పురుటి వాసన వొదలని నవ్వు – జుగాష్‌ విలి

ప్రేమ యిచ్చిన ప్రేమ వచ్చును అని స్వేచ్ఛ అనుకున్నది. నిలకడైన జీవితాన్ని కోరుకున్నది. నిలకడైన జీవితం పెళ్ళి ద్వారా వస్తుందని భ్రమపడిరది. అవి సఫలం కాని వేళ ఒక ప్రేమ నుంచి మరో ప్రేమలోకి ప్రయాణించింది. ప్రేమా, మోహమూ సహజాతాలు.

సహజాతాలన్నీ యిక్కడ నిషిద్ధాలు. సహజాతాలను ఒక క్రమంలో పెట్టవలసింది స్వీయ విచక్షణ. కానీ యిక్కడ సంఘ నీతులు, విలువలు, నమ్మకాలు, నియమాలు సహజాతాలను కట్టడి చేస్తాయి. ఆ కట్టడిని అనివార్యంగా దాటినవారూ, లెక్కచేయనివారూ అనైతికులుగా, బహిష్క్రతులుగా మిగులుతారు..
ఎన్నో ఆటుపోటుల మధ్య కూడా స్వేచ్ఛలో డిప్రెషన్‌ ఏనాడూ కనిపించలేదు. అలాగే ఒంటరితనం ఫీల్‌ కాలేదు. తన ప్రేమించే స్వభావం పట్ల స్వేచ్ఛకి అపారమైన నమ్మకం, గౌరవం. అమ్మానాన్నల ఉద్యమ జీవితాన్ని గౌరవించింది. సాధ్యమైనంత వరకు తానూ ఆ మార్గాన్నే అనుసరించింది.
స్వేచ్ఛ పువ్వు విచ్చుకుంటున్నట్లు సవ్వడి లేకుండా పసిపాపలా నవ్వుతుంది. ఒకోసారి ఎగసిపడే కెరటంలా గలగలా అరమరికలు లేకుండా నవ్వుతుంది. మనసు విప్పి మాట్లాడుతుంది. ఏ మాటా అబద్దమనిపించదు. మాటలోనూ, చేతలోనూ స్వచ్ఛత చెడదు. పారదర్శకత ఉట్టిపడుతుంది. కన్సర్న్‌ ఆమె ప్రేమ ప్రవర్తనలో అంతర్భాగం. ఆమె వ్యక్తిత్వంలోని ఈ సౌందర్యమే ఆమె నిజమైన అందం. తనతో వున్న చిన్నపాటి పరిచయం, సంభాషణలు, తన కవిత్వం ద్వారా స్వేచ్ఛను యిలా అర్ధం చేసుకున్నాను.
స్వేచ్ఛ గుర్తుకొచ్చినప్పుడల్లా పురుటివాసన వదలని పసిపిల్ల కళ్ళముందు కదలాడుతుంది.
ప్రకృతికి పరవశాన్ని పువ్వులకు పరిమళించడాన్ని
నవ్వులకు నవ్వడాన్ని ప్రేమకు ప్రేమించడాన్ని
నేర్పించడానికీ… వాటన్నింటినీ మనకు పరిచయం చేయడానికీ…
2 డిసెంబర్‌ 1986 ` 27 జూన్‌ 2025 మధ్యకాలంలో మన మధ్య జీవించింది స్వేచ్ఛ.
స్వేచ్ఛకు మరణం లేదు. స్వేచ్ఛ చిరంజీవి.

Share
This entry was posted in స్వేచ్చ స్మరణలో. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.