ట్రాన్స్‌ జెండర్‌ ఏ స్త్రీవాదం – ఎ. సునీత

మనం ఆడవాళ్లుగా పుట్టం, సమాజం మనని ఆడవాళ్లుగా తయారు చేస్తుంది అన్న ఫ్రెంచ్‌ స్త్రీవాది సిమోన్‌ డి బువర్‌ సిద్ధాంతీకరణ అందరికీ సుపరిచితమే. స్త్రీ, పురుష జననాంగాలతో (సెక్స్‌) పుట్టిన పిల్లల్ని, స్త్రీలు పురుషులు అనే రెండు రకాల అసమాన మనుషులుగా (జెండర్‌) తయారు చేసేది సమాజమే అంటే, సెక్స్‌ వేరు, జెండర్‌ వేరు. దీన్ని అనేక మంది స్త్రీవాద మానవ శాస్త్రవేత్తలు, రాజనీతి శాస్త్రజ్ఞులు, ఆర్ధిక వేత్తలు, చరిత్ర కారులు సామాజిక శాస్త్ర జ్ఞాన రంగంలో తమ వివిధ రకాల పరిశోధనల ద్వారా విశ్లేషించి చూపించారు.

స్త్రీల, పురుషుల పనులు, పాత్రలు, జీవితాలు చారిత్రకంగా తీవ్ర మార్పులకి లోనవుతూ వచ్చాయని, స్త్రీత్వం, పురుషత్వం అనేవి ‘సహజ సిద్ధంగా’ సంభవించేవి కావని, అనేక నిర్మాణాలు, వ్యవస్థలు దీని కోసం నిరంతరం పని చేస్తాయని చెప్పటానికి అనేక ఆధారాలతో కూడిన జ్ఞానం కూర్చి పెట్టారు. 1990 లో జుడిత్‌ బట్లర్‌ దీన్నుండి కూడా ముందుకెళ్లి జననాంగాలకు ఆడ, మగ అనే అర్ధాలు కూడా సమాజమే ఇస్తుందని, జెండర్‌తో పాటు, సెక్స్‌ కూడా మనం సాంస్కృతికంగా నిర్మించుకున్నదేనని, అది కూడా సహజ సిద్ధం కాదని ప్రతిపాదించారు. అందువల్లనే సమాజం చిన్న పిల్లలకి జననాంగాల బట్టి ఆడ, మగ అనే అర్ధాలు ఇచ్చినా, పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు అందరూ తమ రోజువారీ జీవితంలో తాము ఆయా జెండర్‌కి చెందిన వారిమేనని నిరూపించుకోవాల్సి ఉంటుందని ఎత్తి చూపారు. తమ కిచ్చిన స్త్రీత్వ, పురుషత్వ పాత్రలని పోషించని వ్యక్తుల సెక్స్‌/జెండర్‌ని అనుమానించి, ‘నువ్వు అబ్బాయివేనా/మగాడివేనా?’, ‘నువ్వు అమ్మాయివేనా/ఆడదానివేనా?’ అంటూ సమాజం చేసే నిరంతర పరీక్షలు దీనికి నిదర్శనం ఆయా పరీక్షలు.
బట్లర్‌ ఒక క్వియర్‌ స్త్రీవాది, తత్వవేత్త. తాను కలిసి తిరిగిన క్వియర్‌-ట్రాన్స్‌ బృందంలోని వ్యక్తులు తమ కిచ్చిన, తాము ఎంచుకున్న జెండర్‌తో చేస్తున్న ప్రయోగాలని స్త్రీవాద దృక్పధంతో విశ్లేషించారు. ఆ క్వియర్‌-ట్రాన్స్‌ సమూహం తమకి పుట్టుకప్పుడు సమాజమిచ్చిన జెండర్‌ని కాదనుకుని, స్త్రీలు/పురుషులు అనే ద్వివిధ జెండర్‌ చట్రం బయట బ్రతకటానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులు ఏర్పర్చుకుంది. వారిలో అనేకులు సమాజమిచ్చిన జెండర్‌నే కాదు, పుట్టుకతో వచ్చిన జననాంగాలకిచ్చిన అర్ధాలని కూడా తిరస్కరించి, తమదైన శరీరాల్ని తయారుచేసుకుని, తమ ఆనందాన్ని వెతుక్కుంటున్న వాళ్ళు. బట్లర్‌ తన రచనలు, విశ్లేషణ ద్వారా స్త్రీ (లేదా పురుషుడు) అనే అస్తిత్వాలకి శరీరం అనే పునాది లేదా భూమిక అవసరం లేదని వాదించారు. అసలు జెండర్‌ అనేదే ఒక అస్థిరమైన అస్తిత్వమని, స్త్రీ పురుష అస్తిత్వ చట్రాలని అప్పటికే సవాలు చేసిన స్త్రీవాద పరిధిని విస్తృతం చేశారు.
1960 లలో వచ్చిన రాడికల్‌ లెస్బియన్‌ స్త్రీవాద (స్త్రీ విముక్తి కోసం పురుషుల నుండి పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలని వాదించిన) ఉద్యమం స్త్రీత్వాన్ని ధిక్కరించి కలిసి బ్రతకాలనుకున్న ఆడవాళ్ళకి కొంత జెండర్‌ సంబంధిత వేష భాషలలో వెసులుబాట్లకి దారి తీస్తే, గే విముక్తి పేరేడ్లు, డ్రాగ్‌ షోలు జీవన శైలి పుట్టుకతో పురుషులయిన వాళ్లకి కొంత అటువంటి వెసులుబాట్లు కల్పించాయి. ఇవన్నీ వాళ్ళు ఇతర ఉద్యమాలతో కలిసి, రాజ్యంతో కొట్లాడి, సమాజ విలువలని సవాలు చేసి తెచ్చుకున్నవే. మనందరికీ అమెరికాతో పాటు యూరోపులో కూడా జరిగిన స్టోన్‌ వాల్‌ నిరసనలు, ప్రదర్శనలు, గొడవలతో పాటు ష్ట్ర్‌్‌జూం://షషష.వశీబ్‌బపవ.షశీఎ/షa్‌షష్ట్ర?ఙRGjRఙ7సజీువఅష, సుపరిచితమే గానీ, వాటిల్లో ముందున్న నల్ల జాతి శ్రామిక వర్గ ట్రాన్స్‌ కార్యకర్తలు మార్షా జాన్సన్‌, సిల్వియా, స్టామి డెలార్‌ వైర్మి, సిల్వియా రివెరా ష్ట్ర్‌్‌జూం://షషష.వశీబ్‌బపవ.షశీఎ/షa్‌షష్ట్ర?ఙRజీప-జీIూఔఖష1శీ ల గురించి గత దశాబ్దం లోనే ఎక్కువగా తెలిసింది. స్త్రీవాద ఉద్యమం, లైంగిక విముక్తి ఉద్యమం, గే విముక్తి ఉద్యమంలో ట్రాన్స్‌ వ్యక్తులు మమేకమై ఉంటూ వచ్చారు. అయితే, వాళ్ళు తమని తాము వేరుగా చూసుకోలేదు. గత రెండు దశాబ్దాల్లోనే ట్రాన్స్‌ ప్రజలు, ముఖ్యంగా ట్రాన్స్‌ మహిళలు తమ అస్తిత్వం, హక్కుల కోసం స్పష్టంగా పోరాటం నిర్మించుకున్నారు కూడా.
ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తులు, ముఖ్యంగా ట్రాన్స్‌ మహిళలు స్త్రీ వేషాలేసుకున్న పురుషులని, వారికి స్త్రీలుగా అణచివేతకు, హింసకు, వివక్షకు గురయిన అనుభవం ఉండదు కాబట్టి వాళ్లు తమని తాము ట్రాన్స్‌ మహిళలు అని పిలుచుకున్నా, వారిని ట్రాన్స్‌ వ్యక్తులుగా తప్ప, స్త్రీలుగా పరిగణించ కూడదని పైన చెప్పిన కొంత మంది రాడికల్‌ స్త్రీవాదులు వాదించారు. ఎమి కోయామా ఈ విషయాన్ని తాను రాసిన ‘ట్రాన్స్‌ ఫెమినిస్ట్‌ మేనిఫెస్టో’ లో చర్చిస్తూ, మగ పుట్టుక వ్యవస్థీకృతంగా చదువు వంటి విషయాల్లో కొంత ఆధిక్యత ఇస్తుందని, అది జాతి, కులం, వర్గం పరంగా ఇచ్చే ఆధిక్యతల్లాగే హెచ్చు తగ్గులతో వుంటుందనే విషయం గుర్తించాలని అంటారు. వాళ్ళు ఎంత త్వరగా స్త్రీగా మారారో, ఎంత పూర్తిగా స్త్రీ జీవితాన్ని గడుపుతున్నారో అన్న విషయంపైన అటువంటి ఆధిక్యత ఆధార పడి ఉంటుందని చెప్తూ, స్త్రీగా మారే సందర్భంలో సామాజిక, ఆర్ధిక, భావోద్వేగ పరమయిన నష్టాలకి ఆయా వ్యక్తులు గురవుతారన్న విషయం ఎత్తి చూపుతారు. ఇతర మహిళల కన్నా ట్రాన్స్‌ మహిళలు ఎక్కువ అధికారాలు కలిగివుంటారనే భావన చాలా అజ్ఞానంతో కూడిరదనీ, అది గే జంటకి అడ-మగ జంటల కంటే ఎక్కువ అధికారం ఉంటుందని వాదించటం వంటిదనీ వివరిస్తారు.
మన దేశ సంస్కృతిలో ఇటువంటి జెండర్‌ అతిక్రమణలకి కొంత చోటు ఉంటూ వచ్చింది. మహాభారతంలో యువరాణి అంబ తన ప్రతిజ్ఞ కోసం స్త్రీ నుండి శిఖండి గా మారితే, విష్ణువు వివిధ సందర్భాల్లో మోహినిగా మారటం చిన్నతనంలోనే అందరం వింటాం. రూత్‌ వనితా, సలీమ్‌ కిద్వాయ్‌, దేవదత్‌ పట్నాయక్‌ రచనల్లో మనకి ఇతర ఉదాహరణలు కూడా లభిస్తాయి. అయితే పురాణ స్త్రీలు, పురుషుల జీవితాలకి, భౌతిక ప్రపంచంలో మామూలు మనుషుల జీవితాలకి చాలా తేడా ఉంటుందనే విషయం కూడా మనకి తెలుసు. 11వ శతాబ్దంలో ఢల్లీి సుల్తానేట్ల స్థాపన నుండి, 19వ శతాబ్దం మొఘల్‌ రాజ పరిపాలన అంతమయ్యే వరకూ రాజ మహళ్లలో మధ్య ప్రాచ్యం నుండి వచ్చిన బానిస యూనక్స్‌ (పురుషాంగం తీసేసిన వాళ్ళు) కి సుల్తాన్లని, జనానాని కాపాడే కీలక పాత్ర ఉండేది. కొంత మంది పై స్థాయికి కూడా ఎదిగారు. హిజ్రా వ్యవస్థ ఈ కాలంలోనే మొదలయిందని అనుకుంటారు. నగరాల్లో కులీన కుటుంబాల వ్యక్తుల ఆనందం కోసం నృత్యం, సంగీతం, లైంగిక సేవలు అందించే భోగం స్త్రీలతో పాటు హిజ్రా లకి కూడా ప్రత్యేక చోటు ఉంటూ వచ్చింది. ఆయా ప్రదేశాలు హవేలీలు, జమాత్‌ లుగా పేరు పొందాయి.
అయితే, 19 వ శతాబ్దంలో బ్రిటిషు వలస పాలకులు బ్రిటన్‌లో ప్రబలిన విక్టోరియన్‌ లైంగిక విలువల నేపథ్యంలో క్రిమినల్‌ ట్రైబ్స్‌ చట్టం క్రింద వీరిని నేర జాతిగా ప్రకటించి, వారి పిల్లలని, ఆస్తులని లాగేసుకుని, వారి స్త్రీ వస్త్ర ధారణని, వీధుల్లో వారి నృత్యాలు చేసి బధాయి అడగటాన్ని నిషేధించి, పోలీసు జులుంతో వారినీ, వారి జీవన విధానాన్ని నిర్మూలించటానికి తీవ్ర ప్రయత్నం చేసారు. వలస పాలన పూర్తయేటప్పటికి హిజ్రాలు సమాజపు అంచుల్లోకి నెట్టబడ్డారు. భిక్షాటన, రోడ్ల మీద తిరగటం, లైంగిక సేవలని నిషేధించిన చట్టాలు వారి జీవన విధానాన్ని నేర పూరితంగా మార్చాయి. హిజ్రాలంటేనే పిల్లల్ని ఎత్తుకుపోతారని, బలవంతంగా అంగం తొలగిస్తారని, బెదిరించి, బట్టలు విప్పి డబ్బులు వసూలు చేస్తారనే అపప్రధలు వారి గురించి పాకి పోయాయి. వలస పాలన అప్రత్యక్షంగా వున్న హైద్రాబాదు వంటి నగరాల్లో హవేలీలు మిగిలాయి కానీ బ్రిటిషు పాలన, నిజాం పాలన ముగిసిన తర్వాత, ఇళ్లల్లోంచి తమ జెండర్‌ అతిక్రమణల కారణంగా వెళ్లగొట్టబడిన అనేక మందికి లైంగిక సేవలు అందించే వేశ్యా వృత్తి, భిక్షాటన మాత్రమే జీవనోపాధిగా మిగిలాయి. గాయత్రీ రెడ్డి 2006 లో హైద్రాబాదులో హిజ్రా వ్యవస్థ గురించి పుస్తకం రాసే నాటికి 6 హవేలీలలో గురువులు, నాయక్‌లు, ఛేలాలుగా బ్రతికే ‘షెహర్‌ వాలా’ హిజ్రాలతో పాటు సెక్స్‌ వర్క్‌, భిక్షాటన పై ఆధారపడి జీవిస్తామని చెప్పిన అనేక మంది ‘లష్కర్‌ వాలా’ హిజ్రాలు వున్నారు.
1990లలో ఎయిడ్స్‌ వ్యాధి నిరోధానికి ప్రచారం, సేవలు మొదలు పెట్టినప్పుడు ప్రభుత్వం వీరికి ‘మగవాళ్ళతో సెక్స్‌లో పాల్గొనే మగవాళ్ళు’ అనే (అసహ్యమైన) పేరు పెట్టి వీరిని కూడా ప్రోగ్రాంలలో భాగం చేసింది. ఈ సమయంలో కొన్ని ఎన్‌ జి ఓ లు మొదలయ్యి మొదటి తరం ట్రాన్స్‌ కమ్యూనిటీ ఆక్టివిస్టులు ముందుకొచ్చారు. 2000 లలో సె 377 గురించి ఢల్లీి హైకోర్టులో వాదనలు జరుగుతున్న సమయంలో పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ సంస్థ కర్ణాటకలో ట్రాన్స్‌ జెండర్‌ ప్రజల స్థితి, వారిపై పోలీసు జులుం గురించి మొదటి నివేదిక తీసుకొచ్చింది. 1990లలో తమిళనాడులో, 2014లో సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన నల్సా తీర్పు తర్వాత, అనేక రాష్ట్రాల్లో ట్రాన్స్‌ జెండర్‌ సంఘాలు, సంస్థలు కూడా ఏర్పడ్డాయి. తెలంగాణ ట్రాన్స్‌ జెండర్‌ ఇంటర్‌ సెక్స్‌ హిజ్రా సమితి ఈ క్రమంలోనే ఏర్పడి, హైద్రాబాదులో వార్షిక ప్రైడ్‌ మార్చ్‌లలో కీలక పాత్ర తీసుకోవటం మొదలుపెట్టాయి. ట్రాన్స్‌ జెండర్‌ చట్టం (2019), నియమాలు (2020) లని సరిగ్గా తీసుకురావాలని నిరసనలు చేశారు.
ట్రాన్స్‌ జెండర్‌ సమూహాల గురించిన చర్చల్లో ట్రాన్స్‌ అబ్బాయిల గురించిన చర్చ, గే ఉద్యమాల్లో లెస్బియన్ల లాగే, చాలా తక్కువగా జరుగుతుంది. పుట్టుకతో స్త్రీలుగా పరిగణింపబడే వ్యక్తుల పట్ల వుండే వ్యవస్థీకృత వివక్షకి – ఆర్ధిక, సాంస్కృతిక, సామాజిక వనరుల లేమికి ఇదొక నిదర్శనం. పరలైంగిక స్త్రీల పట్ల కుటుంబం, కమ్యూనిటీలు, సమాజం, రాజ్యం సాధారణంగానే ఎంత వివక్షతో వ్యవహరిస్తాయో మనకి తెలుసు. అది ‘మాకు ఈ స్త్రీత్వమే వద్దు, మగ వాళ్ళుగా బ్రతుకుతాం’ అంటే ఏ స్థాయికి వెళ్తుందో వూహించచ్చు. వారి జీవితాల్లో బలవంతపు పెళ్లిళ్లు, కాపురాలు, పిల్లలు, హింస మామూలు. ఇవన్నీ జరగక ముందే పెళ్లి కాని సిస్‌ – యువతులతో బ్రతకాలని అనుకునే వారిని పోలీసులతో సహా అన్ని వ్యవస్థలు పడి తీవ్రంగా వేధిస్తాయి. పెళ్లి అయితేనే అది ‘సరయిన’ జీవితం అనే విలువ శ్రామిక వర్గ ట్రాన్స్‌ అబ్బాయిలలోనే కాక, కొత్త తరం ట్రాన్స్‌ అమ్మాయిలలో కూడా కొంత ప్రబలటం వల్ల వాళ్ళు కూడా సిస్‌ మహిళల లాగే కుటుంబ హింస, బలవంతపు చావులు, డబ్బు దోపిడీ ఎదుర్కుంటున్నారు. కొంత మంది కోర్టులకి కూడా వెళ్ళటం మొదలు పెట్టారు.
అయితే ట్రాన్స్‌ వ్యక్తుల సహ జీవనాలు, పెళ్లిళ్లు, కుటుంబాలు సిస్‌ కుటుంబాల వంటివి కావు. వాటికి కులాంతర, మతాంతర పెళ్లిళ్లు, కుటుంబాలకుండే సాధికారత కూడా ఉండదు. ఒక రకంగా ఎంపిక చేసుకున్న జీవితంలో ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, అసాధ్యాలు ఉండాలో అన్నీ ట్రాన్స్‌ జెండర్‌ జీవితాల్లో ఉంటాయి. కుటుంబం అనే మాటకే వారి జీవితాలు వేరే అర్ధం ఇస్తాయి. చాలా మందికి చిన్నప్పుడే జరిగిపోయిన పెళ్లిళ్లు, పిల్లలు వుంటారు. తల్లి తండ్రులతో, అన్న దమ్ములతో ఘర్షణతో కూడిన సంబంధం కొనసాగుతూ ఉంటుంది. అలాగే, తమ అసలు జెండర్‌తో ఏర్పర్చుకున్న కుటుంబం కూడా ఉంటుంది. ట్రాన్స్‌ మహిళలకి ఆ కుటుంబం హిజ్రా వ్యవస్థలో గురువుల ఆధ్వర్యంలో వుండే కుటుంబంతో సహా, కొత్త బంధుత్వాలు, భాగస్వాములు వుంటారు. కుటుంబం అంటే ఒక మగ-ఆడ మధ్య పిల్లల కోసం ఏర్పడే బంధం అనే భావనని ట్రాన్స్‌ జీవితాలు సమూలంగా కదిలిస్తాయి. పుట్టిన జెండర్‌లో ఉండనని గానీ, ట్రాన్స్‌జెండర్‌గా గానీ ప్రకటించుకోంగానే, పుట్టుకతో వచ్చిన కుటుంబం, వుద్యోగం, ఆస్తి, చదువు అన్నీ వదులు కోవాల్సి వస్తుంది. ట్రాన్స్‌ మహిళల ఆస్తిని ‘పిల్లా, జెల్లా లేని వాళ్ళకి ఆస్తి ఎందుకు’ అంటూ అన్న దమ్ములు ఏ సిగ్గూ శరం లేకుండా లాగేసుకుంటారు. ఎటువంటి మద్దతు లేని వ్యవస్థలో, ఎంత చిన్నదైనా సరే, ట్రాన్స్‌ కమ్యూనిటీ ఇచ్చే సామూహిక మద్దతు, గుర్తింపు, దాని ద్వారా ఏర్పడే మిత్రులు, బంధుత్వాలు ట్రాన్స్‌ వ్యక్తుల జీవితాలకి కీలకం అవుతాయి.
ట్రాన్స్‌ జెండర్‌ జీవితాలు, మన సమూహాలు, కుటుంబాల గురించే కాక సెక్స్‌ వర్క్‌, ఆస్తి, పని స్థలాలు, టాయిలెట్ల వంటి అనేక విషయాలు, ముఖ్యంగా ఆడతనం, మగతనం, జెండర్‌ గురించిన మన అవగాహనని సమూలంగా సవాలు చేస్తాయి. తమకిచ్చిన జెండర్‌ని వదిలించుకోవటానికి గానీ, తాము జీవించాలనుకునే జెండర్‌కి అనుగుణంగా శరీరాల్ని మలుచుకోవటానికి గానీ, చేసే ప్రయత్నం, సంఘర్షణ శరీరాలకి, జెండర్‌కి అవినాభావ సంబంధం లేదనీ, శరీరాలకి, భావోద్వేగాలకు కూడా సంబంధం ఉండక్కర్లేదనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ప్రస్తుతం ఆ సంఘర్షణ, ప్రయత్నాలు తీవ్రమైన హింస, బాధతో కూడుకుని వున్నాయి. వాటిని తగ్గించటానికి, జెండర్‌ వ్యవస్థ మన అందరిపై మోపే భారాన్ని తగ్గించుకోవటానికి సిస్‌ స్త్రీవాదులుగా మనమేం చెయ్యగలం అనేది అందరం వేసుకోవాల్సిన ప్రశ్న.

Share
This entry was posted in ఇంకు పెన్ను, వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.