భూమిక ఆధ్వర్యంలో నడుస్తున్న మల్టీపర్సస్ సెంటర్లు – భూమిక టీం

గత రెండు సంవత్సరాలుగా భూమిక సంస్థ పనిచేస్తున్న బస్తీలలో మహిళలు, పిల్లల కోసం సపోర్ట్ సెంటర్స్ నిర్వహిస్తుంది. ఈ సపోర్ట్ సెంటర్‌కు ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు. మహిళలు, యుక్త వయసు పిల్లలు వారికున్న వ్యక్తిగత సమస్యలను కుటుంబ సమస్యలను ఈ సెంటర్‌కి వచ్చి కౌన్సిలర్స్‌తో మాట్లాడడం వారి సలహాలు తీసుకోవడం అవసరమైన వారికి వ్యక్తిగత కౌన్సిలింగ్ మరియు కుటుంబ సభ్యులతో కలిపి కౌన్సిలింగ్ నిర్వహించడం

వారి సమస్యకు పరిష్కార మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ సహకార సంస్థల ద్వారా సహాయం అందేలా చేయడం జరుగుతున్నది. అలాగే అన్ని బస్తీలలోనూ సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం యుక్త వయసు పిల్లలను గ్రూపులుగా చేసి వారికి జీవన నైపుణ్యాలు సామాజిక అంశాల గురించి శిక్షణలో నిర్వహించడం చేసాము. ఆ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వారిలో ఉన్న సృజనాత్మకతను గుర్తించి వారితో మరింత సమయం పెట్టి వివిధ అంశాలపై శిక్షణ ఇవ్వడం వారి సృజనాత్మకతను మెరుగుపరుచుకునేందుకు ఒక స్థలం అవసరం అన్న ఆలోచన వచ్చింది.
ఇందులో భాగంగా ఈ సంవత్సరం భూమిక నిర్వహిస్తున్న రెండు సపోర్ట్ సెంటర్లను మల్టీపర్పస్ లర్నింగ్ సెంటర్స్‌గా మార్చడం జరిగింది. ఈ మల్టీపర్పస్ లర్నింగ్ సెంటర్స్‌కి ఎవరైనా రావచ్చు. ఈ సెంటర్లో ముఖ్యంగా మహిళలకు వారి వ్యక్తిగతమైన కుటుంబంలో ఎదుర్కొని అనేక రకాల హింసల గురించి ఇక్కడ కౌన్సిలింగ్ తీసుకోవడమే కాకుండా మహిళలు తమ కోసం తాము కొంత సమయాన్ని కేటాయించుకోవాలి లేదా వారికున్న బాధ్యతల నుండి కొంత సమయం వారి మనసుకు నచ్చినట్లు ఉండాలి అనుకునే వారి కోసం ఈ మల్టీపర్పస్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా గత రెండు సంవత్సరాలలో 4 బ్యాచ్లలో మొత్తం 100 మందికి పైగా మహిళలు కుట్టుమిషన్లు శిక్షణ తీసుకోవడం జరిగింది. వారిలో ఎవరికైనా మిషన్స్ లేకపోతే వారు నేర్చుకున్నది మర్చిపోకుండా మరియు వారికి కొంత ఆదాయ మార్గంగా ఉపయోగపడేందుకు ఈ సెంటర్లలోనే కుట్టు మిషన్లు ఏర్పాటు చేసి వారు వచ్చి కుట్టుకునేలాగా వారికి అందుబాటులో ఉంచాము. చదువు పట్ల ఆసక్తి ఉన్న మహిళలు వారి కుటుంబంలో వారికి అవకాశం లేనప్పుడు వారిలో ఉన్న ఆసక్తిని గుర్తించి వారు చదువుకోవడం కోసం ఒక చిన్న లైబ్రరీని కూడా ఏర్పాటు చేశాము. కథలు, కవితలు, ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు వారికి నచ్చిన వారిని ఆదర్శవంతంగా తీసుకునేలాగా కొంతమంది వ్యక్తుల జీవిత గాధలను కూడా ఈ లైబ్రరీలో ఉంచాము. ఇంకా వారి మనసుకు నచ్చినట్లు వారు ఏవైనా కొత్త అంశాలను నేర్చుకోవాలని తెలుసుకోవాలన్న వారికి కౌన్సిలర్స్ సహకరిస్తారు. అలాగే కొంతమంది మహిళలు చదవడం రాయడం నేర్చుకోవాలి అనుకుంటున్నారు. మొబైల్‌ని ఎలా వాడాలి కూడా తెలుసుకోవాలి అనుకున్నారు. వారి కోసం పలకలు, నోట్ బుక్స్ ఉంచాము. అలాగే డిజిటల్ లిటరసీ గురించి వారికి కొంత అవగాహన కలిగించేలాగా ఈ సెంటర్లు అందుబాటులో ఉండేలాగా నిర్వహిస్తున్నాము.
ఏప్రిల్ 10వ తేదీ ఎన్టీఆర్ నగర్‌లో మల్టీపర్పస్ లర్నింగ్ సెంటర్‌ని, ఏప్రిల్ 17వ తారీకు సబర్మతి నగర్‌లో మల్టీపర్పస్ లర్నింగ్ సెంటర్‌ని ప్రారంభించాము. ఈ మల్టీపర్పస్ లెర్నింగ్ సెంటర్స్ రోజు ఉదయం 10:00 నుండి సాయంత్రం ఏడు గంటల వరకు నడుస్తాయి. లర్నింగ్ సెంటర్స్‌కి రోజు సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు అన్ని బస్తీల నుండి పిల్లలు వస్తున్నారు. ముఖ్యంగా ఈ సెంటర్స్ చైల్డ్ ఫ్రెండ్లీ సెంటర్స్‌గా ఉంటున్నాయి. పిల్లలు రోజు స్కూల్లో చదువుకునే తరగతి అంశాలకు భిన్నంగా వారు ఇక్కడ వారికి నచ్చినవి నేర్చుకుంటారు. పిల్లల కోసం వారికి నచ్చే విధంగా కథల పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు, గణితం, ఇంగ్లీష్ గ్రామర్, గొప్ప వ్యక్తుల జీవిత కథలు, తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్‌లో పుస్తకాలను అందుబాటులో ఉంచాము. అంతే కాకుండా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్రాయింగ్, పెయింటింగ్ వేయడం, స్కిట్స్ చేయడం, రోల్ ప్లేస్ చేయడం, పాటలు పాడడం నేర్చుకుంటారు. అన్నింటికంటే వారికి మరింత ఇష్టమైన విషయం ఆటలు వారి మెదడు ఆలోచింప చేసే విధంగాను, మనసుకు ఉత్సాహంగాను ఉంచడం కోసం కొన్ని ఇండోర్ గేమ్స్‌కి సంబంధించినవి ఈ సెంటర్స్‌లో ఉంచాము. అవి చెస్, లూడో, బ్రెయిన్ విటా, క్యారమ్స్, వర్డ్ బిల్డింగ్, పజిల్స్ మొదలగునవి. ఇంకా కంప్యూటర్స్‌లో బేసిక్స్ ఇవ్వడం కోసం ప్రతి సెంటర్లో రెండు కంప్యూటర్లు బేసిక్ నాలెడ్జ్ పైన శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సామాజిక అంశాల పట్ల అవగాహన పెంపొందించడం కోసం చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చూపించడము వారిచేతనే కథలు కవితలు రాయించడం ప్రత్యేక దినోత్సవాలను నిర్వహించడం ద్వారా వారికి ఆరోజు ప్రత్యేకత గురించి మరింత అవగాహన కల్పించడం జరుగుతుంది. పిల్లలలో ఉన్న అతిపెద్ద సమస్య అయినా పౌష్టికాహార లోపాన్ని కొంతవరకైనా అధిగమించడం కోసం కొన్ని అవగాహన కార్యక్రమాలను నిర్వహించాము మరియు ప్రతిరోజు సాయంత్రం ఈ మల్టీపర్పస్ లర్నింగ్ సెంటర్లో పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్‌ని ఇస్తున్నాము. పల్లి చెక్కిలు, అరటి పండ్లు మొదలగున్నవి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా బస్తీలను ఈ మల్టీపర్పస్ లర్నింగ్ సెంటర్‌ని నిర్వహించడం అనేది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.