భయం అంచున జీవితం – మకాం

యావత్మాల్‌లోని బుల్గడ్ జిల్లాకి చెందిన మంగళ, కవదు బోతునెలను కలుద్దాం. వారు ప్రత్యేకించి దుర్బలతకు గురవుతోన్న ఆదివాసీ తెగ కోలామ్‌కు చెందినవారు. రైతులైన వారిద్దరూ బుల్గడ్ చెరువుకు, తిప్పేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం సరిహద్దులకూ మధ్య ఒదిగి ఉండే తమ ఐదు ఎకరాల పొలంలో చాలా కష్టపడి పని చేస్తారు.

రైతులుగా వారు ఊహకందని ప్రాకృతిక విపత్తులకు బాధితుల వుతుంటారు. కొన్నిసార్లు వారి పంటలు నిలువనీటి వరదలో కొట్టుకుపోతుంటాయి. అయితే కోతకు సిద్ధంగా ఉన్న వారి పంటలను చాలా తరచుగా అడవి నుంచి వచ్చే జంతువులు ధ్వంశం చేస్తుంటాయి.
“జంతువుల నుంచి నిరంతరం కలిగే ఇబ్బందుల వలన, చాలాసార్లు నాకు వ్యవసాయం వదిలేసి, నా పొలాన్ని అమ్మేద్దామని అనిపిస్తూ ఉంటుంది,” ముళ్ళ పందులు, అడవి పందులు, జింకలు, నెమళ్ళు వంటి అడవి జంతువులు తరచుగా చేసే ఊహించరాని దాడులకు విసిగిపోయిన కవదు చెప్పారు. చివరకు చిలుకలు కూడా, ప్రత్యేకించి నువ్వు పంట కాలంలో, పొలాలపైబడి విధ్వంసం చేస్తాయి. ఈ కాలమంతా 24 గంటలు మా పొలాలకు కాపలా కాయవలసి వస్తోంది. “అడవి పందులు మరీ ఘోరం,” అని మంగళ అన్నారు. అవి తినేది చాలా తక్కువ, కానీ మొత్తం పంటని నాశనం చేసేస్తాయి.” ఇటీవలి కాలంలో ఈ జంట ఎదుర్కొంటున్న సవాళ్లు మరింతగా పెరిగిపోయాయి. అభయారణ్యం అంచున జీవిస్తున్న గ్రామస్తులకు తరచుగా పులులు కనిపించటం, జనంపైన పశువులపైన దాడులు చేయటం వంటి సంఘటనలు వారిలో భయాన్ని ఆందోళనను మరింతగా పెంచాయి. తమ అడివిలో పులుల జనాభా ఆకస్మికంగా పెరిగిపోయిందని స్థానిక గ్రామ ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. అటవీ శాఖ ఇతర ప్రాంతాలకు చెందిన పులులను తమ అడవిలోకి వదిలిపెడుతోందని వారు అనుమానిస్తున్నారు. వారి అనుమానాలు పూర్తిగా నిరాదారమైనవి కావు. పులుల సంరక్షణ విధానాన్ని ఏకపక్షంగా అమలు చేయడం ఈ సమస్యకు మూలకారణంగా ఉంది, ఇది వారి ఆవాసాల సున్నితమైన పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తోంది. ఒకవైపు పరిరక్షణ ప్రయత్నాల కారణంగా పులుల జనాభా సహజంగానే పెరిగింది. మరోవైపు ఇతర ప్రాంతాలలో పెరుగుతున్న మానవ-జంతు సంఘర్షణను తగ్గించడం కోసం అటవీశాఖ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి పులులను ఇక్కడికి తరలిస్తోంది. తత్ఫలితంగా, ఇప్పటికే భారం మోస్తున్న తిప్పేశ్వర్ అడివి విస్తారమైన పెద్ద పులుల జనాభాను తట్టుకోలేకపోతోంది. ఇది మనుగడ కోసం పోరాడుతున్న జంతువులకు, మానవులకు మధ్య పూర్తిగా సరికొత్త సంఘర్షణలకు దారితీస్తోంది. “వాళ్లు తమ పులులను ఎందుకు వెనక్కి తీసుకోరు?” అని గ్రామస్తులు కోపంగా ప్రశ్నిస్తున్నారు.” ఇవి ఇక్కడి పులులు కావు; అటవీశాఖ వాటిని బయట నుంచి ఇక్కడకు తీసుకువచ్చింది. ఇప్పుడు మా అడివికి వాటిని పోషించే శక్తి లేనందున వాటిని తిరిగి తీసుకోవాలి.” “నాతో సహా అందరూ పులులకు భయపడతారు,” అని కవదు ఒప్పుకున్నారు. “కానీ మాకు ఇంకే అవకాశం లేదు. పులి మమ్మల్ని చంపటమో, మమ్మల్ని మేము రక్షించుకోవడమో జరుగుతుంది. మేం ధైర్యంతో బతుకుతున్నాం, ఆ విధంగానే మనుగడ£ సాగిస్తున్నాం.”
స్థానిక సముదాయం తమ మనుగడ కోసం వ్యవసాయంతో పాటు అడవిపై కూడా భారీగా ఆధారపడుతుంది. అడవి మాకు ఆహారాన్ని, ఇంధనాన్ని, పశువులకు మేతను అందిస్తుంది. కాలానుగుణంగా దొరికే కూరగాయలకు కూడా అడివే మాకు ఆధారం,” అని మంగళ వివరించారు. పంటలు లేనప్పుడు, చాలా కొద్దిపాటి వ్యవసాయపు పనులే ఉన్నప్పుడు గ్రామస్తులు అడవిలో ఆహారాన్ని వెతుక్కుంటూ తమను తాము పోషించుకుంటారు. మహిళలు తెమ్రాన్ వంటి అడవి పండ్లను సేకరిస్తారు, వాటిని పండిన తరువాత మార్కెట్లో అమ్ముతారు. “మేం తెందు (బీడీ) ఆకులను, బిబా పువ్వులను, సీతాఫలాలను, మహువా (ఇప్ప), చిరొన్జీ (సార పప్పు), వంట చెరుకు కోసం ఎండిన కొమ్మలను సేకరించి అమ్ముతాం. అడవితో ఉండే సహజీవన సంబంధం స్థానిక సముదాయాన్ని అడవితో మమేకమై జీవించేందుకు సిద్ధం చేస్తుంది. పొలాల్లో పనిచేసేటప్పుడు సురక్షితంగా ఉండడం ఎలాగో మాకు తెలుసు.” అని కవదు చెప్పారు. అడవి జంతువులను చూడగానే, వాటిని తరిమికొట్టేందుకు శబ్దాలు చేస్తాం, రేకు డబ్బాలను మోగిస్తాం, లేదా మంట పెడతాం. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటారు, గుంపులుగా ప్రయాణిస్తారు, ప్రమాదకర సమయాల్లో పొలాల్లో ఒంటరిగా పనిచేయరు.” అయితే అటవీ శాఖ తమ అడివిని పులుల అభయారణ్యంగా ప్రకటించడం, తమ నివాస స్థలాలలోకి ఇతర చోట్ల నుంచి పులులను తెచ్చి వదలడం ద్వారా తమ జీవితాలను ధ్వంసం చేసినట్లుగా ఈ సముదాయం భావిస్తోంది. “పులులను రక్షించండి” అంటూ ప్రభుత్వం తీసుకున్న చొరవ వలన, తమను తాము రక్షించుకోవడం కోసమైనా జనం పులిని గాయపరచలేని పరిస్థితి నెలకొంది.
అసలు సమస్య పులులు కాదు,” అని కవదు నొక్కి చెప్పారు. మేమెప్పుడూ వన్యప్రాణులతో కలిసే జీవిస్తున్నాం. సమస్యంతా నిర్వహణలో అటవీశాఖ అవలంబిస్తున్న తప్పుడు వైఖరిలో ఉంది. ఎందుకంటే వారు తమ తప్పుడు విధానాలతో, పథకాలతో – మాపై అది కలగజేసే ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోకుండా పర్యావరణ సమతుల్యతను నిరంతరం దెబ్బతీస్తున్నారు.
ఉదాహరణకు అభయారణ్యంలో నిరంతరం జరుగుతున్న అభివృద్ధి పనులు పులుల సహజ వలస మార్గాలకు ఆటంకం కలిగిస్తున్నాయి. పులి కనిపించినప్పుడల్లా అటవీశాఖ, అడవి చుట్టూ ఉన్న గ్రామాలపై తన నిఘాను తీవ్రతరం చేస్తుంది. వాళ్లు వాహనాలలో లౌడ్ స్పీకర్లతో తిరుగుతూ, రైతులు తమ పొలాలను విడిచిపెట్టి మొత్తానికే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ప్రకటనలు చేస్తున్నారు. ఇది గ్రామస్తుల రోజువారి పనులకు ఆటంకం కలిగించడమే కాక వారి వ్యవసాయ పనులకు కూడా భంగం కలిగిస్తుంది. ఆ అడవిని పులుల అభయారణ్యంగా ప్రకటించినప్పుడు, అడవి జంతువుల వలన నష్టపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లిస్తామని గ్రామస్తులకు వాగ్దానం చేశారు. అయితే నష్టపరిహారాన్ని కోరడం అంత సులభం ఏమీ కాలేదు. “అడవి పందులు మా పొలాన్ని పాడు చేసినప్పుడు, వాటిని ఫోటోలు తీసి అడవి అటవీ శాఖను కలిశాం,” అని కవదు గుర్తు చేసుకున్నారు. “మమ్మల్ని ఒక ఆఫీస్ నుంచి మరో ఆఫీస్‌కి తిప్పారు-మారేగావ్, రాళేగావ్, చివరకు అమరావతికి కూడా, దానితో సమయము డబ్బు వృధా అయ్యాయి.” రైతులు పంచనామా (అధికారిక తనిఖీ) చేయించడానికి అటవీ గార్డులు, పెట్రోలింగ్ సిబ్బందితో సహా వివిధ అధికారులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక అధికారి వివరించారు. ఈ సమన్వయం చేయడంలో రైతులకు తరచుగా 3-4 రోజుల పని నష్టమవుతుంది. అడవి అంచున ఉన్న పొలాలకు లోహపు తీగతో కంచేను నిర్మించడం వంటి నివారణ చర్యలు చేపడతామనే వాగ్దానాలు కూడా నెరవేరలేదు. “ఫెన్సింగ్ వేస్తామని మాకు హామీ ఇచ్చి రెండేళ్లయింది, కానీ ఏమీ చేయలేదు.” కవదు వాపోయారు. అడవి అంచున నివసించడం బుల్గడ్ రైతులకు నిరంతర పోరాటంగా మారింది. వారి పూర్వీకులు వారి ఆవాసాలకు అనుగుణంగా మారుతూ అడవితో సహజీవనం చేశారు, కానీ ప్రస్తుత తరం అటవీశాఖ ద్వారా కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. వారి విధానాల ఫలితంగా ఉద్దేశపూర్వకంగా జరిగే విధ్వంసం, వారి జీవితానికి, ఆస్తికి జరిగిన నష్టానికి పరిహారం ఇస్తామని తప్పుడు వాగ్దానాలు చేయటం, అధికారుల నుండి సానుభూతి గానీ, మద్దతుగానీ పూర్తిగా లేకపోవడం వలన బుల్గడ్ ప్రజలకు మనుగడ భారంగా మారింది.
(భవిష్యత్తును అభివృద్ధి చేసుకుంటూ… మహిళా రైతుల గురించి ఫోటో వ్యాసాలు పుస్తకం నుండి..)

Share
This entry was posted in మహిళా రైతుల జీవన పోరాటాలు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.