అవమానపడ్డ అంబ శిఖండిగా సాధించింది
భంగపడ్డ ద్రౌపది కురుక్షేత్రంతో నిలబడింది
అపహారించబడ్డ సీత రావణవధతో పునీతమైంది
ప్రార్ధించిన సతీ సావిత్రి యమపాషానాన్ని ధిక్కరించింది
పురాణాలే పొంగిపోయాయి స్త్రీ అంటే పరాజయం ఎరగని పవిత్రమూర్తి అని
రాజ్యక్షేమం కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన లక్ష్మీభాయి
ఉప్పు సత్యాగ్రహంలో ఉక్కు పిడికిలైన దుర్గాబాయ్
స్వాతంత్ర పోరాటాన్ని కలంతో తడిమిన కవికోకిల
భూమి కోసం బానిస సంకెళ్ళను స్వంతంగా తెంచుకున్న ఐలమ్మ
పోరాటబాటలు అంగీకరించాయి వీరవనితలంటే అపజయం ఎరుగని అజేయులని
ఆకలన్న వారి కడుపు నింపిన డొక్కాసీతమ్మ
ఆశ్రమాల నెలవు కస్తూర్భా మలుపు
విద్యావంతెనకు మెరుపు సావిత్రిబాయిపూలె గెలుపు
సేవానిరతికి నిలువుటద్దం మేరీక్యూరీ
చరిత్రపుటలన్ని చెదరని శాసనంగా రాసాయి అతివకు తెగువే అందమని
