నవభారతానికి నవదుర్గ – రామిశెట్టి కావ్య

ఆమె ఓ అబల…
బలం లేక కాదు,
బలాన్ని చాటితే బరితెగింపంటారని!
ఆమె ఓ అతివ…

అతి చేయలేక కాదు,
అడుగడుగునా అతి అంటగడతారని!
పెదవులపై చిరునవ్వు…
కనురెప్పల మాటున కన్నీటి సంద్రం…
గుండెలో గాయాలెన్నో,
కళ్లలో మాత్రం రేపటి స్వప్నం!
కన్నీటి చుక్కలతో కలలకు
కనురెప్పల రంగులద్దుతుంది…
ముళ్లబాటలో పాదాలు రక్తమోడినా
విజయాల పూలబాట పరుస్తుంది!
ఆవేశాన్ని ఆప్యాయత వెనుక దాచి,
ఆక్రోశాన్ని చిరునవ్వు చాటున బంధించి,
సహనమే తన ఆభరణంగా ధరించి
సవాళ్లనే సోపానాలుగా మలుస్తుంది!
ఆమె సహనాన్ని చేతకానితనమంటే,
ఆమె మౌనాన్ని అంగీకారమంటే,
ఆమె మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే
అక్కడితో ఆగిపోదు ఆమె కథ!
అన్యాయం హద్దులు మీరితే
అగ్నిజ్వాలై ఎగసిపడుతుంది…
ఆత్మగౌరవం తలవంచే వేళ
అవనినే ప్రశ్నించే అక్షరమవుతుంది!
ఆమె చూపుల్లో కరుణ…
గుండెలో హిమగిరుల నిబ్బరం…
మౌనంలో మహాసముద్ర గాంభీర్యం…
తిరుగుబాటులో ప్రళయాగ్ని ఉగ్రరూపం!
ఆమెకు సింహాసనం అక్కర్లేదు,
సింహంలా గర్జించే సత్తా చాలు!
ఆమెకు కిరీటం అవసరం లేదు,
తలవంచని ఆత్మగౌరవం చాలు!
ఆమెను పూజించే చేతులే
ఆమె రెక్కలు విరిస్తే ఎలా?
ఆమెను దేవతగా కొలిచే లోకమే
ఆమె స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తే ఎలా?
తొమ్మిది రాత్రుల పూజలెందుకు?
ఆడపిల్లకు అడుగడుగునా ఆంక్షలుంటే!
దేవిగా కొలిచే దీపాలెందుకు?
దేహంలో దైవత్వం చూడలేకపోతే!
ఆమె శక్తిని గుర్తించడానికి
నవరాత్రులు సరిపోవు…
ఆమె అస్తిత్వాన్ని గౌరవించడానికి
నవభారతం కావాలి!
దుర్గమ్మ గర్భగుడిలోనే లేదు,
దుష్టశక్తులను సంహరించే విగ్రహంలోనూ లేదు…
అన్యాయాన్ని ఎదిరించే ఆమె తెగువలో,
ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఆమె నిబ్బరంలో,
ఓటమిని ఒప్పుకోని ఆమె సంకల్పంలో ఉంది.
ఆమెను అబలను చేసిన లోకానికే అజేయ శక్తిగా ఎదురునిలిచే వేళ…
ఆమెలోని దుర్గమ్మ విశ్వరూపమై ఆవిష్కృతమవుతుంది.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.