నిజంగా ఆకాశంలో సగం మనమేనా!

తమ్మెర రాధిక

ఇప్పుడు ఆకాశంలో సగంల అన్న నినాదం నిజంగా నిజమేనా! మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల స్థానమెక్కడా? సగమా! అధమమా! చట్ట పరంగా గానీ స్థాన పరంగా గానీ ఆడవారికెపుడూ అనర్థమే జరుగుతూ వచ్చింది. ప్రపంచంలో ఏ రకమైన మార్పులు వచ్చినా అవి ఆడవాల్ళ మీద తీవ్ర ప్రభావం చూపుతూ వచ్చాయి. అంతర్యుద్దాలు, ఆర్థిక మాంద్యాలు, కరువు కాటకాలు, ఉద్యమాలు ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు కుటుంబవ్యవస్థలు కుప్పకూలడం వల్ల స్త్రీలు తమ సర్వశక్తులు ఒడ్డి సంసారాలను నిలబెట్టుకోవల్సి వస్తున్నది. ఇరాక్‌ యుద్ధం జరుగుతున్నప్పుడు గానీ, అస్గాన్‌ యుద్ధం జరుగుతున్నప్పుడు గానీ స్త్రీలు పడ్డ బాధలు ఊహకు అందనివి. ఇళ్ళ ముందు నిలబడ్డవాళ్ళను ఉన్నపళానా మాయం చేసేవారు. వారికి రేషన్‌ లేదు, దాంతో తిండి లేక కుటుంబాలు ఆకలికి అల్లాడి పోయేవి. భర్తలు యుద్ధంలో చనిపోవడం వల్ల పిల్లల్ని పెద్దల్ని సంరక్షించడాని చెయ్యరాని పనుల్లో భాగస్వాములు కావల్సివచ్చుది. ఆర్థిక మాంద్యం వల్ల కూడా ఉద్యోగాలు తీసివేయడంలో కంపెనీలు గానీ సంస్థలు గానీ పక్షపాత వైఖరిని ప్రదర్శించాయి. ఆడవాళ్ళ ఉద్యోగాలు ఎక్కువ శాతం పోయినాయి. కురువు కాటకాలు సంభవించినప్పుడు మగవారికి మల్లె ఇళ్ళు వాకిలి బంధువులు అన్నా అన్ని మమకారాలు చంపుకుని ఊర్లు ఏర్లు వదిలి వెళ్ళాల్సి వచ్చేది. కొత్త వలస ప్రాంతాలలో స్త్రీల అవస్థలు చాలా ఉంటాయి. వాటి అన్నింటిని తట్టుకుని నిలబడడానికి ఎంతో సహనం అవసరం అవుతుంది, ఉద్యమాలు నడుస్తున్నప్పుడు కూడా ఎక్కువ బాధలకు గురి అయ్యేది స్త్రీలే! ఉద్యమాల్లో వీళ్ళ స్థానం ఎక్కడ? మహిళా సంఘాలు అనేక సమస్యల మీద ఉద్యమించడం మనం చాలా సార్లు చూస్తున్నాం. కాని వాటికి ఏమైనా సాధకారతను మీడియా కల్పిస్తుందా? రైతాంగ పోరాటాల్లో గాని, జాతీయోద్యమ చరిత్రలో గానీ ఆడవారి పోరాట పటిమ ఏం తక్కువ కాదు. కానీ ఎంత వరకు వారి అస్థిత్వాన్ని లోకానికి ఎరుకపరిచారు?
 బాల్య వివాహాల స్థాయి నుంచి, చదువుకునే హక్కును, ఆస్తిలో హక్కుని, వరకట్నాలు ఇవ్వకుండా పెళ్ళిచేసుకునే స్థాయి నంఉచి, ఉద్యోగాలు, వ్యాపారాల వ్యవహారాలు నిర్వహించే స్థాయి వరకు ఎదగటానికి పూర్వం స్త్రీలు ధారుణమైన బాధలు పడ్డారు. క్రింది నుంచి ఇప్పటి స్థాయికి రావడానికి మహిళలు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారు. నిర్భంధాలు ఎదుర్కొన్నారు, కొన్ని సార్లు ఒంటరిగా సమాజాల నుంచి వెలవేయ బడ్డారు. అయినా మొక్కవోని ఆత్మ విశ్వాసంతో వాటిని ఎదుర్కొన్నారు. బాల్య వివాహాల కాలంలో 40 ఏళ్ళవారికి 8 సం||ల అమ్మాయినిచ్చి పెళ్ళి చేస్తే ఖర్మం చాలక భర్త చనిపోయినప్పుడు ఆ బాలికకు గుండు గీయించి మల్లు గుడ్డలు కట్టించి, లోకం మొహం తెలియకుండా ఇంటి చాకిరికి పరిమితం చేయించారు. ఆవిధంగా చేసినప్పుడు సమాజంలో ఎలాంటి విషపరిణామాలు ఏర్పడ లేదా? ఇంటా బయటా సంసారాలు చేసే జంటలు ఇలాంటి బాలికల పట్ల కౄర దృష్టిని ప్రసరించారు. ఫలితంగానే గర్భ విచ్ఛిత్తులు, భ్రూణ హత్యలు కొళ్ళలుగా జరిగాయి. గురజాడ, రాజారంమ్మోహన్‌రాయ్‌ లాంటి వారు ఇలాంటి సంఘటనలు చూసి సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఈ సంస్కరణలకు ముందు స్త్రీలు ఎంత నిక్రుష్టమైన జీవితాన్ని జీవిచ్ఛవాలుగా అనుభవించారు? స్త్రీల చదువు విషయంలో కూడా అంత పోరాట పటిమను కనపరచారు. ఆ కాలంలో కుటుంబంలో చదువుకునే హక్కు ఒక్క మగమహారాజులకే ఉండేది. చదివి ఉద్యోగాలు చేయ్యాలా? ఊళ్ళేలాలా అని ఆడ పిల్లలనోళ్ళు మూయించేవారు. ఇంట్లో చదువుకుంటున్న మగ పిల్లల బట్టలు ఉతకడం, వారికి వంట చేయడం లాంటివి చూడమనేవారు. ఇళ్ళు తుడవడం, ఊడవడం, ముగ్గులు నేర్చుకోవడం, పూజలు వ్రతాలు చేసుకోవడం చేసేవారు, మంచి సంప్రదాయం కల ఆడపిల్లలు. మేము చదువుకుంటతాం, అని రోడెక్కిన వారు ఆ రోజుల్లో కుటుంబ వ్యవస్థకు గొడ్డలి పెట్టులాంటి వారు. బ్రిటీష్‌వారి కాలంలో చదువుకునే వయస్సు పిల్లలు ఆడైనా, మగైనా పిల్లల్లో బడికి వచ్చి చదువుకుంటూ ఆ పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వం వారు నెలవారి జీతాలు ఇచ్చేవారు. ఆడబ్బుల కోసమైనా తల్లిదండ్రులు ఆడపిల్లలను బడికి పంపడం అలవాటు చేస్తున్నారు. కుటుంబ నియంత్రణలేని చేయించుకొని ఆ రోజుల్లో ఆడ పిల్లలు ఇంటికి 3,4 గురు చొప్పున ఉండేవారు. ఆడ సంతానం ఎక్కువ, ఆర్థిక పరిస్థితులు తక్కువ ఉండటంతో వరకట్నాలు బాగా ఉండేవి. ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయ్యే పరిస్థితులు గడ్డుగా ఉండేవి. వ్యక్తురాలు కాకముందే అంతో ఇంతో ఇచ్చి వదుల్చుకునే వ్యవహారంగా పెళ్ళి చేసి పంపేవారు. ఆ రోజుల్లో ఎక్కువ వరకట్నం తెమ్మని భార్యల్ని హింసించేందుకు భర్తకు అతని తరుపు వారు హంగుగా అండగా నిలబడేవారు, చాలా మంది ఉండేవారు. ఎంతో అవమానకర పరిస్థితులను ఎదుర్కొని వివాహ జీవితంలో ఎంతో ఒత్తిడిని తట్టుకుని నిలబడాలంటే తమకు ఆస్థిలో హక్కుని కలిగి ఉండటం అనేది అవసరమని  స్త్రీలు తెలుసుకున్నారు. పార్లమెంటులో బిల్లు పాస్‌ అయ్యే కాలం వరకు మహిళలు సమాజంలో ఎన్నో కష్టాలు పడ్డారు. ఆర్థిక స్వాలంభనే తమ బ్రతుకులకు సరియైన పరిష్కారమని ఆ నాటి స్త్రీలు బలంగా విశ్వసించేవారు. దాన్ని ప్రాణాలొడ్డి స్థాపించుకున్నారు. క్రమంగా మారుతున్న కాలంతోబాటు కుటుంబంలోని పెద్దలలో కూడా స్త్రీల విషయంలో సానుకూలంగా స్పందించే అవగాహన వృద్ధి చేసుకున్నారు. ఆ రకంగానే స్త్రీలు తమ భర్తల తండ్రుల సోదరుల సహాయంతో వ్యాపారల్లో ఉద్యోగాలల్లో నిలదొక్కుకోగలిగారు. అయినా ఏదో సాధించామన్న సంతోషం లేకుండా, కష్టాలూ, అవమానాలు వారిని నీడలా వెంటాడుతూనే వున్నాయి. ఒకప్పుడు కుటుంబ పరంగా స్త్రీలకు భద్రత వుండేవి. ఉమ్మడి కుటుంబాలు వున్న రోజులలో తండ్రి, తాతలు, బాబాయిలు, మావలు, సోదరులు కుటుంబ స్త్రీలకు రక్షణ కవచంలా వుండేవారు. సమస్యలు మాత్రము యధాతధమే, ఆడవాళ్ళన్న చిన్నచూపూ, అనాధారణా వున్నా భద్రత కొంత వరకు వుండేది. ఈనాడు చిన్న కుటుంబాలు, సామాజిక మార్పుల వల్ల మహిళల భద్రత అనేది గాల్లో దీపం అయ్యింది. ఇది మన ఒక్క దేశంలో కాదు ప్రపంచ వ్యాప్తంగా ఆడవాళ్ళు, బాలికలూ, వృద్ధులు సైతం హింసకు, అణిచివేతకు గురవుతున్నారు. ఈ మధ్యనే ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు సైతం ప్రంచ ప్రజలకు ఒక పిలుపు నిచ్చారు. ఆడవాళ్ళని కాపాడండని, ఇంటర్‌నెటలలో ‘ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళు కాదు, అంటూ ఆదర్శ పురుషులతో ప్రచారం చెయ్యమంటున్నారు. ప్రతీ సమాజం స్త్రీల రక్షణ కోసం, వారి ఉన్నతి కోసం ఎంతో పాటు పడుతున్నాం అంటున్నాయి. సంతోషం. కానీ ఆ సమయంలోనే సాంప్రదాయం పేరిట స్త్రీల మేధశస్సుకు ముసుగు వేస్తూన్నారు. మత నియమాల పేరిటకొన్ని విషయాలలో వారిని కఠినంగా అణిచి వేస్తున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే అవి వారి మతాలకు చెందిన నిబంధనలని ప్రభుత్వాలు తప్పుకొంటున్నాయి. బాధ్యత తీసుకోవడం ఇష్టం లేక. మతాలను కదిలిస్తే రాజకీయనాయకుల ఓటు బాగా దెబ్బ తింటుందని మత పెద్దలకు తెలుసు. స్త్రీలంటే అలాంటి వారి దృష్టిలో ఆస్తి లాంటిది. మహిళలపై హింస జరుగుతోందని, అంటే కేవలం భౌతిక హింసే కాకుండా, మానసిక, ఆరోగ్య పర, విద్యా పరంగా ఎలాంటి కష్టనష్టాలు సంభవించినా అది హింస క్రిందికే వస్తుందని చాలా మంది అభిప్రాయం. 1993లో ఐక్యరాజ్య సమితి ‘యునైటెడ్‌ నేషన్స్‌ డిక్లరేషన్‌ ఆన్‌ ది ఎలిమినేషన్‌ ఆఫ్‌ వయోలెన్స్‌ ఎగైనెస్ట్‌ ఉమెన్‌’ అనే ప్రకటనలో ఎవరైన లింగ వివక్షత చూపినప్పుడు స్త్రీలు మానసికంగా, భౌతికంగా కష్టాలు పాలైనప్పుడు అది కూడా హింస క్రిందికే వస్తుందని నిర్వచించింది.
 భారతీయ సమాజం యొక్కనమ్మకం ప్రకారం ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో! ఆదరింపబడతారో అక్కడ దేవతలు వుంటారని విశ్వశిస్తారు. ‘కలకంఠ కన్నీరొలికిన సిరి ఇంట వుండదని’ జగమెరిగిన సత్యమే. ఇతర దేశాలలో పురుషులకు సంబంధించిన ప్రతీ కార్యరంగంలో స్త్రీలు కాలు పెట్టారు. అమెరికా, జపాన్‌, జర్మనీ రష్యా లాంటి దేశాలల్లో స్త్రీలు రాజకీయాలను మొదలుకొని విజ్ఞాన వైద్య, ఆర్థిక సిద్ధాంతాల్లో అత్యున్నత ప్రమాణాలతో పని చేస్తున్నారు. మాంటిస్సోరి తయారు చేసి అమలు పరుస్తున్న విద్యా విధానం, ఫ్లోరెంస్‌, నైటింగేల్‌, రెడ్‌ క్రాస్‌ దినం, మేడంక్యూరీ వైజ్ఞానిక పరిశోధన, మదర్‌ ప్రజలకు చేసిన సేవలు, మేరీస్టోప్‌ కుటుంబ నియోజన కార్యక్రమాలు లాంటి పురుషుల ఘన చరిత్రల కేమాత్రం తీసిపోనివి. ఇక రాజకీయ క్షేత్రాలల్లో ఇందిరాగాంధీ, గోల్డా మేయర్‌, మార్గరేట్‌, థాచర్‌, కోరాజానో ఎక్వినో, భండారు నాయకే వీరంతా అందరి నాలుకల పైన ప్రశంశింపబడ్డవారే. ఇదంతా గడిచిన శతాబ్దంలోని విజయాలు. ఇప్పుడు ఈ ప్రగతి మరింత ముందుకు పోతుందా? లేదా అన్నది సమాజంలోని ప్రజలు గమనిస్తున్నారు. మహిళల ప్రగతి అనే అంశం పై చట్ట సభల సంస్థల అంకెలు ప్రధానం కాదు. ప్రగతి వెనుక ఎందరి స్త్రీల జీవితాలు అణగారిపోయాయో ఒక్క ఞణం ఆలోచించాలి. యూనిసెఫ్‌ 1999 రిపోర్ట్‌ ప్రకారం వివిధ దేశాల్లో 45% మంది గృహిణులు గాని, ఉద్యోగిణులు గాని కాలేజిల్లో చదువుకుంటున్న యువతులు గాని హింసకు గాని ఇష్టం లేని శృంగారానికి అత్యాచారాలకు గురైనవారే. 1999 నుండి 2009 వరకు గడిచిన సం||లో ప్రపంచంలో అనేక మార్పులు చేర్పులు వచ్చాయి. వాటిల్లో ఆర్థిక మాంద్యం, కరువు, ఉత్పాతాలు లాంటివే కాక ప్రజల ఆలోచనలు జీవితాలను ప్రభావితం చేసే అంశాలు ఎన్నో వున్నాయి. ఆ ప్రభావం వల్ల కూడా స్త్రీల జీవితాల్లో మార్పులు జరిగాయన్నది. వాస్తవం. పూర్వం కొద్దిదపాటి వడిదుడుకులతో ఏదో విధంగా జీవితం సాగిపోయేది. కానీ అన్ని రంగాల్లో క్రమక్రమంగా వృద్ధిని సాధిస్తున్న ఈ తరుణంలో మహిళలకు చట్టబద్ధమైన రక్షణ అధిక అవసరం. అని వస్తున్న చట్టాలను చూస్తే తెలుస్తుంది. ఫ్యామిలి కోర్ట్‌ యాక్ట్‌, ది స్పెషల్‌ మ్యారేజ్‌ యాక్ట్‌, ది హిందూ మ్యారేజ్‌ యాక్ట్‌, ది మెటర్నటీ బెనిఫిట్‌ యాక్ట్‌, డౌరి ప్రొహిబిషన్‌ యాక్ట్‌, ది మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌, ది ఈక్వెల్‌ రెమ్యూనరేషన్‌ యాక్ట్‌, ది చెయిల్డ్‌ మ్యారేజ్‌ రిస్ట్రేయిట్‌ యాక్ట్‌, క్రిమినల్‌ లా యాక్ట్‌, ఇలా ఆడవాళ్ళకు సంబంధించిన ప్రతి సమస్య మీద ఒక్కోయాక్టు తెచ్చి ఉంటుంది. భారత ప్రభుత్వం. కానీ ఏం లాభం? స్త్రీల మీద జరిగే హింస గానీ, అవమానాలు గానీ, ఆధిపత్య పెత్తనాలు గానీ, హత్యలు గానీ, ఆపడానికి ఏ చట్టం పనికి రాకుండా పోతుంది. సంఘంలో బహిరంగంగా జరిగే ఆకృత్యాలకంటే ఇళ్ళల్లో స్త్రీలమీద జరగే దారుణాలు భయంకరమైనవి. వాటిని చాలా మంది మహిళలు బైటకి చెప్పలేరు. అవి ఎలా వుంటాయంటే కొత్త కోడలు అత్తగారింట్లో అందరికి చులకనే. చివరికి పనివాళ్ళకు కూడా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చూస్తారోనని ఆసక్తిగా గమనిస్తూ వుంటారు. ఆమె పుట్టింటి వాళ్ళని హేళనగా మాట్లాడటం, పెళ్ళిలో మరియాదలుసరిగా చేయలేదని చెప్పడం, అడిగిన వన్ని ఇవ్వలేదని తిట్టడం, కొట్టడం, బంధువులంతా కల్సి నిందలు మోపడం. ఆడది గట్టిగా ఎదురు తిరగలేని ఆయుధం ఎదుటివారికి ఎలా లభిస్తుందంటే ఆమె స్త్రీ త్వాన్ని అభాసుపాలు చెయ్యడం ద్వారా. పిల్లలను దూరం చేస్తానని బెదిరించడం ద్వారా, నిందలు మోపడం ద్వారా, మాటలతో దూషించడం ద్వారా స్త్రీలని భర్త పరివారం అణిచి పెట్టడం చేస్తుంది. ఇది గృహ హింస క్రిందికి వస్తుంది. మహిళా దినోత్సవం రోజున మార్చి 8, 2002న ప్రభుత్వం లోక్‌సభలో చట్టంగా ప్రవేశ పెట్టింది. ఈ చట్టం అమలులోకి వచ్చిన మరునాడే ఒక బ్యాంక్‌ ఆఫీసర్‌ భార్యని హింసిస్తూ పట్టుబడటం విచిత్రం! ఈ మధ్య స్త్రీల పట్ల చాలా కుటుంబాలలో ఉన్న దృష్టి కోణం మారుతున్నది. మగ పిల్లలతో పోల్చి, అన్ని విధాల వారికి అండదండలు ఇవ్వలేక పోవడం, పక్షపాత ధోరణిలో వుండటం అనేవి తగ్గినా, స్త్రీ అంటే కోర్కెలు తీర్చె భోగ వస్తువనే అభిప్రాయం ఈనాటికీ చాలా మందిలో వుంది. కుటుంబానికి రాత్రి పగలూ పని చేసే దాసీగా వుంటూ, ఎలాంటి గౌరవ మర్యాదలు పొందలేక మానసిక క్షోభను అనుభవిస్తూ తమలోని ప్రతిభను పోగొట్టుకునే స్త్రీలు మన సమాజంలో గడపకొకలైన వున్నారు. ఆకాశంలో సగం అనే నినాదంతో వున్న స్త్రీ పురుష నిష్పత్తిలో ఆడవాళ్ళు ఇలాంటి దయనీయ స్థితిలో వుండటం వల్ల సమాజానికి ఎంతో నష్టం. స్త్రీల సాధికారతకై ముఖ్యమైనవి రెండే అడుగులు. ఒకటి చదువు, రెండోది ఆర్థిక స్వావలంభన చదువుతూ, ఉద్యోగం వుంటే ఇక స్త్రీల మీద ఎలాంటి కష్ట నష్టాలు వుడవా? అని ప్రశ్నిస్తే చాలా వరకు కుటుంబ పరమైన, సమాజ పరమైన, వ్యతఇరేక ధోరణిని ప్రశ్నించడం నేర్చుకుంటారు. వారి మీద జరుగుతోన్న దోపిడి దౌర్జన్యాలను ప్రశ్నించడం నేర్చుకుంటారు. ఉదాహరణకి మన దేశంలోని చిన్న రాష్ట్రమైన కేరళని పరిశీలిస్తే మిగతా అన్ని రాష్ట్రాల కంటే కేరళలో ఆడపిల్ల విద్యాభ్యాసం మొదటి స్థానం ఆక్రమిస్తుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తవకుండా ఆడపిల్లలెవరూ చదువు మానరు. అక్కడ ఆడవారి పెళ్ళి వయసు 26, 27 ఏళ్ళుగా వుండాలని ప్రభుత్వంపై వత్తిడి తెచ్చారు. దీని వలన ఆ సమాజంలో అనూహ్యమైన మంచి పరిణామాలు కలిగాయి. పెళ్ళి వయసు నిర్ధారణ వలన అధిక జనాభా సమస్య తగ్గింది. ప్రతి ఒక్క ఆడపిల్ల తప్పని సరిగా చదువుకోవడం వల్ల దేశంలోనే గాక విదేశాల్లో సైతం ఉద్యోగావకాశాలు లభించాయి. ఆర్థిక స్వావలంభన వారి వికాసం వల్ల దేశంలోనే గాక విదేశాల్లో సైతం ఉద్యోగావకాశాలు లభించాయి. ఆర్థిక స్వావలంభన వారి వాకాసానికో మైలురాయి! భారత దేశంలో పంచాయితీ వ్యవస్థలో 50% మంది ఆడవాళ్ళు వుండాలన్నారు. సంతోషమే. ఎంత మంది స్త్రీలు సర్పంచీలుగా పూర్తి కాలం అధికారాన్ని ఉపయోగించి ప్రజలకు సేవ చేయగలుగుతున్నారు? ప్రచార సాధనాలకు అందనంత వరకు ఆ స్త్రీలు ఏ రంగంలోకి దూసుకొచ్చినా వారి వెనకే ఈ నీడలు తప్పడం లేదు. ఉద్యోగాలు చేస్తున్న  స్త్రీలకు ప్రసూతీ సెలవు తప్పడం లేదు. ఉద్యోగాలు చేస్తున్న స్త్రీలకు ప్రసూతీ సెలవు ఇవ్వడం మామూలే. పురుషులు కూడా సెలవు పెట్టుకొని పిల్లలు ఆలనా పాలనా చూడాలని స్వీడన్‌ ప్రభుత్వం అక్కడి పురుషులకు చెప్పినప్పుడు, ఇలాంటి సెలవుల వల్ల ఉద్యోగంలో తమ అనుభవంపై ప్రభావం పడుతుందని అభ్యంతరం తెలుపబోతే, స్త్రీలు అదే అభ్యంతరం వ్యక్తం చేస్తే సమాజమే నష్టపడుతుందని ఆ ప్రభుత్వం తిరస్కరించింది. స్త్రీల, పురుషులిద్దరు ఒకే నాణానికి చెందిన బొమ్మ బొరుసులాంటివారు. ఐక్యత, సద్భావనల వాతావరణంలోని వారి మధ్య సహకారం అభివృద్ధి జరుగుతుంది.
 భారతదేశ స్త్రీల సామాజిక పరిణామాన్ని పరిశీలిస్తే ఇప్పటివరకూ కుటుంబాలలో ఆడపిల్ల పుట్టిందనగానే ”అయ్యో” అనే మనస్తత్వాలు పోలేదు. ఇతరదేశాలతో పోలిస్తే కొన్నికొన్ని రంగాల్లో మన దేశ స్త్రీలు చాలా మంది ప్రగతిలో ఉన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డిప్యూటీ గవర్నర్‌ శ్యామలాగోపీనాధ్‌ బల్లగుద్ది మరీ ఒక అంశాన్ని చెప్పారు. ”ఒక ఆర్థిక, పాలన రంగాల్లోనే కాదు ఏ రంగంలోనైనా ఓపెన్‌ కాంపిటీషన్‌లో పాల్గొనే అవకాశాన్ని ఇస్తే, మగవాళ్ళ కన్నా స్త్రీలే ముందుటార”ని అన్నారు.
 అన్ని విషయాలలోను అణిచివేతకు గురిఅవుతున్న స్త్రీలను విద్యా, వివాహ, ఆర్థిక, సామాజిక రంగాల్లో పురుషులతో సమానంగా చూడాలన్నా ఆరాటం విరేశలింగంగారు తన రచనల ద్వారా ప్రకటించేవారు. ఈ మధ్య జరుగుతన్న వరుస సంఘటనలు చూస్తుంటే స్త్రీలకు ఇవ్వవల్సిన సమానత్వంలో మనం స్టేజీల మీద ఉపన్యాసం ఇవ్వడం వరకు పరిమితం చేశాం. కాలేజిల్లో నాల్గు రోజులు పరిచయానికే ఒకడు ప్రేమించానంటాడు, వెంటబడి వేధించి అల్లరి చేస్తాడు. కానీ ఆ అమ్మాయికి తన అభిప్రాయం చెప్పే స్వతంత్రం లేదా! నో అని చెప్పిన నేరానికి గొంతులు కోసి ప్రాణాలు తీయడం, యాసిడ్‌ పోసి జీవితాన్ని భగ్నం చేయడం మగవాడికి తన కోరినంత మాత్రాన్నే అమ్మాయి వచ్చి ఒళ్ళో వాలాలన్న అహంకారం ఉంది. సొసైటీలో తనూ ఏం చేసిన చెల్లుతుందన్న పొగరుబోతు భావాలు చాలా మందిలో ఉండటం వల్లనే ఇలాంటి అమానుష చావులు పునఃరావృతం అవుతున్నాయి. ”వందేళ్ళ చరిత్ర” అనేది స్త్రీ ఎంతో కష్ట నష్టాలు ఎదుర్కొంటే చరిత్రలో తనొక స్థానాన్ని ఏర్పరుచుకోగలిగింది. ఎంతోమంది మహిళా మణుల పోరాట ఫలితమే నేటి స్త్రీలు ఈ మాత్రమైనా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నారు. ప్రముఖ కవయిత్రి జయప్రభగారు ”వేల సం||లుగా చెలామణిలో ఉన్నా సామాజిక నీతి శాస్త్రాలు, ధర్మ సూత్రాలు స్త్రీలను బలహీనులను అణిచివేయడానికి పితృస్వామ్య వ్యవస్థలో పాలకులు రూపొందించుకున్న ప్రణాళికలన్ని డాక్యుమెంట్లు మాత్రమే! అన్నారు. సంపదకు ఆది దేవత స్త్రీ లక్ష్మీ దేవి ఇది ఒక భ్రమ నిన్న మొన్నటి దాక స్త్రీలకు ఆస్థిహక్కు కల్పించలేదు. చదువుకు ఆది దేవత సరస్వతీ. చదువుల తల్లీ అని ప్రార్థిస్తాం ఇది ఒక భ్రమే. స్త్రీలకు చదువు లెందుకని చాలాకాలం వ్యతిరేకించారని జయప్రభగారు సూటిగా చెప్పారు.
 ఇప్పటికి మన దేశంలో 60%కి పైగా స్త్రీలు వ్యవసాయిక పనులు చేస్తూ పల్లెల్లో నివసిస్తూన్నారు. ఇప్పటితరం పిల్లలు మాత్రం పల్లెనుంచి బస్తీకి ప్రయాణం చేస్తూ చదువుకుంటున్నారు. వారిలో కొద్దిమంది మాత్రమే పై చదువులకు వెళ్ళి ఉద్యోగాలు చేయగలుగుతున్నారు. మిగతా స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబాన్ని పోషించడంలో సహాయపడుతున్నారు. కష్టపడటమే గానీ, శ్రమ ఫలితాలను అందుకోని అనుభవించే శక్తి వాళ్ళ చేతులలో లేకుండా వున్నారు. పగలంతా పొలాల్లో పనులు చేస్తూ, ఆరోగ్యాలను కోల్పోతూ శ్రమదోపిడికి గురవుతూనే వున్నారు. అరకొర చదువులు వారిని ఒడ్డున పడెయ్యలేకపోతున్నాయి. మరి మధ్యతరగతి మహిళల పరిస్థితులూ అందుకు మినహాయింపు లేదు. ఒక మోస్తారు సౌకర్యాలున్న బస్తీలలో కాపురాలుంటూ తమ చదువులకు తగ్గ ఏదో ఒక ఉపాధిని చూపుకున్నా ఇంటా బయటా చాకిరితో అరకొరా సౌకర్యాలతో పని ప్రదేశాలలో కునారిల్లుతున్నారు. వారికి వచ్చే కొద్దిపాటి డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగిస్తే, మగవాడు తెచ్చే డబ్బు విలాసాలకు ఖర్చులకూ సరిపోతాయి. దీనివల్ల ఉద్యోగాలున్న స్త్రీలలో కూడా సంపాదించిన డబ్బును తమ స్వంతానికి ఖర్చుపెట్టుకొనే అర్హత లేదు. ఆర్థిక స్వాతంత్య్రం లేని వారికి ఆర్థిక స్వావలంబన ఎలా వస్తుంది? ఈ రోజున కూడా వేలల్లో సంపాదించే స్త్రీలు ఇంటికొచ్చాక ఆ డబ్బును భర్త చేతిలోకి పోయవలసిందే. ఆమె సంపాదించిన డబ్బుకు ప్లానులు భర్త రూపొందించినవే అయ్యుంటాయి. సంపాదించిన ఆ డబ్బును రెండుచేతులా తిరిగి అడుక్కోవలసినదే. ‘ప్రతీ పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంది.’ అనే సామెతకు ఆడవాళ్ళు ఒకింత గర్వించవచ్చు. కానీ ఈ ఆధునిక శతాబ్దంలో కూడా పురుషుడి వెనుక విజయాలను ప్రస్తుతిస్తూ, కష్టాల కడలలో కాడే స్త్రీలను గుర్తించడం ఎప్పుడు? వారి అభివృద్ధికి దోహదపడే అంశాలను పరిగణనలోకి తీసుకునేదెప్పుడు?
 స్త్రీలకు సహాయపడే విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక స్వావలంబన అనే విషయాలల్లో చట్టాలూ, సంస్థలూ, ప్రభుత్వాలూ చొరవ తీసుకొని వారి ఉన్నతికి, మార్గనిర్దేశకాలు చెయ్యాలి. స్త్రీల జీవితమ్మీద స్త్రీల అధికారం ఏ మేరకు ఉందన్న విషయాన్ని కూడా పై సంస్థలు నిశితంగా గమనించాలి. ఇటీవల స్త్రీవాద సాహిత్యం కూడా ఈ స్థితిని గురించి పరిశీలిస్తూ, అవసరమున్నచోట తన కలానికి వాడిగాను పదును పెడుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రెండున్నర దశాబ్దాల తరువాత స్త్రీల స్థితిగతులను, వారి సమస్యలను అంచనా వేయడానికి 1974 భారత ప్రభుత్వము ఒక కమిటీని (్పుళిళీళీరిశిశిలిలి ళిదీ శినీలి ఐశిబిశితిరీ ళితీ ఇళిళీలిదీ రిదీ |దీఖిరిబి) నియమించింది. కమిటీ తయారుచేసిన నివేదికలో ప్రభుత్వం అమలుచేసిన అనేక పథకాలు విఫలమైనాయని నిజాలు వెల్లడించింది. ఈ నివేదికలో స్త్రీ, పురుషుల మధ్య ఉన్న అసమానతల తీవ్రత ప్రభుత్వాన్నే దిగ్భ్రాంతికి గురిచేసిందట. క్రమానుగతంగా మహిళలను అభివృద్ధిలో భాగస్వాములను చేయడానికిగాను ప్రభుత్వాలు స్త్రీలకు అనుకూలమైన కార్యక్రమాలను చెయ్యడం మొదలుపెట్టాయి. ఆ క్రమంలోనే స్త్రీలకు 33% రిజర్వేషన్లు అమలుచేయడం కోసం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా బిల్లు కానీయకుండా ఎన్నో అడ్డంకులు కల్పిస్తున్నారు.
 ఏ రకంగా చూసినా స్త్రీలకు సమాజంలో పురుషులతో పాటు సమానస్థాయి లేదని తేలిపోతుంది. ఎన్నిసార్లు మహిళా దినోత్సవాలు జరిపినా ప్రభుత్వాలూ చట్టాలూ ఎంత బాకా వూదినా, మహిళా సాధికారతను సాధించడమే తన లక్ష్యంగా ప్రభుత్వం ప్రకటించుకున్న ఆ ప్రభుత్వం అమలుచేసే విధానాలు ఇందుకు వ్యతిరేకంగా వుండటం ఒక విచిత్రం!

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

3 Responses to నిజంగా ఆకాశంలో సగం మనమేనా!

  1. rameshraju says:

    ఈ రొజుల్లో మహిళలకు ఉన్న అవకాశాలు పురుషులకు కూడా ఉండడంలేదు. మహిళలు ఉద్యోగాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. వారి ఆర్ధిక స్వేచ్చ వలన వారిలో విచ్చలవిడితనం పెరిగిపోయింది, కుటుంబవ్యవస్త బలహీనపడింది. ఇటీవల విడాకుల కేసులు కూడా భారీగా పెరిగిపోయాయి, ఐ.పి.సి 498 ఎ కూడా 90% దుర్వినియోగం అవుతోంది. కాపురం ఆనందంగా సాగాలంటే భార్యా భర్తలు ఒకరి పై ఒకరు అధారపడాలే కాని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం సరికాదు. సృష్టి ధర్మం ప్రకారం సమకూర్చేవాడు పురుషుడైతే చక్కబెట్టుకొనేది స్త్రీ అవుతుంది. సమకూర్చడం ఎంత కష్టమో చక్కబెట్టుకోవడం అంతే కష్టం. కనుక రెందు బాధ్యతలు కష్టమే, సమానమే.

  2. Pulla Rao says:

    ఆకాశంలో సగం ఎందుకవ్వాలి ? పూర్తి ఆకాశం ఎందుక్కాకూడదు ?
    సోనియా గాంధీ, మాయావతి, మమత, జయలలితలని చూస్తే ఏమనిపిస్తోంది ?
    మహామహా మహా మహులంతా వాళ్ళ కాళ్ళ ముందు మోకరిల్లినవాళ్ళేగా ?
    ఆడది అనాదిగా అబల కాదు.
    నాగరికత బలిసేకొద్దీ ఆడదాన్ని వెనక్కి వెట్టి మగాడు ముందుకొచ్చాడు.
    ఇప్పుడు ఆడవాళ్ళంతా ఆ మగాడిని సగమైనా ఇమ్మని అడుక్కునే పరిస్థితి కల్పించాడు.
    మగాడే అంత చెయ్యగా లేనిది ఆ మగాడికి జన్మనిచ్చిన ఆడది చెయ్యలేదా ?
    ఆలోచించండి.
    ఆలోచించండి.
    ఆలోచిస్తూనే ఉండండి.

  3. rameshraju says:

    స్త్రీల క్షేమం మరియు కుటుంబ వ్యవస్త కోసమే పురుషులు ఆచారాలు, సంప్రదాయాలు సృష్టించారు. కిరాతులు పూర్వం స్త్రీలను బలవంతంగా ఎత్తుకొనిపోయేవారు. వారి భారి నుండి స్త్రీల ను కాపాడుకోవడానికి పురుషులు స్త్రీ ని ఇంటినుండి బయటకు రావడం నిషేధించారు, మంగళ సూత్రం సృష్టించారు. స్త్రీలు శారీరకంగా బలహీనులు కాబట్టి బయటకు వెళ్ళి ఆహారం సంపాదించే బాధ్య్తత పురుషుడు రాతి యుగంలోనే స్వీకరించాడు. కనుక పురుషుడు ఆడదాన్ని వెనక్కి వెట్టి మగాడు ముందుకొచ్చాడు అని అనడంలో పూర్తి వాస్తవం లేదు. సృష్టి ధర్మం ప్రకారం సమకూర్చేవాడు పురుషుడైతే చక్కబెట్టుకొనేది స్త్రీ అవుతుంది. సమకూర్చడం ఎంత కష్టమో చక్కబెట్టుకోవడం అంతే కష్టం. కనుక రెందు బాధ్యతలు కష్టమే, సమానమే. దీని ప్రకారం నడచుకుంటే సమాజం, కుటుంబ వ్యవస్త సవ్యంగా ఉంటుంది.

    ఈ రొజుల్లో మహిళలకు ఉన్న అవకాశాలు పురుషులకు కూడా ఉండడంలేదు. మహిళలు ఉద్యోగాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య బాగా పెరిగిపోయింది. వారి ఆర్ధిక స్వేచ్చ వలన వారిలో విచ్చలవిడితనం పెరిగిపోయింది, కుటుంబవ్యవస్త బలహీనపడింది. ఇటీవల విడాకుల కేసులు కూడా భారీగా పెరిగిపోయాయి, ఐ.పి.సి 498 ఎ కూడా 90% దుర్వినియోగం అవుతోంది. కాపురం ఆనందంగా సాగాలంటే భార్యా భర్తలు ఒకరి పై ఒకరు అధారపడాలే కాని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం సరికాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.