విదేశాల్లో ఉండే భారతీయులతో జరిగే పెళ్ళిళ్ళు అన్నీ చెడుగా ఉండవు. కానీ మీ కుమార్తె మరియు మీ కుటుంబం శ్రేయస్సు కోసం మీరు అటువంటి సంబంధాల్లోకి ప్రవేశించటానికి ముందు తీసుకొవలసిన జాగ్రత్తలు.
ఎన్ ఆర్ ఐ లు/విదేశాల్లోని భారతీయుల వల్ల ఎన్నో మోసకారి వివాహాలు జరిగిన కేసుల ఉన్నాయి.
ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన కేసుల వివరాలు ఉన్నాయి :
1. విదేశాలకు తీసుకు వెళ్ళబడటానికి ముందే ఆమె వదిలి వేయబడుతుంది. స్వల్పకాల హనీమూన్ తర్వాత త్వరలోనే టిక్కెట్లను పంపిస్తానని ప్రమాణం చేస్తాడు కానీ అతడు తిరిగి ఎన్నటికీ ఆమెను సంప్రదించడు.
2. మహిళ పరాయిదేశానికి వెళ్ళి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తనభర్త ఇంక తిరిగిరాడని అక్కడే ఆమె అర్థం చేసుకుంటుంది.
3. వివాహమైన మహిళ విదేశానికి వెళ్తుంది కానీ సంవత్సరం లోపే ఆమె బలవంతంగా వెనక్కి వచ్చేస్తుంది. ఆమె తన బిడ్డను తనవెంట తీసుకువెళ్ళటానికి అనుమతించబడదు.
4. వివాహిత విదేశానికి వెళ్ళి క్రూరంగా చావుదెబ్బలు తినడం, దాడులకు గురికావటం, మరియు శారీరకంగా, మానసికంగా తిట్లు తినడం, పౌష్టికాహారలోపం మరియు మరింకెన్నో విధాలుగా అవమానకరంగా చూడబడుతోంది.
5. తన భర్త తప్పుడు సమాచారమిచ్చినట్లు లేదా కింద పేర్కొన్నవన్నీ చెప్పినట్లు వివాహమైన తర్వాతే మహిళ తెల్సుకుంటుంది. అతడి ఉద్యోగం, ఇమ్మిగ్రేషన్ హోదా, ఆస్తి, వివాహ హోదా మరియు తక్కిన భౌతికమైన వివరాలు. ఇవి ఆమెను వివాహం చేసుకునేలా మోసానికి గురిచేస్తున్నాయి.
6. వివాహానికి ముందు, తర్వాత కూడా మహిళ, లేదా ఆమె తల్లిదండ్రులు కూడా పెద్ద మొత్తంలో కట్నం ఇవ్వాల్సిన విషవలయంలో చిక్కుకుంటున్నారు. పరాయిదేశంలో ఆమె సంపాదన కోసం ఆమె చేత బలవంతంగా పని చేయించి ఆమె వద్దనుండి సంపాదనను భర్త గుంజుకొంటున్నాడు.
7. తాను వివాహం చేసుకున్న విదేశీ భారతీయుడికి అప్పటికే పెళ్ళయ్యిందని, అతడు వేరొక మహిళతో జీవిస్తున్నాడని ఆమె అక్కడికెళ్ళాక తర్వాత మాత్రమే తెలుస్తుంది.
8. మహిళభర్త, ఆమెకు తెలియకుండానే విదేశాల్లో ఏకపక్ష ఎక్స్‌పార్టీ డిక్రీ విడాకులు తీసుకుంటున్నాడు.
9. ఎటువంటి మద్దతు, లేదా జీవించటానికి ఆధారంగా ఉండేమార్గాలు, లేదా తప్పించుకోవటానికి మార్గాలు లేక ఆ దేశంలో ఉండటానికి వీసా కూడా లేకుండా మహిళ విదేశంలో వదిలి వేయబడుతోంది.
10. భరణం లేదా విడాకుల కోసం మహిళ కోర్టుకు వెళ్తోంది. కానీ కోర్టుల అధికారాలు, నోటీసుల జారీ, లేదా ఆదేశాల జారీ లేదా ఆదేశాల అమలువంటి చట్టబద్ధమైన అడ్డంకులను ఆమె తరచు ఎదుర్కొంటోంది.
11. పెళ్ళి కొడుకు ఉండే విదేశానికి మహిళ అనేక రకాల వంచించబడి వెళ్తోంది. అతడ్ని అక్కడ వివాహం చేసుకుంటోంది. భారతీయ కోర్టులకు అక్కడ పరిమితమైన అధికారం వుందని ఆమె తర్వాతనే తెల్సుకుంటుంది.
ఇటువంటి వివాహాలు మీ కుటుంబానికి ఆపదను కలిగిస్తాయి మరియు మీ కుమార్తె భవిష్యత్తుపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తాయి.
ఈ క్రింద పేర్కొన్న ముందు జాగ్రత్తలు తీసుకోండి :
1. విదేశాలకు చెందిన వివాహం చేయాలనే నిర్ణయం తొందరలోతీసుకోకండి. అది మీ కుమార్తె జీవితానికి సంబంధించినది.
2. ప్రతిపాదిత ఎన్ఆర్ఐ/విదేశంలో ఉన్న భారతీయునితో వివాహన్ని ఖాయపర్చే ముందు అతడి పూర్వచరిత్రను తనిఖీ చేయండి.
3. విదేశీ పెళ్ళి కుమారుడితో వివాహ ప్రతిపాదనను పరిగణించే సమయంలో నిర్ణయాన్ని తీసుకోవటంలో ఒత్తిడికి గురికాకండి. ఎందుకంటే ఇదొక ముఖ్యమైన నిర్ణయం.
4. ఫోన్ మీద లేదా ఈ-మెయిళ్ళ ద్వారా వివాహ విషయాన్ని ఖాయపర్చకండి.
5. విదేశాలకు చెందిన వివాహాన్ని మీ కుమార్తెకు చేయడంలో ఏదైనా బ్యూరో, ఏజంట్, లేదా మధ్యవర్తిని గుడ్డిగా విశ్వసించకండి.
6. వివాహం ద్వారా వేరొక దేశానికి వలస వెళ్ళటానికి లేదా గ్రీన్ కార్డు పొందవచ్చనే వాగ్దానాల పథకాలకు బలికాకండి.
7. విషయాలను రహస్యంగా నిర్ణయించకండి. ప్రతిపాదనను స్నేహితులు మరియు దగ్గరబంధువుల దగ్గర ప్రచారం చేయండి. మీరు మరొక విధంగా సంపాదించలేని ముఖ్యమైన సమాచారాన్ని పొందటంలో వారు సహాయపడగలరు.
8. వివాహాన్ని ప్రచారం చేయటానికి అవసరమైన ఫోటోగ్రాఫ్ తదితరాల నిరూపణతో మత సంబంధమైన వివాహంతో పాటు రిజిస్టర్ వివాహం కూడా భారతదేశంలో జరగటానికి ఎల్లప్పుడూ నొక్కి చెప్పండి.
9. పెళ్ళి కొడుకుకి చెందిన వివాహ హోదా, ఉద్యోగం-స్థానం, జీతం, అతడి అధికారాలు, ఇమ్మిగ్రేషన్ హోదా, వీసా రకం, వేరొక దేశానికి భార్యను తీసుకువెళ్ళటానికి అతడికున్న అర్హత, కుటుంబ వివరాలు, కుటుంబ రకం, అతడికి చెందిన నేరచరిత్ర తదితరవిషయాల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించండి.
10. అత్యవసర పరిస్థితులు ఎదురైనట్లైతే ఆమె దగ్గర ఉండటానికి మీ కుమార్తెకు రాయబార కార్యాలయాలు, హెల్ప్‌లైన్స్, బంధువులు తదితరాల ముఖ్యమైన టెలీఫోన్ నెంబర్లు, చిరునామాలు ఇవ్వండి.
11. మీ ఆధీనంలో మీ పాస్‌పోర్టు/వీసాను ఉంచండి మరియు పాస్‌పోర్టు/వీసా కాపీని కూడా మీరు ఎల్లప్పుడూ ఉంచుకోండి.
12. ఏ కారణం వల్లనైనాగాని నకిలీ కాగితాలు లేదా ఏవైనా నకిలీ లావాదేవీల మీద సంతకం పెట్టటానికి అంగీకరించకకండి.
13. మీ తరపున మరియు పెళ్ళి కొడుకు తరపున కావల్సిన ఇతర లాంఛనాలు, మరియు వీసా జారీకి అవసరమైన కాగితపు పనంతటినీ పూర్తి చేయండి. అసలు కాగితాలన్నింటిని మీ తోటే ఉంచుకోండి. విదేశాలలో చాలా తక్కువ సాంఘిక ఒత్తిడి ఉంటుంది. భర్త భార్యను స్పాన్సర్ చేయనిదే వీసాలు అంత సులభంగా దొరకవు. పెళ్ళికొడుకు తన భార్యను ఏదో ఒక కారణం మీద ఆమె దేశంలో వదిలి వేయగలడు, మరియు తరచు ఆమె డబ్బుతో స్వేచ్ఛగా తిరుగుతాడు.
ఇక మీద జాగ్రత్తగా ఉండండి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
సంవసరాల వారీగా కొన్ని స్టాటిస్టిక్స పుబ్లిష్ చేస్తె ఇంకా ఉపయొగంగా ఉంటుంది.
ఇది చదివాక నాకు ఒక్కటే అనిపించింది.
“అడుసు తొక్కండీ, గానీ తొక్కే ముందర ఈ జాగ్రత్తలు తీసుకోండీ” అని చెప్పినట్టనిపించింది.
అసలు చెప్పాల్సింది ఇది: “ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని బాగా తెలుసు కోకుండా (అంటే రోజుకి ఎన్ని సార్లు పళ్ళు తోముకుంటారూ, ఎన్ని సార్లు స్నానం చేస్తారూ అనే విషయాల దగ్గర్నించీ), ఆ వ్యక్తి మీద ఎంతో ప్రేమ కలగకుండా, ఆ వ్యక్తి లేకుండా జీవించలేమూ అని అనిపించకుండా, డబ్బు ప్రశక్తి లేకుండా, ఆర్థిక స్వాతంత్రం లేకుండా, పెళ్ళి చేసుకోకూడదు” అని మాత్రమే.
– ప్రసాద్
క్షమించాలి. పై వ్యాఖ్యలో ఒక తప్పు దొర్లింది, డబ్బు ప్రశక్తి విషయం. ఇది వాక్య నిర్మాణానికి సంబంధించినది మాత్రమే. ఇలా వుండాలి పై వ్యాఖ్య:
“ఇది చదివాక నాకు ఒక్కటే అనిపించింది.
“అడుసు తొక్కండీ, గానీ తొక్కే ముందర ఈ జాగ్రత్తలు తీసుకోండీ” అని చెప్పినట్టనిపించింది.
అసలు చెప్పాల్సింది ఇది: “ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని బాగా తెలుసు కోకుండా (అంటే రోజుకి ఎన్ని సార్లు పళ్ళు తోముకుంటారూ, ఎన్ని సార్లు స్నానం చేస్తారూ అనే విషయాల దగ్గర్నించీ), ఆ వ్యక్తి మీద ఎంతో ప్రేమ కలగకుండా, ఆ వ్యక్తి లేకుండా జీవించలేమూ అని అనిపించకుండా, డబ్బు ప్రశక్తి లేకుండా వుండేట్టు చూసుకోకుండా, ఆర్థిక స్వాతంత్రం లేకుండా, పెళ్ళి చేసుకోకూడదు” అని మాత్రమే.
– ప్రసాద్”