డా|| సి. భవానీదేవి
నా బొమ్మ
నాకెప్పుడూ ఇష్టమే !
కానీ
ఎవరో కట్టిన ఫ్రేములో కాదు
నా పాట
నాకెంతో ఇష్టం !
నా ఆత్మను మేలుకొల్పినప్పుడేగానీ
ఎవరో కూర్చిన బాణీలో కాదు
ఇన్ని సముద్రాలు దాటినా
నిరంతరం వెదుక్కునేది
నా కోసమే !
నేను కలలు కంటున్న గమ్యాన్ని
నీ మాటల అద్దాల్లో చూడమంటున్నావు
నా చూపులకది
ఇరుకైన ఇనప గోడే గానీ
ఎగర దలచిన ఆకాశం కాదు
సి.హెచ్. సుజాత
అమ్ములు ది రెబలూ
అనగనగా అమ్ములు
అమ్ములు అనగా అణువా? అణుశక్తా?
అంతఃకరణమును మెరుగులు దిద్దే అద్దం.
ఆంధ్రావనిలోని అవతారిక
ఆకాశమే హద్దన్న అంగన
ఇక్కట్లను ఇగిర్చే ఆంక్ష
ఇంధ్రదనుస్సును తాకే ఆకాంక్ష
ఈతిబాధలు ఈదే ఇంధనం
ఈతరానికే ఇతివృత్తం
ఉగ్గుపాలలో ఉదయించిన ఈప్స
ఉత్తమంగా మొలచిన ఈరిక
ఊహాజనిత ఉద్యమం
ఊసులుకొసరే ఉత్తరం
ఋతువుల ఊయల
ఋణానుబంధాల ఊట.
ఎక్కుపెట్టిన ఋజువు
ఎలదోటలో ఋతురాగం
ఏకాంకికలోని ఎలనాగ
ఏలుబడి ఎల్లల ఎరికె
ఐశ్వర్య జలాన్ని తోడె ఏతం
ఐతారం ఎరుగని ఏడాది
ఒలంతం నిషా దించిన ఐదువ
ఒగరు ఒప్పులో ఐకం
ఓనమాలు నేర్పే ఒడి
ఓటమికి ఒడలు చూపని ఒర
ఔదార్యానికి ఓంకారం
ఔన్నత్యానికి ఓటు బ్యాంకు
అంగడిలో అమ్మని ఔషధామృతం
అంతఃపురములో అమ్మని అంబరం సరసన చేర్చిన ఔరసి.
ఈ అమ్ములపొది అమ్ములు.
అమూల్ ది టేస్ట్ ఆఫ్ ”ఇండియా”
అమ్ములూ ది సింబల్ ఆఫ్ ”అమ్మాయా”.
అమ్ములు అందరి అమ్మాయి
అచ్ఛమైన తెలుగమ్మాయి.
డా. జరీనా బేగం
ఇదేమీ మానసికానందమో
సభా ప్రాంగణంలో మూలకు నిలబడి
ఉద్వేగ ఉపన్యాసాలు విని
మరునాడు తనే ఆ సభాపర్వానికి
కీలక వ్యాసకర్త అని పదుగురుకి
చెప్పి ఆనంద పడ్డం
శిఖరాల నెక్కిన స్నేహితుని శ్రమ బాటలో
మాట సహాయం చేయకపోయినా
ముందు నడిపించి తీసుకెళ్ళింది నేనేనంటూ
తన్మయానందంతో వూగిపోతూ
మేధావుల చర్చలలో కవితా గోష్టులలో
బలవంతపు భాగస్వామి అయి
బయట పడగానే ప్రధాన చర్చనీయాంస
సృష్టికర్త నేనేనంటూ ప్రథమస్థాయి
విలేకర్ల ముందు ఆనందోత్సహాలతో
మైమరచి ప్రసంగించటం
వినే వారు దొరకాలే కాని
మనిషిలోని అసంతృప్త మనిషి
తమ తీరని కోరికల
అసంతృప్తి ఆనందాల
అబద్దాల జాబితా
అలిసి పోకుండా వర్ణిస్తూనే వుంటాడు
అదేం మానిసికానంద సౌజన్యమో
రేణుక అయోల
పుట్టిన రోజు
ఈరోజు, పుట్టినరోజు
వేకువ కోసం పెనుగులాడే రెప్పలమీద
చెవిలో వినబడిన మాట
ఎన్నవ పుట్టిన రోజు?!
జీవితాన్ని మరచిపోతున్న వేకువలో మొలచిన మొక్క
ఈ ప్రశ్న.
ఎన్ని సార్లు నిద్రలోకి జారుకున్నా ఒకటే కల
మూసుకుంటున్న ద్వారాలు చెదిరిపోతున్న
ఇంటి ఆనవాళ్లు
శరీరం నిండా సూదులు, ఒంటి చుట్టూతా అల్లుకున్న పరీక్షలు
ముక్కలుకోసి, చర్మం అంచులకి అద్దిన నిర్ధరణలు.
మరణాన్ని వరంగా పొందుతుంటే గుమ్మం దగ్గరే నిలబడి
చెవికింద పలకరింపుగా గుసగుసగా పుట్టినరోజు పిలిచింది.
అయినా ఎందుకో ఈ పుట్టినరోజు
గతం సమాధిమీద మట్టి పెళ్ళలు తవ్వి పోస్తోంది
అస్థి పంజరంలో కదలిక-
ఆరవ ఏట వచ్చింది
బుట్టలా నిలిచిన పట్టుపరికిణితో
గిరగిరా తిరుగుతూ ఆనంద పడుతున్నప్పుడు
బుగ్గమీద మొటిమ నిద్రని దూరం చేసిప్పుడూ వచ్చింది,
యవ్వనం ఇంద్రధనుస్సులా మురిపిస్తూ వుండగానే
అత్తవారింట్లో మొదటిసారిగా వచ్చింది.
బర్త్డే గ్రీటింగ్స్ కోసం ఎదురుచూపు
ఖాళీగా పడివున్న ఉదయాన్ని దాటుకుని
అర్థరాత్రి గ్రీటింగ్స్, గుప్పుమన్న విస్కివాసన
పొగడ్తలు శరీరంనిండా గాయాలు.
సుడితిరిగే దుఃఖం అంచులలో పుట్టినరోజు
మసక చంద్రుడిలా వెలవెల పోయింది
కాని మళ్ళీ వచ్చింది
శరీరమంతా విచ్చుకున్న పువ్వులాంటి అనుభవంతో
ఆనందం-నాచుట్టూ పక్షిలా ఎగురుతోంది
విశాలమైన నదిలో చేప పిల్లలా ఈదుతోంది
తల్లిని కాబోతున్న అనుభవం,
”హ్యాపి బర్త్డే” మాతృత్వపు పరిమళం తియ్యగా రాగాలు తీసింది
కాలం నిన్న మొన్నటి చిట్టి పక్షి పిల్లకి జంటని చూపించి
విశాలమైన జీవన గగనంలోకి తీసుకపోయింది.
అపురూపమైన రక్త సుగంధం ఇగిరిపోయింది
ఇంకా ఆ పుట్టిన రోజు పరిమళం గుండెల్లో మిగిలి
ధైర్యాన్ని ప్రసాదిస్తోంది.
ఆశుపత్రి నాపుట్టిల్లు అని తెలుసుకున్నాక
ఎన్నో ఏళ్ళుగా నడిచీ నాదే అనుకున్న ఇల్లు
సమయాన్ని ముక్కలు చేసి విడివిడిగా వుండడానికి సహాయపడుతోంది
ఎన్నో ప్రశ్నలు,
”రోమాంటిక్” అనే పదానికి అర్థం తెలుసా?
నువ్వు నాకు నచ్చటం లేదు, విదిలించుకుంటున్న చేయిని
ఎన్ని సార్లు పట్టుకుంది, విస్కీ మత్తులో జారిపడిపోతుంది!
గతంకాదు నేను కూడా సమాధి అవుదామని
అస్థి పంజరంలోకి జారుకుంటుంటే వినిపించింది
ఈ రోజు నీ పుట్టిన ఇదిగో కానుక
లేత పాదాలు గులాబి రంగులో
ముఖాన్ని తాకుతూ కిలకిలమన్నాయి
ఇన్ని మసక మబ్బుల పుట్టిన రోజుల మధ్యలో
పున్నమి చంద్రుడు…..
ప్రతీక…
నాకు నా బొమ్మా ఇష్టమే !
నీ బొమ్మా ఇష్టమే !
నీవు కంటున్న కలలు గమ్యాన్ని
నా నిజమైన మాటల అద్దాల్లొ చూడు
నీ కొసం ఎమైనా చెయగలవాడిని నీనెనని నమ్ము
నీను నీకు చూపించె కలల గమ్మం
నీవు ఇప్పుడె చూడలెకపొవచ్హు
అది నీవు ఎగర దలచిన కలల ఆకాశాన్ని చెర్చలెకపొవచ్హు
కాని అది
మన జీవితానికి వెలుగు బాట వెయడానికి మార్గదర్సి కావచ్చు
నీవు కనలెని కలలు కూడా కనెలా చెయడానికి దొహదపమౌచ్హు
ఏమఒటావొ ?
****
“అమ్ములు ది రెబలూ”
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ: అన్ని…..
అమ్ములు-
కన్యక, కవితామయి
కావ్యకన్య కాంతిమయి
కిన్నెరసాని, కిరణ్మయి
కీర్తి కీరీటం, కీర్తన
అలా …..అలా ….కచటతప…. యరలవ…… కూడా
“అమ్ములు” అందరి అమ్మాయి
అచ్ఛమైన తెలుగమ్మాయి.
భూమికలొ ఒక బాగం
సుజాత గారు అల్లిన కవితామయి
******
“ఇదేమీ మానసికానందమో”
చదివెవారు దొరకాలి కాని
మీరు మాత్రం విడిచిపెడుతున్నారా
మీలొని అసహన రూపం
తన అభిప్రాయాల
అసంతృప్తి జాబితాను
వర్ణిస్తూనే వున్నారుకదా
ఇదెం మానిసికానంద మో
అని నీననడం లెదు
ఎవరి ఆనందం వారిది అంటున్నాను.
“పుట్టిన రోజు”
రేణుక అయోల గారు
మీ కవిత నా మనసు ను కలచి వెసింది
జన్మదినా నికన్నా జన్మనిచ్హినప్పడ్డు ఆడదానికి ఎక్కువ ఆనందం ఉంటంది
ఎన్నొ మసక మబ్బుల పుట్టిన రోజుల మధ్యలో ఫుట్టిన పున్నమి చంద్రుణ్ణి చూసుకుని
ఆడది మురిసి పొతుంది – జరిగిన కష్తాలన్ని మరచి పొతుంది…..
మరొజన్మ ఎత్తుతుంది