– జి. సాయితేజ, 8వ తరగతి
సోమపురం అనే ఊళ్ళో రంగన్న అనే రైతు ఉండేవాడు. అతనికి ఒక తోట ఉంది. ఆ తోటలో మొక్కజొన్న విత్తనాలు చల్లాడు. అవి మొలకెత్తి పెద్దగా అయ్యాయి. వాటికి మొక్కజొన్నలు కూడా అయ్యాయి. ఆ మొక్కజొన్న కంకులు తినడానికి పిచ్చుకలు వచ్చేవి. ఆ పిచ్చుకలను చూసి రంగన్న ఆ తోట పైన వల వేశాడు. ఆ రోజు పిచ్చుకలు వచ్చి దానిని తింటూ ఉండగా ఒక పిచ్చుకపిల్ల వలలో ఇరుక్కుంది. మిగితావి వచ్చి దానిని పైకి నెట్టాయి. అవి అన్ని కలిసి వెళ్ళిపోయాయి. ఆ రోజునుండి ఒక్క పిచ్చుక కూడా తోటలోకి రాలేదు. రంగన్న సంతోషపడ్డాడు. ఆ రోజు రంగన్న రాత్రి పొలానికి చేతిలో కర్ర, కాలికి చెప్పులు, మరో చేతిలో లైట్ తీసుకొని వెళ్లాడు. మంచెపై పడుకొని ఉండగా పందులు వచ్చి తోటలో తిరుగుతున్నాయి. రంగన్న వాటిని తరిమేసి ఆ రాత్రి అక్కడే నిద్రపొయ్యాడు. తెల్లవారింది. రంగన్న ఇంటికి వచ్చి భార్య దగ్గరి నుండి కొంత డబ్బు తీసుకొని కృష్ణాష్టమికి కావలసిన వస్తువులు తెచ్చాడు. అలా ఊరిలోకి వెళుతుండగా రెండు రామచిలుకలు ఒక జామకాయ తినడం చూసి ఆనందించాడు. అయ్యో ఇవి తింటు ఉండగా ఆనందిస్తే ఆ పిచ్చుకల బాధ ఏమిటి అనుకున్నానే అని పొలానికి వెళ్లి నీళ్లు కట్టి మొక్కజొన్న చేనుపై ఉన్న వల తీసేశాడు. ఆ పిచ్చుకలు చాలా ఆనందంగా ఉన్నాయి. అతను కూడా సంతోషంగా ఉన్నాడు. పిచ్చుకలు వచ్చి మొక్కజొన్న చేనుపై వాలాయి.