– జె. రాజు, 7వ తరగతి- జె. రాజు, 7వ తరగతి
ఒక ఊర్లో ముసలమ్మ తన మనవరాలుతో ఉండేది. రోజూ స్కూల్‌కి పంపేది. నాయనమ్మ ఒకరోజు పొలంకి వెళ్ళింది. అప్పుడు సోని నాయనమ్మకోసం అన్నం తెచ్చింది. నాయనమ్మ బాగా కష్టపడి సోనికు స్కూల్ బ్యాగ్, చెప్పులు కొనిపెట్టింది. నాయనమ్మ పొలం పనిచేసే మనవరాలిని పెంచి చదివించేది. ఆమె పెద్ద చదువులు చదివి మంచి మార్కులతో ఫస్ట్ వచ్చింది. ఆమెకు పెండ్లి చేస్తారు. ఒకరోజు నాయనమ్మని చూద్దామని మనవరాలు వచ్చింది. అక్కడ చుట్టుపక్కల చాలామంది బీదవాళ్లు ఉన్నారు. చాలామంది అనాథలు ఉన్నారు. మగపిల్లలను మంచిగా పెంచుకుంటున్నారు. ఆడపిల్లలను వదిలేస్తున్నారు. సోని అపుడు వాళ్ళలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి ఒక సంఘం చేసింది. ఆ సంఘంలో వారికి చాలా విషయాలు చెప్పింది. ఆడపిల్ల సోని ధైర్యవంతురాలు కావాలని ప్రజలలో కొంతమంది కోరుకున్నారు. అనాథలకు హాస్టల్ వేసింది. చిన్నపిల్లలకు బాల్యవివాహాలు వద్దని చాటిచెప్పింది. ఒకరోజు ఆమె వాళ్ల భర్త యింటికి వెళ్ళింది. ఆమె భర్త తమ్ముడికి పాము కరిచింది. అతన్ని దేవుడు దగ్గరికి తీసుకువెళ్ళి మొక్కారు. మంత్రగాడితో మంత్రం వేయించారు. అయినా అతను చనిపోయాడు. సోని వెళ్ళేసరికి మరిది శవంగా మారాడు. నిజంగా దేవుడుంటే బ్రతికించుమని సోనీ ఏడుస్తూ అంది. ఒక్కరు కూడా మాట్లాడ్డం లేదు. సోని ఉన్నట్లుండి కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది. హాస్పిటల్‌కు చేర్చారు తీసుకువెళ్ళి బ్రతికించారు. తెల్లవారి నాయనమ్మ వచ్చింది పలకరించడాపికీ. నీవు పరిస్థితులకు భయపడకు. కష్టం వస్తే కష్టాలకే ఎదురుతిరిగి విజయం సాధించు అని ధైర్యం చెప్పింది. ఆమె మనస్సులో అనుకుంది అవును ప్రజలలో మూఢనమ్మకాలు నిద్రలో ఉన్నదాన్ని ప్రజలలోను చైతన్యవంతులుగా రూపుచేద్దాం పనికే తమ ఊరివారిని కలిసి మాట్లాడింది. భయపడకుండా ఉండాలని. తను అనుకుంటే దేశాన్ని మార్చగల శక్తి నాయనమ్మ చెప్పిన మాటమీద మనసులో ఉంచుకొని తను చేసిన పని నీవు ఆడబిడ్డ కాదమ్మా, పులిబిడ్డ అన్నారు ప్రజలు. అనుకోకుండా సోనికి గుండెజబ్బు వచ్చింది. ఆమె భర్త హాస్పటల్‌లో చేర్పించాడు. ఆమెను బ్రతికించాలంటే 2 లక్షలు కావాలి అన్నాడు డాక్టరు. అమ్మో… అంత డబ్బు నేనెక్కడనించి తేవాలని బాధపడ్డాడు సోని భర్త. ఒక ముసలి ఆమె సోని చూడ్డానికి వచ్చింది. విషయం తెల్సి హాస్పిటల్ ఖర్చులకోసం తన బంగారం, నగలు ఇచ్చింది. ఆమెను చూచి ఒకరికొకరు అందరు డబ్బులు, నగలు ఇచ్చారు. డాక్టరు ఇది చూసి ఆశ్చర్యపడ్డారు. మీరందరూ ఒకే మాటమీద ఒకే తాటిమీద ఉన్నరా అన్ని అనిపించింది. అసలు మీరు సోనీకి ఎందుకింత సాయం చేస్తున్నారు అని డాక్టరు అడిగారు. సోని ఎంతో ధైర్యవంతురాలు. ప్రజలలో ఉండే బాధను తొలగించి ప్రజలను చైతన్యవంతులుగా తీర్చిదిద్దింది అని ప్రజలు చెప్తారు. డాక్టరు వెంటనే వెళ్ళి సోనికి ఆపరేషన్ చేశారు. ఆమె బ్రతికింది. ఆమె వెనుక ప్రజలు ఉన్నారు. ప్రజల వెనుక ఆమె ఉంది. ఇలానే మనందరం కలిసి మూఢనమ్మకాలను తొలగిద్దాం. ఇవే కాకుండా ఏవైనా పెద్ద సమస్యలు వచ్చినపుడు అందరం కలిసి తొలగిద్దాం.