– ఎపి మహిళా సమత సొసైటి, కరీంనగర్‌ చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో మహిళా సమత సొసైటి 1998 సం. నుండి స్త్రీలను సంఘటిత పరచి వారి సమస్యలను / అవసరాలను తీర్చుకోవడం కోసం అవగాహన కల్పిస్తూ 36 మంది మహిళలతో జీవన జ్యోతి మహిళా సంఘంగా ఏర్పాటు కావడం జరిగింది. సంఘంగా ఏర్పడిన మహిళలు కనీస మౌళిక సదుపాయాలు సంఘటితంగా తీర్చుకోవడం జరిగింది. ఈ క్రమంలో స్త్రీల అక్షరాస్యత అవసరాలను గుర్తించిన స్త్రీలు రాత్రి పూట చదువుకోవడానికి ఎ.ఎల్‌.సి. సెంటర్స్‌ టీచర్‌ను ఎంపిక చేసుకోవాలని నిర్ణయం తీసుకుని శారద అనే అమ్మాయిని ఎంపిక చేసుకున్నారు.

శారద చిన్న తనంలో ఇంటర్‌ చదువుతున్న సమయంలో గ్రామంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న 40 సం. వయస్సు గల వీరయ్యతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకోవడం జరిగింది. వీరయ్యది ఎస్‌.సి. (మాల) కులం. వీరయ్య మొదటి భార్య కుటుంబంలో గొడవల వలన ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. వీరయ్యకు శారద వయస్సు గల కుమారుడు, కూతురున్నారు. నీ కంటే వయస్సులో పెద్ద వాడైన వీరయ్యను వివాహం చేసుకోవద్దు అని కుటుంబ సభ్యులు, గ్రామపెద్దలు చెప్పినా వినకుండా 2007 జూలై 11వ తేదీన వేములవాడ గుడిలో వివాహం చేసుకున్నారు. కరీంనగర్‌ మండలం వావిలాలపల్లి గ్రామంలో 20 రోజులు కాపురం ఉన్నాక రేకొండ గ్రామంకు తిరిగి వెళ్ళడం జరిగింది. వివాహం చేసుకుని వెళ్ళాక రెండు కుటుంబాల మధ్య తగాదాలు జరిగి శారద వాళ్ళ అమ్మ పురుగుల మందు త్రాగి చనిపోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయినా శారద నా భర్త వీరయ్యతో తప్ప ఎవరితో నాకు సంబంధం లేదు అనే ధోరణిలో ఉన్నారు. కాపురం సాఫీగా సాగిపోయింది.

వీరయ్య కూతురు మరియు కొడుకు కూడా వీరితో పాటే వుండేవారు. కొడుకు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకొని వెళ్ళిపోయాడు. కూతురు పెళ్ళి వీరయ్య, శారదలు చేసారు.

2008 మార్చి 17న శారదకు అబ్బాయి జన్మించాడు. కుమారుడు పుట్టడంతో వీరయ్య, శారదను మరింత ప్రేమగా చూడటం తన అవసరాలను వెంటవెంటనే తీర్చడం, బయటకు వెళ్ళనీయకుండా, పక్కింటి వారితో మాట్లాడనీయకుండా చేయడటం, కలర్‌ టి.వి. తీసుకురావటం, సొమ్ములు చేయించడం వంటివి ఎన్నో శారద కోసం వీరయ్య చేసారు. ఇలా సాగిపోతున్న సమయంలోనే వీరయ్యకు గ్రామంలోని మరికొంత మంది మహిళలతో వివాహేతర సంబంధాల గురించి, స్త్రీలను మోసం చేస్తున్న సంగతులు శారద గమనించడం జరిగింది. శారద డెలీవరి అయ్యి ఉన్న సమయంలో వేరే స్త్రీలతో లైంగిక సంబంధాలు కొనసాగించడం, వాళ్ళను ఇంటికి తీసుకురావటం వంటివి జరిగాయి. కొన్ని సార్లు శారద గమనించి గమనించనట్లుగా ఉండటం, అడిగితే నేను ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను, చాలా మందితో చాలా రకాల సంబంధాలు కల్గి ఉండాల్సిన అవసరం ఉందని శారదను నమ్మించడం, లేదంటే బెదిరించడం చేసేవాడు. ఈ క్రమంలో శారద 2008 సం.లో సంఘంలో జాయిన్‌ కావడం జరిగింది.

గ్రామంలో మహిళా సమత నుండి ఆల్‌ సంఘాల క్లస్టర్‌ మీటింగ్‌ నిర్వహించి స్త్రీల సమస్యల గురించి మాట్లాడినప్పుడు విని సంఘంలో జాయిన్‌ అయ్యి, 2008లోనే ఎ.ఎల్‌.సి. టీచర్‌గాను, తర్వాత ఫెడరేషన్‌ గవర్నింగ్‌ బాడీ మెంబర్‌ మరియు ఇ.సి. మెంబర్‌గాను ఎంపికయ్యారు. ఫెడరేషన్‌ సమావేశాలు రెగ్యులర్‌గా నిర్వహించుకునే దానిలో, ప్లానింగ్‌లో తన లాంటి స్త్రీలకోసం పని చేయాల్సిన అవసరం ఉందనేది మాట్లాడేవారు. స్త్రీల స్థితి, పరిస్థితి స్త్రీల స్వశక్తి గురించి, స్త్రీ, పురుషుల సమానత్వం గురించి అర్థం చేసుకున్న శారద తన భర్త చేసే తప్పుడు పనులను గురించి ప్రశ్నించడం, అడగడం మొదలుపెట్టారు. దానితో భార్యాభర్తలకు గొడవలు మొదలు అయ్యాయి.

31 డిసెంబర్‌ 2010 తేదీన వీరయ్య బాగా త్రాగి వచ్చి శారదను కొట్టడం, హింసించి, చంపడం కోసం ప్రయత్నం చేయగా వీరయ్య చేతి నుండి తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నంలో భర్తను ఫోర్స్‌గా వెనక్కి నెట్టి వెయ్యగా గోడకు గుద్దుకోవడం జరిగింది. గోడకున్న మొల తలలో గుచ్చుకుని అదే ఫోర్స్‌తో మళ్ళి ముందుకు పడటం జరిగింది. వీరయ్య లేచి తనను చంపుతాడనే భయంతో శారద మళ్ళీ దగ్గరలో ఉన్న ఇనుపరాడ్‌తో తలపై కొట్టింది. బోర్ల పడిపోయిన వీరయ్య లేవకపోవడంతో లేపి చూసే వరకు వీరయ్య తల మంచం కోడు పైన పడిపగిలింది. అలాగే శారద రాడ్‌తో కొట్టిన దెబ్బ వలన మరింత ఎక్కువగా తగిలి తల పగిలినందున అతను చనిపోయాడని నిర్ణయించుకుని 2 సం. కొడుకుని ఎత్తుకుని తేది. 01.01.2011 రోజున ఉదయం 5 గం. సమయంలో చిగురుమామిడి మండల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి భర్త చనిపోయిన విషయం చెప్పి లొంగిపోవడం జరిగింది. సమాచారం అందుకున్న టీమ్‌ మెంబర్స్‌ మండలంకు, గ్రామంకు వెళ్ళి కలిసి మాట్లాడగా శారద భర్తను చంపడంలో శారద పుట్టింటి వారు (అన్నదమ్ములు) సహాయం చేసారని వీరయ్య తరుపున బంధువులు శారదతో పాటుగా శారద తల్లి మరియు అన్నదమ్ముల పైన పోలీస్‌ స్టేషన్‌లో పిటిషన్‌ ఇవ్వడం జరిగింది. దీనితో పుట్టింటి వారికి శారదపై మరింత కోపం పెరిగింది. అలాగే శారద పోలీస్‌ స్టేషన్‌కు రాకుండా రేకొండ గ్రామంలోనే ఉన్నట్లయితే శారదను చంపేయాలనే ఆవేశంతో వీరయ్య బంధువులున్నారు. శారదకు ఉరి శిక్ష పడాలని పోలీస్‌ స్టేషన్‌ ముందు దర్నా చేయడం జరిగింది. సంఘం స్త్రీలు, గ్రామస్థులలో కొంతమంది శారదకు సపోర్టుగా మరికొంత మంది వీరయ్యకు సపోర్టుగా మాట్లాడినారు. శారదకు సపోర్టుగా మాట్లాడే వారిలో వీరయ్య (భర్త) ఎలాంటి వ్యక్తియైన చంపడమనేది క్షమించరాని నేరంగా పరిగణించారు. శారదకు సపోర్టుగా మాట్లాడడానికి వెళ్ళిన టీమ్‌ను మరియు ఫెడరేషన్‌ సభ్యులను హేళన చేయడం, బూత మాటలు తిట్టడం జరిగింది.

తర్వాత పోలీస్‌ స్టేషన్‌లో సిబ్బందితో మాట్లాడగా తను వచ్చి లొంగి పోయింది కాబట్టి కేసు ఫైల్‌ చేసి జైలుకు పంపించడం జరిగింది. 3 నెలలకు బెయిల్‌పై బయటకు రావడం జరిగింది. తర్వాత మహిళా సమత నుండి ఆమెకు సపోర్టు అందిస్తూ ముందుగా జిల్లా ఎం.ఎస్‌.కె.లో 22.08.2012 రోజున వంట మనిషిగా అవకాశం ఇవ్వడం జరిగింది. కేసు క్లియరెన్స్‌ కోసం ప్రభుత్వం నుండి లాయర్‌ను, పెట్టుకోవడం కోసం సమాచారం ఇచ్చి ప్రతి నెల కేసుకు హాజరుకు వెళ్ళడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. పోస్టు మార్టమ్‌ రిపోర్టులో త్రాగి ఉండటం వలన పడిపోయారు, తలకు దెబ్బ తగిలి చనిపోయాడు. అలాగే స్త్రీ తన ఆత్మరక్షణ కోసం ప్రయత్నంలో భాగంగా ఇనుప రాడ్‌తో కొట్టడం తప్పు కాదనేది చెప్పి 10.10.2012 రోజున కేసు కొట్టి వెయ్యడం జరిగింది. తనకున్న సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని మహిళా కార్యకర్తకు అప్లికేషన్‌ పెట్టుకొమ్మని చెప్పగా నవంబర్‌ 2011 సం.లో జరిగిన కార్యకర్తల సెలక్షన్‌ వర్కుషాపులో కార్యకర్తగా సెలక్టు అయ్యి తేది 26.12.11 రోజున మహిళా సమత సొసైటి, ఎల్లారెడ్డిపేట మండలంలో మహిళా కార్యకర్తగా జాయిన్‌ అయినది. అలాగే తన చదువు స్థాయిని పెంచుకోవడానికి ఓపెన్‌ ఇంటర్‌లో జాయిన్‌ అయ్యి పరీక్షలు వ్రాసి పాస్‌ అయ్యారు. అలాగే అంబెద్కర్‌ యూనివర్సిటీలో డిగ్రి ఫస్ట్‌ ఇయర్‌కు జాయిన్‌ అయ్యారు తన కొడుకును చదివిం చుకుంటున్నారు. ప్రస్తుతం సంఘాలలో స్త్రీల సమస్యలు/అంశాల గురించి చర్చించడం సమస్యలలో ఉన్న స్త్రీలకు సపోర్టు అందిం చడం జరుగుతోంది.

స్త్రీల జీవితాలలో మార్పు కోసం స్త్రీలు ప్రయత్నాలు చేయాలి, అప్పుడే మార్పు సాధ్యం అవుతుంది.

 – ఎపి మహిళా సమత సొసైటి, కరీంనగర్‌

Share
This entry was posted in గ్రామీణ మహిళావరణం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.