గాయాలెన్నయినా…! – పొద్దుటూరి మాధవీలత

చీకటికి భయపడి సూర్యుడు
ఉదయించడం మానేస్తాడా…?
నలుపురంగు పులిమాడని
కోయిల పాడటం మానేసిందా…!
నిలువెల్లా చేదైనా వేపచెట్టు
చల్లని గాలులతో సేదతీరుస్తుంది.
సుకుమారమైన మల్లెలు
మండుటెండల్లోనే గుబాళిస్తాయి.
గ్రహణాలకు వెరవక జాబిల్లి
పండు వెన్నెలని పంచుతాడుగా…!
గాయాలెన్నయినా వేణువు
సరిగమలను పలికిస్తుంది
గుచ్చుకునే ముళ్ళున్నాయని
గులాబీ విచ్చుకొనక మానదుగా…!
సాగరుని చేరనంత మాత్రాన
సెలయేటి ప్రయాణం ఆగిపోదుగా…!
నాగులకు నెలవైందని
మొగలిరేకులను వెలివేస్తామా…!
ఎన్నేళ్ళకయినా…
మట్టిలో కలిసిపోక తప్పదని తెలిసినా
మనిషి బ్రతుకు తీపి మానడుగా…!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.