పిలుపైనా పలకరింపైనా – Dr.C.Narayana Reddy

ఎప్పుడో విన్న పిలుపే
ఇప్పుడు ఎదుట నిలబడింది
ఇప్పుడది పలకరింపు.
పిలుపే స్వరస్థాయిని తగ్గించుకుని
పలకరింపులో ఆర్ధ్రత వుంది కానీ
అభివ్యక్తి లోపించింది.
నా పరిణతానుభవాన్ని
మరింతగా పదును పెట్టుకుని
ఆ పలకరింపులోని ఆంతర్యాన్ని
చేదుకోవాలని
చేతనైన ప్రయత్నం చేసినా
ప్రయత్నం ప్రయాసగా మిగిలింది.
ఎటూ తోచక గద్దించి చూచేసరికి
ఆ పలకరింపు
ఎకాయెకిన ఎటో ఎగిరిపోయి
దూరం నుంచి పిలుపుగా వినిపించింది.
కొందరు వ్యక్తులు
మనకు పరోక్షంగా వున్నప్పుడు
ఎక్కుపెట్టిన గొంతులతో
ఏవేవో అంటుంటారు.
సముఖంలో ఆ గొంతులే నీళ్లు నములుతుంటాయి.
మడతలు పడ్డ మనసులున్నప్పుడే
ఈ పరిస్థితి దాపురిస్తుంది.
పరోక్షంగా వున్నా
ప్రత్యక్షంగా వున్నా
ఉద్దిష్ట సత్యాన్ని
నిర్దిష్ట రీతిలో ప్రకటిస్తుంది.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.