ఒక ఊరిలో ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక ఏనుగు, సింహం,నెమలి, పులి, నక్క అనే వీళ్ళు అన్న తమ్ముడు అక్క చెల్లెల్లాగా ఉంటారు. అయితే ఒక రోజు సింహంని చూసి ఒక కుందేలు పారిపోయింది. అప్పుడు నెమలి వచ్చి అన్న నిన్ను చూసి ఎందుకు చిట్టి కుందేలు పారిపోయింది అని అడిగింది. నేను అంటే దానికి భయం అని అన్నది.
అయితే నెమలి అన్ని కుందేలును తెచ్చి మనలాగా ఉంచుకుందాం. సరే చెల్లి అని సింహం, ఏనుగు, నక్క, పులి అన్నాయి. అయితే ఒక రోజు ఏనుగు నక్క కుందేలు దగ్గరకు వెళ్ళి చిట్టి కుందేలా నువ్వు మా అన్నని చూసి భయపడుతున్నావా? అని ఏనుగు అన్నది. అవును నాకు ఆ అన్నని చూసి భయం అయితుంది అని చిట్టి కుందేలు అన్నది. మేము అందరం అన్న, తమ్ముడు, అక్క చెల్లెల్లులాగా ఉన్నాము. నువ్వు కూడారా. మాతో ఉండోచ్చు అని నక్క అన్నది. అప్పుడు చిట్టి కుందేలు నేను మీ దగ్గరకు వస్తే నన్ను ఏం చేయరా అన్నది. నక్క అన్నది. ఓ చిట్టి కుందేలా మేము నిన్ను ఏం చేయము. మాతో భయం లేకుండా ఉండవచ్చు. అప్పుడు సరే వస్తాను అని చిట్టి కుందేలు చెప్పింది. చిట్టి కుందేలు ఏనుగు మీద ఎక్కి వాళ్ల అడవికి తీసుకోవెళ్ళింది. అప్పుడు సింహం అన్నది. చిట్టి కుందేలు మా అన్న నన్ను చేసి భయపడకు సరేనా అయితే అప్పుడు చిట్టి కుందేలు అందరితో కలిసి ఉంది. వీళ్ళు అందరు కలిసి మరోక అడవికి వెళ్ళారు. వెళుతుండగా ఒక వేటగాడు చిట్టి కుందేలు మీద వల వేసి పారిపోయాడు. అప్పుడు నెమలి చూసి ఓ చిట్టి కుందేలా వలలో చిక్కుకపోయావేంది? ఇప్పుడు ఏం చేయాలి. అని ఆలోచించింది. అప్పుడు ఒక ఉపాయం కలిగింది.
నెమలి ఒక చిట్టి ఎలుకల దగ్గరకి వెళ్ళి అంది. ఓ చిట్టి ఎలుకల్లారా మా చిట్టి కుందేలు వలలో చిక్కుకపోయింది. కొద్దిగా కాపాడమని వేడుకుంది. సరే అని చిట్టి ఎలుకలు వెళ్ళి ఆ వలను కొరికేస్తున్నాయి. అప్పుడు నెమలి, ఏనుగు, పులి, నక్క చిట్టి కుందేలు ఆ చిట్టి ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పారు. అప్పుడు చిట్టి ఎలుకలు మాకు ఎవరూ లేరు మేము మీతో పాటు ఉంటామని చిట్టి ఎలుకలు అన్నాయి.
నెమలి అన్నా ఈ చిట్టి ఎలుకలను మనతో పాటు ఉంచుకుందామని అన్నది. సరేనని ఏనుగు, సింహం, చిట్టి కుందేలు, పులి, నక్క అన్నారు. అప్పటి నుంచి వాళ్ళందరూ ఒక కుటుంబం లాగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరు సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉన్నారు. కథలు చెప్పుకుంటూ, పాటలు పాడుకుంటూ, నాట్యం నేర్చుకుంటూ, కవిత్వాలు అల్లుతూ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ వారు ప్రపంచంలో వారు ఆనందంగా గడుపుతున్నారు.