ఈ భూమ్మీదకి వచ్చినప్పుడు
తొలిసారి స్పర్శించిందీ ఎత్తుకుందీ
మా అమ్మ
నేను పెరిగి పెద్దవుతున్నప్పుడు
నా అల్లరి భరించి గారాబం చేసింది
నా ఆలనా పాలనా చూసింది
మా అక్క
నేను అక్షరాలు నేర్చుకుంటున్నప్పుడు
నా చేయి పట్టి రాయించింది
నా చదువులో సాయం చేసింది మా టీచర్
జీవితమంతా నాతో కలిసినడుస్తూ
ప్రేమ స్నేహాన్ని అందిస్తున్నది
నా భార్య
వృద్ధాప్య చెరలో నిస్సహాయుడినైనప్పుడు
కాలు చేయి ఆడని స్థితిలో
మళ్ళీ ఓ అమ్మయి ఆదుకున్నది
నా కూతురు
నేను చనిపోయినప్పుడు
అణువణువునా నన్ను ఐక్యం చేసుకున్నది
నా మాతృభూమి
అందుకే.. వచ్చే జన్మలో కూడా
పురుషుడినైతే ప్రతి స్త్రీకి ఋణపడతాను
స్త్రీగా పుడితే.. ఇంకా గర్విస్తాను.