మన దేశంలో ఎక్కువ మంది శాతం తల్లి తండ్రులు ఆడపిల్ల చదువులను డిగ్రీతో ఆపేసి పెళ్ళి చేయాలనుకొంటారు. ఈ 21వ శతాబ్దంలో కొంతమార్పు వచ్చినప్పటికీ, 1960లలో ఈ పరిస్థితి బాగా వుండేదనే చెప్పవచ్చు. అంతకు మించి చదివించితే వారికి తగిన విద్యార్హతలుగల వరుడు దొరకడం కష్టమనే భావనే అందుకు ప్రధానమైన కారణం. చదువుకొంటూపోతే వయసుమీరుతూ వుంటుందనీ అందువల్ల కూడా వారికి తగిన జోడీ దొరకదనే భయం మరో కారణం. మహా అయితే పి.జి పూర్తిచేసే వరకూ ఆగి ఆపైన వరాన్వేషణ మొదలు పెడతారు. ఆ విధంగా కాస్త చదువుకొన్న వర్గాలలోని ఆడపిల్లలు సైతం పి.జి. చేస్తూనే వివాహ జీవితంలోకి అడుగు పెడతారు. అందుకు భిన్నంగా ఉద్యోగాలు చేస్తూనో, లేదా పరిశోధన చేస్తూనో మరి కొంతకాలం వారు కన్యలుగా కొనసాగుతూవుంటే అందుకు ఆర్ధిక పరమైన లేదా ఇతరములైన కారణాలు వుంటాయి. పరిశోధన పట్ల ఆసక్తి అందుకు తగిన సమర్ధత గల వారికి సైతం వారు ఆడువారు అయితే వారి విద్య పిజి స్థాయి దగ్గర ఆగిపోతుంది. కొండొకచో పి.జి పూర్తి చేసినప్పటికీ, పరిశోధనలో చేరినప్పటికీ పరిశోధనా జీవితాన్ని కొనసాగించడం వారికి జరగని పని. ఎందువల్ల నంటె సరిగ్గా ఆ సమయానికి వారు వివాహితులై బిడ్డలనుకనే వయసుకు వచ్చి వుంటారు. చూలింతగా, బాలింతగా పిల్లలని సాకే తల్లిగా ఆమె తన పరిశోధనాసక్తిని చంపుకొంటుంది. మరీముఖ్యంగా విజ్ఞానసాంకేతిక రంగాలలో పరిశోధనస్థాయిలో స్త్రీల సంఖ్య అంతంతమాత్రంగా ఉండడానికి ప్రధానమైన కారణం ఇదే! నూటికో కోటికో ఒకరిద్దరు మహిళలు జాతీయ అంతర్జాతీయస్థాయిలో మేలైన పరిశోధనాఫలితాలను సాధిస్తూ ఎంతో ఎత్తుకి ఎదిగి ఉన్నత పదవులలో పనిచేస్తూ కనిపిస్తారు. అటువంటి కొద్దిమంది వనితల్లో విజయలక్ష్మి రవీంద్రనాధ్ ఒకతె. స్వతః సిద్ధంగా తెలివి తేటలూ పరిశోధనాశక్తీ, సమర్ధతలుగల విజయలక్ష్మికి ఇటు తల్లితండ్రుల అండదండలు, అటు భర్త రవీంద్రనాధ్ అందించిన చేయూత తోడ్పాటూ కొడుకుఆసరా కూడా దండిగా లభించాయి. ఆమెకు బుద్ది తఱపిన ఆచార్యులు సైతం అపారమైన ప్రోత్సాహ సహకారాలను అందించారు. ఇది మన దేశంలో చాలా అరుదైన సందర్భం.
విజ్జి 1953 అక్టోబర్ 18న చెన్నైలో దసరా 10వ రోజైన విజయదశమినాడు తమిళుల ఇంట పుట్టింది. తల్లి తండ్రులు ఆమెలు ఆమెకి విజలక్ష్మి అని పేరు పెట్టారు. ఎంచుకొన్న రంగంలో శ్రేష్టత సాధించాలన్న కోరిక చిన్ననాటనే ఆమెలో నాటుకొనడానికి తండ్రి ఏ.కె.రామన్ కారణం. ఆయన ఉత్తర హిందూస్థానంలో ఇంజనీర్‌గా రైల్వేలలో పని చేసేవారు. చెన్నైలో పుట్టినా ఆమె పెరకువ ఉత్తర హిందూ స్థానంలో వింధ్యపర్వతాల ఉత్తరంలో గడిచింది. ”నా జీవితంపై అప్ప ప్రభావం చాలా వుంది. కఠోర పరిశ్రమ, శ్రేష్టత, నీతి, నిజాయితీ విలువలను నాకు ఆయన నూరిపోశారు. మహిళలకు విద్య తప్పనిసరి అని నమ్మేవారు. వారసత్వంగా లభించే సంపదకంటే ఆడువారు చదువువల్ల పొందే సంపదే గొప్పదనేవారు. అప్ప నన్ను విజ్ఞానశాస్త్రాలను చదువుకోవడానికి బాగా ప్రోత్సహించారు.” అని పేరుకు తగినట్టుగా ఎన్నడూ ఓటమిని చవిచూడని విజ్జి చెపుతుంది.
విజయలక్ష్మి రవీంద్రనాథ్ తల్లిదండ్రులు భాగవతుల రవీంద్రనాధ్
విజ్జి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో 1972లో డిగ్రీ పూర్తి చేసే సరికి ఆమె తల్లి, ఇతర కుటుంబసభ్యులు పెళ్ళి చేసి అత్తవారింటికి పంపేయాలని గట్టిపట్టు పట్టారు. విజ్జి పిజి చేస్తానంది. తండ్రి సరే నన్నాడు. కుటుంబంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఆయన కూతురిని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో రసాయన శాస్త్రం చదువుకోవడానికి చేర్చాడు. విజ్జి పి.జి పరీక్షలో అత్యున్నత స్థానాన్ని సంపాదించి డిగ్రిని పొందింది. బెంగుళూర్‌లోని ‘ఇండియన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సైన్సెస్’లో ప్రోజక్ట్ అసిస్టెంట్‌గా చేరింది. అక్కడ భాగవతుల రవీంద్రనాధ్‌తో పరిచయం అయింది. 1981 నాటికి మైసూర్ సి.ఎఫ్.టి.ఆర్.ఐ. రీసెర్చ్ ఫెలోషిప్‌తో పిహెచ్‌డి పట్టా పొందింది. రవి కూడా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆర్గానిక్ కెమిస్ట్రిలో పి.జి చేసి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆచార్య శేషాద్రిగారి దగ్గర చేరి పిహెచ్‌డి చేసాడు. ఇండియన్ ఇన్సిస్ట్యూట్ ఆఫ్ సైన్సెస్’ లో అప్పుడు సైన్టిస్ట్‌గా పనిచెస్తున్నాడు. రసాయన పరిశోధనలో పొందే ఆనందం, విషాదం, కష్టం, సుఖం అన్నీ ఎరిగి వున్నవాడు. పరిశోధనాశక్తి కుశాగ్రబుద్ధిగల విజయలక్ష్మిని చేపట్టాడు. ఆమె విజయపంధాన నడిచేటందుకు తోడుగా నిలిచాడు. విజయలక్ష్మి ‘విజయలక్ష్మి రవీంద్రనాథ్’గా తెలుగింటి కోడైలంది. అంతర్జాతీయంగా గుర్తింపు పొంది తెలుగువారికి తమిళులకు కూడా గర్వకారణమైంది.
యు.ఎస్ ఇండియాలలోని పలు విశ్వ విద్యాలయాల పరిశోధన & అభివృద్ధి (= డ ణ) ప్రయోగశాలలో కొన్ని దశాబ్దాల అనుభవం వున్న రవీంద్రనాధ్ ‘భారవి’ పేరుతో స్వతంగా ఒక ప్రయోగశాలను బెంగళూరులో నెలకొల్పాడు. ఎనభై పరిశోధనా పత్రాలను ప్రచురించిన రవి పద్దెనిమిది పేటంట్లను సాధించాడు. ఇతను రచించిన ువఞ్‌పశీశీస శీఅ ఁూతీఱఅషఱజూశ్రీవర aఅస ూతీaష్‌ఱషవ శీట జష్ట్రతీశీఎa్‌శీస్త్రతీaజూష్ట్రవఁ (జుశ్రీశ్రీఱర నaతీషశీశీస, ఖఖ, 1989బీ 502 జూజూ.) బాగా ప్రాచుర్యం పొందింది. ఁజష్ట్రవఎఱర్‌తీవ aఅస దీఱశీషష్ట్రవఎఱర్‌తీవ శీతీ ూతీస్త్రaఅఱష చీa్‌బతీaశ్రీ ూతీశీసబష్‌రఁ aఅస ఁజష్ట్రతీశీఎa్‌శీస్త్రతీaజూష్ట్రవ: ూతీఱఅషఱజూశ్రీవర డ ూతీaష్‌ఱషవఁ (నaతీషశీశీస ూషaసవఎఱష, ూఎర్‌వతీసaఎ) అనే రెండు పుస్తకాలకు సంపాదకీయాన్ని వహించాడు.
పిహెచ్.డి. అయ్యాక పోస్ట్ డాక్టొరల్ చేయడానికి విజ్జికి యు.ఎస్.లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్.ఐ.హెచ్.) నుండి పిలుపు వచ్చింది. అప్పటికి ఆమె పసిబిడ్డడి తల్లి. ‘పిల్ల వాడిని మేము చూసుకొంటాం నువ్వు వెళ్లు”. అన్నారు ఆమె భర్త. తల్లితండ్రులు. ఎన్.ఐ.హెచ్. వాషింగ్టన్ డిసిలో రెండు సంవత్సరాలు విజిటింగ్ ఫెలోగా పని చేసింది. అక్కడ డాక్టర్ మెఖైల్ బోయడ్ ఆమెకు బుద్ధి కఱపిన గురువు. అతని నుండి విజ్జి మంచి ప్రోద్బలాన్ని పొందింది. ఇండియాకి రాగానే బెంగుళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్’ లో చేరింది. స్వతంత్రంగా పరిశోధనా జీవితాన్ని ప్రారంభించింది. మొదట్లో చాలా గడ్డు పరిస్థితులను చవి చూసింది. ఎందుకంటే పరిశోధనకు కావలసిన మూలధనాన్ని సమకూర్చుకోవడం చాలా కష్టమైన సంగతి. ఒక అసోసియెట్ ప్రొఫసర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి అదివశం కాని పని. నిరాశ చెందుతూ తానొంటరిననే భావనకు లోనయ్యింది. ఇంతలో డాక్టర్ బాయెడ్ ఆమెతో కలసి పరిశోధన చేయదలచినట్టుగా తెల్పుతూ అందుకు మనసా పూనుకొన్నాడు. ఇద్దరు కలసి మూలధనాన్ని సమకూర్చు కొనడానికై ప్రతిపాదనలను తయారుచేసి ధనాన్ని రాబట్టుకోవడంలో సఫలీకృతులయ్యారు. ”డాక్టర్ బాయడ్ సాధన సంపత్తులను సమకూర్చుకోనడంలో నాకు సాయపడి పరిశోధన నిరాటంకంగా కొనసాగేలా చేసాడు. మేధోపరమైన ఆసారానిచ్చి ప్రోత్సహిస్తూ అంతర్జాతీయంగా మా సమ ఉజ్జీలతో పరిచయాలవడానికి చక్కని వేదికను అందించాడు. అందువల్లనే నేనీ స్థాయికి రాగలిగాను” అని విజ్జి చెపుతుంది.
బెంగుళూర్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్’ కి చెందిన సైకోఫార్మకాలజి (మెదడుపై మందులు పనిచేసే తీరును వర్ణించే శాస్త్రం) విభాగంలో మొదట పూల్ ఆఫీసర్‌గా చేరిన విజయలక్ష్మి రవీంద్రనాధ్ క్రమక్రమంగా పదోన్నతులను పొందుతూ 2000 సంవత్సరం నాటికి నాడీమండల రసాయనశాస్త్ర విభాగంలో (డిపార్ట్‌మ్మెంట్ ఆఫ్ న్యూరో కెమిస్ట్రి) ఆచార్య పదవికి చేరుకొంది.
నాడీ శాస్త్రాలలో (న్యూరోసైన్సెస్)లో ఆమె సాధించిన పరిశోధనా ఫలితాలకి జాతీయ అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది.వైద్య చికిత్స శాస్త్ర (మెడికల్ సైన్సెస్) విభాగంలో 1996లో ఎస్‌ఎస్‌భట్నగర్ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందింది. 2001లో ఓమ్ ప్రకాష్ భాసిన్, 2006లో జె.సి బోస్ ఫెలోషిప్‌లను అందుకొంది. 2010 సంవత్సరంలో పద్మశ్రీని పొందింది.
అంతర్జాతీయ పరిశోధనాపత్రికలైన ‘న్యూరోసైన్స్ రీసెర్చ్’ – ‘న్యూరోటాక్సిసిటీ రీసెర్చ్’ వంటి అనేక పత్రికలకి సంపాదక సభ్యురాలైంది. గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ బ్రేన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఐ.బి.ఆర్.ఒ.)లో సభ్యత్వాన్ని పొందింది. ‘ఆసియా పసిఫిక్ రీజినల్ కౌన్సిల్ ఆఫ్ ఐ.బి.ఆర్.ఒ.కి పాలకమండలి సభ్యత్వాన్ని పొందిన మొట్టమొదటి ఇండియన్‌గా నిలిచింది. దేశంలోగల మూడు సైన్స్ అకాడమిలైన నేషనల్ అకాడమి ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇండియా, ఇండియన్ ఎకాడమి ఆఫ్ న్యూరోసైన్సెస్, థర్డ్ వర్ల్డ్ ఆకాడమి ఆఫ్ సైన్సెస్‌కి ఫెలోగా ఎన్నికైన బహుకొద్దిమంది స్త్రీలలో విజయ ఒకతె.
హరియనాలోని గోర్గావ్‌లో నెలకొల్పబొయే ‘నేషనల్ బ్రేన్ రీసెర్చ్ సెంటర్ (ఎన్.బి.ఆర్.సి)కి అవసరమైన ప్రణాళికను రూపొందించడానికి విజ్జిని ఆహ్వానించారు. 2000 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ఆ సంస్థ వ్యవస్థాపకురాలిగా సంచాలకురాలిగా నియమిస్తూ ఉత్తరవులను జారీ చేసారు.
”పోస్ట్ డాక్టొరల్ సంవత్సరాలలో నేను నాకుటుంబానికి దూరంగా వున్నారు. ఎన్.బి.ఆర్.సి ని నెలకొల్పే క్రమంలోనూ, ఆ తరువాత సంచాలక పదవీ బాధ్యతలను చేపట్టడంవల్ల మళ్ళీ నేను నా కుటుంబసభ్యులకు దూరంగా వున్నాను. దాదాపు పది సంవత్సరాల పాటు నేను ఢిల్లి. బెంగుళూర్‌ల మధ్య తరచూ ప్రయాణాలు చేస్తూ ఎక్కువ కాలం గడిపాను. నా ఈ వృత్తి జీవితాన్ని కొనసాగించుకొనడంలో నా కుటుంబసభ్యులు నాకు అపరిమితంగా సహకరిస్తూ అండగా నిలిచారు. స్నేహితులనుండి నా సమ ఉజ్జి శాస్త్రవేత్తల నుండి లభించిన సహాయం చెప్పుకోదగ్గది అని విజయ చెపుతుంది.
అతితక్కువ సమయంలో జాతీయస్థాయిలోనేకాక అంతర్జాతీయ స్థాయిలోనూ మహోత్కృష్టమైన కేంద్రంగా ఎల్‌బిఆర్‌సి పేరు తెచ్చుకొంది. డీమ్డ్ యూనివర్సిటి ప్రతిపత్తిని పొందింది. దేశంలోని డిబిటి, సిఎస్‌ఐఆర్, ఐసిఎమ్‌ఆర్ వంటి స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థలలో డీమ్డ్ యూనివర్సిటి హోదాను పొందగలిగిన ఏకైకసంస్థగా ఎన్.బి.ఆర్.సి ఎదిగింది. వ్యవస్థాపక సంచాలకురాలిగా విజయలక్ష్మి రవీంద్రనాధ్ ప్రదర్శించిన చురుకుదనం, శక్తివంతమైన నాయకత్వ లక్షణాల వల్లే అది సాధ్యమైంది.
విజయలక్ష్మి రవీంద్రనాధ్ మానవ మెదడులో జరిగే ఔషధ జీవక్రియ డ్రగ్ మెటబాలిజమ్) పై పరిశోధనలకు బాటవేసిన ప్రథమురాలు. కాలేయంతోపాటు మనోక్రియాశీల ఔషధాల చికిత్సాచర్యలను మెదడుకూడా ప్రభావితం చేస్తుందని ఆమె చేసిన పరిశోధన వెల్లడించింది. విజయ సాధించిన ఫలితాలు మనో వైకల్యాల చికిత్సలో ఉపయోగపడె క్రొంగొత్త మనోక్రియాశీల ఔషధాలను అభివృద్ధి చేయడంలో తోడ్పడ్డాయి. సాధారణంగా మానసికరోగులలో కనిపించే మందులుపనిచేయకపోవడం అనేలక్షణానికి గలఫార్మకోడైనమిక్స్ అవగాహనను ఆమె ఫలితాలు కలగజేసాయి. ‘ఫార్మ కోడైనమిక్స్’ శారీరక క్రియలపై జీవరసాయన క్రియలపై మందులు తీసికొనివచ్చే ప్రభావాలను, మందుపనిచేసే క్రియాసంవిధానాన్నీ. ఇచ్చిన మందుగాఢతకీ అది చూపే ప్రభావానికి గల సంబంధాలను అధ్యయనం చేస్తుంది. ‘అటాక్సియా’లో కనిపించే శారీరక ప్రవృత్తులు క్రమం తప్పడం, మనోదౌర్బల్యంతో కూడిన ఉన్మాదం వంటి నరాల క్షీణతవల్ల ఏర్పడె రకరకాల వైకల్యాల మూలం, వికాసాల గురించిన విజ్ఞానాన్ని ఆమె ప్రయోగ ఫలితాలు వెల్లడించాయి. మోటార్ న్యూరన్, పార్కిన్సన్ రోగాలున్న జంతునమూనాలతోచేసిన అధ్యయనాల ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని సేకరించగలిగింది. విటమిన్-ఇ వంటి సాంప్రదాయక ఆంటీఆక్సిడెంట్ కంటె ఎక్కువగా థయోల్ ఆంటీ ఆక్సిడెంట్లు నరాలకు రక్షణని ఎక్కువగా ఈయగలవని ఆమె పరిశోధనా ఫలితాలు ప్రధానంగా చెప్పాయి. నాడీక్షీణత వైకల్యాలు రావడంలోను అవి పెరగడంలోనూ స్త్రీలకీ పురుషులకీ మధ్య కనిపించే తేడాలను అధ్యయనం చేసింది. ఆడవారి హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ నరాలకు ఇచ్చే రక్షణ విషయమై ఆమె పరిశోధనా ఫలితాలు చక్కని వివరాలను వెలుగులోకి తెచ్చాయి. మందు మొక్కల కషాయాలు ఆల్జిమర్స్ రోగలక్షణాల తీవ్రతను తగ్గించిన వైనాన్ని ఉపశమనాన్ని కలగచేసిన సందర్భాలనూ జంతు నమూనాలపై ప్రయోగ పూర్వకంగా ప్రదర్శించి చూపింది. వీటిని పేటెంట్‌లను పొందింది.
ఎన్.బి.ఆర్.సి. వ్యవస్థాపక సంచాలకురాలిగా ఆసంస్థకి ప్రపంచం పలుమూలలనుండి వివిధ వైజ్ఞానిక శాఖలకు చెందిన నిపుణులు వచ్చిచేరేలా ఆకర్షించగలిగింది. మానవ మెదడును అవగాహన చేసుకొనడానికి ఒకరితో ఒకరు విషయ పరిజ్ఞానాన్ని పంచుకొంటూ ముందుకు సాగాలన్నది ఆమె నమ్మకం. అందువల్ల ఆ సంస్థలో అణు జీవశాస్త్రం నుండి శరీరధర్మశాస్త్రం, కంప్యూటేషనల్ సైన్స్, గణితందాకా అన్ని విభాగాలవారూ వున్నారు. మన భారతదేశంలో ఒక సమస్యపై నిష్ణాతులైన జీవశాస్త్రజ్ఞులూ, గణితజ్ఞులూ కలసి పనిచేస్తున్న ఏకైక సంస్థగా జాతీయ మెదడు పరిశోధనాకేంద్రం (నేషనల్ బ్రేన్ రీసెర్చ్‌సెంటర్) నిలిచింది.
విజయలక్ష్మి రవీంద్రనాధ్
ఎస్.బి.ఆర్.సి. బాగా వేళ్ళూని ప్రగతిపధాన పడిన తరువాత విజ్జికి సహజంగా పరిశోధనపై గల మక్కువ చేత దానిని వదిలి బెంగుళూర్‌లోని ఇండియన్ ఇన్సిస్టూట్యూట్ ఆఫ్ సైన్సెస్’ సంచాలకులైన పి.బలరాంగారు అక్కడ నాడీ వైజ్ఞానిక కేంద్రాన్ని నెలకొల్పమని సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆమె అలా నెలకొల్పిన కేంద్రానికి ప్రొఫెసర్ అండ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నది. ఎన్.బి.ఆర్.సి.ని వదిలి రావడానికి గల కారణాలలో ”భర్త రవీంద్రనాధ్, కొడుకు శాస్త్రికి ముసలి తల్లిదండ్రులకి ఓ దశాబ్దంపాటు దూరంగా వున్నాను ఇప్పుడు వాళ్లతో గడపాలన్న నా కోరిక కూడా ప్రధానమైనదే. ఎన్.బి.ఆర్.సి నాకు బిడ్డలాంటిది ఎప్పుడే అవసరం వచ్చినా నేను దానికి అందుబాటులోనే వుంటాను. ఏ సంస్థకైనా నాయకత్వంలో మార్పు అవసరం. నూతన ఆలోచనలకు తావునిస్తూ సంస్థ పురోభివృద్ధికి ఆ మార్పు తోడ్పడుతుంది” అని చెప్పింది.
ఆశ్వ గంధవేళ్ళ నుండి తీయగా వచ్చిన కాషాయం ఆల్జీమోర్స్ తోనున్న ఎలకల కిచ్చి వాటి జ్ఞాపకశక్తిని తిరిగిపొందిన వైనాన్ని నమోదు చేయగలిగింది. ఈ కషాయం నేరుగా మెదడుపై పని చేయదనీ అది లివర్‌లో ఒకానొక ప్రోటీన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఆప్రోటిన్ మరుపుకు కారణమైన మెదడులోని అమలాయిడ్ ఫ్లేక్‌లను స్పాంజ్‌లా తొలగిస్తుందని కనుగొంది. మెదడుకి సంబంధించిన రోగాలకు ఫార్మా కంపెనీలు మందుల తయారీలో విఫలమయ్యాయి కనుక వారు ఈ సాంప్రదాయ ఆయుర్వేద మందుల తయారీకి కృషి చేస్తున్నట్టు, త్వరలోనే లక్ష్యాన్ని చేరగలరని విజ్జి తన డి.వి.నరసింహారావు స్మారకోపన్యాసంలో చెప్పింది. ”స్త్రీలు విజ్ఞాన సాంకేతిక రంగంలో పరిశోధనను చేపట్టిన తొలి రోజులలోనూ, శాస్త్రవేత్తలుగా ఎదిగే వయసులో నున్న ఆ సంవత్సరాలలోనే వారు పిల్లలనికని, వారిని పెంచే వయసులో వుంటారు. ఆ తొలి వైవాహిక జీవిత దశలో వారికి గట్టి రక్షణ వ్యవస్థ సహాయం అవసరం. అభివృద్ధి పథాన నడుస్తున్న వృత్తి జీవితంతో వైవాహిక జీవితాన్నీ పెరుగుతున్న కుటుంబాన్నీ సమతుల్యంగా సమర్ధించు కొనడానికి పడే అవస్థలలో ఆమెకు కుటుంబసభ్యుల సమకారం లభించాలి. అప్పుడే అమెతన మేధోశక్తిని వెలికి తీయగలుగుతుంది. ఇటుపని ప్రదేశాలలోకూడా సముజ్జీల సమూహాన్ని ఏర్పరచుకొని తనదీ అయిన ఒక రక్షణ వ్యవస్థను ఏర్పరుచుకోడానికి ఆమెకు సమయం సరిపోదు. పని ప్రదేశంలో సాటివారితో విజయాలనూ, వైఫల్యాలనూ పంచుకోవడం అవసరం. ఒక శాస్త్రవేత్తగా జీవించే వ్యక్తికి ఇది తప్పనిసరి. ఈ విషయంలో నేను అపరిమితంగా లాభంపొందాను. శాస్త్రవేత్తలైన స్త్రీలు తమకు తాముగా ఒక నెట్‌వర్క్‌ని ఏర్పరచుకోవాలి. పరస్పరం సహకరించుకోవాలి అప్పుడే వారికి వృత్తి జీవితంలో తగిన వాతావారణం వుంటుంది. నేను నా విద్యార్ధినులకు ‘మీరు రబ్బరుబంతిలా తయారుకావాలి, దానిని ఎంతగట్టిగా నేలకేసికొడితే అది అంత ఎత్తుకి ఎగురుతుంది’ అని చెపుతూవుంటాను. కొత్త తరంలో సాధికారిత గల శాస్త్రవేత్తలు సంఖ్య పెరుగుతుంది, వారిలో మహిళలుంటారు; అంతేకానీ ”మహిళాశాస్త్రవేత్తలు” అని చెప్పబడే ఒక ప్రత్యేకవర్గం లేదంటుంది.