ఒకప్పుడామె పారిశుద్ధ్య కార్మికురాలు
మానవ విసర్జితాలను ఎత్తిపోసే శ్రామికురాలు
రాజస్థాన్లోని అవ్వార్ గ్రామంలో
మగ్గిపోయిన దళిత మొగ్గ.
ఇంటికో పది ముట్టజెప్పేవారు
ముక్కు మూసుకునే ఆహారం విసిరేసేవారు
ఆ చాకిరి తల్లికి దూరంగా జరిగే సమాజం
చూపులకు కూడా నోచుకోని అంటరానితనం
ఎంతటి దౌర్భాగ్యం?
యిప్పడా మొగ్గ విచ్చుకుంది
పరిమళాలు వెదజల్లే పువ్వుయింది.
‘సులభ్ ఇంటర్నేషనల్’ శిక్షణలో
కదిలే దీపమయింది.
తనలాంటి అభాగ్యుల జీవితాల వెలుగయింది
ఎప్పడో చీపురు పట్టినవేళ్ళు కావవి
హస్తకళల నైపుణ్యం చిగుళ్ళు.
పారిశుద్ధ్య రాయబారిగా
పీర స్పృహను విస్తరిస్తున్న బాటసారిగా
‘ప్రిన్సెస్ ఆఫ్ శానిటేషన్ వర్కర్స్’ పురస్కార గ్రహీతగా
అమెరికాను చుట్టి వచ్చింది.
హజీర్గేట్ హరిజనకాలని అందించిన
ముత్యమై ప్రకాశిస్తోంది.
ఉషాచామర్…
ఏప్రియల్ ఎనిమిదవతేదిమరో మైలురాయి
యూనివర్సిటి ఆఫ్ పోర్ట్స్ మౌత్ ఆహ్వానంపై
‘భారతదేశంలో పారిశుద్ధ్యం – మహిళల హక్కులు’ కై
ఇంగ్లండ్ వీధుల్లో ఆమె గర్జించిన రోజు.
ఎవరన్నారు ఆమెను నిరక్షరాస్యురాలని?
ప్రపంచపు మేధావులు చెవులు అప్పగించి
‘ఉషాచామర్’ ప్రసంగ ధారను ఆస్వాదిస్తుంటే….
ఆమె పడిలేచిన కెరటం
స్ఫూర్తినినింపే విజయకేతనం
(పారిశుద్ధ్య దళితకార్మికురాలుశ్రీమతి ఉషా చామర్ జీవన ప్రస్థానంలోని స్ఫూర్తిని ఒడిసిపడ్తూ)
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags