స్త్రీవాద వివాదాలు – ఒక సందర్భం- ఆచార్య పి. సుమతీ నరేంద్ర

తెలుగు సాహిత్యంలో గత శతాబ్దంలో సరికొత్త వాదాలు ముందుకొచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి దళితవాదం, స్త్రీ వాదం, మైనార్టీ వాదం. స్త్రీవాద సాహిత్యం ఉప్పెనలా వచ్చినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడానికి

కొంత సమయం పట్టింది. ఇప్పుడిక స్త్రీ వాదం అంటే ఏమిటో చెప్పుకోవలసిన పనిలేదు. స్త్రీల సమస్యలు పురాతన కాలం నుంచీ ఉన్నవే. అయినప్పుడు స్త్రీవాదం ఇప్పుడే ఎందుకు మొదలైంది అనేది కొంతమందికి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉండిపోయింది. స్త్రీలు తమ సమస్యలను గురించి తామే చర్చించుకొని కవిత్వం ద్వారా, కథల ద్వారా అభ్యివ్యక్తం చేసే అవకాశాన్ని స్త్రీవాదం కలిగించింది. పురుషులు దీన్నంతా పనికిమాలినసాహిత్యం అని కొట్టిపారవేయకుండా ఆలోచించి, చర్చించేస్థాయిని కలిగించింది స్త్రీ వాద సాహిత్యం. అయితే ఇంతటితో స్త్రీవాద సాహిత్యం అవసరం తీరిపోదు. స్త్రీలకు ప్రత్యేకంగా కొన్ని సమస్యలున్నాయి. పురుషులతో కొన్ని విభేదాలున్నాయి. స్త్రీ, పురుష అసమానతలు ఉన్నంతకాలం స్త్రీవాద సాహిత్యం అవసరమే. ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు తప్పకుండా వస్తుంది. అది ఎప్పుడు ఎలా వస్తుంది అన్నది ఆయా సందర్భాలను బట్టి ఉంటుంది. దేశకాల నైసర్గిక పరిస్థితులను బట్టి దాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది. స్త్రీల సమస్యలు వ్యక్తిగతమైనవిగా భావించడం సరికాదు. అవి సామాజిక సమస్యలు. ఇప్పుడిప్పుడే వాటికి పరిష్కారాలు వెదికే పని ప్రారంభమైంది. ఇది ఆహ్వానించదగిన పరిణామం.

స్త్రీ పురుషుల మధ్య ఇంత అంతరం అసలెందుకు వచ్చిందని ఆలోచిస్తే పురుషుడు చేసే పనికి విలువ పెరుగుతూ, స్త్రీ చేసే పనికి విలువ తరుగుతూ వచ్చింది. రానురాను ఇంటి పనిచేసే స్త్రీ భరింపబడేదిగా, బయట పనిచేసే పురుషుడు భరించేవాడుగా సమాజం విభజన రేఖలను గీయడం ప్రారంభించింది.

మాతృత్వం సృష్టిలో అత్యంత కీలకం. నరజాతి మనుగడకు మూలం సంతానం. ఈ బాధ్యత స్త్రీ పురుషులిరువురిదీ. కని పెంచే తల్లికి గౌరవం ఎక్కువ ఉండాలి. అది పర్యాయం అయింది. పైగా ఆమె కన్న సంతానం మీద కూడా పెత్తనం పురుషుడిదే. ఎప్పుడు ఎవర్ని కనాల్నో కూడా అతడే నిర్ణయిస్తాడు. అలా జరక్కపోతే ఆమె శిక్షంపబడుతుంది. సంతానం కలగకపోతే ఒక ఆమె పరిస్థతి నరకమే. లోపం ఎవరిదైనా శిక్ష ఆడదానికే? మారు మనువు పురుషుడి హక్కు ఆ ఊహే రాకూడదు స్త్రీకి.

మరొకటి ఇంటి చాకిరీ. ముఖ్యంగా వంట పని. పరిశుభ్రత, ఇంటిపని, వంటపని తను స్వీకరించి మగవాడికి స్వేచ్ఛనిచ్చింది స్త్రీ, తనకుతాను ఇంటికి బందీ అయింది. ఉత్పత్తికి క్రమంగా దూరమైంది. ఆర్థికంగా పురుషుడి మీదనే పూర్తిగా ఆధారపడింది. ఇంక అప్పటినుంచీ ఆమె బ్రతుకు పరాధీనమైంది. ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఆకాంక్షలు దూరమయ్యాయి. ప్రకృతిలో సమానులే అయిన స్త్రీ పురుషులు బానిస యజమాని అయ్యారు. ఇంతగా అణచివేతకు గురైన స్త్రీల స్వేచ్ఛాంకురాలు అనుకూల పరిస్థితులలో మొలకెత్తి మహావృక్షాలయ్యాయి.

స్త్రీవాదం పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి అయ్యిందనే వారున్నారు. రామాయణంలో సీత రాముని వెంట అడవికి వెళ్ళింది తన అభీష్టానుసారంగా. వద్దన్నా వినలేదు. తార వాలి వధను ప్రశ్నించింది – రాముడిని తప్పుబట్టింది. మండోదరి రావణుని వారించింది. కైక తన కోరికలను నెరవేర్చుకునే గట్టి ప్రయత్నం చేయకపోతే అసలు రామాయణమే లేదు.

వేదకాలంలో స్త్రీలు విద్యాధికులు కావడానికి ప్రయత్నించారని తెలుస్తుంది. అలాగే భారతంలో స్త్రీపాత్రలను చూస్తే వారికి వివాహాది విషయాలలో, సంతాన ప్రాప్తి విషయంలో స్వేచ్ఛ ఉండేదని తెలుస్తుంది. కురుక్షేత్ర యుద్ధాన్ని వాంఛించింది ద్రౌపది అని స్పష్టంగా చెప్పింది భారతం. కౌరవసభలో, రాయబార సందర్భంలో అనేక విషయాలను లేవనెత్తింది ద్రౌపది. సీత లేకపోతే రామాయణం లేదు. ద్రౌపది లేకపోతే భారతం లేదు. వాళ్ళ హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం వాళ్ళు పోరాడారు. ఆ ప్రయత్నంలో కష్టాలు వచ్చినా సరే నిబ్బరంగా నిలబడ్డారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్నారు. శకుంతల, దమయంతి, శర్మిష్ఠ, దేవయాని తమ ఇష్టానుసారంగానే వివాహమాడారు. కష్ట నిష్ఠూరాలకు నిలబడ్డారు.

మధ్య యుగాలలో స్త్రీ స్థితి దిగజారింది. అప్పుడు ఆమె గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం కొంత జరిగింది. ‘మాతృదేవోభవ, గృహిణీ గృహముచ్యతే, యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతా:’ వంటి సూక్తులు అప్పుడు అయినా పరిస్థితి చక్కబడలేదు. స్త్రీని భోగ వస్తువుగా పురుషుడు చూడడం మొదలైంది. శారీరకంగా బలవంతుడైన మగవాడు ఆడదాన్ని హీనంగా చూడసాగాడు. తన రక్షణలోనే ఆమె ఉండాలి, మరొక పురుషుడు ఆమెను కన్నెత్తి చూడకూడదు, మాట్లాడకూడదు అనుకొనే దాకా అతడి అహంకారం పెరిగింది. రాను రాను బానిస కన్నా అధ్వాన్నమై పోయింది ఆడదాని బ్రతుకు. లైంగిక హింస, చిత్త క్షోభ భరించలేక ఆడదానిగా పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం మేలు అనే భావం ఏర్పడింది.

తాళ్ళపాక తిమ్మక్క వంటి సాంప్రదాయ కవయిత్రి

”పొలతి నమ్మగరాదు – పురుషులనెపుడు

పలురీతి గృష్ణ సర్పములై యుండ్రు” అన్నదంటే,

స్త్రీలు ఎంత విసిగివేసారి పోయారో అర్థమౌతుంది. ఆమె కట్టు, బొట్టు, చదువు, వివాహం, సంతానం అన్నీ పురుషుడి దయాదాక్షిణ్యాల మీదనే ఆధారపడి ఉండేవి.

క్రమంగా స్వాతంత్య్రోద్యమ కాలంలో స్త్రీ విద్య ముందుకు తీసుకొని రాబడింది. జాతీయోద్యమం స్త్రీలలో చైతన్యాన్ని పాదుకొల్పింది. స్వతంత్ర భారతదేశంలో గాంధీజీ వంటి మహాత్ముల బోధనల ఫలితంగా స్త్రీల విద్య, ఉద్యోగావకాశాలు పెరిగాయి. సమస్యల పట్ల అవగాహన పెరిగింది. ఆర్థిక స్వావలంబన మొదలైంది. ఆ క్రమంలో సాహిత్య సృష్టి ఎక్కువైంది మహిళలపరంగా. పాశ్చాత్య దేశాలకు, భారతదేశానికి, ఆసియా దేశాలకు సమానమైంది ఏదైనా ఉంది అంటే అది స్త్రీల అణచివేత. అక్కడ పుట్టిన ఉద్యమాల ప్రభావం కూడా కొంత పడింది. అంతేకాని సమస్య దిగుమతి కాలేదు. పరిష్కారం కోసం ప్రయత్నం కూడా ఇక్కడే పుట్టింది.

పోతే మధ్యతరగతి మహిళలు ఉబుసుపోకకు చేస్తే మిగతావాళ్ళు అనుసరిస్తున్నారు గుడ్డిగా అనే ఒక వితండవాదం బయలుదేరింది. దానికి మేధావులు వత్తాసు పలకడం విచిత్రం. స్త్రీవాదం వ్యక్తిగతమనీ, సైద్ధాంతిక నేపథ్యం లేదనీ, అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారనీ, సమాజాన్ని విచ్ఛిన్నకరమైన భావజాలంతో కలుషితం చేస్తున్నారనీ, పురుష ద్వేషం వలన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుందనీ రకరకాలుగా విమర్శలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ సమాధానాలు సులభంగానే దొరకుతాయి.

‘మధ్యతరగతి స్త్రీలు’ అంటే ఎవరు? కొంత విద్యాధికులై రాయగలిగిన అవగాహన, అవకాశం ఉన్నవారు స్త్రీవాద సాహిత్యానికి ఆద్యులుగా నిలిచారు. ఎందుచేతనంటే ఉన్నత వర్గాలవారికి ఆర్ధికమైన సమస్యలు తక్కువే. ఇంటిచాకిరీ, పసిపిల్లల సంరక్షణలో ఉండే చిక్కులు తక్కువే. ఇక ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారికి పొయ్యిమీదికి, పొయ్యి కిందికి వెతుక్కోవడంలోనే కాలం సరిపోతుంది. వాళ్ళను అణచివేత ఉక్కిరి బిక్కిరి చేసినా వ్యక్తం చేయడానికి వారికి భాష సరిపోదు. అసలు ఏ ఉద్యమంలోనైనా ముందు ఉండేది మధ్యతరగతి వారే.

ఇక ప్రాంతం, మతం, కులం వాటిని స్త్రీ వాదులకు ఆపాదించడం అసహనం తప్ప మరొకటి కాదు. తల్లిదండ్రులే చిన్నచూపు చూడడంతో మొదలవుతుంది స్త్రీ వేదన. సోదరులు పెత్తనం చెలాయించడం, గుండెల మీద కుంపటిగా భావించడం, అత్తింటికి పంపాలనే పుట్టింటి వారి ఆరాటం, అక్కడకు వెళితే అరళ్ళు, భర్త నిరాదరణ ఇవన్నీ స్త్రీని క్రుంగదీసే అంశాలు. ఆర్థిక స్వాతంత్య్రం లేక ఎప్పుడూ ఎవరో ఒకరిమీద ఆధారపడవలసి వుండడం, తాము కన్న పిల్లలు కూడా తమను పనికిరాని వారుగా చూడడం స్త్రీలను మానసికంగా వేధిస్తూవచ్చాయి. తరతరాల అణచివేతకు ప్రతిఫలనంగా ఉద్భవించిందే స్త్రీవాదం.

వంటిల్లు, చూపులు వంటి కవితలు ప్రతీకాత్మకంగా వచ్చినవే లైంగిక వేధింపులు ఇప్పుడు కూడా స్త్రీల స్వేచ్ఛను హరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దశల పురుషులు ఎక్కువమంది ఆషామాషీగా స్త్రీవాద సాహిత్యాన్ని విమర్శించారు.

జ్వాలాముఖి, జయప్రభ, ఎస్వీ సత్యనారాయణ మొదలైన వారెందరో ఈ వివాదంలో పాల్గొన్నారు. ఈ విమర్శలలో ప్రధానంగా రెండు పార్శ్వాలు కనిపిస్తాయి. ఒకటి స్త్రీవాదులు వాడిన భాష. స్త్రీ శరీరానికి, ఋతు ధర్మానికి, ప్రసవానికి సంబంధించిన పదజాలంపై పురుషులు అభ్యంతరాలు లేవనెత్తారు. తమ సమస్యలను తామే ఆవిష్కరించాలన్న ధ్యేయంతో రాసిన కవయిత్రులు కొంత అభ్యంతరకరమైన పదజాలాన్ని వాడారన్నది ఒక అభియోగం. దిగంబర కవులు అదే పనిచేశారు అంతకుముందే. అది తప్పు కానప్పుడు ఇదెలా తప్పు అవుతుంది అని స్త్రీవాదుల ఒక అభియోగం. దిగంబర కవులు అదే పనిచేశారు అంతకుముందే. అది తప్పు కానప్పుడు ఇదెలా తప్పు అవుతుంది అని స్త్రీవాదుల ప్రశ్న. మరొకటి ముందే చెప్పుకొన్నట్లు ఇది మధ్య తరగతి ఆడవాళ్ళ కాలక్షేప కవిత్వం అనేది. ఎస్వీ దీనికి ఆద్యుడు. చదువరులైన వారు ఉద్యమ సారధులు కావడం తరచూ జరుగుతుంది… నాయకత్వం వహించిన వారి వ్యక్తిగత జీవితాలలోకి తొంగి చూడడం హర్షణీయం కాదు. వారు చెప్తున్న విషయం చర్చనీయాంశం అవుతుంది కాని వారి స్వీయచరిత్ర కాదు. ఏదిఏమైన దీనివలన అనేక విషయాలు ముందుకొచ్చాయి. సెన్సేషనలైజ్‌ చేయడం ఒక్కటే మార్గం కాదు సమస్య పరిష్కారానికి. అధ్యయనం, ఆలోచనాత్మకమైన కార్యాచరణ అవసరం. స్త్రీల సమస్యలు వ్యక్తిగతం కానేకావు. అవి సామాజిక సమస్యలు కూడా. వాటి పరిష్కారానికి స్త్రీలు మాత్రమే పాటుపడితే చాలదు. ఆ మాటకి వస్తే స్త్రీ వాదానికి పూర్వరంగం సిద్ధం చేసినవారు పురుషులే. స్త్రీవిద్యకు, స్వాతంత్య్రానికి అంకురార్పణ చేసింది పురుషులే. ఉన్నత వర్గాలకు చెందిన స్త్రీలు ప్రతి అంశంలో కొంత వెనుకాడుతుంటారు. వారిని కలుపుకొని పోవడం కొంతకష్టం. శారీరక శ్రమ చేసేవారిలో అర్థం చేసుకొని ఉద్యమాలలో పాల్గొనే సమయం ఉండదు. వారిని ఎడ్యూకేట్‌ చేయడానికి కొంత కాలం పడుతుంది.

ఇవన్నీ సాధించడంతోపాటు పురుషులలో ఒక సానుకూలమైన ఆలోచనా ధోరణిని కలిగించాలి. ఇది ఎక్కడ ప్రారంభంకావాలి అంటే ఇంటిలోనే. పిల్లలు పుట్టినప్పుడు ఏ బేధభావాలు కలిగి ఉండరు. వారిని పెంచే క్రమంలో తల్లిదండ్రులే అలాంటి విభజన రేఖలకు శ్రీకారం చుడతారు. సమాజం ఆ రేఖలను దుర్భేద్యమైన కుడ్యాలుగా నిర్మిస్తుంది సమాజం అంటే మనమే. ఆడపిల్లలను భయపెడతాం ప్రతి చిన్న విషయంలో. మగ పిల్లలను వదిలేస్తాం. కొండొకచో ప్రోత్సాహిస్తాం. తిరగడం, తిట్టడం తప్పని మందలించం. ఇక్కడ మొదలవుతుంది వివక్ష, దీన్ని అరికట్టాలి. స్త్రీ పురుషులు సృష్టిరీత్యా సమానులే అయినందున విభజనరేఖలు గీయడం మానెయ్యాలి. పొరపొట్లు జరగకుండానే చూడాలి. జరిగితే ఇరువురినీ బాధ్యులను చేయాలి. ఈ వివక్ష లేకుండా పోయినంత కాలం స్త్రీవాదం ఉంటుంది. వివాదం వస్తుంది. దీన్ని రూపుమాపే ప్రయత్నం, బాధ్యత కేవలం స్రీలది కాదు. సమాజంలో సమూలమైన మార్పు రావాలి, వస్తుంది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.