దేవదాసీ వ్యవస్థ అంతరించిపోయింది ఈ వ్యవస్థ లేదు అని అధికార వర్గాలే చెప్పుకొంటున్నాయీ అయితే ఈ మాట నిజం కాదనే వాస్తవం గ్రామాల్లో పనిచేనే నాలాంటి కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తు చేస్తూ వుంటుంది. ఈ మధ్య నేను విశపన్కల్లు మండలంలో ఈ మాట ఎంత వరకు కరెక్టు అని పరిశీలించసాగాను. ఆ క్రమంలోనే గ్రామాలకు వెళ్ళినప్పుడు దేవదాసీలు వున్నారా అనే విషయాన్ని కొంతమంది మహిళలతో ఆరా చేశారు. వాళ్ళ పెద్దముత్తయిదువా అనే అర్థంలో గౌరవ ప్రదంగానే కాక మరో అర్థంలోనూ స్ఫురించేలా చెప్పింది. నేను ఆ మరో అర్థమేమిటో అని ఆమెను మళ్ళీ పెద్ద ముత్తయిదువ అంటే అదే గ్రామ ఊరిలో వున్న మగవారికి అందరికి భార్య అని, ఆ మాత్రం కూడా తెలియదా అనే ఆశ్చర్యంలో అక్కడినుండి వెళ్ళిపోయారు.
దేవదాసీ అంటే గ్రామపెద్ద ముత్తైదువు గ్రామంలోని మగవారి లైంగిక ఆనందానికి అధికారికంగా నియమించిన ఓ స్త్రీ. వీరంతా 15-20 సం|| మధ్య వయస్కులుగా ఈ వ్యవస్థలోకి దించబడతారు. ఈ గ్రామంలోని దేవదాసీలంతా (పెద్ద ముత్తైదువుల) కర్ణాటక రాష్ట్రంలో ప్రనిద్ధి దేవాలయం అయిన ”ఉలిగమ్మ” అనే దేవత దగ్గరకు వెళ్ళి అక్కడ పెళ్ళి అనే తంతు చేస్తారు. ఇందులో 7 రకాల దేవుడి బొమ్మలు రూపంలో వున్న బొట్టులు వుంటాయి. వీటికి ఎరుపు, తెలుపు పెద్దపూసలు 14, తెల్లదారంలో వేని పిన్నమ్మ వరుస ఆమెతో కట్టిస్తారు. చేతికి రెండు వెండితో చేనిన గాజులు లాంటివి వేస్తారు. ఇక్కడితో ఆమెను అమ్మవారికి సమర్పించి మా అమ్మాయి ఈ వృత్తి చేయడానికి అనుమతిని ఇవ్వండి అని వేడుకొని కానుకలు సమర్పిస్తారు. అక్కడ ఒక రాత్రి నిద్ర చేని తిరిగి గ్రామానికి చేరుకుంటారు. ఈ తంతు ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే జరుగుతుంది.
గ్రామంలో అప్పటినుండి ఆమె మగవారితో మాట్లాడడం మొదలు పెడుతుంది. గతంలో పుష్పవతి కాకుండానే 10-11 సంవత్సరాల వయస్సులో దేవదానిని చేనేవారు. ఇపుడు ఈ గ్రామంలో పెద్ద మనిషి అయిన తర్వాత చేస్తున్నారు. ఆమె గ్రామంలో వ్యవసాయ కూలీగా వెళ్తుంది. గ్రామంలో ఎవరో ఒకరు ముందుకు వచ్చి తాళి కట్టాలి. ఆ వ్యక్తి ఎవరు అనేది గ్రామస్తుల సమక్షంలో జరగొచ్చు లేదా ఆమె భర్తగా నేను వుంటాను అని ఆదర్శంగా ముందుకు రావచ్చు. లేదా ఆమె తరపు వాళ్లు ఎవరినైనా ఎన్నుకోవచ్చు. ఈ తంతు కోసం గ్రామం మొత్తం దండోరా వేయించి మగవారు అందరూ వస్తారు. ఎన్నుకున్న వ్యక్తి అందరి సమక్షంలో పెళ్ళి చేసుకుంటాడు. అక్కడితో ఆమెను దేవదానీని చేనే తంతు పూర్తి అయినట్టు లెక్క.
అప్పటి నుండి ఆమెతో మగవాడు అనేవాడు ఎవరైనా సరే శారీరకంగా (వ్యభిచారం) కలవచ్చు. వయస్సుతో, కులంతో, వర్ణంతో నిమిత్తం లేదు. ఆమెను ఎక్కడిౖనా తీసుకొని ూడా వెళ్ళొచ్చు. ఆమె ఇంట్లో అయినా వుండొచ్చు. ఆమెను శారీరకంగా కలినే వాళ్ళు డబ్బులు, కానుకలు ఇవ్వొచ్చు, ఇవ్వకపోవచ్చు. ఖచ్చితంగా ఇవ్వాలి అనేది పట్టింపు వుండదు. గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల నుండి ూడా వ్యక్తులు వచ్చి ఆమెతో వుండొచ్చు.
ఆమెకు పిల్లలు పుట్టరా ఒకవేళ పిల్లలు పుడితే వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే ప్రశ్నల్ని, విషయాలను కూడా రాబట్టాం. పిల్లలు పుడతారు కానీ వీరికి తండ్రి వుండరు. పిల్లలను ఎంత మందిని కనాలి, అసలు కనాలా వద్దా అనేది ఆమె ఇష్టానికి వదిలేస్తారు. పిల్లలను గ్రామస్తులు చులకనగా చూస్తారు. ఆ వయస్సు పిల్లలతో ఆడుకోవడానికి తమ పిల్లల్ని తోడుగా పంపరు. ఏదో ఒకమాట అంటూ పోతారు. ఆ పిల్లలకు ఎందుకు ఈ మాటలు అంటున్నారో అర్థం కాదు. తండ్రి ఎవరో తెలియకుండా పెరుగుతారు. ఈ పిల్లలు పుట్టినప్పటినుండి ఎన్నో ప్రశ్నల చుట్టూ తిరగాల్సి వుంటుంది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్లు ఉండరు. వారిపోరాటం ఊహ తెలినినప్పటి నుండి మొదలు అయ్యి సమాజం ఏంటి అని తెలుసుకునే వరకు కొనసాగుతుంది. కుటుంబ వ్యవస్థ ఉండదు. ప్రభుత్వ సదుపాయాలు వుండవు. పెన్షన్ అందదు, బియ్యం కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు వంటివి ఏమీ ఉండవు. కాబట్టి పెన్షన్ వంటి ఇతర సదుపాయాలు ఆ గ్రామంలో లేవు.
హవగళి అనే గ్రామంలో 14 సం||ల అమ్మాయిని దేవతకు వదిలారు అని విన్నాను. వెంటనే ఆ అమ్మాయి వయస్సు వంటి వివరాలు తెలుసుకొని రెండు రోజుల తర్వాత ఆ గ్రామానికి వెళ్ళాను.
దేవదాసీ అయిన అమ్మాయి గురించిన వివరాలు అడిగితే మాకు అనేది చెప్పి మెల్లగా ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. చాలామంది 60 నుండి 80 మంది దాకా తెలినిన వాళ్ళే. ఈ పద్ధతి కాదు అని మేమే ఆ అమ్మాయి ఇంటి దగ్గరకు వెళ్ళాము. పాత ఇల్లు. పెచ్చులు ఊడిపోయిన గోడలు, కొట్టంపై కప్పు చెదిరిపోయి పడిపోవడానికి నిద్ధంగా వుంది. ఇంటి చుట్టు ప్రక్కల చక్కగా పేడతో అలికి ముగ్గు పెట్టి వుంది. పూల చెట్లతో అందంగా కనబడింది. గడపకు ఎర్రమట్టి పూని, పసుపు, కుంకుమ పెట్టి పైన పేడతో అలికి ముగ్గులు పెట్టారు. ఆ ఇంట్లో నుండి వృద్ధ దంపతులు వచ్చారు. ఏదో కన్నడ భాషలో మాట్లాడారు. ఎవరు, ఎందుకు వచ్చారు అనేది ఆ మాటల అర్థం. మీ అమ్మాయి పేరు ఏమిటి అని అడిగితే ఎందుకు చెప్పాలి అని చాలా కోపంగా లోపలికి వెళ్లిపోయారు. మీరు ూడా వెళ్లిపోండి అన్నారు. ఎంత నచ్చచెప్పినా వినకుండా వుండిపోయారు.
చేనేది లేక అప్పటికి వెళ్ళిపోయాం. మళ్ళీ వెళ్ళి వివిధ రకాలుగా సమాచారం నేకరించాం ఆ అమ్మాయి పేరు అనంతమ్మ. వాళ్లు 5 మంది ఆడపిల్లలు ఈ అమ్మాయి చివరి అమ్మాయి. మిగిలిన 4 గురికి పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇంటి యజమాని దేవుడికి నేవ చేస్తారు కాబట్టి ఊరిలో అందరూ బియ్యం కొంత డబ్బులు వంటివి ఇస్తారు. ఈ అమ్మాయిని రెండు నెలల క్రితం ఉలిగమ్మ దగ్గరకి తీసుకెళ్లి దేవతకు అప్పచెప్పారు. అప్పటినుండి ఆ అమ్మాయి ఊళ్ళోకి వెళ్ళడం ూడా మొదలు పెట్టింది అని సమాచారం తెలుసుకున్నాము. గ్రామం కూడా లోపలికి వుంటుంది. ఆటో, బస్సు సౌకర్యం వుంది కానీ రోజుకు ఒక్కసారి మాత్రమే తిరుగుతాయి. 200 కుటుంబాలు వున్నాయి. బిని, యన్ని, ఓని కులాలు వున్నాయి.
మిరప, పత్తి, పంటలు ప్రధానం. గ్రామం చుట్టూ పెద్ద పెద్ద వాములు (ఎండు వరిగడ్డి, వేరుశనగ కట్టి, కలిపివేనేది) వున్నాయి. ఎవరికి వాళ్లు వారి స్థలంలో చుట్టూ ముళ్ళ కంపలతో కంచెవేని అందులో అందంగా గడ్డివాములు వేని వున్నారు. రోడ్లు చిందర వందరగా వున్నాయి. ఓ.ని. వాళ్లు ఒక వైపు, బి.ని. వాళ్లు ఒకవైపు, చివరివైపు యన్.ని. వాళ్లు వున్నారు. ఈ యన్.ని. వాళ్లకు ప్రత్యేకంగా స్కూలు, ఒక సంస్థవారు కట్టించిన కాలనీ వుంది. ఓ.ని., బి.ని ఇండ్లు పురాతన కట్టడాలు బలంగా, పెద్దగా కట్టిన ఇండ్లు ఇప్పటికీ వున్నాయి. గ్రామం అంతా తిరిగి ఆ అమ్మాయి గురించి తెలుసుకొని తిరిగి వచ్చేశాం.
తిరిగి 4 రోజుల తర్వాత గ్రామంకు వెళ్ళాం. స్త్రీలతో అదే విషయం చర్చకు పెట్టాం. మళ్ళీ యథాతథంగా వెళ్ళిపోయారు. గట్టిగా మాట్లాడి అందరినీ ూర్చోబెట్టి కంప్యూటర్ యుగంలో ూడా ఈ విధంగా జరగడం ఏమిటి అసలు మేము వెళితే వారు పలకరించడం లేదు అందరం వెళదాం రండి అంటే మేము ముందే వెళ్ళాము. ఎంతమంది వెళ్లినా అనంతమ్మ వాళ్ల నాన్న నానా మాటలు అంటున్నాడు. నోటికి వచ్చినట్లు తిడుతున్నాడు. ఎవరు మాట్లాడినా ఈ విషయం నాకు తెలుసు. ఈ దేవదాని వ్యవస్థను చట్టబద్ధం చేశారు. మీరు ఎగేసుకుని రావాల్సిన అవసరం లేదు. ఈ విషయాలు విన్న తర్వాత ఇంకా వేరే గ్రామాల వారిని సహాయంగా తీసుకెళ్దాం అని చెప్పాం. కానీ ఈ ప్రయత్నం ఫలించలేదు. పనుల కారణంగా 50 మంది ఒకేసారి వెళ్ళలేకపోయాం.
కానీ ఎక్కడ వున్నా ఏం పని చేనినా ఈ సంఘటనే గుర్తు వస్తుంది. ఇంత ప్రయత్నంలో అనంతమ్మకు కలవలేక పోయామే అనే బాధ ఒకవైపు 14 సం||ల అమ్మాయి వ్యభిచార వృత్తిలోకి పోతోంది. ఎలాగైనా రక్షించాలని మాత్రం వుండేది. ఎలా దారి అనేది అర్థం కావడం లేదు. నాలాగా పనిచేనేవారు, కార్యకర్తలు అందరం 30 మందిమి ఒక సమావేశంలో కలనినపుడు నా మనస్సులోని మాటలను తెలియచేశాను. నా కొలీగ్ కూడా వివరంగా అక్కడి పరిన్థితిని వారందరికీ అర్థం చేయిస్తూ వివరించి చెప్పింది.
మా వాళ్లు అందరూ రకరకాల సలహాలు ఇచ్చారు. ఇందులో నా ఆలోచనలకు ప్రాణం పోనింది మాత్రం మనలాగా పనిచేనే స్వచ్ఛంద సంస్థలు, డిపార్ట్మెంట్స్ సహాయం తీసుకుని అందరం కలని వెళితే అనంతమ్మ వాళ్ల కుటుంబ పరిన్థితి మరియు, ఏదో పరిష్కారం దొరుకుతుంది అనే ఆలోచన బాగా నచ్చింది. వెంటనే ఆ పనిలో మునిగిపోయాం. ఎవరెవరు వున్నారు. వారి ఫోన్ నెంబర్స్, తీసుకొని అందరితో ఫోన్లోనే సంభాషించి ఒక్కరోజు టైం ఇచ్చి అక్కడి పరిన్థితిని తెలియజేని అత్యవసర పరిన్థితిని అర్థం చేయించాము. అందరూ వెంటనే స్పందించి ఆగమేఘాల మీద మండలంకు చేరుకున్నాము. మొదట యంఆర్ఓ గారికి విషయం తెలియజేని పోలీన్ వారికి తెలిపి వారి సహాయం తీసుకొని 10 డిపార్ట్మెంట్స్ వారు అన్ని వాహనాలు, అంత మంది అధికారులు స్త్రీలు ఒక్కసారిగా అనంతమ్మ ఇంటికి వెళ్ళాం. ఇంట్లో నుండి 3 గ్గురు బయటికి వచ్చారు.
ఈ సందర్భాన్ని ఊహించని ఆ కుటుంబ సభ్యులు ఆశ్చర్యం, భయం, ఒసాేరి ప్రదర్శిస్తూ బయటికి వచ్చారు. మల్లికార్జున రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేశాడు. వాల్ల భార్య కొల్లమ్మ, కూతురు అనంతమ్మ వణికిపోతూ రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేశారు. అనంతమ్మ పాత చీరలో పొడవు జుట్టు వాడిపోయిన పూలు, చక్కటి చిరునవ్వుతో నల్లని మెరినే కళ్ళు ఆమె ఆకృతికి చక్కగా అమరిన చీరను సరిచేసుకుంటూ చీరకొంగును కప్పుకుని వచ్చి నిలబడింది. ఎందుకు ఇంత మంది వచ్చారు అనేవారి సందేహాన్ని బయటికి చెప్పలేరు. కానీ ఆ కళ్ళు మాత్రం ఆ సందేహాన్ని తీర్చుకోవడానికి అందరివైపుూ దీనంగా వెతుకుతున్నాయి.
ఈ కంగారుని గమనించి ూర్చోబెట్టి నీళ్లు తాగించి ఎందుకు ఇలా చేశారు అనేది అడిగాము. వారివైపు నుండి సమాధానం లేదు. పోలీసుల లాగా పదే పదే ప్రశ్నలు వేశక తప్పదు అన్నట్లు వణుకుతున్న గొంతును సవరించుకుంటూ ఆయన మాట్లాడుతూ నాకు 5 గురు సంతానం అందరికంటే చివరి అమ్మాయి అనంతమ్మ. 4 గురు పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాం. ఈ అమ్మాయికి పెళ్ళి సంబంధాలు చూద్దాం అనుకునే లోపు మేమంతా ఒంటరి వాళ్లం అయిపోతాం అని అనంతమ్మ నాకు పెళ్ళి వద్దు నేను మిమ్మల్ని చూసుకుంటూ మీతోనే వుంటాను అన్నది. దాని కోసం చాలా మాట్లాడినా ఆమె వినలేదు. అందు మాకు కూడా తోడు వుంటుంది అని పెళ్ళి సంబంధాలు చూడడం ఆపేశాము కానీ ఆదాయం ఎక్కడినుండి వస్తుంది అందు ఇలా అనుకొని ఉలిగమ్మతో పెళ్లి చేశాము అన్నాడు. అనంతమ్మవైపు చూన్తే వెంటనే గట్టి గొంతుతో తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ మా అమ్మ నాన్నలకు అందరూ ఆడపిల్లలే. వారికి వయస్సు అయిపోయింది. ఈ వయస్సులో వారిని చూనేవాళ్లు ఎవరు? అందు నేను అమ్మవాళ్లను చూసుకుంటూ, మా అక్కవాళ్లు పుట్టింటికి వేన్త చూసుకోవడానికి వుండడానికి ఇలా చేశాము అంటూ చెప్పింది. కొల్లమ్మ మాట్లాడలేదు.
అప్పటికే గ్రామంలో వుండే చిన్నా, పెద్దా, ఆడ, మగ అందరూ గుంపులు గుంపులుగా ఆ పరిసరాలలో తిరుగుతూ గ్రూపు సమావేశాలు పెట్టుకున్నారు. ప్రస్తుత పరిన్థితులలో ఇక్కడ ఇలా మాట్లాడటం మంచిది కాదని మండలానికి అందరం చేరుకున్నాము. యంఆర్ఓ కార్యాలయంలోకి వెళ్ళి అడిగితే అవే సమాధానాలు. యన్‌ఐ గారు మాట్లాడుతూ చట్టరీత్యా ఈ వృత్తి చేయడం తప్పు. ఈ వృత్తి లేకుండా చేని చాలాకాలం అయ్యింది. చేనినందుకు నీకు శిక్ష మరియు జరిమానా పడుతుంది. ప్రోత్సహించిన మీ తల్లిదండ్రులూ శిక్ష పడుతుంది. పెద్ద కేసు అవుతంది తెలుసా అని గంభీరమైన గొంతుతో అన్నారు. యంఆర్ఓ గారు తన వయస్సుకు, ¬దాకు తగినట్లు మెత్తగా గొంతు సవరించుకుంటూ ఒక్క మాటకు, మరో మాటకు విరామం ఇస్తూ వాక్యానికి వాక్యానికి ఆలోచిస్తూ మాట్లాడడం మొదలు పెట్టారు. నువ్వు చెప్పిన కారణాలు నిజాలు కాదనలేదు. మీకు ఈ న్థితికి కారణం పేదరికం కాబట్టి, ప్రభుత్వ సదుపాయాలు అందితే కొంత పేదరికం నుండి బయట పడతారు. అంటూనే వారికి పెన్షన్ వస్తుందా, బియ్యం ఎన్ని ఇస్తున్నారు, ఇల్లు వుందా అంటూ వివరాలు తీసుకుంటూనే సంబంధిత డిపార్ట్మెంట్ అధికారులవైపు చూశారు.
వారు చెప్పింది నిజమే అన్నట్టు అధికారులు తలలు ఆడించారు. బియ్యం ఇచ్చే విషయం నాకు వదిలేయండి నా చేతిలో వుంది. నిరుపేదల క్రింద అంత్యోదయ కార్డు (35 కిలోల బియ్యం) మంజూరు చేస్తాను అంటూనే యంపిడిఓ గారు ఆ మాటను అందుకుంటూ మల్లికార్జునా మీ వయస్సు ఎంత అని అడిగితే 62 సం||లు అని టక్కుమని సమాధానం చెప్పారు ఆయన. అయితే పెన్షన్ మంజూరు చేయించే (1000 రూపాయలు) బాధ్యత నాది అని అన్నారు. ఏ.ఈ. గారు స్పందిస్తూ ఇల్లు మంజూరు చేయించే బాధ్యత నాది అంటూ సున్నితంగా బాధ్యతను న్వీకరించారు. ఈ విధంగా అధికారులు ఎవరికి వారు బాధ్యతలు పంచుకున్నారు. సరే వాటి అమలు ఎలా తిరిగి ఈ జాబితాలో వున్నవి మంజూరు అయ్యాయా లేదా అనేది ఏ సాక్ష్యంతో అడగాలి అనేది నా మనసులో మెదలుతున్న ప్రశ్న. అంతలోపే పేపర్ విలేకరులు వచ్చారు. డిపార్టుమెంట్లలోని పెద్ద అధికారుల వైపు చూస్తూ విషయం ఏమిటి మీరు ఏమి చేశారు అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఎవరికి అర్థం అయ్యే రీతిలో వారు చెబుతున్నారు. మేము అధికారులవైపు చూస్తూ అధికారికంగా లెటర్ ఇన్తే బాగుంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం అన్నాం. మండల స్థాయి మెజిన్ట్రీ యంఆర్ఓ గారు కాబట్టి అతను ఒక లెటర్ పోలీన్ అధికారులు ఒక లెటర్, అమ్మాయి వైపు నుండి ఒక లెటర్ తీసుకొని అనంతమ్మను మాత్రమే మేము తీసుకుని రాత్రి 10 గంటలకు హాస్టలుకు చేరుకున్నాం. హాస్టల్లో వుండే పిల్లలు ఈ సమయంలో ఎవరు వచ్చారు అంటూ ఆశ్చర్యంగా అందరూ చూస్తూ వుండిపోయారు.
మరుసటి రోజు నుండి అనంతమ్మతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ అక్కడ కుదరలేదు. ఆమె ూడా ఇష్టపడటం లేదు. టీచర్ని పిలిచి అనంతమ్మ ఇక్కడికి రావడానికి గల కారణాలను, పరిన్థితులను తెలిపి అందరూ ప్రేమగా వుండండి అని చెప్పి పంపాము. రెండు రోజుల తరువాత ఆమెను కలవడానికి వెళ్తే నా కొత్తగా కనబడింది. చీర కాస్తా పంజాబి డ్రెన్ అయ్యింది. జడ స్టయిల్ మారింది. ఇంకా తెలుగును అందంగా మాట్లాడింది. నేను పోగానే రెండు చేతులూ ఎత్తి నమస్కారం చేస్తూ నాకు ఇక్కడ చాలా బాగుంది. పిల్లలు అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు. కానీ ఇంటి దగ్గర మా అమ్మ నాన్నలు ఎలా వున్నారో అనే బెంగగా వుంది అన్నారు. ఈ విషయాలు ఆలోచించద్దు. వాళ్లు బాగానే వున్నారు. ఇక్కడ నువ్వు బాగుండి అని చెప్పి వెళ్ళిపోయాను.
నెల రోజుల తర్వాత ఆమెను మాట్లాడడానికి నా రూంకి పిలిపించాను. నమేన్త అమ్మా అంటూ లోపలికి రాగానే తలెత్తి పైకి చూశా. నా కళ్ళు నమ్మలేదు. నెల రోజుల క్రితం చూనిన అమ్మాయేనా అనే అనుమానం నా కళ్లు మోసం చేస్తున్నాయా నన్ను అనే అనుమానం. అలా చూస్తూ నోటి నుండి మాట రాలేదు. అలా చూస్తూనే నా ప్రక్కన కుర్చీవైపు చూపిస్తూ ూర్చోమని చెప్పాను. ఆమె ముఖంపైన వున్న నలుపు పోయింది. మంచి కలర్ వుంది. ఆ నవ్వు మరింత అందాన్ని తెచ్చి పెడుతుంది. చక్కగా అమరిన డ్రస్సు, స్టయిల్ జడ, సుతి మెత్తని చేతులు అమాయకంగా చూస్తూ వుంటే మరింత అందంగా కనబడుతుంది. ఒక్కసారి నన్ను నేను సవరించుకుంటూ ఎలా వున్నావు తల్లీ, ఇక్కడ అంతా బాగానే వుందా? అంటూ అడిగాను. అంతా బాగుంది అని మాత్రమే చెప్పింది. మరి రెండు రోజులు తర్వాత హాస్టల్లో తయారు కాక మాసపత్రిక నా టేబుల్ మీద వుంది. అది ఎడిట్ చేయాలి. తప్పులు ఏమైనా వుంటే సరి చేని ఇన్తే రాష్ట్రంలోని అన్ని జిల్లా ంద్రాలకు ఈ మాస పత్రిక పోతుంది. నాకు ూడా ఈ మాస పత్రికను చూడడం ఆతృతగా వుంటుంది. కాబట్టి వెంటనే ఆ పనిమీద వున్నా. ఈ నెలలో కొత్తగా అందంగా కలర్ఫుల్గా వుంది. 22 పేజీలు వుంటే అన్ని పేజీలు రకరకాల డిజైన్‌తో అందంగా వుంది. తప్పొప్పులు సరిచేని టీచర్కఇచ్చి చాలా బాగుంది. వెరీగుడ్ అన్నాను. మిగిలినవి ఇలాగే చేయండి అన్నాను. వెంటనే టీచర్ ఈ డిజైన్స్, కలర్స్ అన్నీ అనంతమ్మ వేనింది అన్నారు. నేను ఆశ్చర్యంగా వెంటనే మొదట వారి ఇంటి ముందు వేనిన ముగ్గులు గుర్తుకు వచ్చాయి. ఎలా చదువుకుంది అని అడిగితే చేతివ్రాత బాగుంటుంది. శ్రద్ధగా ఏదైనా నేర్చుకుంటుంది అని చెప్పింది. ఎక్కడో నాలో నాకు గర్వంగా అనిపించింది. ఈ ఫీలింగ్ గొప్పగా వుంది.
రెండు నెలల తర్వాత మా కార్యాలయంలో సమావేశం మా నిబ్బంది అంతా ఒచోేట చేరాము. మా నిబ్బందిలో ఒకమ్మాయి ఉద్యోగానికి రాజీనామా చేని వెళ్ళిపోతుంది. ఈ సందర్భాన్ని ఘనంగా చేసుకోవాలనుకున్నాం. హాస్టల్ పిల్లల్ని, మా నిబ్బందిని పిలిచి సందర్భాన్ని చెప్పి ఆ అమ్మాయి గురించి, తెలియచేని మా పద్ధతిలో అంతా చేనిన తర్వాత రిలీవ్ అవుతున్న అమ్మాయితో డాన్స్ చేయించాలి అనుకున్నాం. ఆమె కొంత నిగ్గుపడి కొంచెం లేని కూర్చుంది. నేను హాస్టల్ పిల్లలను పేరు పేరున పలికి రమ్మంటున్నాను. అందరూ రాము మాకు రాదు అంటున్నారు. అనంతమ్మను మాత్రం పిలవలేదు. అందరినీ పిలిచిన తర్వాత ఆమెను మాట వరుసకి రమ్మని చెప్పాను. వెంటనే వచ్చింది. బీట్ సాంగ్‌కి చక్కటి డ్యాన్స్ చేనింది. పాట మొత్తం ఆగకుండా అలా అలౌకగా తన శరీరాన్ని మూమెంట్స్‌తో ఊపుతుంది. చాలా అందంగా అనిపిస్తుంది నాకు. కంటి రెప్ప వేయకుండా చూస్తూ వుండిపోయాను. మా నిబ్బంది, పిల్లలు ఈలలు వేస్తూ రిేంతలు వేస్తున్నారు. పాట అయిపోయింది. నేను మాత్రం ఆమెనే ఆశ్చర్యంగా నాకు తెలియకుండానే గట్టిగా చప్పట్లు కొడుతున్నా అలాగే డ్యాన్స్ అయిపోయింది. ూర్చున్నాం ూడా. నేను చప్పట్లు కొడుతూనే వున్నాను. వెరీ గుడ్ రా చాలా బాగా చేశావు. ఎక్కడ నేర్చుకున్నావు అంటూ అడిగాను. ఎక్కడ నేర్చుకోలేదు అంది. ఎన్ని కళలు వున్నాయి. ఆ అమాయకపు చిన్ని తల్లికి. మట్టిలో మాణిక్యం కదా ప్రోత్సహిన్తే ఎంతవరకు అయినా రాణించగలదు అనిపించింది.
ఇది జరిగిన 10 రోజులకు హాస్టల్‌కి శెలవులు ప్రకటించాము. చివరి రోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టుకున్నాం. పిల్లల తల్లిదండ్రులు వచ్చారు. వారందరితో మాట్లాడి పిల్లలను పంపాము. అనంతమ్మ తల్లిదండ్రులు రాలేదు. ఏమైందని స్ట్రైక్ కదా వస్తున్నాం అన్నారు. అన్నట్ల 1 గంటలో వారు హాస్టల్ దగ్గర వున్నారు. రావాల్సిన టైంకు రాలేదు. లేటు అయిపోయిందమ్మా క్షమించండి అంటూ ఆ వృద్ధ దంపతులు రెండు చేతులతో దండం పెడుతూ అక్కడ ఎక్కడో కూర్చున్నారు. మొదట నీళ్లు ఇచ్చి ఏమైనా తిన్నారా అంటే లేదమ్మా అన్నారు. తినడానికి అన్నం పెట్టి తీరికగా మాట్లాడుకుందాం అన్నాను.
నెమ్మదిగా వచ్చి ఎక్కడైనా సంతకం పెట్టాలా అమ్మయ్యా అన్నారు మల్లికార్జున రిజిష్టర్‌లో పెట్టమన్నాను. సంతకమా ఒప్పితమా అన్నాను. నేను ఆ కాలంకు 1950 నాటికి 3వ తరగతి చదువుకున్నాను అన్నాడు. నాకు సంతకం వచ్చు అన్నాడు. సంతకం పెట్టి ఆయనతో మాట్లాడుతూ వున్నాను. ఇంకా చదువుకోవాల్సింటివి ఎందుకు చదువు ఆపేశావు అన్నాను. మనకు స్వరాజ్యం వచ్చిన తర్వాత దేశం కరువుతో అల్లాడి పోయింది. తిండికి జరిగేది కష్టం. అందు నన్ను చదువు మాన్పించి పనులకు పంపేవారు. కొంతకాలానికి పెద్దోల్ల ఇంట్లో జీతానికి పెట్టారు. రోజూ బువ్వ పెట్టి సంవత్సరానికి 4 రూపాయలు జీతం ఇచ్చేవారు. అది ఆ కాలంలో ఎంతో గొప్ప అని చెప్పుకుంటూ వచ్చారు. నేను ూడా అవునా అంటూ అడుగుతుంటే మరింత ఉత్సాహంతో తెలుసా అమ్మా నేను పుట్టినాకా గాంధీ, నెహ్రూ ఈ పెద్ద పెద్ద నాయకులు అందరూ వున్నారు. ఆ కాలంలో మనకు నీళ్లు లేవు. ఇప్పుడు వున్న ప్రాజెక్టులు అప్పుడు తెచ్చినవే. వాటిలో మట్టి పనులు చేయడానికి నేనూ వెళ్ళాను. ఈ కాలంలో లాగా జె.ని.పి.లు, ప్రొ్లన్లు లేవు. మనుషలమే ఎంత దూరం అయినా తవ్వి మట్టి మోనేవాళ్లం. అందు ఆ కరువుకాలంలో పంటలు పండకపోయినా ఈ విధంగా చేనిన పనులతో తిండి గడిచి పోయేది అన్నారు. ఆ కాలంలో నా పెళ్ళి 1600/- రూపాయలు ఖర్చుపెట్టి చేసుకున్నాను. మా మాదిగోల్ల ఇంట్లో ఇంత డబ్బు పెట్టి జరిగిన పెళ్ళిని గొప్పగా అందరూ చెప్పుకునేవాళ్లు. మీ భార్య వాళ్లు కొత్త బంధుత్వమా అని అడిగాను. లేదమ్మా మా పక్కిల్లే అన్నాడు. ముని ముని నవ్వులతో. మీది ప్రేమ వివాహమా అని అడిగాను. నవ్వుతూ ముఖం క్రిందకు దించుతూ అపుడు ఆ కాలంలో చెవిగిత్తనాల వుంటలు పెట్టి నన్ను ఆకర్షించింది అన్నాడు. వెంటనే ఆ పెద్దావిడవైపు చూశాను. వెంటనే అతను ఇప్పుడు ఇలా వుంది కానీ అమ్మా ఆ రోజులలో బాగుండేది. లావుగా, వెంట్రుకలు పొడవుగా ూర్చుంటే క్రింద పడేవి అంత అందంగా వుండేది అని చెబుతుంటే ఆ పెద్దావిడ ముని ముని నవ్వులు నవ్వుతూ తల వంచి ూర్చుంది. ఇదంతా చెబుతూ ఆ రోజు యంఆర్ఓ గారితో వ్రాయించిన లెటర్ చూపిస్తూ నాకు పెన్షన్, కానీ ఇల్లు కానీ, బియ్యం కానీ ఏమీ రాలేదు అమ్మా అన్నారు. మరోసారి అని చూని ఈ వారంలో మీ మండలంకు వచ్చి సారు వాళ్లతో మాట్లాడుతాను మీరు వెళ్లండి అన్నాను. అంతే సున్నితంగా అదే అమ్మా అంటూ మేము వెళ్తాము ఎందుకంటే బస్సులు లేవు బంద్ కాబట్టి ఉరవకొండ మీద వెళితే ఆటోలు వుంటాయి. లేదంటే కరకముక్కల దగ్గర దిగి 5 కి.మీ. నడవాలి అంటూ తన వెంట తెచ్చుకున్న సంచిని ఎత్తుకుంటూ నమస్కారం చేని అనంతమ్మ చేయి పట్టుకుని బయలుదేరారు. నేను లేచి అనంతమ్మను పట్టుకుని కాలుకి వున్న వెండి గాజులు, మెడలో వున్న దండ ఇప్పుడైనా తీనివేయవచ్చు కదా అన్నాను.
లేదమ్మా ఈ దండను తీనేన్తే పాపకు ఆరోగ్యం పాడైపోతుంది. ఈ దండలో ఏమీ లేవు అంటూ చూపించింది. 14 పూసలు, 7 బొట్టు బిల్లలు లాగా వుండే దేవుడి బొమ్మలు తెల్లదారంలో వున్నాయి. ఈ దారం మాత్రమే బయట కనబడుతుంది. ఈ పూసలు అన్నీ డ్రస్సులో వేని పిన్నీ పెట్టింది. మేము ఈ విషయం కొనసాగించలేదు. అనంతమ్మ మా అమ్మనాన్నలకు కనీసం పెంన్షన్ అయినా వచ్చే విధంగా చూడండి. దాంతో వారు ఎలాగోలా బ్రతికేస్తారు. నేను మీ హాస్టల్లో వుండి 10వ తరగతి పాసైనా ఏదో ఉద్యోగం సంపాదింస్తా అంటూ ధైర్యంగా చెప్పింది. మీ నాన్నకు ఏదో ఒకటి చూస్తాను అన్నాను. అనంతమ్మ కళ్లనిండా నీళ్లు పెట్టుకుని వెళ్ళి వస్తాను అక్కా అంటూ వాళ్ల అమ్మానాన్నల వెంట శెలవుల కోసం ఇంటికి వెళ్ళిపోయింది.
చాలా బాగా రాశారు. అనంతమ్మని ,ఆమె పేరెంట్స్ ని చూడాలని ఉంది. మాధవి గారు చాలా గొప్పగా డాక్యుమెంటేషన్ ఇది.