ఎంగిలాకు వొకటి ఎగురుకుంటూ వచ్చింది. నన్నెవరు తింటారు అని నాలుగు దిక్కులూ చూసింది. ఆకుమీద అన్నం మెతుకులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆకాశమ్మీది మెరుపు నేలమీదలాె వచ్చిందా? అనుకుంది పిల్లకాకి. నింగి నుంచి నేలకు కావ్కావ్ అంది తల్లికాకి. పిల్లకాకి కా-కా అని వంత పాడుతూనే ఒక్కో మెతుూ నోటితో ఏరుకు తింటోంది. తల్లికాకి మాత్రం కావ్…కావ్ మని అరుస్తూ తోటి కాకుల్ని పిలుస్తూ చుట్టూ చూస్తోంది. అమ్మా, మనం సంపాదించింది మనమే తినాలి గానీ దొరికిన విస్తరాకుతో మనోళ్లందరికీ పెళ్లి భోజనం పెడతావేంటి? అన్నది పిల్లకాకి. ఆ గోలలో కా…కా మంది. ‘ఒక్కళ్లమే అంటే అది ఎంగిలాకు, పదిమందిమి అంటే పెళ్లి విస్తరాకు’ చెప్పి నవ్వింది తల్లికాకి. ఇంతలో భౌ…భౌమంటూ ఎంగిలాకు మీద పిడుగులా పడిందో కుక్క. కాకులన్ని చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి. ఇప్పుడేమయిందో చూడు… అంది పిల్లకాకి. నువ్వే చూడన్నట్టు చూసింది తల్లికాకి. ఒకటి వొకటి నాలుగు కుక్కలు చేరాయి. అంతకన్నా ముందు భౌ…భౌమంటూ ఒకదాన్నొకటి రానివ్వకుండా తరుముకున్నాయి. ముందే వచ్చిన కుక్క కన్నా బలిసిన బలమైన కుక్క చివరకు తిండి దక్కింది. కొంతసేపటికి పిల్లకాకి నోరెళ్లబెట్టింది. ‘చూశావా లోకం బలవంతుల వడ్డించిన విస్తరయితే, బలహీనులంతా ఆకలితో చచ్చిపోవలసినదేనా? తల్లికాకి అడిగింది. పిల్లకాకి కా… అనడం కూడా మర్చిపోయింది. ఎవరికి తిండి దొరికినా అది అందరూ పంచుకుంటే అప్పుడు ఆకలి బాధలు ఉండవు అని తల్లికాకి చెప్తూ చూసింది. బలంగల కుక్క విస్తరి మీద కాలుపెట్టి గర్వంగా చూస్తోంది. ఈ బలం.. ఈ బలుపు ఎప్పటికీ ఉండిపోవు. ఎవరైనా కాలంతోపాటు కరిగిపోవాల్సిందే. తల్లి చెప్పకముందే పిల్లకాకికి అర్థమైంది. ఒక్కో కుక్క ఆరు మాసాలు ఏమి తినకుండా అలాగే ఉండటం మీకు తెలుసా? అంది మరో కాకి. ఛీ… కుక్క బతుకు మనకొద్దు అంది ఇంకో కాకి. మనుషుల పనే బాగుంది ఎంచక్కా… పిల్లకాకి మాట పూర్తికాలేదు. ఛీ కాకుల కంటే హీనం అన్నాయి కాకులన్ని ఒ గొంతుతో. ఉలిక్కిపడి చూచింది పిల్లకాకి. మనుషులు దాచుకుంటారు తరాలు తిన్నా తరగనంత… అంతూపొంతూ లేనంత. దాచుకోవడానికి, దోచుకోవడానికి ూడా వెనుకాడరు. అందు మనుషుల్లోనే ఆకలి. ఆ మాట కుక్కని ఉద్దేశించి అన్నదో మనిషిని ఉద్దేశించి అన్నదో పిల్లకాకికి అర్థం కాలేదు. ఇంతలో దూరంగా కా…కా… అంటూ పిలుపు. ఆ పిలుపు వైపు కాకులన్ని ఎగిరిపోయాయి. వాటి వెంటే తల్లికాకి, దాని వెంట పిల్లకాకి. ఇదిగో పిల్లా మనప్పుెడూ తిండికి ఢోకా లేదు అంటూ తల్లికాకి ఉత్సాహంగా రెక్కలాడించింది. పిల్లకాకి నవ్వుతూ చూసింది.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags