చూస్తు చూస్తు ఏమైంది నా ప్రపంచానికి
ఇంత అంధకారంలో ఉంది
అసలు భానుడున్నాడా…? లేడా…?
ఏమో… ఎవరికి తెలుసు…?
ఈ రోజేదైనా సూర్యగ్రహణమా…!
నాౖతే అలా అనిపించట్లేదే…
అయినా నిన్నటి దాకా బాగానే ఉందిగా…
మరి ఇవాళ ఏమైంది.
ఓ¬… మర్డర్లు, మానభంగాలు
రేపులు, హత్యలు, కిడ్నాప్‌లు
కాల్చివేతలు, ఉరితీతలు
కులమతవైరాలు ఇవా.
దీనికి కారణం ఇదేనా అసలు విషయం
అదిగో అటు చూడు… ఏమిటి
వింత… ఎక్కడ లేని వెలుగు
అక్కడుందేంటి? చూడ్డానికి
మనుషుల్లా ఉన్నారే…
ఎవరు వాళ్లు వాళ్ల పేర్లేంటి.
బుద్ధుడు, వివేకానందుడు
వాళ్ళేనా…
నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
మరణం పొందిన గాంధీ
మళ్ళీ వస్తున్నాడే…
అదిగో అటుచూడు
ప్రపంచాని వెలుతురొచ్చింది.
అంటూ మూడు కాళ్ళ ముసలయ్య
చెట్టూచేమలతో, గుట్టపుట్టలతో,
జీవజంతువులతో మాట్లాడుతుండగా…
మనసు కరిగి
శాంతి పెరిగి
హింస తరిగి
ప్రాణం పైకొచ్చి
గగనం డభీలుమని కిందకొచ్చి
హరివిల్లు బాణమై
శాంతిని నెలకొల్పింది.
జీవహింస పాపమని
పొడుపుచుక్కలా వికసించింది
నా మనస్సు
కలకాలం ఎగిరే కాకిలా
కాలం పైకొచ్చేకొద్ది
నా మనస్సు ఆలోచిస్తూనే
ఉంది…
కొండంత ఆశయాలతో
మళ్లీ మళ్లీ జన్మించాలని ఉంది
ధనవంతుడిగా కాదు
కష్టాన్ని నమ్మే
కాడినెత్తుకునే కర్షకుడిలా…
-
Recent Posts
Recent Comments
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
April 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
