సాంతిేకమా!
నీకు సాష్టాంగ నమస్కారం
పశ్చిమ దేశంలోని పనివాడిని
పక్కనే చూపావు
మనవడితో
రోజంతాపనే
అలసటలో
అద్వైత భావం
అబ్బరాల వదనం
అవ్యక్త ప్రకటనం
అబ్బో
ఇది అనుకోని కవిత్వం!!
చందమామలా
ఉన్నాడంటారు
అబద్దమంటే
ఇదే మరి!!
నీ హాసవిలాసాల్లో
కాళిదాసు
అనిమిత్త హాసాలకు
దొరికింది అడ్రసు
అతడు గొప్ప నిఘంటుకారుడు
మా వాడి మాటలకు
అర్థం చెప్పమనండి చూద్దాం!!
నవ్వుల మీద
పరిశోధన
పి.హెచ్.డి. చేస్తున్న
పని పండితుడు
మూని పెట్టిన
పిడికిళ్ళలో
ఎన్ని జన్మల రహస్యాలో
చెప్పుకోండి
చిన్ని పెదవుల్లో
ఎన్ని రాగాలో
ఎత్తుకోమని
ఎన్ని వేడుకోలో!!
మడత పెట్టిన
పట్టుచీరలా
ఒళ్ళో ఎంత మెత్తగా
ఉన్నాడో
పాల కడలిని
నాలుకతో చిలుకుతారా
ఇదిగో
వీడున్నాడుగా!!
కృష్ణడికి
గుప్పిళ్ళలోనే వెన్న
వీడికి
ఒళ్లంతా వెన్నే
వాడు నిలబడితే
నీటిలో పద్మం
కూర్చుంటే
పద్మంలో బ్రహ్మ
వాడి నవ్వుల్లో
దొర్లే గమకాలకి
శాస్త్రాలు చాలవు
అనువాదాలు లేవు
మనవడి కళ్ళు
మమతల వాకిళ్ళు
తపతపల కాళ్ళు
తామరతూళ్ళు
-
Recent Posts
Recent Comments
- కొత్తపల్లి రవిబాబు on ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ
- K. SriKiran on వలసాంధ్రలో స్త్రీల పత్రికలు : తెలుగు జనానా (1893-1907) -డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
- Usha Rani Vongur on తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
August 2026 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
