పాకిస్తాన్ స్త్రీవాద కవయిత్రి
ఫాతిమాహసన్
(నా కళ్ళల్లో, కురుల్లో, చెక్కిళ్లపై చూడకండి
నా ధ్యానంలోకి, నా భావాల్లోకి నన్ను చూడండి.)
నా కూతురు నడక నేర్చుకుంది
మైలు రాయి అంకెల గుర్తులకావల
రహదారుల చిరునామాలకావల-
చదవడం నేర్చుకుంది.
ఆరిపోతూ వెలిగే రంగుల కాంతిలో
ప్రయాణపు సరిహద్దులు దాటి
బండి చక్రాల్లో చిక్కుకున్న దారుల్లో
ముందుకెళ్ళడం నేర్చుకుంది.
నా కూతురు
ప్రపంచపటంలో-
తనకిష్టమున్న రంగులు-
నింపడం నేర్చుకుంది,
నా కూతురు
నా వేలు విడిచి నడవడం నేర్చుకుంది!