మతమంటే…
మరో మనిషి పట్ల సద్భావనయని
మనో వికారాల సంస్కరణయని
మంచి చెడుల మధ్య కంచెయని
మమతను పెంచే నిరంతర ప్రయత్నమని
మనమనే భావనకు తొలి బీజమని
మానవ సేవకు సరైన త్రోవయని
మానవాళి సుఖసంతోషాల కోరికకు రూపమని
మనసున నెలకొనే బలమైన నమ్మకమని
మానవతను మనలో వెలిగించే దీపమని
మానవ జాతి వికాసానికి దిశానిర్దేశమని
మనిషి మనుగడకు తీరైన రూపకర్త యని
మనిషిని మనిషిగా నిలిపి ఉంచే ధర్మమని
మతం శాంతిని తప్ప మరేదీ కోరదని
మతం సామరస్యాన్ని తప్ప దేన్నీ ప్రోత్సహించదని
ముందుగా మీరాకళింపు చేసుకుని, ఆ పై
మీ బిడ్డల కీ భావాల్ని స్తన్యంతో అందించండి తల్లులారా!