చిన్నతనంలో చిట్టి చిట్టి అడుగులేసి పాపాయి
పెరిగి పెద్దయి అన్ని బాధ్యతలను తీసుకున్న అమ్మాయి
అన్నిటిలో ఎవరికీ తక్కువ కాదు అని తన ప్రతిభను
చాటి చెప్పే అమ్మాయి మన చెల్లాయి.
చెల్లిగా, అక్కగా, కూతురిగా, అమ్మగా, భార్యగా తన
బాధ్యతలను ఓర్పుతో, నేర్పుతో మెలిగే అక్కాయి.
అందంలోనే కాదు మగవారితో సమాన హక్కుగల అమ్మాయి
ఈనాడు స్త్రీమూర్తిగా మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా
ఎన్నడు భయపడని అమ్మాయి
ఎన్ని కష్టాలు తనకు ఎదురువచ్చినా ముందుకు అడుగువేసే అమ్మాయి మన స్త్రీ