లింగభత్తిని మల్లయ్య
ఇందిరా జైసింగు మనదేశంలోని ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరు. భారతీయ మహిళాలోకంలో ఆమెకంటూ ఒక ప్రత్యేకత
ఉంది. సంఘసేవలో అంకితం కావడమే ఆమెకు ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ”ప్రజా ప్రయొజనాల కోసం ఆమె చేసిన
న్యాయపోరాటమే” ఆమెకు వన్నె తెచ్చింది. మహిళల సమస్యలు, మహిళలపై సాగుతున్న వివక్ష, మహిళా
హక్కుల సాధికారత, భోపాల్ గ్యాస్ బాధితుల కోసం, పర్యావరణ సమతుల్యానికి కాటకాలవుతున్న ఫ్యాక్టరీల మీద,
శ్రామికుల హక్కుల కోసం న్యాయపోరాటం వంటివన్నీ ఆమె న్యాయసేవలో కొన్ని మైలురాళ్లు.
ఇందిరా జైసింగు 1940లో ముంబాయిలో పుట్టారు. పాఠశాల చదువు ముంబాయిలోనే మొదలైనప్పటికీ
గ్రాడ్యుయేషన్ చేసేటప్పటికి తన నాన్నగారి ఉద్యోగబదిలీ రీత్యా బెంగళూర్‌కు మారారు. 1962లో ”లా” పట్టా
తీసుకున్నారు. 1986లో ఆమె సీనియర్ న్యాయవాది అయ్యే నాటికి బాంబే హైకోర్టు చరిత్రలో మరే మహిళ కూడా
ఈ స్థాయికి చేరలేదు. బాంబే హైకోర్టులో మొదటి మహిళా సీనియర్ న్యాయవాదిగా రికార్డు ఆమె సొంతమైంది.
ఇందిరా జైసింగు తన న్యాయవాద వృత్తి ప్రారంభించకముందు సామాజిక సేవా కార్యక్రమాల్లో, సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ
బాలికలను, మహిళలను దేశభక్తి పట్ల చైతన్యవంతుల్ని చేసేది. న్యాయవాద వృత్తి ప్రారంభించినప్పటికి కూడ సామాజిక
సేవా కార్యక్రమాల పట్ల మక్కువ తగ్గలేదు. మానవహక్కులు, మహిళల హక్కులు, నిరుపేదలైన శ్రామికుల హక్కుల
కోసం శ్రమించారు..మహిళల మీద సాగుతున్న వివక్ష కేసులను ఎక్కువగా వాదించేవారు. కేరళకు చెందిన మేరీరాయ్
కేసు ఇలాంటిదే. ఆమె మొదటగా వాదించిన లైంగిక వేధింపుల కేసు ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ కె.పి.ఎస్. గిల్‌ది. ”ఆయన
ఒకసారి ఉన్నతస్థాయి అధికారులు హాజరైన ఫంక్షన్‌లో మహిళా ఐ.ఎ.ఎస్. అధికారిణి పట్ల అనుచితంగా ప్రవర్తించిన
సంగతి తెలిసిందే”. ఈ సంఘటనలో అప్పటివరకు లైంగిక వేధింపులు ఉన్నతస్థాయి అధికారులలో ఉండవన్న
అభిప్రాయానికి తెరపడింది.
హిందూ చట్టం ప్రకారం మైనారిటీ తీరని పిల్లలకు తల్లి సహజ సంరక్షకురాలు అని వాదించి దానిని ఆచరణ బద్దం చేశారు.
పూర్తిగా తల్లి సంరక్షణలోనే పెరుగుతున్నప్పుడు రికార్డులన్నీ తల్లి పేరుతోనే కొనసాగాలని ఆమె కేరళ హైకోర్టులో గట్టిగా
వాదించారు.
భారతీయ విడాకుల చట్టంలో ఉన్న లోటుపాట్లను తీవ్రంగా నిరసించారు.
ఇ భోపాల్ పేలుడులో బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం ఇప్పించడానికి అమెరికన్ మల్టీనేషనల్
కంపెనీ మీద వేసిన కేసును ఆమె సుప్రీంకోర్టులో వాదించి బాధితులకు న్యాయం జరిగే విధంగా తీర్పు రావడానికి
దోహదపడ్డారు.
ఇ పర్యావరణ సమతౌల్యానికి కంటకంగా మారిన ఫ్యాక్టరీల కొనసాగింపును సవాల్ చేసి ఆ కేసులను
స్వయంగా వాదించేవారు.
ఇలా ఆమె చేపట్టిన ప్రతి కేసులోనూ వ్యక్తిగత ప్రయొజనాల కంటే సామాజిక ప్రయొజనాలే ఎక్కువగా ఉండేవి. ఆమె సక్సెస్
వెనుక దాగిన రహస్యం కూడా అదే. ఇలా ఆమె తన జీవితాన్ని న్యాయవాద వృత్తికే అంకితం చేశారు.
న్యాయవాదులు తమ అభిప్రా్యాలను, భావాలను, సమస్యలను పరస్పరం చర్చించుకోవడానికి ఒక వేదిక కావాలని
భావించిన జైసింగు ”లాయర్స్ కలెక్టివ్” అనే సంస్థను స్థాపించి సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. 1986లో ”ది
లాయర్” పేరుతో మాసపత్రికను స్థాపించారు. అందులో భారతీయ న్యాయవ్యవస్థలో ఉన్న సామాజికన్యాయం, మహిళల
సమస్యలు, వాటిని పరిరక్షించడానికి ఉన్న మార్గాలను చర్చించేవారు.
అనేక జాతీయ అంతర్జాతీయ కాన్ఫరెన్సులలో మనదేశానికి ప్రతినిధిగా ఆమె హాజరయ్యారు. లండన్‌లోని ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్ ఫెలోషిప్‌కు ఎంపికయ్యారు.
అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో స్కాలర్, రోటరీమానవ్‌సేవా అవార్డులతో పాటు ఆమె ప్రజా ప్రయొజనాల కోసం
చేస్తున్న కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2005లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
విద్యార్థినులు, మహిళలు, మహిళాస౦ఘాలు ఇందిరా జైసింగును ఆదర్శంగా తీసుకొని తమ ప్రత్యేకతను ప్రదర్శించాలని
ఆశిస్తూ…
ఇందిరా జై సింగు గారి గురించి మాకు తెలినదికాదు. మగాల్ల హక్కులను, స్త్రీలకు న్యాయం పేరుతో కాల రాసే, గృహహింస నిరొదక చట్టాన్ని చేయడంలో ఆమె పాత్రా తెలుసు.
ఒక్క చట్టం స్త్రీల కొసం వస్తేనే గగ్గోలు పెట్టే మగవారికి అంత అభధ్రతాభావం ఎందుకో?