ఆ రెండు సినిమాలు – రెండు ఆత్మగౌరవ పతాకలు! – పరేశ్‌ ఎన్‌. దోశి

ఒకానొక రాత్రి పార్టీలో కలిసిన ముగ్గురు యువకులతో ఆ ముగ్గురు యువతులు డ్రింక్స్‌ తీసుకుంటూ, నవ్వుతూ తుళ్ళుతూ ఉన్నప్పుడు జరుగుతుంది అది. చొరవ తీసుకుని, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా, వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించి లొంగదీసుకోవా లనుకుంటారు ఆ యువకులు. ఆ ముగ్గురిలో ధైర్యవంతురాలైన ఒక యువతి మినాల్‌.. ప్రతిఘటిస్తున్నా వినిపించుకోని యువకుడ్ని వేరే గత్యంతరం లేక చేతికందిన బాటిల్‌తో ముఖాన కొడుతుంది. కంటి దగ్గర గాయమై రక్తమోడుతున్న అతన్ని వదిలి, మిగిలిన ఇద్దరు స్నేహితురాళ్ళని (పలక్‌, ఆండ్రియా) తీసుకుని బయటపడుతుంది మినాల్‌.

జరిగింది పీడకలగా మర్చిపోయి ముందుకు సాగాలను కుంటారు ఆ ముగ్గురు యువతులూ. కానీ ఆ యువకులు తమ ఇంకొక స్నేహితుడితో కలిసి వాళ్ళను వదిలిపెట్టకూడదని కక్ష కడతారు. ఆ యువతులకు వాళ్ళ హద్దు (ఔకాత్‌ అంటే స్టేటస్‌) ను గుర్తు చేయాలనుకుంటారు. ఆ యువతులు అద్దెకుండే ఇంటి యజమానికి ఫోన్‌ చేసి వాళ్ళచేత ఇల్లు ఖాళీ చేయించమని బెదిరిస్తారు. ఆ యువతులకు కూడా ఫోన్‌ చేసి బెదిరించడమే కాక వెంబడిస్తారు. మినాల్‌ని కారులోకి లాగి, వెళ్తున్న కారులోనే ఆమెపై అత్యాచారం చేసినంత పనిచేస్తారు. దీంతోే ఇక ఆ యువతులకు వారిపై పోలీసు కేసు పెట్టక తప్పని పరిస్థితి. అక్కడినుంచి పోలీస్‌ స్టేషన్లలో పనితీరు, వ్యవస్థ ఇవన్నీ ముందుకొస్తాయి. అభియోగి రాజవీర్‌ ఒక రాజకీయ నాయకుడి కొడుకు. ఈ కేసు నమోదు కావడం గురించి పోలీసులు వారికి ముందే చెప్తారు. దీంతో రాజకీయ నాయకుడు చెప్పినట్లు ఆ యువతుల మీద పాత తేదీతో ఒక కేసును (హత్యా ప్రయత్నం) నమోదు చేస్తారు.

ఇప్పుడు ఈ విషయాన్ని చర్చకు పెట్టాలంటే కోర్టు రూం డ్రామా కంటే సులువైన పద్థతి ఏముంది?

అప్పుడు వస్తాడు దీపక్‌ సెహగల్‌ (అమితాబ్‌ బచ్చన్‌) అనే లాయర్‌. వాళ్ళ పక్క భవంతిలోనే ఉండే దీపక్‌ వాళ్ళను గమనిస్తుంటాడు. మినల్‌ని ఆ యువకులు కారులో ఎత్తుకెళ్ళడం చూసి పోలీసులకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేస్తాడు. అతను ఇప్పుడు కోర్టులో ఆ యువతుల తరపున లాయర్‌.

డ్రింక్స్‌ తీసుకునే అమ్మాయిలు మంచి కుటుంబంలో నుంచి వచ్చినవారు కాదని, సంస్కారవంతులు కాదని, అలాగే రాత్రి సమయాల్లో పార్టీలకు వెళ్ళేవారు, మగవాళ్ళతో నవ్వుతూ మాట్లాడే వాళ్ళు, జీన్స్‌, స్కర్ట్‌లు వేసుకునేవాళ్ళు మంచి వాళ్ళు కాదనే నమ్మకాలూ, అభిప్రాయాలూ మన సమాజంలో బలంగా ఉంటాయి. దీని దృష్ట్యా కోర్టులో కనుక ఆ యువతులు అలాంటి వారేనని నిరూపించగలిగితే, వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని, డబ్బుల దగ్గర తేడాలొచ్చి వాళ్ళలో ఒక యువతి హత్యా ప్రయత్నం చేసిందని నిరూపించడం తేలికవుతుంది.

ఒక స్త్రీ… ఆమె భార్యయినా, వ్యభిచారి అయినా, ప్రియురాలయినా, ఎవరైనా కావచ్చు. ఆమె అంగీకారం లేకుండా, ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెపై దౌర్జన్యం చేస్తే దాన్ని అత్యాచారంగానే గుర్తించాలి. ఆమె ”నో” అంటే ఆ మాటకు ఒక్కటే అర్థం. అది మగవాళ్ళంతా అర్థం చేసుకోవాలి. ఇవీ కేసులో తన వాదన ముగించాక దీపక్‌ చెప్పే చివరి మాటలు.

ఈ సినిమా ఏ విషయం చెప్పదలచుకుంటున్నదన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా మంచి సినిమా. అందరి నటనా (ముఖ్యంగా యువతులది) చాలా చక్కగా ఉంది. అనురుద్ధ రాయ్‌ చౌదరి దర్శకత్వం కూడా చెప్పదలచిన విషయం వైపుకే కథను నడిపిస్తుంది. కథనం చూసేవారిని కట్టిపడేస్తుంది. మగవారి ఆలోచనల్లో మార్పు తేగలిగితే ఈ సినిమా విజయం సాధించినట్లే.

కానీ గమనించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. దీపక్‌ ఒక పఱజూశీశ్రీaతీ సఱరశీతీసవతీ తో బాధపడుతున్న వ్యక్తి. అలాంటివాళ్ళు శరీరంలో హార్మోన్లు ఎక్కువైనా, తక్కువైనా అకారణంగానే చాలా దు:ఖంలో కూరుకుపోవడమో, కారణం లేకుండానే చాలా

ఉత్సాహంగా ఉండడమో చేస్తారు. అలాంటి వ్యక్తికే స్పష్టంగా అర్థమవుతున్న విషయం, ఆరోగ్యంగా  ఉన్న సమాజానికి ఎందుకు అర్థం కాదు? వాతావరణ కాలుష్యానికి అలవాటు పడిపోయిన మనుషుల మధ్య దీపక్‌ మాత్రం మాస్క్‌ తొడుక్కునే బైటికి వెళ్తాడు. ఏదో అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తూ, ఒక బాధ్యతగల భర్తగా సేవలు చేస్తుంటాడు. ఈ సందర్భం వచ్చినపుడు ఆ యువతులకు న్యాయం జరగాలని వాళ్ళ తరఫున కేసు వాదిస్తాడు. పితృస్వామ్యంలో ఆ యువతులకు జరిగిన అన్యాయానికి ఆయన పితృస్థానంలో నిలబడి సరిచేయాల నుకుంటాడు.

సినిమాలో ఆ ముగ్గురు యువతులూ ఒక రకంగా  ఒంటరే. వాళ్ళ ఇళ్ళనుండి ఈ కష్టకాలంలో తోడుగా నిలబడడానికి ఎవరూ ఉండరు. పలక్‌ ప్రేమిస్తున్న వ్యక్తి కూడా ఆమెకు సపోర్టివ్వడు. తమ పనులేవో తాము చూసుకుంటూ, తమ కాళ్ళమీద నిలబడిన ఈ ముగ్గురు యువతులూ చాలా ధైర్యస్థులు. కానీ కోర్టులో మాత్రం బేలగా అయిపోతారు. ఎంతటి ధైర్యవంతులైన స్త్రీలనైనా మెడలు వంచి నిస్సహాయ పరిస్థితుల్లోకి నొక్కేసే బలమూ, తెలివి తేటలూ ఉన్న వ్యవస్థ ఇది.

శత్రువు దుర్మార్గుడే కాదు, తెలివైనవాడు కూడా. కోర్టు సీన్‌లో రాజవీర్‌ తన సహజ స్వభావం బయటపడేలా మాట్లాడడంతో కేసు తేలిపోతుంది. ఎమోషనల్‌గా కాకుం డా తెలివిగా ప్రవర్తించి ఉంటే కేసు ఇంత తేలికగా గెలిచే పనేనా? వాస్తవానికి అత్యాచారాల కేసులలో చాలావరకు తగినన్ని సాక్ష్యాధారాలు లేవనో, లేదా వేరే కారణాల వల్లనో కొట్టివేయబడుతున్నాయి.

ఎందుకో 2015లో వచ్చిన ”మసాన్‌” గుర్తుకొస్తోంది..

వారణాసి గంగా నదీ తీరం. సంస్కృత పండితుడు సంజయ్‌ మిశ్రా నదీ తీరంలో ఒక దుకాణం (శ్రాద్ధ కర్మలు వంటివి చేసుకునే వారికి అవసరమయ్యే సరంజామా విక్రయించేది) నడుపుతుంటాడు. అతని కూతురు రిచా చడ్డా చదువుకుంటూ పార్ట్‌టైం పని చేసుకుంటుంది. అదే నదీ తీరంలో శవాలను దహనం చేసే కుటుంబంలో విక్కీ కౌశల్‌ అనే ఒక యువకుడు ఇంజనీరింగ్‌ చదువుతుంటాడు. ఇంటిదగ్గర ఉన్నప్పుడు తండ్రికి శవాలను దహనం చేసే పనిలో సాయపడుతుంటాడు.

సినిమా ఈ రెండు కుటుంబాల కథ. రిచా చడ్డా  ఒక యువకుడ్ని ఇష్టపడుతుంది. ఒకరోజు వాళ్ళిద్దరూ రహస్యంగా ఒక లాడ్జిలో గది తీసుకుని మోహాల మైకంలో తేలిపోతున్న సమయంలో పోలీసులు రైడ్‌ చేస్తారు. పోలీసులు మొబైల్‌లో రిచా చడ్డా ఫోటో తీస్తారు. ఆమె ప్రేమికుడు మాత్రం పరువు పోతుందనే భయం, తండ్రి భయంతో గిలగిల్లాడిపోతాడు. వదిలిపెట్టమని ప్రాధేయ పడతాడు. ఎంతో కొంత తీసుకుని వదిలి వేయమంటాడు. ఇలా చిక్కిన గొర్రెలను అంత తేలికగా వదిలిపెడతారా పోలీసులు? పిరికివాడైన ఆ యువకుడు సందు దొరకగానే విడిపించుకుని బాత్రూంలో దూరి తలుపు వేసుకుంటాడు. తర్వాత నిస్సహాయంగా తన చేతి మణికట్టు వద్ద కోసుకుంటాడు. పోలీసులు అతన్ని ఆస్పత్రికి తీసుకువెళ్ళినా బతకడు. దీంతో వాళ్ళిద్దరూ చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మాయి ఒక్కతే బలిపశువయింది.

నువ్వు లాడ్జికి ఎందుకు వెళ్ళావని పోలీసు అడిగితే ఆమె ”కుతూహలం” కారణంగా అని చెబుతుందే తప్ప ఎటువంటి సిగ్గు, అపరాధ భావాన్ని వ్యక్తం చేయదు. వాళ్ళ నాన్న అడిగినా అదే జవాబు. ూపవ్‌్‌ఎవఅ్‌ ్‌శీ రబఱషఱసవ నుంచి ఆమెను తప్పించాలంటే రెండు నెలల్లో మూడు లక్షలు చెల్లించాలని ఆ పోలీసుకు, ఆమె తండ్రికి మధ్య  ఒప్పందం జరుగుతుంది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో దాచుకున్న లక్ష మొదటి వాయిదాగా  వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిగతా డబ్బు ఎలా సమకూర్చాలా  అన్నది వాళ్ళ సమస్య. దీనికితోడు ఆమెకు కొన్ని అదనపు సమస్యలు. ‘నువ్వు వాడితో పడుకున్నావుగా, నాతో పడుకోవడానికేం’ అనే వేధింపులు. రూ.12 వేల ఆదాయం వచ్చే ఉద్యోగం ఊడడం, వేరే ఉద్యోగంలో చేరితే అక్కడ రూ.5,500 జీతం మాత్రమే రావడం… ఇలాంటి చిన్న చిన్న విషయాలను చాలా సూక్ష్మంగా చూపిస్తాడు దర్శకుడు నీరజ్‌ ఘైవాన్‌ (ఇదే అతని మొదటి చిత్రం).

మరో పక్క తక్కువ కులానికి చెందిన విక్కీ, అగ్ర కులానికి చెందిన శ్వేతా త్రిపాఠి ప్రేమించు కుంటారు. అతని కులం తెలిసిన తర్వాత కూడా అతన్నే చేసుకుంటానని, అవసరమైతే ఇంటినుంచి పారిపోయి వస్తానని, పెళ్ళయ్యాక పెద్ద

వాళ్ళు నెమ్మదిగా చల్లబడతారనీ అంటుంది ఆమె. కానీ దానికి ముందే ఆమె ఒక బస్సు ప్రమాదంలో మరణిస్తుంది. ఆమె శవాన్ని అతనే దహనం చేయాల్సి వస్తుంది.

ఈ రెండు జంటలూ చాలా నిజాయితీగా, స్వచ్ఛంగా, అమాయకంగా, నిర్మలంగా ఉంటాయి. యువతుల విషయానికి వస్తే వాళ్ళిద్దరూ చాలా ధైర్యాన్ని కనబరుస్తారు. రిచా చడ్డా తన బాడీ లాంగ్వేజ్‌తో (నిటారుగా నిలబడే/ కూర్చునే/ నడిచే తీరు, సిగ్గు/ అపరాధ భావం లేశమాత్రమైనా కనబడని తీక్షణమైన కళ్ళు, తడబాటు లేని సూటిగా వచ్చే మాటలు, తనమీద తనకున్న నమ్మకం) అలరిస్తుంది. శ్వేతా త్రిపాఠి కవిత్వాన్ని ప్రేమించే సున్నిత మనస్కురాలు. కానీ తమ మధ్య ఉన్న కులపు అడ్డుగోడల గురించి తెలిసిన తర్వాత ఆమె తీసుకునే నిర్ణయం… అవసరమైతే పారిపోయి అయినా వివాహం చేసుకోవాలి,  తర్వాత పెద్దవాళ్ళని నెమ్మదిగా ఒప్పించొచ్చు.

ప్రతిరోజూ ఎన్నో శవాలు దహనమయ్యే ఆ భూమికలోనే ఈ రెండు ప్రణయ గాథలు (మసాన్‌ అంటే స్మశానం).

ఈ రెండు సినిమాలు పోల్చింది కూడా ఆయా స్త్రీల ధైర్య సాహసాలని, ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని తెలియచేప్పడానికే.

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.