ఎన్. అరుణ
అమ్మ ఒడి నుండి తప్పిపోయి
చదువుల వలలో చిక్కుకున్నాను
నాన్న వేలు పట్టుకొని
నడుస్తున్నట్టే వుంది
హఠాత్తుగా చూసుకుంటే
దారిలో ఒంటరిగా మిగిలిపోయను
తిరునాళ్ళలో పిల్లలు ఆగమైనట్టు
అలనాటి జ్ఞాపకాలు
కలల ఆకాశాలు
ఆశయల సుదరాలు
అన్నీ వెనక్కెళ్ళి పోయయి.
గమ్యం గమనాన్ని నిర్దేశిస్తుందో
గమనం గమ్యన్ని శాసిస్తుందో
తెలియని సందిగ్ధత !
ఎగిరిపోయే కొంగలు
ఏ అస్తమయంలో దగ్దమౌతాయె!
అనంతమైన విశ్వాంతరాళ అంధకారంలో
స్వీయ కాంతి తారకలు
పొడుచుకొచ్చాయిగాని
ఇక సాహసమే యుద్ధం!
జీవితంలో
నానుంచి నేను వెళ్ళిపోతున్నాను
ఎక్కడికి?
బహుశా నాలోకి కాదు గదా!