ఏది సహజం? ఏది అసహజం? ఎవరు నిర్ణయించాలి? – పి. ప్రశాంతి

ఐదు నెలలు నిండ బోతున్న నిత్యకి సీమంతం జరుగుతోంది. పెళ్ళై మూడేళ్ళైంది. నెల తప్పిందని తెలిసినప్పట్నుండి తను వింటున్న మాటలు ఆశ్చర్యమనిపిస్తున్నాయి. తన దృష్టిలో అవి లైంగిక పరమైన మాటలు, సెక్సువల్లీ కలర్డ్‌ భాష… మరి వీళ్ళంతా ఇంత తేలిగ్గా ఎలా వాడగలుగుతున్నారు! పెళ్ళికి ముందు లైంగిక కోరికల విషయాలు మాట్లాడ కూడనివి. పెళ్ళైనాక లైంగిక తృప్తి గురించి బహిరంగంగా చర్చించకూడదు. కాని నెల తప్పితే అందరికీ స్వీట్లు పంచి మరీ చెప్పొచ్చు. నెలలు నిండుతుంటే పెరిగే కడుపు, శారీరక మార్పులతో నిండుగా తయారవుతున్న శరీరంపై కామెంట్స్‌ చెయ్యొచ్చు. ఇవన్నీ అందరూ కలిసి సరదగా మాట్లాడుకోవడం… నిత్యకి మాత్రం అర్థంకాని అసహనంగా

ఉంది.

తనసలు పెళ్ళే చేసుకోవద్దను కుంది. మేనమామ కూతురు సత్య, తను జీవితాంతం కలిసి బతకాలనుకున్నారు. ఊహ తెల్సినప్పట్నుంచి దాదాపు ఇరవైయ్యేళ్ళు ఎంతో సంతోషంగా గడిపారు. ఒకే ఊరు, ఒకే బడి, ఒకే కాలేజిలో చదువుకున్న నిత్య. సత్యలను వారి సంబరాన్ని చూసిన వారంతా వాళ్ళు కవల పిల్లలనుకునేవారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. కాని పెద్దవారి నిర్బంధాలకి తలొగ్గి పెళ్ళిళ్ళై వేరైపోయారు. ఎవరి సంసారం వారిదైపోయింది. నిత్యకి వివాహ జీవితం కూడా బాగుందనిపిస్తోంది. భర్తతో దగ్గరి తనం, ప్రతి రాత్రి సున్నితంగా దగ్గర చేరే భర్తంటే ఇష్టంగానే ఉంది కాని ప్రతిసారి సత్య గుర్తొస్తుంది. ఆడబిడ్డలు, తోటికోడలు వారి జీవితాల్లోని అసంతృప్తుల గురించి ఆ పరిస్థితుల్ని ఎలా మార్చుకోవాలి అవేవి రహస్యంగా మాట్లాడుతుంటే, తను మాత్రం గట్టిగా మాట్లాడబోతే నాలుగ్గోడల మధ్య ఉండాల్సిన మాటలంటూ కోప్పడేవారు. మరిప్పుడు నాలుగ్గోడల లోపలి రహస్యం గర్భం రూపంలో బహిర్గతమౌతుంటే ప్రతి ఒక్కరూ మాట్లాడ్తున్నారు. సంతోషంతో సంబరాలు చేస్తున్నారు. ఇది ద్వంద్వ వైఖరిగా అనిపించింది నిత్యకి.

నెలలు నిండాయి. డెలివరీకి పుట్టింటికెళ్ళిన నిత్యకి ప్రాణం లేచొచ్చిన ట్లైంది. అక్కడ అప్పటికే బాలింతరాలిగా పుట్టింట్లో ఉన్న సత్యని కలిసేసరకి. ఇద్దరికీ సమయం తెలిసేది కాదు. ఒకరినొకరు అంటుకుపోయి గడిపేవారు. ఎన్నేళ్ళైంది!!

పోలీస్‌ సేష్టన్‌లో కూర్చున్న నిత్యకి గతం సినిమా రీళ్ళలా తిరిగింది. పద్దెనిమి దేళ్ళ లైలా మేనత్తకూతురైన ఇరవై ఏళ్ళ షైనీ కోసం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఢిల్లీ వెళ్ళిపోతే మిస్సింగ్‌ కేస్‌ పెట్టారు ఆమె తల్లిదండ్రులు. ఫోన్‌ కాల్స్‌ ద్వారా ట్రాక్‌ చేసి లైలాని ఢిల్లీ నించి తీసుకొచ్చారు పోలీసులు. షైనీపైన కిడ్నాప్‌ కేసు పెట్టారు లైలా తల్లిదండ్రులు. షైనీని కూడా తీసుకురావాలని ప్రయత్నం చేశారు. కాని ‘నేను మేజర్ని, నా స్వంత నిర్ణయంతో ఇష్టపూర్వకంగా వెళ్ళాను. మీరు ఆమె నెలా తీసుకొస్తారని, ఆమె మీద కేసేలా పెడ్తార’ని లైలా వాదించడంతో ఏం చెయ్యలేకపోయారు. కూతురి అసహజ ప్రవర్తన భయపెడ్తోందని, కుటుంబంలో విలువ లేకుండా పోయిందని, సమాజంలో తమ పరువు పోయిందని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇంతకన్న చచ్చిపోవడం నయం అంటున్న వారితో మీరెప్పుడైనా పేరొందిన ఏదైనా పాత గుడికెళ్ళారా అనడిగింది నిత్య. ఏంటీ అసంబంద్ధ ప్రశ్న అన్నట్టు చూసారు. ‘పురాతన గుడులన్నింటి పైన రకరకాల బొమ్మలుంటాయి. చూసే

ఉంటారు వాటన్నింటిలో స్వలింగ లైంగిరక చర్యలకు సంబంధించి కళాత్మకంగా చెక్కిన బొమ్మలుంటాయి. అంటే ఇది కొత్త విషయం కాదు, సమస్యా కాదని మీకెందుకనిపించ ట్లేదు’ అంటున్న నిత్యని విస్తుపోయి చూసారు.

పిల్లలు స్కూల్‌కెళ్ళడం మొదల య్యాక నిత్య ఒక ఎన్‌జిఓతో కలిసి వాలంటీర్‌గా పనిచేయడం ప్రారంభించింది. స్త్రీ, పురుష సంబంధాలేకాక ఇతర సంబంధాలూ ఉంటాయి. అది ఒక వ్యక్తి యొక్క లైంగికతకి చెందిన విషయం, వారివారి సెక్సువాలిటీని బట్టి వారి జీవితాన్ని నిర్ణయించుకునే హక్కు వ్యక్తులకుందని నమ్ముతూ, దానిపై ప్రచారం చేస్తూ స్వలింగ సంబంధాలలో (సేమ్‌ సెక్స్‌ రిలేషన్స్‌) ఉన్న వారికి కౌన్సిలింగ్‌, లీగల్‌ సపోర్ట్‌ ఇస్తుంది ఈ సంస్థ. ఇది విన్నాక తన అనుభవాలని, తన భావాలని విశ్లేషించుకున్న నిత్య తను ఎదుర్కొన్న పరిస్థితిలాంటి పరిస్థితుల్లో ఉన్న యువతకి సెక్షన్‌ 377పైన, సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌పైన అవగాహన కల్పిస్తోంది. కరుడుగట్టిన సామాజిక, కుటుంబ వ్యవస్థల విలువల్ని ఆచరించాలే తప్ప చట్టంలో మార్పుతో, వ్యక్తుల భావాలతో మాకు సంబంధం లేదనట్లు ప్రవర్తించే పోలీసు వ్యవస్థతో ప్రతిసారీ ఘర్షణే. తన టీనేజ్‌ కొడుకుకి మేల్‌ పార్ట్‌నర్‌ ఉన్నాడని తెలిసినపుడు భర్త తలకిందులైపోతుంటే అర్థం చేయించగల్గింది కానీ, మిగితా వారి నుండి విమర్శలు ఎదుర్కొంటూనే ఉంది. అది అసహజం అని వాదించే వారితో దానిని ఎవరు నిర్ణయిస్తారు అని వాదిస్తోంది.

పురాణాలు, కల్పిత కథల్లోని కొన్ని పాత్రలే ఆదర్శంగా చూపించి మానవ సమాజం అంతా ఇలాగే ఉండాలని నిర్భంధించే మత మౌఢ్యపు సంస్థలకి చట్టంతో పనిలేదా? చట్టాన్ని అమలు చేయాల్సిన రక్షణ వ్యవస్థదీ అదే తీరైతే, చట్టం సహకారంతో వ్యక్తుల హక్కుల్ని రక్షించాల్సిన న్యాయాధికారులదీ గుంపులో గోవిందా పద్ధతైతే హక్కుల పరిరక్షణ ఎలా జరుగుతుంది? రైట్‌ టు ఛాయిస్‌ను రక్షణ వ్యవస్థలే కాలరాస్తే ఈ హక్కుల ఉద్యమకారులపై మారణహోమం జరగక ఏమౌతుంది? హింస వ్యతిరేక పక్షోత్సవాలు చేసుకుంటున్న మానవ హక్కుల పరిరక్షణ సంస్థలు కూడా ఈ కోణాన్ని వదిలేస్తే… హింస రూపాలు మారుతాయి కాని అంతం చూడగలమా!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.