భూమిక పత్రికా సంపాదకులకు,
గత సంచికలో ప్రచురించిన భార్గవి గారి ”భారతీయ చలనచిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్” సినిమాలోకం ఆద్యంతమూ ఉద్వేగ భరితం చేసింది. గురుదత్‌ని తీర్చిదిద్దిన ప్రభాత్ స్టూడియో ఇప్పుడు ”ప్రతిష్టాత్మక పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్” అయింది. జీవితాన్ని, జీవన విలువలతో పేగు బంధం వేసుకుని బతికిన మహనీయుడి గురించి బాగా రాశారు. ధన్యవాదాలు!
– శివలక్ష్మి, ఇ-మెయిల్
ఎడిటర్ గారికి
గత సంచికలో వచ్చిన సంపాదకీయం ‘గుడాంబానే ఎందుకు? మద్యం షాపులు మూసేయండి’ మద్యం లేని సమాజం కోసం కృషి చేయాలన్నది చాలా బాగా రాసారు ధ్యనవాదాలు. – లలిత, నల్గొండ
నవంబరు సంచికలో ప్రచురించిన కవితని చంచల్‌గూడ జైలులో ఉండే నాగమణి తమ ప్రిజన్ పత్రిక కోసం సేకరించింది. ఆ కవిత భండారు విజయ రాసిందనే విషయం ఆమె ప్రస్తావించకపోవడం వలన నాగమణి పేరుమీద అసంపూర్ణంగా ప్రింట్ అయ్యింది. విజయ ఫోన్ చేసి అడిగినప్పుడు జరిగిన పొరపాటును గుర్తించాం. పొరపాటు జరిగినందుకు విచారిస్తున్నాం.
– ఎడిటర్