యుద్ధనారి మారంమాయి చూపిన దారిలో… తమ్మెర రాధిక

(ఆదివాసీల ‘మారంమాయి’ మహామానవి మహాశ్వేతాదేవి పుస్తకం నుంచి)

పెద్దక్క చనిపోయి ఇప్పుడు కధలూ నాటకాలు రాసేవాళ్ళందరికీ మహామాతగా మారింది. అలా జరగడానికి ఆవిడ అడవి బిడ్డల కోసం జీవితాన్నే అడవికి అంకితం చేసింది. అడవి మీద కాసిన ఆ వెన్నెల వారి జీవితాలల్లో వెలుగునే పంచింది. ఆ వెలుగుల వెనక ఆర్థిక కష్టాలూ, అసాంఘీక శక్తుల వీరాలాపాలూ, మానసిక వేద సమస్యలను నేలమట్టం చేస్తుంది. ఆమే పెద్దక్క మారంమాయి మహాశ్వేతాదేవి.

పూర్వం నించీ అడవి బిడ్డలు అరణ్యాలలో నివాసాలు ఏర్పరుచుకుని తమతమ భాషతో, నృత్యాలతో, తమదైన పోడు వ్యవసాయంతో, తమదైన దైవాలతో స్వయం సమృద్ధి కలిగి జీవిస్తున్నారు.

తనెక్కడైతే ఆదివాసీలకు అన్యాయం జరుగుతుంటే ప్రత్యక్షం అవుతుందో తన కథలలో నవలల్లో నాయకులు కూడా అలానే ప్రత్యక్షం అవుతారు. ‘హజార్‌ చురాషిర్‌ మా’ కథలో కూడా మధ్యతరగతి చిత్రీకరణల నుంచి, భూమిలేని రైతు కూలీలను భూస్వాములు ఎలా పీడించి పీల్చి పిప్పి చేస్తారో కథలోని సుజాతతో పాటే తనూ అడవిజాతి ఆదివాసీల కోనలలో పయనించి స్వయంగా తెలుసుకున్నారు.

మహాశ్వేతాదేవి నిరంతరం కఠిన శ్రమకోర్చి ఆదివాసీల అసలు సమస్యయిన భూమి సమస్యను లోతుగా అధ్యయనం చేసారు. ఈ సమస్య కొకవైపు భూస్వాములూ – ఇంకొక కొసన భూమిలేని రైతు కూలీలు వున్నారు. భూమి వున్నవారు దాని మీద హక్కు గలిగి పనిపాటలు చెయ్యకుండా, రైతులు పండించిన ఫలసాయాన్ని దౌర్జన్యంగా అనుభవించేవారు. మధ్య దళారీలు రైతు కూలీలకు విత్తనాలూ, దుక్కిటెద్దులూ, విత్తనాలు, అరకలు, చిన్న మొత్తంలో కొద్దిగా డబ్బు పడేసి, వాళ్ళు పండించిన పంటలో సగం, కొన్నిసార్లు మొత్తం గుంజుకుని కూలీ గింజలు కొలుస్తుంటారు.

భూమిలేని ఈ కూలిజనపు అవస్థల్ని, వారి ఆకలి బాధల్ని, అధ్వాన్న పరిస్థితులని చదువుతుంటే మనం ఏ కాలంలో వున్నాం! ఇంకా ఇలాంటి పరిస్థితులు వున్న కాలమా అనిపించక మానదు. మహాశ్వేతా దేవి చిత్రించిన పరిస్థితులను ఆమె స్వయంగా చూసినవే కావడం దురదృష్టకరం!

ఆమె సృష్టించిన పాత్రలన్నీ రక్త మాంసాలతో కదలాడుతో కన్నీరు పెట్టి స్థాయి, పరిస్థితుల ప్రాబల్యం వల్ల ఒక్కొసారి తిరగబడతాయి, కొన్నిసార్లు అణచివేయబడుతాయి. ‘ఆదివాసీల ”మారం మాయి” మహామానవి రచనలపై వ్యాసాల సంకలనంలో నాగరాజుగారు ఒక పేరాలో–

పిడికెడు మెతుకుల కోసం, మూరెడు గోచిపాత కోసం, గుక్కెడు గంజి కోసం, చిటికెడు ఊపిరి కోసం, చిట్టెడు ఉప్పు కోసం, పావలా కూలీ డబ్బుల కోసం, నాలుగు అక్షరాల చదువు కోసం, గుప్పెడు మనశ్మాంతి కోసం – ఆఖరికి తమ వాళ్ళ శవాన్ని దహనం చెయ్యడం కోసం కూడా ప్రాణాలకు తెగించి భీకర పోరాటం చెయ్యాల్సిన పరిస్థితుల్ని ఆమె రచనలలో ఈ వ్యవస్థ నగ్న స్వరూపాన్ని నడిరోడ్డులో నిలబెడతాయి.

ఈ పుస్తకాన్ని అనిశెట్టి రజితగారు ఒక ఉద్వేగంతో తపనతో తీసుకొచ్చారు. భారతీయ సాహిత్య నిధిలో ఆమె సాహితీ సంపద ప్రత్యేకమైందనీ, ఆమె నడత విలక్షణమైందనీ, ఆమె మహాన్నతమైన వ్యక్తనీ అందుకే ఆమె పేదల, నిర్వాసితుల ‘మారందాయిగా’ మారారనీ రచయిత్రి ప్రగాఢ ప్రేమా విశ్వాసం! తనలోని నిరంతరంగా సాగే ఆలోచనా స్రవంతి కొనసాగేందుకు ‘అడవి పసరుల మందును తాగించిన ఆ అడవి మనిషికి ఆత్మార్పణమే’ నివాళిగా అర్పిస్తూ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

మహాశ్వేతా దేవి తన రచనలు దేనికి ప్రతీకనో సూటిగా వివరించారు. ‘నా రచనలో ఏ నిర్ధిష్ట రాజకీయాల జాడల కోసం వెదకడం వృధా. పీడితులైన జనం విముక్తి కోసం నడుంకట్టిన వ్యక్తులే నా రచనల్లో కీలక వ్యక్తులు. మనిషి రాజకీయ క్రీడ కోసం రూపొందలేదు. తన హక్కులన్నీ చెక్కు చెదరకుండా హాయిగా జీవించాలన్న తపనను సఫలం చేయాలన్నదే రాజకీయాలకు కూడా ధ్వేయంగా వుండాలని నమ్ముతాను. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా తిండికీ, నీళ్ళకూ, భూమికీ నోచుకోక కట్టు బానిసత్వంలో నా దేశ ప్రజలు అల్లాడిపోవడం నాకళ్ళతో చూస్తున్నాను. ఈ అమానుష నిర్భంధాల నుంచి నా ప్రజలను విముక్తుల్ని చెయ్యలేని వ్యవస్థకు వ్యతిరేకంగా జాజ్వల్యమాన సూర్యబింబంలా ప్రజ్వరిల్లుతున్న ఓ ఆగ్రహమే నా రచనలన్నింటికీ ప్రేరణ, స్ఫూర్తి అన్నారు.

ఆమె కథలలోని ఆగ్రహం ఎందుకు అనుకున్న వారందరూ ఆమె అభిప్రాయాన్ని చదివి ‘నిజమే అది దర్మాగ్రహమే’ అనుకుంటారు.

వివిధ రంగాలలో ప్రముఖులైన వ్యక్తులున్న కుటుంబంలో పుట్టి, పెరిగిన మహాశ్వేత దేశ విభజన తరువాత ఢాకా నుండి పశ్చిమ బెంగాల్‌కు వచ్చేసారు. కలకత్తా యూనివర్సిటీలో ఎం.ఎ. ఇంగ్లీషు చదివారు. ప్రముఖ నాటక కర్త బీజోన్‌ భట్టాచార్యను పెళ్ళి చేసుకున్నాక, 1948లో నబూరూన్‌ భట్టాచార్య పుట్టాడు. పదేళ్ళ తరువాత భర్త నుంచి విడాకులు తీసుకుని అసత్‌ను రెండో పెళ్ళి చేసుకున్నారు. అతనితో కలిసి చాలా ప్రయోగాలు చేసింది.

వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులు ఆమె హృదయంలో శూన్యాన్ని నింపినా రచనా వ్యాసంగం ద్వారా దాన్ని భరిపూర్తి చేసుకొన్నారు. గిరిజనులు, అడవి బిడ్డల కష్టాలూ, విషాదాలూ వారి జీవన విధానం లాంటి వాటిని పూర్తిగా అవగాహనతో, వారితో కలిసి వారితో అడవుల్లో వుండి వారి సమస్యలపై పోరాట స్ఫూర్తితో రచనలు చేసి ఆ రచనలను ప్రపంచానికి చాటి చెప్పారు.

అనిశెట్టి రజిత గారి మాటల్లోనే ‘సమాజంలో ఎవరు కానీ మంచి చేస్తే దాన్ని స్వీకరిస్తూ, చెడు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తూ అట్టడుగు సమూహాల కోసం నిలబడి, వారికోసం సుదీర్ఘమైన యుద్ధం చేసిన వ్యక్తి మహాశ్వేతాదేవి. రచయిత్రి ‘బషాయిటుడు’ అనే కథలో బషాయిని చిత్రీకరించిన విధానం – నిరుపేద కుటుంబంలో పుట్టి, అనాథగా పెరిగి, తనదైన గుర్తింపు కొరకు, అస్తిత్వం కొరకు పెనుగులాడిన ఆదివాసీ యువకుడు. తాను అనుసరించిన దారి తనకు గమ్యం చూపదని అర్థమయ్యాక, మోసపోయాక, తిరుగుబాటు చేసి కొత్త దారిని ఎంచుకుంటాడు. భూస్వాముల దృష్టిలో ప్రమాదకారి విద్రోహిగా ముద్రపడి మరణించిన ప్రతీసారీ మళ్ళీ ప్రజలలో పుట్టి పోరాటాన్ని ప్రజ్వలింప చేసే అద్భత మానవుడు బషాయి. అనిశెట్టి స్రుశించిన ఏతోనా కథలో – అడివే ఆదివాసుల తల్లి. వారు తమ బ్రతుకును నడుపుకోవడానికి ఒక నది ఒక అడివి చాలు. అడివిని నాశనం చేసేది ఆదివాసులు కాదు. అటవీ సంపద మీద కన్నేసిన బడాబాబూలూ, జమిందారులూను, ఎవరూ తన యింటిని తను తగల బెట్టుకోడు. తను తినే తిండిలో విషం కలుపుకోరు. ఆ పనులు చేసేది దొరలూ, భూస్వాములే అంటారు.

ఆదివారం పుట్టడంతోటి ఆపిల్ల వాడికి ఎతోవా (ఎతువార అంటే ఆదివారం) అని పేరు పెట్టారు. పట్టణంలో నివశించే భూస్వామి పొలాలల్లో పని చేస్తూ డబ్బును బదులు తిండి గింజలు తీసుకునే సంతాలులూ, ముండాలూ, లోథాలూ అనేక దౌర్జన్యాలకు బలయ్యేవారు. భూస్వామి భూమి అమ్మివేయడం మూలాన పని దొరకని వారు అలజడి లేవదీయడం మూలాన 36 మంది ఆదివాసులను పోలీసులు అరెస్టు చేస్తే తమ జాతి ప్లీడరును కలిసి మొరపెట్టుకోవడం మూలాన 36 మందీ విడుదలై తమ ఊరికి వస్తూ ఎతోవా తల్లిదండ్రులు దార్లో ఇటుక బట్టీలో కూలి చేసి ఆ డబ్బుతో ఏదో కొనుక్కుతిని (అది కుళ్ళిపోయిన పండ్లో బూజు పట్టిన మిఠాయో!) ఆ కారణంగా చనిపోతారు, వాళ్ళ దరిద్రం అంత భయంకరంగా వుండేది. ఎతోవాను బడికి పంపిస్తాడు తాత మంగళే. ఒంటిమీద ఒక నిక్కరు తప్ప మరేమీ వుండనంత కరువు.

పనిలో వుండి పని చేస్తూనే బోర్‌ కొట్టి ఆ నీళ్ళతో తోటను తడపడం, బంగ్లా అంత ఊడ్చి, వాళ్ళ దగ్గర మిగిలిన రాత్రన్నం తిని గేదెలను పొలం వైపుకు కొట్టుకు పోతూ బడి దగ్గర ఆగి పంతులు మాటలు వింటూ ఆదివాసీల పోరాటాలను తెలుసుకుంటాడు.

ఎతోవా సంత రోజులో సంతను శుభ్రం చేసినందుకు ఇచ్చిన ఒక గోనె సంచిని నదిలో జాగ్రత్తగా కడిగి వర్షాకాలంలో గొడుగులా, చలికాలంలో కంబళిలా వాడుకుంటాడు. అతను గొడ్లు కాస్తూ కట్టెలు విరుచుకొస్తాడు. దొరుకుతే ఆకు కూరలూ చేపలూ పట్టి తెస్తాడు. కట్టెలు అమ్మి ఉప్పు సంపాయిస్తే, తాత కొన్ని బియ్యపు గింజలు సంపాయిస్తూంటాడు. ఇన్ని చేసిన యజమాని ఎతోవా తాతకు మందలిస్తాడు ఎతోవాని పనికి ఎందుకు పంపవు, వాడు చదువుకొని మహారాజు అవుతాడా అని. మంగళే వాడికి ఆదివాసీ క్లబ్బు మీటింగులకు తీసుకుపోయి పూర్వీకుల గాథలూ పోరాటాలూ తెలుసుకునేట్టు చెయ్యడం మూలాన ప్రభుత్వం కల్పించిన సౌకర్యంతో చదువుకోవాలని నిర్ణయించుకుంటాడు. మహాశ్వేతాదేవి ఈ కథలో ఆదివాసీల పండుగలూ, వారి ఆచారాలూ తంతులని కథా సందర్భానుసారంగా చిత్రించారు. ఎతోవా తన వారి చరిత్ర తెలుసుకున్నాడు. మరో చరిత్ర రచనలో భాగస్వామ్యానికి సిద్దమయ్యాడు.

1965లో పలమావూ గిరిజన గూడాన్ని చూసిన అనంతరం ‘ఈ ఊరు గిరిజన భారతానికి అద్ధం’ అని భావించారు. ఆనాటి నుంచి వారి జీవన సరళిపై ఆమె ఆలోచనలో మార్పు వచ్చింది. అత్యంత నికృష్టంగా హేయమైన పరిస్థితుల మధ్య జీవిస్తున్న గిరిజనులను చూసి చలించి వారి కోసం నిలబడి రచనలూ పోరాటాలూ చేయనారంభించారు.

గిరిజన సంస్కృతులు నాశనం అవడం చూసి ఆవేదన చెంది తరువాత కాలంలో ఆదివాసీ సంఘాలను స్థాపించారు. దాంతో ఆమె వారికి తల్లిగా గుర్తించబడ్డారు. ఆవిడ 45 నవలలనూ, 15 కథా సంపుటాలనూ, 10 బాలల పుస్తకాలనూ, 1 నాటక సంపుటినీ రచించారు. ఈ రచనలలో కేవలం ఆదివాసీల సమస్యలూ, సంఘర్షణలూ, వారి జీవిత విధానం లోతుగా సమాజానికి అర్థం అయ్యే రీతిలో రాసారు. అంతే కాదు దేశంలో ప్రజాపోరాటాలు ఎ్కడ జరిగినా వాటిని ఓన్‌ చేసుకున్నారు. మహాశ్వేతా దేవి కథలూ, నవలలంటే సానుభూతితో చదివే పాఠకులు చాలా మంది ఉన్నారు. ఆమె రచనల్లో కళ్ళకు కట్టే దోపిడీ చరిత్ర ఇంకా కొనసాగుతూనే వున్నా ఏమీ చేయలేని తమ నిస్సహాయతను ఎరిగే ఉన్న పాఠకులూ ఎందరో వున్నారు.

ఆవిడ రచించిన ఎతోవా, ఒక తల్లి, ఎవరిదీ అడవి, రుడాలీ, ఎక్కడి కల, విత్తనాలు, ఉప్పు, చిన్నోళ్ళు, దేవతా వృక్షం, వేటగాళ్ళూ – లేగదూడ, బషాయిటుడూ, రాకాసికోరది ఎంతో ప్రతిష్టనార్జించాయి. ఆమెని ఆమెగా గుర్తించడం అంటే ఆమె రచనల్లో జీవించారు, కష్టపడ్డారు, తాను నమ్మిన సిద్ధాంతాలకూ, విశ్వాసాలకూ కట్టుబడి రాసారు కనుక.

ఎంత చిన్న కథ రాసినా కథా గమనం ఎలాంటిదో స్వయంగా చూసి రాసారు. తెలుగులోకి అనువాదం చేసిన ఆమె కథలు, ఆమె మరణించాక వచ్చిన కథలూ అందరూ చదివి ఉండరు. ఒక్కటీ రెండు చదివినంత మాత్రాన ఆవిడ అర్థం అయ్యే అవకాశం వుండదు. అనిశెట్టి రజిత గారు మహాశ్వేతాదేవి గారి గురించి తీసుకొచ్చిన ఈ పుస్తకం వల్ల కేవలం బెంగాల్‌కు చెందిన రచయిత్రిగా చూసేవారి చూపు మారుతుంది. ఆవిడ భారతీయ రచయిత్రి ఆ మహా… మహాశ్వేత గురించి ఇందరి అభిప్రాయాలూ, కథల విశ్లేషణ గురించి చదివినప్పుడూ ఒక్క క్షణం హృదయం భయాంకర పెను సంచలనాలకు గురవుతుంది.

పాఠకులు గానీ రచయితలు గానీ మారందాయి గురించి సంపూర్ణంగా తెలుసుకొని సాహిత్యం అంటే అన్న పదం గురించి పరిపూర్ణ ఆనందాన్ని, విషాదాన్ని, భారాన్ని, ఉక్రోషాన్ని, విషాదాన్ని, బాగా జరిగింది అన్న ప్రతీకారాన్ని ఇలా చెప్పలేని భావోద్వేగాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారు.

ఈ పుస్తకం తేవాలని అనుకున్నప్పటి నుండీ అనేక భావోద్వేగాలతో తన్మయత్వంతో తనలో… తనలో… తను ప్రయాణం చేస్తూ… అగ్ని గర్భనూ, జ్వాలా ముఖినీ దర్శించాలన్న ధ్యానం పూర్తిగా…. వంద… వెయ్యి రెట్లుగా అనుభూతించారని భావిస్తూ… మాకూ అలాంటి రసానుభూతిని కలిగించారని అనిశెట్టి రజిత గార్కి ధన్యవాదాలతో…

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.