భూమిక ఎడిటర్ గారికి!
భూమిక గత సంచికలో కవన శర్మగారి కథ ‘ఆమె ఇల్లు’ చాలా బాగుంది. మహిళల ఆలోచనలు వారి మానసిక సంఘర్షనలు చక్కగా వివరించినారు. అద్దె ఇంటి కోసం అన్వేషణకు బయలు దేరినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు వారినే ఇబ్బంది పెట్టి, బయపెట్టి, ఆలోచింప చేసే ప్రశ్న ‘ఇంతకు ఈ ఇల్లు మీదా? మీ ఆయనదా? ఈ ఇల్లు అద్దెకివ్వ గలిగిన అధికారం మీకుందా?’ కమల ప్రతి ఇంటి ఆవిడను అడిగిన విధానం బాగుంది. దీన్నుంచి మహిళలందరూ ఎదుటివారు అడిగే ప్రశ్నలకు కుంగిపోకుండా ధైర్యంగా ఎదుటి వారిని ఆలోచింపచేసే విధంగా ప్రశ్నించడం నేర్చుకోవాలి అనే సందేశం బాగుంది.
కమల లాగా మానసిక సంఘర్షణ పడి చివరికి ధైర్యంగా సరి అయిన నిర్ణయం తీసుకోగలిగే విధంగా మహిళల్లో చైతన్యం రావాలి.
ఈ కథ చదువుతుంటే పాత్రలు కళ్ళ ముందు కదులాడినట్లు అనిపించింది కవన శర్మగారి కథ మహిళలకు మార్గదర్శకంగా మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా వుంది. నేను కవన శర్మగారి కథ చదవటం ఇదే మొదటిసారి. ఈ కథను మా ఇంటిల్లిపాదికి చదివి వినిపించాను. ఇంకా వారు రాసిన ప్రముఖ కథల పుస్తకముల పేర్లు తెలియచేయగలరు అవి ఎక్కడ అందుబాటులో ఉంటాయో కూడా తెలియచేయగలరు. ఇంతమంచి కథలను, సందేసాత్మక విషయాలను పాఠకులకు అందిస్తూ భూమికను ప్రతి నెల సకాలంలో పాఠకులకు అందిస్తున్నందుకు భూమిక బృందానికి ధన్యవాదములు.