రాగం – రాగం

ఇంద్రగంటి జానకీబాల
ఆమెని కలవడం అదే మొదలు. అయినా అయిదు నిముషాల్లో అత్యంత సన్నిహితంగా అయిపోయింది.
నాకు సంగీతమంటే మహాపిచ్చి. ముఖ్యంగా పాటలంటే చెవికోసుకుంటాను. ఎక్కడ కొత్త పాట వినిపించినా, దాన్ని బంధించి మా యింటికి తీసుకుపోనిదే నాకు తోచదుః అంటూ నవ్వింది.
సంగీతం ఆరోగ్యానికెంతో మంచిది. మానసికారోగ్యానికి మరీ మంచిదిః అన్నాను.
అమ్మో – సంగీతమంటే మీరా సరిగమలు – తాళాలు, రాగాలు, కచ్చేరీలూ అనుకుంటున్నారా! కాదండి బాబు – నాకు వట్టి పాటలంటే యిష్టం – ఆ… అంటూ రాగాలు తీస్తే కూచుని వినలేను సుమండిః అంది అభినయిస్తూ-,
అంతవరకూ బాగానే వున్నాను గానీ అప్పుడే నాలో ఒక విధమైన విసుగు బయలుదేరింది-, అయితే నన్ను ఆమె వదలలేదు.
నాకు పాటల్లో అన్నీ యిష్టమేగానీ-, అన్నమాచార్యకీర్తనలంటే మరీ పడి చచ్చిపోతానుః అంది.
ఆమెలో కొంత అమాయకత్వం, మరింత అజ్ఞానం కలిసి పేరుకుని వుందని గ్రహించి, ఆమెని భరించేద్దామని నిర్ణయించేసుకున్నాను.
ఆమె బలవంతం చేసి నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది. అది ఇల్లు అనడం కంటే దేవేంద్ర భవనం అనడమే సమంజసంగా వుంటుంది-, ఆమె ఆప్యాయంగా ఇల్లంతా తిప్పిచూపించి ఎంతో ప్రేమగా ఎన్నో పదార్థాలు పెట్టి, తినమని బలవంతపెట్టింది. అన్నింటికీమించి ఆమె చూపించిన నిలువెత్తు మ్యూజిక్‌ సిస్టమ్‌ చూసి మురిసిపోయాను. ఆమెకు నాయందు అంత అభిమానం కలగడానికి కారణం, నాకు కాస్త సంగీతం తెలిసి వుండటం, కొంచెం పాడగలిగి వుండటం అని నాకు అర్థమై ఆనందం కలిగింది-, ఆమె నన్ను అక్కడే సోఫాలో కూర్చోబెట్టి మ్యూజిక్‌ సిస్టమ్‌ ఆన్‌ చేసింది. అది ఆమె దురదృష్టమో, నా గ్రహచారమో తెలీదు గానీ ఆ… అంటే అమలాపురం – ఇ అంటే యిచ్ఛాపురంః అంటూ తగులుకుంది పాట – నేను అవాక్కయ్యాను గానీ ఆమె పెద్దగా పట్టించుకోలేదు-,
ఏ పాటైనా సరే నా దగ్గరుండాల్సిందే అంది గర్వంగా – అయ్యో! ఇంత సుపీరియర్‌ క్వాలిటీ గల ఈ సిస్టమ్‌ ఎంత దురదృష్టవంతురాలుః అనుకున్నాను.
ఒకసారి నేను రేడియో స్టేషన్‌లో ఒక రికార్డింగుకని వెళ్ళాను. అక్కడున్న నా మిత్రురాలు జ్యోతి అర్జంట్‌గా నీకొక అద్భుతమైన పాట వినిపించాలి అంటూ నన్ను చెయ్యిపుచ్చుకుని స్టూడియోలోకి లాక్కుపోతుంటే నా అభిమాని ఆమెః కనిపించింది. నన్ను చూస్తూనే కౌగలించుకున్నంత పనిచేసింది-, తానేదో ట్రాక్‌ రికార్డ్‌ చేయడానికొచ్చానని చెప్పింది.
మీ పరిచయం వల్ల నాకు మ్యూజిక్‌ గురించి తెలుసుకోవాలని మహాసరదా కలిగి కొన్ని పుస్తకాలు కొని చదువుతున్నా అంది.
చాలా మంచిపని చేస్తున్నారు అంటూ జ్యోతి వెంట పరుగుతీశాను.
బొంబాయి గాయని మధురాణిః పాట ఆన్‌ చేసింది జ్యోతి. ఇద్దరం నిశ్శబ్దంగా పాట వింటూ మైమరచిపోయాం. మేమిద్దరం ఏలోకంలో వున్నామో కూడా తెలీనంత మైకంలో పడిపోయి పాట వింటూ వుండగా – చటుక్కున డోర్‌ తీసుకుని ఆమె వచ్చింది-
కూర్చోండి అన్నట్టు నేను సైగ చేసి పాట వినడంలో మునిగిపోయాం – కాస్సేపు అస్తిమితంగా అటూ యిటూ కదిలింది. ఆ పాటల అభిమానికాపాట సరిపడదని నాకనిపిస్తూనే వుంది-,
ఇదేం రాగం మేడమ్‌ అంది అభిమాని – నేను వినండి అన్నట్టు సైగ చేశాను. మరికొంతసేపు ఆమె ఊరుకుంది.
మోహనరాగమంటారా అంది. నేను మాట్లాడకుండా వూరుకున్నాను-, ఆమె మరికాస్తసేపు అటూయిటూ మెదిలి సర్దుకుని కూర్చుంది-, ఒక్క నిముషం గడిచింది-,
మోహనే కదండీ అందామె మళ్ళీ-,
జ్యోతి కల్పించుకుని ముందు వినండి. తర్వాత రాగం గురించి ఆలోచిద్దాం అంది.
అభిమాని అదిరిపడింది. ముళ్ళ మీద కూర్చున్నట్లు కూర్చుంది. పాటయిపోయింది. ఆమె రికార్డింగు వుందని వెళ్ళిపోయింది-.
మూడున్నర నిముషాలు కూర్చుని స్థిమితంగా పాట వినడానికి చేతకావడం లేదు. రాగం గురించి ఆరాటం అంది జ్యోతి.
అవునుః అన్నాను నేను.

Share
This entry was posted in పాటల మాటలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.