మట్టిపూలు ఎస్టీ, ఎస్సీ, బిసీ మైనారిటీ రచయిత్రుల రాష్టస్థాయి ఆవిర్భావ సదస్సు

జూపాక సుభద్ర
నడుస్తున్నది అస్తిత్వ సాహిత్య ఉద్యమాల శకం. భవిష్యత్‌ అంతా అస్తిత్వ ఉద్యమాలదే. ఎస్సీ, ఎస్టీ,బిసి, మైనారిటీ వర్గాలు ఎవరికి వారుగా వారి వారి హక్కుల కోసం, సాధికారం కోసం వాటాకోసం, అభివృద్ధికోసం విముక్తి చైతన్యంతో ఉద్యమించడం ప్రస్తుత సామాజిక దృశ్యం.
ఈ మొత్తం సంఘర్షణలో అణగారిన సామాజిక వర్గాల స్త్రీల శ్రమ పాత్ర ప్రధానమైనది. ఉత్పత్తి శక్తులుగా సమాజాన్ని నిర్మించి అభివృద్ధి చేస్తున్న అణగారిన స్త్రీల సమస్యలు ఎక్కడా గుర్తింపుకు రాకపోవడమనేది పెద్ద రాజకీయమే. సామాజికంగా, సాహిత్యంగా వారి అస్తిత్వాలే కనబడవు. కమ్యూనిస్టులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు మెయిన్‌ స్ట్రీమ్‌ ఫెమినిస్టులు కూడా యీ కులాల స్త్రీలను పక్కన వుంచడం, అప్రధానం చేయడం జరిగింది. ఇదంతా అణచివేతనే అని ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ రచయిత్రులంటున్నారు.
అణచివేత కులాల స్త్రీలకు అభివృద్ధి ఫలాలను, ప్రాతినిధ్యాల్ని అందనీయకుండా కొనసాగినయి. ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ లంటే మగవాళ్ళ అస్తిత్వాలనే ప్రాతిపదికగా గుర్తించడం, స్త్రీలు అంటే ఆధిపత్య కులాల స్త్రీలనే పరిగణనలోనికి తీసుకోవడం జరుగుతోంది. ఈ రెండింటిి మధ్యలో అణచి వేత కులాల స్త్రీలను అదృశ్యం చేయడం జరుగుతోంది. సరిగ్గా చరిత్రలో, సాహిత్యంలో యిదే జరిగింది, జరుగుతోంది. ఆధిపత్య కుల, మత, ప్రాంత జెండర్‌ వాదాల రచయిత్రుల రచయితల దబాయింపులే సాహిత్యంలో రాజ్యమేలుతున్నాయి. అణచివేత కులాల స్త్రీల కుల పితృస్వామ్యం, శ్రమ సంస్కృతి సాహిత్యంలో గౌరవ ప్రదమైన ప్రాధాన్యతలతో ఎక్కడా ప్రతి ఫలించలేదు. గురజాడ, చలం, కొడవటి గంటి నుంచి అంతా వారి కులంలోని స్త్రీల జీవితాల్ని చర్చించితే అది స్త్రీలందరి చర్చని ప్రచారం చేయడంపట్ల అణచివేత కులాల స్త్రీలు వ్యతిరేకంగా వున్నారు. ఇది ఆధిపత్య కుల స్త్రీవాదులు, సంఘాలు అర్ధం చేసుకోకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
కుల ఉద్యమాల మగ రచయిత్రులు తమ సామాజిక వర్గాల స్త్రీల అస్తిత్వాల్ని అప్రధానం చేయడం లేదా గ్లోరిఫై చేయడం జరుగుతోంది. అణగారిన కులాల స్త్రీల ప్రాంత, మత, జెండర్‌ సమస్యల్ని ఉమ్మడిగా మాట్లాడే పేరు మీద ఆధిపత్యకులాల స్త్రీలు వారి మేధోశక్తుల్ని కబళిస్తూ హైజాక్‌ చేస్త్తూ తమ విస్తృతిని పెంచుకో చూస్తున్నారు.
వీటన్నింటిని ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ రచయిత్రులు ప్రశ్నించే క్రమం మొదలైంది. తమ అస్తిత్వ పునాదుల్లో కొత్త కోణాల్ని వెదుక్కుంటున్న తవ్వుకుంటున్న చారిత్రక సందర్భమే ఃఃమట్టిపూలుఃః ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ రచయిత్రుల తాత్కాలిక వేదిక.
ఈ వేదిక రాష్ట్ర స్థాయి ఆవిర్బావ సదస్సు హైదరాబాదులోని ప్రొగ్రెస్సివ్‌ మీడియా సెంటర్‌లో 22.3.09న రోజంతా జరగగా, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు షాజహాన, జి. విజయలక్ష్మి, జూపాక సుభద్ర నిర్వాహకులుగా వ్యవహరించారు.
దళిత ఉమెన్‌ ధియేటర్‌ కో ఆర్డ్గినేటర్‌ చంద్రశ్రీ రాసి పాడిన ఃమట్టిపూలు పాటతోః సదస్సు ప్రారంభమైంది. సదస్సులో ఎస్సీఎస్టీ, బిసి, మైనారిటీ రచయిత్రులు ఒకే వేదికపై కూడిన చారిత్రక అవసరం మీద, అస్తిత్వాల గుర్తింపు వైరుధ్యాలు ఐక్యత మీద కుల పితృస్వామ్య జెండర్‌ వైరుధ్యాల మీద చర్చను ఆహ్వానించడం జరిగింది. ఈ చర్చలో సూరేపల్లి సుజాత, గోగు శ్యామల, కన్నారం ఝూన్సీ, ఎల్లి నవల రచయిత్రి అరుణ, జెల్లి ఇందిర, డా. బి. సరోజన, జ్వలిత, జి. కృష్ణవేణి, ఫుట్ల హేమలత, షాజిదా ఖాతూన్‌, రాజేశ్వరి, నస్రీన్‌బేగం, వినోద, అనిత జాలాది విజయ, పచ్చనూరు అనురాధ, జవేరియా, శ్రీదేవి మొదలగు రచయిత్రులు పాల్గొనడం జరిగింది. మట్టిపూల సదస్సు లోని రచయిత్రులంతా ఒక అస్తిత్వ సాహిత్య ప్రయోజనంకోసం కలవడం, ప్రత్యేక అస్తిత్వాల్ని, కలబోసుకోవడం, ఆర్గనైజ్‌ కావడ మనేది గొప్ప చారిత్రక సందర్భ మని, అవసరమని ఏకకంఠంగా అభిప్రాయ పడ్డారు. సభలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ స్త్రీల అస్తిత్వాల ఆత్మగౌరవాలకు పత్రిక అవసరమని ఒక కవితా సంకలనాన్ని తీసుకురావడం, అన్ని ప్రాంతాల అట్టడుగు అణచివేత కులాలైన సామాజిక వర్గాల స్త్రీల జీవితాల్ని సాహిత్యంలోకి తీసుకురావడానికి కృషి చేయడం, జిల్లాల వారీగా రచయిత్రుల్ని సమీకరించి సభలు సమావేశాలు నిర్వ హించాలని ప్రతిపాదించడం జరిగింది. భిన్న అస్తిత్వాల, భిన్న వైరుధ్యాల ఐక్యత మీద కుల పితృస్వామ్యం మీద చర్చ మరో మీటింగుకి కొనసాగించబడింది.
సాయంత్రం 6 గంటలకు మట్టి పూలు ఎస్సీ, ఎస్టీ, బిసీ మైనారిటీ రచయిత్రుల బహిరంగ సభ జరిగింది. సభకు షాజహాన వక్తల్ని ఆహ్వానించగా జూపాక సుభద్ర అధ్యక్షత వహించడం జరిగింది. వక్తలుగా గోగు శ్యామల, డా.ఎం. వినోదిని, డా. జెల్లి ఇందిర, ఫుట్ల హేమలత, జ్వలిత, వజిదా ఖాతూన్‌, జి. విజయలక్ష్మి మాట్లాడి నారు.
గోగు శ్యామల మాట్లాడుతూ దళితస్త్రీలకు అభివృద్ధి మాట అటుంచి, వారికి బతకడమే ఒక సమస్యగా వుందని, యీ దుర్మార్గాన్ని ఎవ్వరూ మాట్లాడ్డం లేదంది. కమ్యూనిష్టులు, ప్రగతివాద మేధావులు, ఫెమినిస్టులు,మహిళా సంఘాలు కులాన్ని శతృవైరుధ్యంగా చూడ్డంలేదంది. కులం, అణచివేత కులాలకు శతృ పూరితమే నని యిది మిగతా సమాజం గుర్తించాలని డిమాండ్‌ చేశారు.
డా. ఎం. వినోదిని క్రిస్టియన్‌ స్త్రీల బాధలు ప్రత్యేకమైనవని, దళిత క్రిస్టియన్‌ స్త్రీలపై హిందూ మత వాదుల దుర్మార్గాన్ని, దాని సంస్కృతిని దుయ్య బట్టారు. కుల జెండర్‌ వివక్షల్ని తూర్పారబడుతూ జెండర్‌ కన్నా కులం బలమైనదని చెప్పారు.
జ్వలిత మాట్లాడుతూ బిసీ మహిళలు వారి వృత్తి జీవనాలు సాహిత్యంలో, ఎక్కడా రికార్డు కాలేదని, అవన్నీ సాహిత్యీకరించాల్సి న అవసరముందన్నారు.
డా. జెల్లి ఇందిర స్మృతుల్లో బ్రాహ్మణ స్త్రీల మైల బట్టల్లాంటి వాళ్లు దళిత స్త్రీలని వుందని యింకా అదే భావన కొనసాగు తోందని చెప్పారు. ఇంకా యూనివర్సిటీల్లో అణచివేత కులాలకు సంబంధించిన అన్ని రంగాల్నించి పరిశోధన జరగాలని, ఈ స్త్రీల దృష్టికోణాల్నించి చరిత్ర తిరగరాయాలని పిలుపిచ్చారు.
వజిదా ఖాతూన్‌ ముస్లిం స్త్రీలపై కొనసాగుతున్న దురాచారాలపై పోరాడాలని వారి జీవితాల్ని అనుభవాల్ని రికార్డు చేయాలన్నారు.
ఫుట్ల హేమలత మాట్లాడుతూ దళిత క్రిస్టియన్‌ మహిళా సాహిత్యం విస్తృతంగా రావాల్సినవసరం వుందన్నారు.
జి. విజయలక్ష్మి బిసీ స్త్రీల ప్రత్యేక అణచివేతల గూర్చి మాట్లాడుతూ ఃమట్టిపూలుఃః అణచివేత కులాల అస్తిత్వ వైరుధ్యాల్ని, వైవిధ్యాల్ని పూయించే కృషి చేస్తుందన్నారు.
కొన్ని అనివార్య పరిస్థితుల్లో రాలేకపోయిన వక్తలు డా. విజయభారతి, ప్రొ. జయసలోమి, నాగమ్మ ఫూలే ఉత్తేజ కరమైన తమ సందేశాల్ని సభకందించారు.
ఃఃఆధిపత్య కులాల స్త్రీల కన్నా అణచివేత కులాలస్త్రీలపై పితృస్వామిక భావజాల తీవ్రత ఎక్కువ. పై వర్గాల స్త్రీలు బైటపడ్డానికున్న అవకాశాలు కింద కులాల స్త్రీలకు లేవు. కింద కులాల స్త్రీలు కుటుంబ, కుల, శ్రమతో పాటు పై కులాల పురుషుల పీడన కూడా ఎదుర్కొంటున్నారు. చదువు కొని ఉన్నత స్థాయిలో వున్న స్త్రీలు కూడా ఈ వివక్షను ఎదుర్కొంటున్నారు. ఈ దృష్టిని మార్చడానికి యీ మట్టి పూల వేదిక అవసరముందిఃః- డా. విజయభారతి.
ఃఃమనువాదులు మూలవాసీ స్త్రీలను దేవదాసీ, మాతంగి జోగినీలుగా మార్చి వారి జీవనాల్ని చిన్నాభిన్నం చేశారు. వేల సంవత్సరాల నుండి మూలవాసీ స్త్రీల వ్యధలు, గాధలు యీ మట్టిలో యింకి పోయాయి. ఈ మట్టిని తవ్వితే -ఈ స్త్రీల ఆక్రోశాలు అనేకాలు కోకొల్లలుగా వస్తాయి. పూలే, అంబేద్కర్‌లు చెప్పినట్లు ప్రత్యామ్నాయ సంస్కృతి రానంతవరకు మనువాద సంస్కృతి యిలాగే కొనసాగు తుంది.ఈ మట్టి పూల వాసనల్ని మనందరం ఆస్వాదిస్తూ మనమనుకున్న ప్రపంచాన్ని నిర్మిద్దాంఃః- నాగమ్మ ఫూలే.
ఃఃమనుషులంతా ఒకటే. కాదు కాదు అనేది అక్షర సత్యం. వ్యత్యాసాలు అనేక కోణాల్లో నిత్యం ప్రస్ఫుటమవుతుంటాయి. పురుషులు స్త్రీల వ్యత్యాసం సామాజిక సమస్యగా పరిగణించారు. కాని స్త్రీలకు స్త్రీలకు మధ్య వ్యత్యాసాలు గణించబడలేదు. అది కూడా సామాజిక సమస్యగా గుణించ బడాలి.
మట్టికి ఓ ప్రత్యేకమైన వాసన వుంది. ఆ వాసన మట్టి పూలకు తప్పదు.ఃః – ప్రొ. జయసలొమి.
మట్టిపూలు సభ కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది.
1.ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీ స్త్రీల జీవితాలు సాహిత్యీకరించడంగా ఈ వేదిక కృషి చేస్తుంది.
2. కుల పితృస్వామ్యం , ఆధిపత్య కుల పితృస్వామ్యానికి, అన్ని రకాల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా ఈ వేదిక పని జేస్తుంది.
3. అన్ని రకాల సాహిత్య అస్తిత్వాలకు మద్దతునిస్తుంది ఈ వేదిక.
4. ఈ వేదిక ప్రత్యేక తెలంగాణకు, ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతుంది.
5. అభివృద్ధి పేరుతో ఆదివాసీలను నిర్వాసితుల్ని చేయడాన్ని యీ వేదిక వ్యతిరేకిస్తుంది.
6. మహిళా రాజకీయ రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బిసీ మైనారిటీ కోటాల కోసం ఈ వేదిక పనిచేస్తుంది.
7. ఎస్సీ,ఎస్టీ, బిసీ, మైనారిటీల జీవన శ్రమ సంస్కృతిని పాఠ్యాంశాల్లో చేర్చాలి. వారిని అవమానించే భావజాల దృక్పధాల్ని సిలబస్‌ నుంచి తొలగించాలని యీ వేదిక డిమాండ్‌ చేసింది.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

One Response to మట్టిపూలు ఎస్టీ, ఎస్సీ, బిసీ మైనారిటీ రచయిత్రుల రాష్టస్థాయి ఆవిర్భావ సదస్సు

  1. saleem basha says:

    అవసరమైన ప్రయత్నమిది,లక్ష్యం ఉన్నతమైనదైనపుడు విజయం చేకూరక తప్పదు.మీ విజయాన్ని కాంక్షిస్తూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో