నా కూతురు ఎవరికీ అందనంత ఎత్తుకెదిగింది -బుంగ మనోరంజితమ్మ

నా పేరు బుంగ మనోరంజితమ్మ. నేను భోగాపురంలో పుట్టాను. ట్రైనింగ్‌ టీచర్‌గా చదివాను. తర్వాత నా తల్లిదండ్రులు, ఏలూరు దగ్గర ఉన్న గుండుగొలను అనే గ్రామంలో ఉండే మా చిన్నత్త చేతులమీదుగా 1959 జూన్‌ 15న చర్చ్‌లో నా వివాహం జరిగింది. నాకు పెళ్ళయిన మూడు సంవత్సరాల వరకు సంతానం లేదు. మా అత్తచేత ద్వేషింపబడ్డాను. సంతానం లేని కారణంగా మాటలతో చిత్రహింసలకు గురిచేసేవారు. నేను వాటిని మౌనంగా భరిస్తూ దేవుడు సంతానమిస్తేనే కదా అని దేవునిపై భారం వేసి మౌనంగా

ఉండేదాన్ని. పెళ్ళయిన తర్వాత మూడవ సంవత్సరాన సాధారణ కాన్పులో 1962 మార్చి 26వ తేదీన హేమలత పుట్టింది. నా కూతురు హేమలత పుట్టినప్పటికి నాకు ఉద్యోగం లేదు. హేమలత నా గర్భంలో ఉన్నప్పుడు నా అత్తామామల చేత చాలా చిత్రహింసలకు గురయ్యాను. కానీ అందరూ కూడా మా ప్రథమ మనుమరాలు అని హేమను మాత్రం గారాబంగా చూసుకునేవారు. మా ముగ్గురు చెల్లెళ్ళు, తమ్ముడు అందరూ ముద్దుగా చూసుకునేవారు. నా భర్త, మా అత్తమ్మ కలిసి బంగారు తీగవే నువ్వు అని హేమలత అని నామకరణం చేశారు. అందరూ హేమా… హేమా… అంటూ పిలిచేవారు. తర్వాత తనకు వయసు వచ్చేటప్పటికి కావలి దగ్గరున్న చతులపాలెం గ్రామంలో టీచర్‌గా పనిచేస్తున్నాను. వాళ్ళ నాన్నగారు హేమను ఎంతో అల్లారుముద్దుగా చూసుకునేవారు. ఆయన తనకు పౌడర్‌, నూనె అన్నీ తెచ్చి జాగ్రత్తగా చూసుకునేవారు. ఎలిమెంట్రీ స్కూల్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు నాతోపాటు స్కూల్‌కి తీసుకెళ్ళేదాన్ని. చింతలపాలెంలోనే ఫిఫ్త్‌ ఫారం వరకు చదివింది. ఆరవ తరగతిలో నెల్లూరులోని హాస్టల్‌లో చేర్పించాలని వాళ్ళ నాన్నగారు భావించారు. తర్వాత సెయింట్‌ జోసెఫ్‌ అనే హైస్కూల్‌లో క్రైస్తవ హాస్టల్‌లో చేర్పించాము. హాస్టల్లో చేర్పించాక నేను చాలా బాధపడేదాన్ని. చిన్న వయసులోనే హాస్టల్‌లో చేర్చామని దిగులు పడేదాన్ని. మా వారు అప్పుడప్పుడు మా పాపను తెచ్చి చూపించేవారు.

ఆరవ తరగతి నుండే కథల పుస్తకాలు చదువుతూ ఉండేది. ఇంత పేరు తెచ్చుకుంటుందని అస్సలు అనుకోలేదు. కథలు చదువుతున్నప్పుడు తరగతి పుస్తకాలు చదువుకోమని నేను, వాళ్ళ నాన్నగారు చెప్పేవాళ్ళం. అక్కడ హాస్టల్‌లో ఉంటూ ఆరవ తరగతిలోనే పాఠశాల వారు నడిపే క్రీస్తు రాజు అనే మాసపత్రికలో ‘తిరిగిరాని పయనం’ అనే కథ రాసింది. ఆ పత్రిక తెచ్చి మాకు చూపించింది. మేము ఆ కథను చదివాము. చదివి ఏంటమ్మా నీ పేరు రాసి ఉంది అని అడిగితే నేనే రాశాను నాకు ఎవరూ చెప్పలేదు అని చెప్పింది. అది విన్న వాళ్ళ నాన్నగారు కథలకు ఎక్కువ సమయం ఇవ్వకు, క్లాస్‌ పుస్తకాలకు ఎక్కువ సమయం కేటాయించు, మంచి మార్కులు రావాలి అని పదే పదే చెప్తుండేవారు. ఒకదాని తర్వాత ఒకటి అలా రాస్తూనే ఉంది. తర్వాత స్పందన, ప్రార్థనా శక్తి అనే క్రైస్తవ మాస పత్రికల్లో కథలు వచ్చేవి. మేము కథలు చదివేవాళ్ళం, మెచ్చుకునేవాళ్ళం. కథలు రాయమని ఎవరూ నేర్పలేదు.

హైస్కూల్‌ పూర్తవగానే ఇక్కడ నెల్లూరులో డి.కె.కాలేజీలో ఇంటర్మీడియట్‌లో చేర్పించాం. వాళ్ళ నాన్నగారు డాక్టర్‌ చదివించాలనే ఆశతో సైన్స్‌ గ్రూప్‌లో చేర్పించారు. నాకు నెల్లూరు మున్సిపల్‌ స్కూల్‌కి ట్రాన్స్‌ఫర్‌ అయింది. అప్పటినుండి ఇంటినుండే కాలేజీకి వెళ్ళేది. అలా ఇంటర్‌మీడియట్‌ పూర్తి చేసింది. తర్వాత టీచర్‌ ట్రైనింగ్‌కి బెంగుళూరు పంపించాము. అక్కడ కన్నడ నేర్చుకుని కాలేజీ అసెంబ్లీలో కన్నడ వార్తా విశేషాలు చదివేది. అలా తన కథలను ఇంప్రూవ్‌ చేసుకుంది. ‘గూడు చేరిన గువ్వ’ అనే కథ విశ్వవాణి అనే పత్రికకు వెళ్ళింది. అక్కడ ఎండ్లూరి సుధాకర్‌ గారు ఆ కథను కరెక్షన్‌ చేస్తున్నారు. ఆ సమయంలో మీరు ఎంతో బాగా రాస్తున్నారు అని ఉత్తరాలు పంపేవారు. ఆ ఉత్తరాల్లోని ఒక ఉత్తరంలో ”మీ వయసు ఎంత? మీకు నలభై సంవత్సరాలు ఉంటాయా? మీకు పిల్లలు ఎంతమంది? మిమ్మల్ని ఒకసారి చూడాలండి” అని రాసి పంపారు. ఆ లెటర్‌ చూసి మేమంతా నవ్వుకున్నాం. ఆ లెటర్‌కి ఇలా రిప్లై ఇచ్చింది ”నా వయసు పద్దెనిమిది సంవత్సరాలండి. నాకు ఇంకా పెళ్ళి కాలేదు” అని. దానికి సుధాకర్‌ గారు మళ్ళీ అయ్యో మీకు నలభై సంవత్సరాలు ఉంటాయని అనుకున్నానండి. అయితే మిమ్మల్ని ఒకసారి కలవాలి అని రాసి పంపారు. మా ఇంటి ఎదురుగా రక్తదాత గోపీకృష్ణ అనే అతను ఉండేవారు. వారి ఇంటికొచ్చి చూశారంట కానీ మాకైతే తెలీదు. అందరూ లెటర్స్‌ రాస్తున్నారు అన్న సంగతి సుధాకర్‌ గారు చెప్పేవరకూ మాకు తెలీదు. ఈ అమ్మాయి కథ రాసినట్లు కూడా తెలీదు. అమ్మాయిని చూసి వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నట్లు మాకు లెటర్‌ రాశారు. కొంతకాలం రిప్లై ఇవ్వలేదు. తర్వాత కొంతమంది పాస్టర్లను పంపించారు. వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత వాళ్ళ నాన్న, నేను ఒప్పుకున్నాం. సుధాకర్‌ గారు నాకు ఒక ఉత్తరం రాశారు. నేను స్కూల్‌లో ఉండగా నాకు ఉత్తరం అందింది. అది చదివి మా ఆయనతో మనమ్మాయిని వివాహం చేసుకుంటానని ఉత్తరం రాశారు అని చెప్పాను. సరే అనుకుని పాస్టర్లను పిలిపించి వివాహానికి ఏర్పాట్లు చేశాము. నెల్లూరులోని డౌనీ హాల్‌లో ఆర్‌.ఆర్‌.కె.మూర్తి గారి చేతులమీదుగా, చాలామంది పాస్టర్ల మధ్య వివాహం చాలా ఘనంగా జరిగింది. ప్రార్థనా శక్తి పత్రికలలో కథకు, కవితకు కళ్యాణం అని మెయిన్‌ హెడ్డింగ్‌తో ఆర్టికల్‌ వచ్చింది. వాళ్ళ నాన్నగారు నా కూతురు ఎంత పెద్ద రచయిత్రి అయిందో అని చాలా గర్వపడేవారు. చాలా ఇష్టమైన కూతురుగా పెరిగింది.

హేమలత వివాహానంతరం విద్యను మెరుగుపరచుకుంది. డిగ్రీ, తర్వాత ఎం.ఎ.తో పాటు పిహెచ్‌డి పూర్తి చేసింది. వివాహం కాకముందు ఇక్కడ కొంతకాలం టీచర్‌గా పనిచేసింది. పెళ్ళి తర్వాత హైదరాబాద్‌లో ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో కొంతకాలం టీచర్‌గా పనిచేసింది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో అధ్యాపకురాలిగా ఎదిగింది.

కానీ ఎవరికీ అందనంత ఎత్తుకు వెళుతుందని ఏనాడూ అనుకోలేదు.. మా కుటుంబానికి తీరని లోటు.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.