అసలైన అధికారం కోసం నేను సైతం… -పి. ప్రశాంతి

ఎన్నికలంటూ ఎన్నికలొచ్చె… ఓటు వేయబోతే… నీ ఓటు లేదు అనిరి! అట్లెట్ల లేదని గద్దించి అడగబోతే… నెట్టి కూల పారదోసే!!

గొంతెత్తి ఆక్రోశంతో పాడుతోంది చంద్రి. మరో 20 మంది ఆమెతో గొంతు కలిపి పిడికిళ్ళు బిగించి వంత పాడుతున్నారు. మూడువేల పై చిలుకు ఓట్లున్న ఆ ఊర్లో పంచాయితీ ఆఫీసు ముందు రెండు గంటలుగా మహిళలు బైఠాయించారు. సర్పంచ్‌ని రమ్మని, అప్పుడు నిన్ను గెలిపించిన మా ఓట్లు ఇప్పుడెందుకు పోయాయో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు.

యస్‌.సి మహిళ రిజర్వేషన్‌లో ఊరిపెద్దలు నిలబెడితే గెలిచిన నీల ఏ రోజూ ఆఫీసుకి పోలేదు. సర్పంచ్‌ సీట్లో కూర్చోలేదు. దొరింటి వ్యవసాయప్పనులకి ఊరి కూలీలను సమీకరించి, మూడు పంటలకి దగ్గరుండి పనులు చేయించటమే తనకు తెలుసు. రాత్రి బళ్ళో సంతకంతో పాటు అక్షరాలూ నేర్చుకుంది. చూసి రాయగలదు కానీ సొంతంగా రాయరాదు. కూలి పైసలు లెక్కకట్టి ఇవ్వగలదు కానీ బ్యాంకు పుస్తకాలు చూడలేదు. సర్పంచ్‌ అయినప్పటి నుంచి చెక్కులమీద సంతకం పెట్టడమే కానీ అది ఎందుకో తెలియదు… ఎంతకో తెలియదు. ఈ మధ్య తమ వాడకి ఒక ఎన్‌.జి.వో. నుంచి వచ్చిన లక్ష్మక్క సర్పంచ్‌ల ట్రైనింగ్‌కి తీసుకెళ్తే నాల్రోజులపాటు ఎన్నో విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపోయింది. తనేంటో అర్థమైౖ, ఏం చేయాలో ఊహించుకుంటూ ఊరికొచ్చింది. పది రోజుల్లోనే పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. మహిళా సంఘంలో చేరి ట్త్రెనింగ్‌లో విన్న విషయాల్ని అందరికీ పంచింది. వారం రోజులపాటు ఆ విషయాలే చర్చించుకున్నారు. అంతలోనే గ్రామ సంఘంలో చురుగ్గా పనిచేసే వారి పేర్లు ఓటర్ల లిస్టు నుంచి మాయమవ్వడం అందులోనూ ఎక్కువ మంది దళిత, ముస్లింల పేర్లే కనబడకపోవడంతో పంచాయితీ ఆఫీసు ముందు బైఠాయించారు. న్యాయం చెయ్యాలని జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌లు చేశారు. మీడియా, ఊరి జనం అందరూ వచ్చారు. ఆ జనంలో మహిళలు మాత్రం మచ్చుకి కూడా లేరు.

‘రోజుకి మూడు జండాలు పట్టుకుని విడివిడిగా మూడు పార్టీలకీ ప్రచారం చేసే మీకు… ఇప్పుడు ఓటే లేకుండా పోయింది, బాగా అయ్యింది. సిద్ధాంతమే లేనోళ్ళకి ఓటేసే హక్కెక్కడిది’ ఓ పార్టీ పెద్ద మనిషి ఎద్దేవా చేశాడు. మరి కొందరు తందానా అన్నారు.

‘ప్రచారం మా పొట్ట కూటి కోసం… ఓటు మా రాజ్యాంగ హక్కు’ గట్టిగా అరిచింది బాలమణి. ‘రోజుకో పార్టీ కండువా కప్పుకునే నీకెక్కడిది సిద్ధాంతం’ కస్సుమంది రాణి. ‘ఒక పార్టీ గుర్తుమీద గెలిచి, ఆ పార్టీ అధికారంలోకి రాలేదంటే ఏకంగా అధికార పార్టీలోకి గోడదూకేసే మీరు రాజ్యాంగ ముద్దాయిలు’ ఆవేశంగా అంది రజిత.

వాళ్ళు లేవనెత్తిన పాయింట్లు, వాడిన భాష విని ఖంగుతిన్నారు అక్కడి పెద్దలు.

‘మా శ్రమను దోపిడీ చేస్తూ, మా హక్కుల్ని కాలరాస్తూ మాకు న్యాయంగా రావల్సిన వాటిని రానివ్వక పోవడమే కాక మేము కడుతున్న టాక్స్‌లతో జీతాలు తీసుకుని మాపైనే అజమాయిషీ చేసే ఈ అధికార దాహపుగాళ్ళని ప్రశ్నించండి. మా తిండిమీద, మా కట్టుబట్టల మీద, మా స్నేహాల మీద కట్టడిని మేం ఊరుకోం’.

‘మా చదువుల మీద, మా ఇష్టా యిష్టాల మీద, మా మాటా పాట మీద ఎవ్వరి ఒత్తిడినీ మేం లెక్కచేయం’. ‘మా ఫోన్‌ల మీద, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల మీద, మా పత్రికలు, రాతలమీద, మా బ్యాంకు ఖాతాల మీద నిఘాని మేం సహించం’.

ఒకదాని వెనక ఒకటిగా ఘర్జిస్తున్న గొంతులు మార్దవంగా లేవు. ఓర్పు, సహనశీలతల పరదాలు చింపేసి వెలుగుతున్నట్లే ఉన్నాయి. సున్నితపు, సౌమ్యపు భ్రాంతులను మాయం చేస్తూ విప్పారుతున్నాయి. కంచులా మార్మోగుతున్నాయి.

‘మీ మీద ఎటువంటి అఘాయిత్యాలు జరగకూడదనే పెద్దల ఆలోచన. మన కుటుంబ వ్యవస్థ, దేశ సంస్కృతి ప్రపంచానికి ఆదర్శం కావాలనే ఈ ప్రయాస. మన సరిహద్దులవేపు ఎవ్వరూ కన్నెత్తి చూడకూడదనే ఈ ఘర్షణ’ ఓ పెద్ద బొట్టు పంచెకట్టు నీతి బోధ.

‘మా స్థానాన్ని కొల్లగొట్టకపోతే, మా మనోబలాన్ని, ఆత్మస్థైర్యాన్ని పితృస్వామ్య భావజాలంతో క్షీణింపచెయ్యకుండా ఉంటే, మా స్వేచ్ఛని, ఆలోచనా వైనాన్ని కట్టడి చేయకపోతే… మమ్మల్ని మేమే రక్షించుకోగలం. భక్షించాలనే మీ బుద్ధిని శుద్ధి చేసుకుంటే, జనాభాలో సగం ఉన్న మేము ఎవరి అనవసరపు రక్షణ, సంరక్షణ అవసరం లేకుండానే వీరవనితలమవుతాం. భావితరాలను క్రమశిక్షణ గల బాధ్యతాయుత పౌరులుగా మేము తయారు చేయక్కర్లేదు… మమ్మల్ని చూసి వారే నేర్చుకుంటారు. ఇప్పుడు మాత్రం మా రాజ్యాంగ హక్కయిన ఓటును స్వేచ్ఛగా వినియోగించుకోవడంలో ఎవరడ్డం పడినా మేము సహించం… ఈ అణచివేత, జులుం ఇక సాగనివ్వం…’ యువ గొంతుకలు ఎగసి పడుతున్నాయి.

ఈ చైతన్యమే… ఈ శాంతి యుద్ధమే తను కోరుకున్నదని తృప్తిగా చూస్తున్న నీల మనసులో అనుకుంటోంది – నేను సైతం… నేను సైతం…

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.