వర్తమాన లేఖ -శిలాలోలిత

ప్రియమైన శాంతిశ్రీ,

ఎలా

ఉన్నావు? నువ్వు విజయవాడ

షిఫ్టయిపోయాక

మనం కలవలేదిక. మనం మొదటిసారి ఎప్పుడు కలుసుకున్నామో గుర్తుందా నీకు. మా పెళ్ళయిన కొత్తలో ఐద్వా వాళ్ళ మీటింగులో కలుసుకున్నట్లు గుర్తు. అప్పటికి నువ్వు చాలా చిన్నదానివి. నీ కళ్ళల్లోని వెలుగు భవిష్యత్తంతా నీదేనన్న నిజాన్ని చెప్పిందప్పుడే. నీ మొదటి కథ ‘విపుల’లో రావడం, నీకెంతో సంతోషాన్ని కలిగించింది కదూ! ‘వెన్నెల’ ఆ కథ పేరు. 2009లో అనుకుంటా వచ్చింది. ఇప్పటివరకు ఓ పాతికపైనే కథలు రాసుంటావ్‌ కదూ! పుస్తకమింకా ఎందుకు వెయ్యలేదు?

‘కవి సంగమం’ నిర్వహించిన రెండవ సభలో వేదికమీద కవిత చదివావు. అప్పుడు నీ మొహంలో ఎంత సంతోషం కనబడిందో! నీలోని కవితా తృష్ణ పెరగడానికి ‘కవిసంగమం’ ఇచ్చిన ప్రోత్సాహమే కారణమని చాలా సందర్భాల్లో అన్నావు. ఆనాటి నీ కవితకు నిన్న ప్రజాశక్తిలో వచ్చిన లేటెస్ట్‌ కవితకు ఎంత తేడా ఉందో తెల్సా. నాకు బాగా నచ్చిందది. ఓసారి మళ్ళీ చదువు. కవిత పేరు – ‘సంపూర్ణ చైతన్యం’…

ఆమె బిడ్డకు చనుబాలు ఇస్తున్నప్పుడు సగం ప్రాణంగా సంచరిస్తున్న దుఃఖమేదో కట్టలు తెగిన జ్ఞాపకాల నదిలా ప్రవహిస్తూ కాసేపు నిన్నలా ముంచేస్తుంది

ఆమె నీకు స్త్రీ మినహా మరేమీ కాకపోవచ్చు

కాసింత కాంక్షాభరిత సుగంధాలతో అద్దిన

నులివెచ్చని స్పర్శగానే స్ఫురించవచ్చు ఆమె పేరు దయ నీలోకి ప్రవహిస్తున్నప్పుడు బీడువారిన భూమిలో పగుళ్ళన్నీ పూడుతున్నట్లూ

పచ్చని జీవితం మొలకల సందడి

ఎదనిండా వ్యాపిస్తున్నట్లుగా ఉంటుంది ఆమె నీ దేహం మాత్రమే కోరుతుందా?లేక

నీవే ఆమె దేహం మాత్రమే కాంక్షిస్తున్నావా?

ఈ దేహాలే సగం సగం అంటూ ఘోషిస్తున్నాయా?

అన్న ప్రశ్నలే… అద్దంలో ప్రతిబింబంలా

నవ్వితే నవ్వు… ఏడిస్తే ఏడువు…!

ఆమె సమ్మోహన స్పర్శ నీలోకి ఒలుకుతున్నప్పుడు / ఏకత్వపు శ్వాస ఎంత నిజమో వేరుపడి ఉన్నప్పుడు ఆమె అస్తిత్వమూ అంతే నిజం! ఆమె దేహం ఒక్కటే కాదు; హృదయమూ ఉన్న సంపూర్ణ / నీ వస్తువులా లెక్కించిన ప్రతిసారీ / అది కాదనీ, కుదరదనీ, మనిషిననీ / ఆమె ఆక్రోశిస్తూనే ఉంది. / నేలమీద నక్షత్రాలన్నీ వెల్లువలా ఒక్కటవుతున్నాయి / ఈ వెలుతురు వేళ నిండుపున్నమిలా ప్రకాశిస్తున్నప్పుడు / సగాలన్నీ సరైన సమానతల / హరివిల్లులని తెలుసుకుంటావు / సూర్య, చంద్ర, నక్షత్రాల్లో ఏ ఒక్కటి లేకున్నా / ఆకాశమెలా ఆవిష్కృతమవుతుంది. ఆమె – నీవూ సమస్త ప్రకృతీ లేకుంటే / భూమి ఎలా భువనైక బావుటాగా ఎగుస్తుంది? / సగ సగ నగరాలు ఏకధ్వనిన మోగినప్పుడే కదా / సంపూర్ణ చైతన్యం సాధ్యమవుతుంది?

చాలా స్పష్టంగా, పరిణతి నిండిన కవిత ఇది శాంతీ. నాకు బాగా నచ్చింది. మూడు తరాలకు ప్రతినిధివి నువ్వు. ఎలా అంటావా? అమ్మ ‘కల్పన’ జీవిత సముద్రానికి ఎదురొడ్డి గెలిచిన స్త్రీ. 10వ తరగతితో ఆపేసిన చదువు భర్త నిర్లక్ష్యంతో, మరో స్త్రీతో జీవితాన్ని పంచుకొన్న గాయాన్ని మాన్చుకోవడం కోసం, మళ్ళీ చదువు మొదలుపెట్టి, డిగ్రీ చేసి, విరిగిన తన రెక్కల్ని బలోపేతం చేసుకొని నిన్నూ, తమ్ముడ్ని పెంచి పెద్ద చేసింది చూడు. అదీ ఆమె విజయం. ఆత్మవిశ్వసాన్ని ఎక్కడా కోల్పోలేదు. మీ నాన్న చనిపోయిన తర్వాత పెన్షన్‌లో అమ్మ పేరు రాయకపోతే, అమ్మ హక్కు కోసం కోర్టుల చుట్టూ తిరిగితే నువ్వూ, శ్రీనివాస్‌లు అండగా నిలబడడం మెచ్చుకోదగ్గది. కులాంతర వివాహమని నీ పెళ్ళికి అమ్మ కొంత వ్యతిరేకించినా, తర్వాత ఆమె శ్రీనివాస్‌ను అభినందించడం మొదలుపెట్టింది. నిన్నొక పరిపూర్ణమైన వ్యక్తిగా తయారుచేసింది. నిన్ను నువ్వు స్ట్రెంతెన్‌ చేసుకోవడానికి అమ్మ జీవితం నేపథ్యమైంది.

80 మంది దగ్గరకు వెళ్ళి వాళ్ళ జీవితాన్ని ఇంటర్వ్యూల రూపంలో రికార్డు చేశావు. రియల్‌ స్టోరీస్‌ రాశావు. ‘ప్రజాశక్తి’లో 6,7 ఏళ్ళ నుండి ఐదారుగురితో ‘ఐద్వా అదాలత్‌’ అనే గ్రూప్‌ ఏర్పాటు చేసి ప్రతివారం కౌన్సిలింగ్‌ చేస్తున్నావు. స్త్రీలకు ఆర్థిక, రాజకీయ పరిణామాల గురించిన పరిజ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి, ఆర్థిక భద్రత ఉండాలి, మానసిక చైతన్యం ఉండాలి అనే నీ భావనలన్నీ నిజాలే. స్త్రీనింకా ద్వితీయ పౌరురాలిగా పరిగణించడమే నీకు నచ్చని విషయం. ఘర్షణల కొలిమిలోంచి వచ్చావు నువ్వు. పర్యావరణం యాంగిల్‌లో బి.టి.వంగ విత్తనాలు, సహకార సేద్యం గురించి ఎక్కువగా రాశావు. చిన్నప్పుడే మిషనరీ స్కూల్‌లో చదివేటప్పుడే ఎస్‌.ఎఫ్‌.ఐ.లో చేరావు. పాలిటెక్నిక్‌ కోర్సు, జర్నలిజంలో డిప్లొమా, కంప్యూటర్‌ నేర్చుకోవడంతో సబ్‌ ఎడిటర్‌గా ఎదిగావు. ’87 నుంచి ‘ఉదయం’ గారి దగ్గర రెండేళ్ళపాటు పి.ఎ.గా పనిచేయడంలో అనుభవాలలో మార్పు, ఆలోచనలలో దృఢత్వం వచ్చాయి. హైదరాబాద్‌ వచ్చాకే రచనా రంగంవైపు ఎక్కువగా మొగ్గు చూపావు. రెండో తరంలో నీ విజయం తర్వాత, మూడో తరంలో మీ పాప ‘నవ్య’ ఉన్నతమైన వ్యక్తిత్వంకలదానిగా, మనిషిగా పెంచడం మీరిద్దరూ సాధించిన విజయం. ‘నిర్భయ’ కేసు విషయంలో నవ్య వెలిబుచ్చిన అనుభవాల గాఢత నీకెంతో నచ్చాయన్నా వప్పుడు. మల్లు స్వరాజ్యం గారి ఆత్మకథను రాశావు. దాన్ని తొందరగా పూర్తి చెయ్యి తల్లీ! ఇది ఆజ్ఞ అనుకుంటావో, ప్రేమ అనుకుంటావో నీ ఇష్టం. నీ జీవితం ముళ్ళదారి గుండానే నడిచి విజయం సాధించావు. నాకింకో కోరిక కూడా ఉంది. నీ జీవిత చరిత్రను ఇప్పటి చారిత్రక సందర్భాన్ని రాయాల్సిన బాధ్యత నీకుంది. నువ్వు ఇంటర్వ్యూలు చేసిన స్త్రీలందరి ప్రస్తావనలతో వస్తే చాలా బాగుంటుంది. నువ్వు కోరుకున్నట్లుగానే స్త్రీలను ఇకనైనా మనుషులుగా గుర్తించే స్థితి కోసం, మన వంతు బాధ్యతగా చేయగలిగినంతవరకూ చేద్దాం. సరేనా! ప్రామిస్‌!

Share
This entry was posted in వర్తమాన లేఖ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.