బార్‌ డాన్సర్లకి జీవన స్వేచ్ఛలున్నాయా! -జూపాక సుభద్ర

ఈ మధ్య డాన్స్‌ బార్ల మీద మహారాష్ట్ర గవర్నమెంట్‌ విధించిన నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తేసింది. డాన్స్‌ బార్ల పునః ప్రారంభానికి సుప్రీంకోర్టు తాఖీదిచ్చింది. ఎందుకు సుప్రీంకోర్టు నిషేధాలొద్దు, నియంత్రణలు ముద్దంటోంది? సిసి కెమెరాలు పెట్టొద్దు, టిప్పులు ఇవ్వొచ్చు… కానీ నోట్లు విసరొద్దు. బార్‌ రూమ్‌కి, డాన్స్‌ స్టేజికి అడ్డు తెర ఉండొద్దు, విద్యా సంస్థలకు కిలోమీటరు దూరంలో ఉండాలన్న నిబంధన అవసరం లేదు, సాయంత్రాలు ఆరు నుంచి 11.30 దాకా ఉంచాలని ఆర్డర్స్‌ ఇచ్చింది. ఆధిపత్య కుల మగవాళ్ళకు అనుకూలంగా… ఈ తీర్పు ఉంది. ఈ నిషేధాలతో నష్టపోతోంది బార్‌ రూమ్‌ల యజమానులు, రెస్టారెంట్లు, హోటల్స్‌ యజమానులు. అట్లనే ఈ మగవాళ్ళ ఆనందాల కోసం, వినోదాల కోసమే బార్‌ డాన్సర్లు, డాన్స్‌ బార్‌లు. వీరికి ఆనందాలు పంచేది, ఆకలి అడుగున బతుకులీడుస్తున్న వారు ఎక్కువగా దళిత, ఆదివాసీ మహిళలు.

భారతీయ బార్‌ గర్ల్స్‌ యూనియన్‌ (బిబిజియు) అధ్యక్షురాలు వర్ష కాలే ప్రకారం ”మహారాష్ట్రలో… ముఖ్యంగా ముంబై దాని చుట్టుపక్కల దాదాపు ఆరు లక్షల మంది బార్‌ డాన్సర్లు ఉన్నారు. 2005లో మహారాష్ట్ర ప్రభుత్వం డాన్స్‌ బార్ల మీద నిషేధం విధించడం వల్ల బార్‌ డాన్సర్లు ఉపాధి కోల్పోయి సెక్స్‌ వర్కర్లుగా, డ్రగ్స్‌కి బానిసలై చచ్చిపోయారు, లైంగిక దాడులకు బలైపోయారు. వాళ్ళ జీవితాలు రోడ్డుపాలై ధ్వంసమయ్యాయి. ఈ తీర్పు బార్‌ డాన్సర్లకు విజయం. పని హక్కును తీసేయడం, నిషేధించడం అన్యాయం. సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నాం.” అట్లనే మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ కూడా ఈ తీర్పును స్వాగతించాలని, మహిళా జీవనోపాధి హక్కు రక్షణగా చూడాలని మాట్లాడ్తుంటరు. మన

ఉద్యోగాలు మనకొచ్చాయని ఈ మహిళల చేత విజయోత్సవాలు చేయిస్తున్నరు. నిజానికి బార్‌ డాన్సర్లుగా ఆధిపత్య కులాల మహిళలు ఉంటే ఇట్లాంటి తీర్పులు వచ్చేయి కాదేమో! 2005 నుంచి పేరుకు నిషేధాలు, ఎత్తివేతల డ్రామాలు ప్రభుత్వాలు, హైకోర్టు, సుప్రీంకోర్టుల మధ్య నడిచి ఇప్పుడు డాన్స్‌ బార్లని బార్లా తెరిచి ఎటువంటి నియంత్రణ లేని ఆనందాలు పొందండి అంటూ ఆధిపత్య కులాల మగాళ్ళకి అనుమతులిచ్చింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, ప్రభుత్వాలు నడిపేదంతా ఆధిపత్య మగ ప్రపంచమే. దానికి వత్తాసు పలికేది, దళిత మహిళల చేత పలికించేది మహిళా సంఘాలు, ఫెమినిస్టు సంఘాల సవర్ణ మహిళలు.

భారతదేశంలో దళిత మహిళలు పాకీ పనోళ్ళు, మున్సిపల్‌ పారిశుధ్య

పనివాళ్ళు, ఇండ్లల్ల పన్జేసేవాళ్ళు, రైతు కూలీలు, పరిశ్రమల కూలీలు, భవన నిర్మాణ కూలీలు, వలస కూలీలు, జోగినీలు, మాతమ్మలు, దేవదాసీలు, శివసత్తులు, సెక్స్‌ వర్కర్లు, బార్‌ డాన్సర్లు… వంటి అనేక రకాల శ్రమ చేస్తున్నారు. సమాజపు అగాధాల్లో సామాజిక అంచుల్లో విపత్కర పరిస్థితుల్లో నీచంగా చూడబడే వృత్తుల్లోకి నెట్టబడినవారు దళిత మహిళలు.

2005లో డాన్స్‌ బార్లని నిషేధించినపుడు దేశవ్యాప్తంగా కొంత చర్చ నడిచింది. 2006లో జరిగిన నేషనల్‌ ఉమెన్‌ కాన్ఫరెన్స్‌లో ‘బార్‌ డాన్సర్ల’ చేత డాన్స్‌ చేయించి, వారిమీద డబ్బులు విసిరి, వారి రైకల్లో రూపాయిలు దోపి వినోదించిన వారు సవర్ణ మహిళా నాయకురాండ్రు. వాళ్ళ మగవాళ్ళు బార్లల్ల చేస్తే వీళ్ళు బయట చేసిండ్రు. దళిత మహిళలు సవర్ణ సమాజం నీచంగా చూసే వృత్తుల్లోకి ఎందుకొస్తున్నారు? అనే ప్రశ్నకి ఎవరు ఏ వృత్తయినా ఎంచుకోవచ్చు, అది వారి స్వేచ్ఛగా వదిలేయాలి అని వారి భాషా పటిమల్తో, అనుభవజ్ఞానవాద పాండిత్యాలతో అణిచి వేస్తుంటరు. పైకి స్వేచ్ఛ, హక్కు అనేవి కమ్మగా కనిపించొచ్చు, వినిపించొచ్చు కానీ దీనిలో కొత్త ప్రశ్నలు, కొత్త కోణాలు, చర్చలు, కొత్త అర్థాలు వెతుక్కునే అవసరముంది.

దళిత మహిళలు ఆడి పాడి వినోదాలు, ఆనందాలు కల్పించే ఈ సంస్కృతి ఎక్కడిది? ఈ సంస్కృతికి దళిత మహిళలే ఎందుకు బలి కావాలి? బల్సిన మనుషుల్ని ఎంటర్‌టైన్‌ చేసే పనిముట్లుగా భద్రతలేని ఈ కుల మార్కెట్‌గా ఉన్న బార్‌ డాన్సర్‌ వృత్తి దళిత మహిళ రక్షణకి, ఆత్మగౌరవ హక్కుకు, అభివృద్ధికి ఆటంకంగా చెప్పుకోవాలి.

సమాజంలో భద్రతలు, గౌరవాలు, అవకాశాలన్నీ ఆధిపత్య కుల మాతృ

పితృలకే సొంతమైతే… అగౌరవంగా

ఉండిన, ప్రమాదకరమైన, అభద్రమైన వృత్తుల్లోకి నెట్టబడుతున్న వాళ్ళు దళితులు, దళిత మహిళలు. వీళ్ళని ఇట్లా నెట్టివేసి మళ్ళీ ఆ రొంపి నుంచి బైటికి రాకుండా ‘స్వేచ్ఛ’లని, హక్కులనే పూతలు పూసే రాజకీయాల్ని ఎట్లా సమర్ధిస్తాము? కుల సమాజంలో దళిత మహిళల ఆత్మ గౌరవాన్ని, అభివృద్ధిని హరించే స్వేచ్ఛ ‘వారిని ఇంకా అణగదొక్కే స్వేచ్ఛ’నే అనే చైతన్యం రావాలి. దళిత మహిళల్ని నీచమైన, అగౌరవమైన వృత్తుల్లోకి నెట్టేస్తున్న పరిస్థితుల్ని వాటి నేపథ్యాల్ని ప్రశ్నిస్తూనే వారికి వ్యక్తిగత భద్రత కల్పించాలి. కానీ ఫెమినిస్టు, సవర్ణ సంఘాలు బార్‌ డాన్సర్ల కుల నేపథ్యాల పునాదుల్ని, కుల మార్కెట్‌ గ్లోబల్‌ కల్చర్‌ని, వారి పేదరికాన్ని అర్థం చేసుకోకుండా వారి ‘వ్యక్తిగత స్వేచ్ఛ’ని వ్యతిరేకించొద్దంటున్నారు. దళిత మహిళల ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని అణచివేసే స్వేచ్ఛలు ఏ రూపంలో వచ్చినా అవి దళిత మహిళలను ఇంకా అణగదొక్కేవే. దళిత మహిళలకు మానవ హక్కులు దూరమైన రాజకీయాల్ని పక్కనబెట్టి ‘వృత్తిని ఎన్నుకోవడం’ ‘వ్యక్తి స్వేచ్ఛ’ అనే పై పూతల్ని సమర్ధించడం అంటే… అభద్రతంగా, అగౌరవంగా చూడబడుతున్న వృత్తుల్లోకి వెళ్ళడానికి దళిత మహిళల్ని నెట్టేయడం సామాజిక నేరంగానే చూడాలి.

Share
This entry was posted in మా అక్క ముక్కు పుల్ల గిన్నే పోయింది. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.