20 జూన్ 2019 ఉదయం నా ఫ్రెండ్ పెట్టిన మెసేజ్ ద్వారా అబ్బూరి ఛాయాదేవి గారు ఇక లేరు అని తెలిసింది. ఆత్మీయుల్ని కోల్పోయానని అనిపించింది. వెనువెంటనే అయ్యో నేను హైదరాబాద్ నుండి వచ్చేసేటప్పుడు, ఛాయాదేవి గార్ని కలవాలనీ, కనీసం ఫోన్ చేయాలనీ అనుకుంటూనే తాత్సారం చేసాను, ఇప్పుడు మళ్ళీ ఆ అవకాశం రాదు కదా అని బాధపడ్డాను. ఎప్పుడు ఫోన్ చేసి కలవడానికి వస్తానన్నా, ‘వద్దు, చాలా దూరం, ఎండల్లో కష్టపడి ఇంత దూరం రావద్దు’ అనేవారు. నేను ఇబ్బంది పడతాననే భావన ఉండేది ఆమె మాటల్లో. అయినా రెండు మూడు సార్లు సి.ఆర్.ఫౌండేషన్‌కి వెళ్ళి ఆవిడతో కొద్దిసేపు గడిపాను. ఎప్పుడు వెళ్ళినా ఆప్యాయంగా పలకరించి, సాహిత్య చర్చతో పాటు ఏవో ఫలహారాలు కూడా పెట్టేవారు. ఎంతో నిరాడంబరంగా, సరళంగా ఉండేవారు. వయసులో చిన్నవారి పట్ల కూడా ఎంతో గౌరవంగా ఉండేవారు. ఎప్పుడు కలిసినా మళ్ళీ మళ్ళీ కలవాలని అనిపించేది. మే నెలలో అనుకుంటూనే ఆవిడ్ని కలవకపోవడం నాకు జీవితాంతం కొరతగానే మిగిలిపోతుంది.
ఎప్పుడు ఏ సహాయం అడిగినా, ఫోన్ నంబర్ అడిగినా చాలా సిన్సియర్‌గా, తన దగ్గర లేకపోయినా ఎవరెవర్నో కనుక్కొని తెప్పించి ఇచ్చేవారు. ఛాయాదేవి గారి కథల్ని అనువాదం చేసే అవకాశం నాకు కలిగింది. తర్వాత నా “My mother My strength” పుస్తకం గురించిన ఆలోచన చెప్పినప్పుడు ఎంతో ఉత్సాహంతో వ్యాసం రాస్తానని చెప్పడమే కాకుండా కొంతమంది రచయిత్రులను కూడా నాకు పరిచయం చేశారు. అందులో కొండవీటి సత్యవతిగారు ఒకరు. బాపట్లలో పురస్కారం అందుకునే సందర్భంలో తన అనువాదాలను చదివి సభలో తెలుగులో మాట్లాడమని పిలిచారు. బాపట్ల ప్రయాణం సత్యవతిగారితోనూ, తిరుగు ప్రయాణం ఛాయాదేవి గారితోను మంచి అనుభవాలు. ఛాయాదేవి గారి నిరాడంబరత, సున్నిత మనస్తత్వం, స్నేహభావం, ఏది చెప్పినా సూటిగాను మనసు నొప్పించక చెప్పే విధానం నాకు చాలా ఇష్టం. ఎప్పుడు కలిసినా జూశీరఱ్‌ఱఙవ ఙఱపతీa్‌ఱశీఅ దొరికి మళ్ళీ మళ్ళీ కలవాలనీ, మాట్లాడాలనీ అనిపించేది. ఛాయాదేవి గారు కూడా మా అమ్మ వయసులోనే కన్నుమూశారు.
I will miss her like I miss my mother.