నువ్వు ఇప్పుడు మాట్లాడావనుకో
అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అని అనవచ్చు
పోనీ అపుడు మాట్లాడే ఉంటావనుకో, ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు అనవచ్చు.
సరే అప్పుడు, ఇప్పుడూ మాట్లాడితే, ఫలానాప్పుడు మాట్లాడావా అనవచ్చు
అవునా, అయితే ఆ ఫలానా అప్పుడు ఇంకో ఈ ఫలానా ూడా జరిగింది
ఆ ఫలానా మీద నువ్వు మాట్లాడావా అనవచ్చు
ఇప్పుడు మళ్లీ ఇప్పటి వద్దకు వద్దాం.
ఇప్పుడు ఇంకో ఇప్పుడు
ఇప్పుడే జరిగింది దాని గురించి ఇప్పుడేమంటావో అనలేదు కదా అని ూడా అనవచ్చు.
సరే, ఇట్లా ఎవరన్నా ఎవరి గురించైనా, జరిగిన జరుగుతూ
ఉన్న దేని గురించైనా
అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా, అనవచ్చు
సరే, అప్పుడు అట్లా అనడానికి నీకున్న అర్హత
నువ్వు ఫలానా, ఫలానా నా అయివున్నావా ?
నువ్వు అలా అయివున్నప్పటికీ
ఆ మరో ఫలానా విషయం పై ఫలానా, ఫలానా మాటలు అనేందుకు నీవసలు ఎవరు? ఏమిటి అని అనవచ్చు
అప్పుడు పుట్టి ఉండవచ్చు, లేదూ మరణించి ూడా ఉండవచ్చు
అప్పుడు ఫలానా వాళ్ళ కోడి నిదుర పోయిఉండవచ్చు
లేదా అసలు వాళ్ళ కోడి ఇంకా పుట్టి ఉండక పోవచ్చు
లేదా దాన్ని ఫలానా వాడు హత్యచేసి ఉండవచ్చు
అప్పుడు కోడీ, కోడీ నువ్వు ఎందుకు ూయలేదని అడగటం భావ్యమా?
లేదూ కొన్ని కోళ్లు ఆలస్యంగా ూయవచ్చు
సరే, మొత్తానికి ూయడం కదా కావాలి ఇప్పుడు
కొన్ని కొన్ని జరిగినప్పుడు మనం ఇంకా పుట్టక పోవడం గురించి ూడా దుఃఖిద్దాం
ఎవరి ూత వాళ్లదే అయినప్పటికీ
ఎప్పుడోకపుడు కోళ్లన్నాక ూయడమే మంచిదేమో ఒకొక్కరికి ఒక్కోసారి తెల్లవారుతుంది
నిబిడాశ్చర్యంతో ఎప్పటికో ఒకప్పటికి నిద్రలేచి
ఈ చీకటి రాత్రికి గుచ్చుకున్న
సవాలక్ష ముళ్ల కంచెలని ధ్వంసించేందుకు
ఫలానా, ఫలానా వాళ్ళందరూ మాట్లడటం
మొత్తానికి అందరూ మేల్కొనడం
మంచిదే కదా?