అడుగడుగునా సుడిగుండాలు దాటే ఆడపిల్లలు – పి. ప్రశాంతి

చిన్నగా, ఒక్కొక్కటిగా మొదలైన పిట్టల కిలకిలలు, అంతలోనే బృందగానాలూ అన్నీ కలిసి సుప్రభాతం ఆలపించడం ప్రారంభిం చాయి. దుప్పటి ముసుగులా కప్పుకుని ముడుచుకు పడుకున్న శిరీష మరింత మునగ దీసుకుంది. రాత్రి మొదలైన పీరియడ్స్‌తో కడుపునొప్పి మొదలై బద్దకంగా ఉండి లేవాలని పించట్లేదు. పక్కింటి పద్మత్త వాకిలూ డుస్తున్న చప్పుడు, ఎదురింటి అలివేలు పిన్ని పాలు పిండ డానికి ప్రయత్నిస్తూ బర్రెని, దూడని అదిలిస్తున్నది చెవుల పక్కనే వినిపిస్తున్నట్టుంటే దుప్పటితో పాటు చేతుల్తోనూ చెవులు మూసుకుంది. పది గజాలు కూడా దూరం లేని ఇళ్ళు మరి.

కడుపులో పిండుతున్నట్లుగా నొప్పి మొదల వడంతో ఇక పడుకోలేక మెల్లగా లేచి కూర్చుంది. గదిలో ఓ పక్కగా తమ్ముళ్ళిద్దరూ మంచి నిద్రలో ఉన్నారు. పక్క వీథిలో ఉండే పార్వతమ్మ మాట గట్టిగా వినపడి నిస్సత్తువగా చూసింది. తమ వీథిలోకి కూడా వచ్చి ‘తొమ్మిదికంతా చేనులో దిగాల… ఎనిమిదికే ఆటో వస్తది. రెడీగా

ఉండండి’ అని సైరన్‌ ఇచ్చింది. ఆ వైపు ఒక్క క్షణం దిగాలుగా చూసినా తన కర్తవ్యం గుర్తొచ్చి లేచింది శిరీష. ‘పత్తి కూలికి పోయినన్నాళ్ళే కాస్త ఆదాయం వచ్చేది. కనీసం మరో 15 రోజులన్నా పనికి వెళ్తే కానీ తను కాలేజీ ఫీజు కట్టుకోవడానికి, తమ్ముళ్ళకి పుస్తకాలు కొనడానికి డబ్బు సరిపోదు. ఇప్పుడైతేనే రోజుకి 250 రూ. వస్తుంది. తప్పదు వెళ్ళాలి’ అనుకుంటూ చకచకా పక్కబట్టలు మడతపెట్టి పనిలో పడింది.

శిరీష తల్లిదండ్రులకు నలుగురు పిల్లలు.

భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుని పిల్లల బతుకులు తమలా కాకూడదని, వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి తాము కష్టపడ్డా పర్లేదని నిర్ణయించుకుని తల్లిని పిల్లల దగ్గరుంచి ముంబైలో కాంట్రాక్ట్‌ లేబర్‌గా ఐదేళ్ళకి బాండ్‌ రాసిచ్చారు. అలా ముంబై చేరుకున్న ఆ జంట భవిష్యత్తులో తమ జీవితాలు తమ చేతుల్లో ఉండవని ఊహించలేదు. వెళ్ళిన ఏడాదికే అనారోగ్యంతో తల్లి పోయినా వెనక్కి వచ్చెయ్యలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. ఇక ఇల్లు, పొలం, పిల్లల బాధ్యత పదో తరగతికొచ్చిన పెద్దమ్మాయి మనీష మీద పడింది. పధ్నాలుగేళ్ళకే పెద్దరికాన్ని తీసుకుంది.

మనీష పదో తరగతి పూర్తయ్యేసరికి శిరీష హైస్కూలుకొచ్చింది. మనీషకి డాక్టర్‌ అవ్వాలని కోరిక. ఇంటర్‌లోనూ మంచి మార్కులే వచ్చినా ఎమ్‌సెట్‌కి ప్రిపేర్‌ కాలేకపోయింది. రోజూ కాలేజికి అంత దూరం వెళ్ళొచ్చేసరికి ఓపికై పోయేది, టైం కూడా సరిపోయేది కాదు. లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకోవాలన్నా ఆర్థికంగా అనువు గా లేదు. ఇది అర్థం చేసుకున్న మనీష చెల్లితో తన ఆలోచనల్ని చెప్పేది. చాలా చురుగ్గా

ఉండే శిరీష వయసుకు మించి పరిణతితో అక్కకి చేదోడుగా ఉండేది. మనీషకు ఇంటర్‌లో ఫ్రీ సీట్‌ వచ్చి ఎమ్‌సెట్‌ కోచింగ్‌తో హాస్టల్‌ వసతితో చదువుకునే అవకాశం వచ్చినా వదులుకుంది. వెంటనే ఉద్యోగంలో చేరే అవకాశం వచ్చినప్పుడు మొదలైంది భయం. నెలకి పదివేల జీతం, కానీ పట్నంలో ఉండాలి. తల్లిదండ్రుల బాధని చూస్తూ వాళ్ళతో చెప్పలేక అక్కచెల్లెళ్ళిద్దరూ చర్చించుకున్నారు. శిరీష అక్కని ప్రోత్సహించింది. బాధ్యతలు తను తీసుకుంటా నంది. నెలకి పదివేలు తమ జీవితాలకి ఎంతో అవసరమని నిర్ణయించుకుని పట్నంలో

ఉద్యోగంలో చేరడానికి నిర్ణయమైంది.

అప్పటికి దాదాపు ఐదేళ్ళుగా పొలం పనుల్లో అక్కతోపాటు చురుగ్గా పాల్గొనడంతో అన్నీ అవగతమయ్యాయి కనుక, ఇంటి బాధ్యత అప్పటికే నిభాయిస్తోంది కనుక ధైర్యంగా చెప్పింది అక్కకు – ‘నువ్వు సంపాదించు, అమ్మా నాన్నల్ని జల్దీ ఇంటికి తెచ్చుకుందాం’ అని. ఇల్లు, పొలం, తమ్ముళ్ళని చూసుకుం టూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టింది. పదో తరగతిలో 9 పాయింట్లతో లెక్కల్లో 95 మార్కుల్తో పాసయ్యింది. జిల్లా కేంద్రం నుంచి కాలేజీలు క్యూ కట్టాయి, ఫ్రీ సీటుతో పాటు ఇంజనీరింగ్‌కి శిక్షణనిస్తామని. రెండేళ్ళు గిర్రున తిరిగిపోయాయి. అక్క సంపాదన ఎంత జాగ్రత్తగా వాడుకున్నా పట్నంలో కనబడని ఖర్చులవ్వడంతో పెద్దగా కూడబెట్టలేక పోతున్నానని బాధపడేది. తమ్ముళ్ళకి మాత్రం ఏ లోటూ లేకుండా చూసుకునేది.

ఇంటర్‌ ఫైనల్‌ పరీక్షలింకా అవ్వనేలేదు, కరోనా ఉత్పాతం వచ్చి పడింది. చదువులేమ వుతాయో, పరీక్షలెలా పెడ్తారో, బడులు, కాలేజీలు ఎప్పుడు తెరుచుకుం టాయో… అంతా అయోమయం. మొత్తానికి పరీక్షలయ్యి 92% మార్కులతో పాసైనా శిరీషకి సంతోషంగా లేదు. లాక్‌డౌన్‌ వల్ల తల్లిదండ్రులు ఊరికి రాలేకపోయారు. పనీ లేదు, కూలీ లేదు. తిండి గడిచినా అప్పు కట్టలేకపోవడంతో వడ్డీ పెరిగిపోయింది. తమ్ముళ్ళకి ఆన్‌లైన్‌ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్‌ అవసరమైంది. అక్కచెల్లెళ్ళి ద్దరూ తిప్పలు పడి సెకండ్‌హ్యాండ్‌ది ఒకటి కొనిచ్చారు. కానీ కనెక్టివిటీ సమస్యతో, క్లాసుల సమయం క్లాష్‌ అవుతుండడంతో వాళ్ళ మధ్య టెన్షన్లు మొదలయ్యాయి. అన్నదమ్ములిద్దరూ ఘర్షణ పడడం, అక్క చేనుకెళ్ళినప్పుడు ఫోన్‌లో ఆటలాడుకోవడంతో నెట్‌ త్వరగా అయిపోవడం, అదే పనిగా ఫోన్‌ చూస్తుండడంతో కళ్ళు పొడారిపోవడం, తలనొప్పి రావడం వంటి సమస్యలు మొదలయ్యాయి. తను డిగ్రీలో చేరడానికి, తమ్ముళ్ళకి, తనకి బుక్స్‌ కొనడానికి డబ్బు అవసరమైంది. తనకి కూడా క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్‌ కావాలి, నెట్‌ కావాలి. ఇక పత్తి కూలికి వెళ్ళడమొక్కటే దారి. రోజుకు 250 రూ. వస్తాయి. ఒక నెల్రోజులు పనికెళ్తే సరిపోతుంది. అదిగో అందుకే కడుపునొప్పిని లెక్కచెయ్యకుండా లేచి పత్తిపనికి పోడానికి చకచకా సిద్ధమౌతోంది. ”కష్టాలు రానీ, కన్నీళ్ళు రానీ… ఓడిపోవద్దు, రాజీపడొద్దు” అని పాడుకుంటూ తనని తాను ఉత్తేజపరచుకుంటూ సాగుతోంది.

డిగ్రీకొచ్చినా బక్కపల్చగా, ఎత్తు తక్కువగా, పోషణ లేనట్లుండే శిరీషని ఎవరు చూసినా హైస్కూల్లో అప్పుడే చేరిందను కుంటారు. చురుకైన కళ్ళ వెనక, ఆకర్షణీ యమైన నవ్వు వెనక దాగున్న టెన్షన్లు ఎవరికీ కనబడవు. ఇరవయ్యేళ్ళు కూడా లేని శిరీష అరవయ్యేళ్ళ అనుభవానికి, బాల్యాన్ని పోగొట్టుకుని పెద్దరికం మీదపడి, ఎదగాల్సిన సమయంలో ఏ పోషణ అందక కుచించుకు పోయిన శరీరాలు, ఇరుకున పడ్డ ఆరోగ్యం, ఆవిరైన కలలు… ఇలాంటి శిరీషలు, మనీషలు గ్రామగ్రామాన ఎంత మందో! యువ భారత్‌… వెలుగుతున్న భారత్‌… ఇందులో శిరీషలు, మనీషలు ఎక్కడ!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.