రైతు స్వరాజ్య వేదిక`దశాబ్ది మహాసభల సందర్భంగా కురుగంటి కవిత ఉపన్యాసం

దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రైతు స్వరాజ్య వేదికకు అభినందనలు. ఢల్లీిలో జరుగుతున్న రైతుల ఉద్యమం గురించి మాట్లాడటం మొదలు పెడితే, ఒక రోజు ఒక మూడవ తరగతి చదివే బాలుడు పంజాబ్‌ నుంచి స్కూల్‌ నుంచి పారిపోయి వచ్చాడు ఒకరోజు. ఆ

బాలుడు స్టేజ్‌మీదికి వచ్చేశాడు. ఇది రిపబ్లిక్‌ డే ముందు 23వ తేదీన జరిగిన సంఘటన. ఆ బాబు బస్సు ఎక్కిన తర్వాత టికెట్‌ తీసుకునేటప్పుడు కండక్టర్‌తో పాటు మిగిలిన వాళ్ళకు అతను ఇంట్లోవాళ్ళకు చెప్పకుండా పారిపోయి వచ్చాడని అర్థమయింది. అతన్ని సింఘు బార్డర్‌ వరకు తీసుకొచ్చి, స్టేజీ వరకు తీసుకొచ్చాక ఆ బాబు అక్కడ నిల్చొని వాళ్ళతో ‘‘26వ తేదీన ఎక్కడైతే మనం ఢల్లీిలో రైతుల పెరేడ్‌లోకి వెళ్ళడానికి సిద్ధమవుతామో అందులో నాకు అందరికన్నా ముందుండాలని ఉంది. భగత్‌సింగ్‌లాగా నా ప్రాణాలను రైతులకు ఇవ్వడానికి నేను రెడీ అయ్యి వచ్చాను. మా అమ్మా, నాన్నలను మీరే ఒప్పించాలి. నేను ఇక్కడే, ఈ పోరాటంలో ముందుంటాను’’ అని చెప్పాడు. ఈ ఉదాహరణ మన ముందుంది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కేవలం పై పైకి చూపెట్టే విలువలు కాదు, రక్తంలో, ఒక్కొక్క కణంలో జీర్ణించుకుపోయిన కొన్ని విలువలు మరియు సూత్రాలను ఈ ఉద్యమంలోకి తెచ్చిన పోరాటవీరులు ఉన్నారు. వాళ్ళ స్ఫూర్తితో అది చాలా విస్తరిస్తోంది. అక్కడ కుల మతాలు లేకుండా… అంటే కులమనేది ఉంది. అక్కడ కూర్చొని ఉన్న నాలాంటి వాళ్ళకు దళిత రైతుల మాటేంటి అని లోపల చాలా అనిపిస్తూ ఉంటుంది. పంజాబ్‌లాంటి సిక్కు మతం ఉన్న రాష్ట్రంలో కూడా మధ్యబీ సిక్కులు అని కొంతమంది మధ్య తరగతి సిక్కులు ఉన్నారు. సిక్కులు అంటే సర్దార్జీలు. వాళ్ళ గురించి, వాళ్ళ పోరాటాల గురించి స్టేజీలపైన ఎక్కువగా చర్చ వినబడదు. అయినా కూడా మతమనేది లేదని చెప్పుకోవడానికి లేకుండా, జనవరి 28న పోలీసులు వచ్చి తరిమేస్తున్నప్పుడు ఉత్తరప్రదేశ్‌ జాట్‌ కులస్థుడైన రాకేష్‌ జీ షికాయత్‌ గారు కళ్ళనీళ్ళు పెట్టుకోవడంతో రాజస్థాన్‌, హర్యానాలో ఉన్న జాట్లంతా రాత్రికి రాత్రే నిద్ర కూడా పోకుండా దాసీపూర్‌ సరిహద్దుకు వచ్చిన సందర్భం కూడా ఉంది.
కాబట్టి ఒక విధంగా కులమనేది, ూశీషఱaశ్రీ ఖఱఅంష్ట్రఱజూ చీవ్‌షశీతీస అనేది పాజిటివ్‌గా కూడా ఎలా వాడుకోవచ్చు? కేవలం వేరేవాళ్ళని అణచివేయడానికి కాకుండా ఒక మంచి విషయం కోసం వాడుకోవడానికి ఏమన్నా ఆస్కారముందా అనే వాటిపై చూచాయగా కొన్ని ఉదాహరణలు వెలుగులోకి వచ్చాయి. కానీ, ఇంకో విధంగా చూస్తే ఇటువంటి తారతమ్యాలేమీ లేకుండా జరుగుతున్న ఉద్యమం ఇది. ఉద్యమం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇంటర్వ్యూలు చేసిన చాలామంది మమ్మల్ని అడిగారు అత్యధికంగా 11 సార్లు చర్చలకు వెళ్ళారు కదా, మీరు ఏమి సాధించారు? అని. ఢల్లీిలో విజ్ఞాన్‌ భవన్‌కు వెళ్తున్న దారిలో, విజ్ఞాన్‌ భవన్‌ బయట ఇలా ప్రతిసారీ మీడియా వాళ్ళు, ముఖ్యంగా Aదీూ చీవషం వాళ్ళు చాలా నాటకీయంగా మీరు ఇన్నిసార్లు ఇలా చర్చలకు వెళ్తున్నారు, ఏమి సాధించారు అని ప్రశ్నించారు.
దానికి రాకేష్‌ జీ షికాయత్‌ గారు చాలా చక్కటి సమాధానం చెప్పారు. ఏంటంటే, ఈ దేశంలో రైతులకు, వేరే దేశాల రైతులకు కూడా… ఒకసారి విత్తనం వేశాక ఆరు నెలలపాటు పంట చేతికి వచ్చేదాకా దానికోసం వేచి ఉండే ఓపిక మా నరనరాల్లో ఉంది. ఆరు నెలలు వేచి చూశాక పంట కోస్తున్నప్పుడు కూడా ఒక పెద్ద వడగండ్ల వానో, ఇంకా ఏదన్నా ఒక ప్రకృతి వైపరీత్యమో (చీa్‌బతీaశ్రీ ణఱంaర్‌వతీ) వస్తే ఆ పంట కూడా కోయలేకపోవచ్చు. అయినా కూడా మేము నిరాశకు గురవ్వము. మళ్ళీ విత్తనం వేస్తాము. దాని కోసం 6 నెలలు వేచి చూస్తాం. ఇది రైతులలో ఉన్న ఒక సహజ తత్వం. మాకు ఆశ ఉంది, ఓపిక ఉంది, పట్టుదల ఉంది. అవి ఉన్నందుకే ఈ దేశంలో వ్యవసాయం చేస్తున్న రైతులు తట్టుకుంటున్నారు కదా. ఈ రైతు వ్యతిరేక వ్యవస్థలో వాళ్ళు … తట్టుకున్నారంటే ఇవి ఉన్నాయి కాబట్టే. ఈ గుణాలు వారి జీవితంలో భాగమైపోయాయి. ఆ విధంగానే ఈ రోజు అక్కడ పోరాటం కూడా కొనసాగుతోంది. ఈ పోరాటంలో మీ డిమాండ్లు ఇంకా నెరవేరలేదు కదా అన్నదానికి మేము మళ్ళీ, మళ్ళీ చెబుతోన్న సమాధానం ఏమిటంటే ‘‘ఆ డిమాండ్లు కూడా మనకు తక్కువ కాలంలోనే చేకూరతాయి’’. ఆ నాలుగు డిమాండ్లు ఏంటంటే ‘మూడు చట్టాలను రద్దు చేయడం, ఎంఎస్‌పి ని ఒక చట్టపరపమైన హక్కుగా ప్రతి రైతుకి అందించడం, ఢల్లీి ఎయిర్‌ పొల్యూషన్‌ సందర్భంలో ఒక కమిషన్‌ని ఏర్పాటు చేసి అందులో వ్యవసాయంలో ఉన్న కొన్ని కార్యక్రమాలను కూడా పీనల్‌ క్లాజెస్‌ `శిక్షను విధించడం అనేది ఒక ఆర్డినెన్స్‌ ద్వారా చేయడం జరిగింది. ఎవరన్నా వాళ్ళ చేనుకి మంట పెడితే ఒక కోటి రూపాయలు, ఐదేళ్ళ కారాగార శిక్ష,. గోధుమ, వరి పంటను కాల్చితే వేసే శిక్షను కూడా అందులో ఉన్నదాన్నే తీసేయాలి అని ఒక డిమాండు. నాల్గవది విద్యుత్‌ సవరణ చట్టం. డ్రాఫ్ట్‌ బిల్లును ఉపసంహరించుకోవాలని. ఆ నాలుగు డిమాండ్లు కూడా నెరవేరతాయని మాకందరికీ నమ్మకం ఉంది. మీకు కూడా ఉందని అనుకుంటున్నాను.
అయితే ఆ నాలుగు డిమాండ్లే కాక ఇంకా ఎన్నో సాధించింది ఈ ఉద్యమం. అందులో ముఖ్యమైనది రైతులు ఐకమత్యంతో పోరాడితే తప్పకుండా సాధించగలుగుతారు అనే ఒక ధైర్యం ఈ ఉద్యమం నుంచి రైతాంగానికి అందింది. మనందరం ఎన్నేళ్ళ నుండో కలలు కంటోన్న ఉద్యమమిది. మనం ఎటువంటి ఉద్యమకారుల కోసం వేచి చూశామో అటువంటి ఉద్యమం ఇది. ఇంటికి వెళ్తాను అన్న ధ్యాసే లేదు అక్కడ కూర్చున్న వాళ్ళకు. ఎటువంటి ఆందోళన అంటే మనందరం నేర్చుకోవలసిన విషయాలు చాలా ఈ ఆందోళనకారులు మనకు నేర్పిస్తున్నారు.
ఒకటి గ్రామాల నుంచి ఒక రొటేషన్‌ పద్ధతిలో ఉద్యమకారులను ఎలా పంపించాలన్న దానిపై పంజాబ్‌లోని ప్రతి గ్రామం ఇప్పటికే ఒక విధానాన్ని (ూవర్‌వఎ) ఏర్పాటు చేసుకుంది. మీడియా వాళ్ళు, తెలియని వాళ్ళు అనుకొంటుంటారు వీళ్ళది ఎప్పుడు అయిపోతుంది, అయిపోతే కనుక ఏమీ చేకూరదేమో అని భయపడుతుంటారు. కానీ, గ్రామాల్లో సామాజిక నియంత్రణ పద్ధతి (ూశీషఱaశ్రీ Rవస్త్రబశ్రీa్‌ఱశీఅ ూవర్‌వఎ) ఒకటి ఏర్పడిరది, మీ కుటుంబానికి ఇప్పుడు ఒక చక్కటి అవకాశం వస్తే మీరు వెళ్ళాలనేది. మీ టర్న్‌లో మీరు వెళ్ళకపోతే కనీస జరిమానా కట్టాలి. ఆ డబ్బుతో ఇంకొకరు వెళ్ళడం కానీ, దాన్ని ఉద్యమానికి దానం కింద ఇవ్వడం కానీ అక్కడి మెకానిజమ్‌. అలాంటి నిర్ణయాలను పంజాబ్‌, హర్యానా వాళ్ళు ఇప్పటికే ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు మేము అక్కడ చూస్తోంది ఏమిటంటే ఒకప్పుడు కులాలపరంగా విడిపోయిన సమాజం కూడా కలిసి మహా పంచాయతీలు చేసుకుంటున్నారు. రాజస్థాన్‌లో మీనార్స్‌ అనే ఎస్టీ వర్గం వారు, గుజ్జర్లు. రిజర్వేషన్‌ కోసం జరిగిన పోరాటాలలో వాళ్ళ మధ్యలోనే చాలా విభేదాలు ఏర్పడ్డాయి. ఎన్నో ఏళ్ళనుంచి గ్రామాల్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుని, అందరూ కలిసి ఈ మహా పంచాయతీలను చేసుకోవడం జరుగుతోంది. అలాగే 2013 గొడవల తర్వాత ముజఫర్‌నగర్‌లో ముస్లిం రైతులు, జాట్‌ రైతులు మళ్ళీ ఇప్పుడు కలిసి పోరాటం చేస్తున్నారు. సమాజంలో ఈ ఉద్యమం ఎటువంటి మార్పు తెస్తోంది అన్నది గమనిస్తే చాలా దూరం వెళ్ళగలిగే ప్రభావాలు, పరిణామాలు ఇప్పటికే సానుకూలంగా అందాయి.
అలాగే మహిళా రైతుల గురించి తప్పక మాట్లాడాలి. నా జీవితంలో నేనెప్పుడూ 50 వేల మంది మహిళా రైతులను ఒకచోట గుమిగూడి ‘‘మేము మహిళా రైతులం’’ అని వాళ్ళని వాళ్ళు గుర్తించేలా చేసుకుంటారనే రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. ఒకేరోజు 70 వేల మంది మహిళా రైతులను చూశాను. వాళ్ళతో మాట్లాడే అవకాశం ఒకటి దొరికింది. ఆ రోజు వాళ్ళు మాట్లాడుకున్నది ఎంత aంంవత్‌ీఱఙవ స్త్రీ వాద సఱంషశీబతీంవ అంటే రైతు ఉద్యమాల్లో సాధారణంగా ఇది కనబడదు. ఎందుకంటే రైతు ఉద్యమాలను నడిపించేదంతా మగవారే. ఈ స్త్రీవాద దృక్పథం వాళ్ళలోకి రావడమే తక్కువ. అటువంటిది మహిళా రైతులే ఆ రోజు అక్కడ నేతృత్వం వహించి ఎన్నో విషయాల గురించి, మహిళా రైతుల సమస్యల గురించే కాకుండా మహిళల మీద హింస, గృహ హింస, అత్యాచారాలు, రాజకీయ పార్టీల భాగస్వామ్యం వంటివన్నీ చర్చించుకోవడం జరిగింది. అలాగే ఒకరోజు కౌలు రైతుల హక్కుల గురించి, 19వ శతాబ్దం మొదట్లో కౌలు రైతులు అక్కడ చేసి ఉద్యమం గురించి, కింగ్‌ ఆఫ్‌ పటియాలాలో జరిగిన ఒక ఉద్యమాన్ని గుర్తు తెచ్చుకుంటూ, ఆ రోజున పోలీసు కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయిన రోజును స్మరించుకుంటూ కౌలు రైతుల గురించి దేశమంతటా మాట్లాడుకోవడం జరిగింది. అలాగే యువకుల గురించి ఒక ప్రత్యేకమైన రోజు అంటే భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్‌లను ఉరి తీసిన మార్చి 23వ తేదీన ‘షాహి దివస్‌’గా నిర్వహించుకోవడం జరుగుతుంది.
ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లోని చాలామంది యువత ఉద్యమం జరిగే ప్రాంతానికి వస్తారని భావిస్తున్నాము. అలాగే ప్రపంచం మొత్తం మీద ఇంత ఆటోమేటిక్‌గా ఒత్తిడిని పెంచుతూ ఇది వాళ్ళ ఒక్కరి ఉద్యమమే కాదు, ఇది మొత్తం రైతులు తమను తాము రక్షించుకోవడానికి చేసే ఉద్యమం అని గుర్తించుకునే ఒక గొప్ప ఉద్యమం. దీనికి బ్రెజిల్‌లో, యూరప్‌లో, ఆస్ట్రేలియాలో మద్దతు లభించింది. ఇది కేవలం రాజకీయ మద్దతుగా నేను మాట్లాడడంలేదు. రైతులకు రైతులుగా వేరే దేశాలలో మద్దతు ఇచ్చిన దాని గురించి చెప్తున్నా. అంతే కాకుండా పార్లమెంట్లలో వీటిపై చర్చలు జరగడం అదనంగా జరిగిన విషయం. నేను మధ్యలో రెండు రోజులు పంజాబ్‌కి వెళ్ళాను. అక్కడ సంయుక్త కిసాన్‌ మోర్చా లీడర్లలోనే మా లీడర్‌ ఒకాయన ఈ ఉద్యమం మధ్యలో ప్రాణాలు కోల్పోయారు. అప్పుడొక రెండు రోజులు వెళ్ళాను. అక్కడ నేను గమనించిన విషయం ఏమిటంటే టీవీల్లో వచ్చే సీరియల్స్‌ మన మహిళల హక్కుల గురించి ఇన్నేళ్ళుగా, ఇన్ని దశాబ్దాలుగా సాధించిందంతా తుడిచి పెట్టుకుపోయే విధంగా నడుస్తుంటాయి. ఆడవాళ్ళుÑ భార్యలు భర్తల కాళ్ళమీద పడడం, అత్తా కోడళ్ళ వ్యూహ ప్రతివ్యూహాలు… రకరకాల చెత్తంతా వస్తుంటుంది. అక్కడి ప్రజలు ఆ సీరియళ్ళను చూడడం ఆపేశారు. ఇది నేను అక్కడ ఉన్న రెండు రోజుల్లో గమనించిన విషయం. ప్రజలు అక్కడ ఈ ఉద్యమంలో ఏమి జరుగుతోందన్న దానిపై ఎప్పటికప్పుడు యూ`ట్యూబ్‌ల నుంచి, సోషల్‌ మీడియా నుంచి అప్‌డేట్స్‌ తీసుకుంటున్నారు. టీవీలలో చూసే వాటి విషయాల్లో కొన్ని మార్పులు అక్కడ కనబడుతున్నాయి. మొత్తంమీద ఈ జరుగుతున్న ఈ ఉద్యమంలో మన పాత్ర ఇంకొంచెం పెరగాలి. ఈ విషయంలలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో మనం వెనకబడ్డాం. అక్కడి నుంచి ఫోన్‌ కాల్‌ వస్తే అంటే ఫలానా రోజు బంద్‌ చేయండి, ఫలానా రోజు నాలుగు గంటలు చక్కాదాం చేయండి, ఇంకో రోజు నిరాహారదీక్ష చేయండి అంటే ఏదో కొంత సింబాలిక్‌గా, సాంకేతికంగా ఇక్కడ కొన్ని నడుస్తున్నాయి కానీ, మనం ఆ ఉద్యమం నుంచి స్ఫూర్తి తెచ్చుకుని ఇక్కడ చేయవలసింది ఇంకా చాలా ఉంది, చేయగలమని నా నమ్మకం. దానికి మీరందరూ ఇంకా ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నాను.
ఒకటి రైతు స్వరాజ్య వేదిక గురించి. ఇప్పటికే మీరు ఇక్కడ ఇచ్చిన నివేదికలో రైతు స్వరాజ్య వేదిక ఒక విధంగా ఇతర సంఘాలకన్నా వేరేగా ఎలా ఉంది’ ఇది ఎన్జీఓ కాదు, పూర్తిగా ప్రజా సంఘం అనేది కన్వెన్షనల్‌గా ఎలా నడుస్తుందో అది కూడా కాదు, ఒకే వేదికలో రీసెర్చి దగ్గర నుంచి ఒక మేధావుల పాత్ర ఎలా ఉండవచ్చు అనేది కూడా చెప్పారు. ఇక్కడ ఎంతమంది శీజూఱఅఱశీఅ జూఱవతీషవం మనకు ఉన్న మేధాశక్తిని వాడుతున్నారో నాకు తెలియదు కానీ, పంజాబ్‌, హర్యానాల్లో ఈ ఉద్యమంలో పాలుపంచుకోని ఒక్క మేధావి కూడా మనకు కనబడరు. ప్రతివాళ్ళు వాళ్ళ అనాలసిస్‌, వాళ్ళ పీసెస్‌ రిపీటెడ్‌గా చేస్తున్నారు. ఇక్కడ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఎంతవరకు జరుగుతోందో నాకు తెలియదు కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇటువంటి ఒక వేదిక కొంత ఱఅ్‌వశ్రీశ్రీవష్‌బaశ్రీ ఱఅజూబ్‌, తీవంవaతీషష్ట్ర.. అన్నింటికన్నా ముఖ్యంగా మనం మాట్లాడే ప్రత్యామ్యాయాలు ఏంటి? ఎందుకంటే, ఉద్యమం చేసేవాళ్లు చాలాసార్లు ఏది వ్యతిరేకించాలన్నా చాలా స్పష్టమైన అభిప్రాయంతో వ్యతిరేకిస్తారు. కానీ తమకు ఏమి కావాలి అన్న ప్రత్యామ్నాయాన్ని, పర్యాయాన్ని చూపెట్టగలిగేది చాలా తక్కువ మంది.
అది ఎన్జీఓ ప్రపంచానికి మాత్రమే పరిమితమవ్వకుండా ఒక ఉద్యమంలో కూడా మనం ఒక రచనాత్మకమైన ఉద్యమాన్ని నెలకొల్పడమనేది మనం రైతు స్వరాజ్య వేదిక నుంచి, అలాగే జాతీయ స్థాయిలో ఆశ, కిసాన్‌ స్వరాజ్య సంఘటన్‌ నుంచి చేయడం జరిగింది. అయితే వేదికలకు స్పేస్‌ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆ తత్వాన్ని కోల్పోకుండా మీరు అన్ని పాయింట్లని మున్ముందు కూడా ఎలా బలోపేతం చేస్తారనే దాన్ని గమనిస్తే బాగుంటుంది. అలాగే ఈ ఉద్యమంలో నేను గమనించింది ఏమిటంటే, కేవలం పెద్ద రైతు సంఘాలే కాదు, మాకు అక్కడ కిసాన్‌ సంయుక్త మోర్చాలో పోరాడుతున్న రైతు సంఘాల్లో కొన్ని కేవలం ఒక్క జిల్లాలో చాలా బలంగా
ఉన్న సంఘాలు కూడా ఉన్నాయి. నేను అనుకుంటున్నా రైతు స్వరాజ్య వేదిక కూడా అది ఆదిలాబాద్‌ జిల్లా అవ్వచ్చు, లేదా మీరే ఎంచుకున్న ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతం ఉండొచ్చు… కనీసం ఒకటి, రెండు క్షేత్రాల్లో సభ్యత్వం ఆధారంగా చాలా బలంగా విస్తరించుకుంటే అది మొత్తం అన్ని చోట్ల చేయగలం. అందులోకి నేరుగా ఒకేసారి దిగకుండా కొంత ఫోకస్డ్‌గా, కొన్ని ప్రాంతాల్లో ప్రజల సమీకరణ చాలా బలంగా ఉండే విధంగా ఏర్పరచుకుంటే కనుక దాంతో కూడా ఇటువంటి ఉద్యమాలు నడపొచ్చు. పట్టణ వినియోగదారులను మరింత బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందని నేననుకుంటున్నాను. పట్టణాల్లో మనతో కలుస్తున్నా కూడా ‘ఆశా’లో కానీ, రైతు స్వరాజ్య వేదికలో కానీ వాళ్ళు కూడా కొంత యాక్టివిస్టు లాంటి పట్టణ వినియోగదారులే. కానీ నా అభిప్రాయమేంటంటే చాలా సాధారణ వినియోగదారులు కూడా కొన్ని కొన్ని విషయాల్లో మనతో రాగలుగుతారు అని.
అటువంటి సందర్భాన్ని ఇంకా మనం సృష్టించుకోవాలి. రైతు స్వరాజ్య వేదిక ఇంకా కొంత తప్పకుండా చేయగలుగుతుందని నేను భావిస్తున్నాను. చివరగా, ఒక అశీఅ-టబఅసవస ఎశీసవశ్రీ టశీతీ aష్‌ఱఙఱర్‌ టవశ్రీశ్రీశీషం. అది ఎలా సృష్టించగలుగుతామో అనేది ఇంకా ఆలోచించగలిగితే బాగుంటుంది. నేను పంజాబ్‌లో చూసింది ఈ ఉద్యమంలో భాగంగా చాలామంది రైతు నాయకుల కింద ఉన్నవాళ్ళు వ్యవసాయమే కాకుండా, వాళ్ళకి ఎక్కడో అక్కడ వేరొక ఆదాయ మార్గాలు పెట్టుకునేవాళ్ళు ఇందులోకి దిగగలుగుతున్నారు. అది అంత సులభం కాదు కానీ, అటువంటి వాళ్ళను, కొంతమంది ప్రొఫెషనల్స్‌తో సహా తీసుకురాగలిగితే చాలా బలం వస్తుంది.
చాలా సంస్థల్లో, వేదికల్లో, లేకపోతే సంఘాల్లో కూడా రైతు సంఘాలు, ప్రజా సంఘాల్లో కూడా సిస్టమ్‌లను సాధారణంగా మనం అపనమ్మకం మీద ఏర్పరచుకుంటాం. అవిశ్వాసంతో పనిచేసే ఏ టీం కూడా సమర్ధవంతంగా పనిచేయలేదు, పని చేయడానికి కుదరదు. దాంట్లో ఎప్పుడో ఒకసారి సమస్యలు వస్తాయి. కాబట్టి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఏర్పరచుకునే టీంలను ఏర్పాటు చేసుకోవడంలోనే చాలా బలం చేకూరుతుంది. చిన్న టీమ్స్‌ అయినా చాలా సాధించగలుగుతాయి. ఆ నమ్మకంతోనే మీరు రైతు స్వరాజ్య వేదికను ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు ఏప్రిల్‌ నెలలో ఒక్కొక్క రాష్ట్రం నుండి కనీసం 100, 150 మంది ఢల్లీి సరిహద్దులకు రావాలని కోరుకుంటున్నాము. వారంతా గోధుమ పంట సాగు కోసం వెళ్ళిపోతారు. ప్రభుత్వం కూడా ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయన్నది వేచి చూస్తోంది. అదే కాకుండా ఈ గోధుమ సాగు కోసం వెళ్ళి తిరిగి వస్తారా, రారా అనేది తెలియదు. కాబట్టి మీరు దక్షిణాది రాష్ట్రాల నుంచి టీమ్స్‌ను పంపించండి. భోజనాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అక్కడ లంగర్‌ సేవ ఉంది. మీరు ఉండడానికి టెంట్‌లు ఉన్నాయి. పరిశుభ్రమైన టాయిలెట్లు ఉన్నాయి. మీరు అక్కడ 10, 15 రోజులు ఉండడానికి రెడీ అయి వస్తారని ఆశిస్తున్నాను. ఈ అవకాశమిచ్చిన మీకందరికి నా ధన్యవాదములు.

Share
This entry was posted in ఉపన్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.