రైతు స్వరాజ్య వేదిక`దశాబ్ది మహాసభల సందర్భంగా మీరా సంఘమిత్ర ఉపన్యాసం

అందరికీ నమస్కారం! జై భీమ్‌! జిందాబాద్‌! ఈ రోజు ఇక్కడ రైతు స్వరాజ్య వేదిక దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కన్వెన్షన్‌లో మీ అందరి మధ్య ఉంటూ ఇప్పటి సెషన్‌లో మాట్లాడిన మన సారిక కావచ్చు, నూర్జహాన్‌ కావచ్చు, ఇంకా రైతులు, మిత్రులు మాట్లాడినవి… అంటే

ఒకవైపు ఆర్భాటం, వ్యక్తిగత జీవితంలో పోరాటం, దాంతోపాటు ఒక ఆర్గనైజేషన్‌` ఒక సంఘంలో భాగంగా ఉంటూ చాలామంది జీవితాలలో మార్పు తీసుకురావచ్చు అనే ఆ నమ్మకం, ఆ స్ఫూర్తితో పనిచేస్తున్న రైతు స్వరాజ్య వేదికలోని ప్రతి జిల్లా కార్యకర్తకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నుండి వచ్చిన కార్యకర్తలందరికీ, దళిత ఆదివాసీ రైతులకు, ముఖ్యంగా మహిళా రైతులకు జై భీమ్‌! జిందాబాద్‌లు.
ఇందాక వేణుగోపాల్‌, కవిత గారు మాట్లాడినట్లు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇందాక కవిత చెప్పినట్లు ఢల్లీి సంఘటనలు మనకు టి.వి.లలో చూపిస్తున్నట్లు కళ్ళకి కట్టినట్లు చెప్పారు. కొంతమంది ఢల్లీికి కూడా వెళ్ళి వచ్చాము. కానీ ఒక సిక్కు సంప్రదాయం నేపధ్యంలో ఏ విధంగా అయితే ఉద్యమం జరుగుతోందో, అదేవిధంగా అదొక భగత్‌సింగ్‌ స్ఫూర్తితో, ఆ రైతాంగ
ఉద్యమానికి అదొక యువ స్ఫూర్తి.
నవంబర్‌ 25కు ముందు అసలు ప్రభుత్వమయితే ఢల్లీిలోకే మిమ్మల్ని రానివ్వమని భీష్మించుకొని కూర్చుంది. కానీ అక్కడి నుంచి మనం ఇప్పుడు చూస్తే 115, 116 రోజులవుతోంది. I mean this is very significant to locate the journey of this movement in the past 115days. ఇటీవలి కాలంలో ఈ ఉద్యమంలో భాగంగా 250 మందికి పైగా రైతులను మనం కోల్పోయాం. ఆ రైతులకు జోహార్లు అర్పిస్తూ ఈ ఉద్యమంలో అక్కడ ఉన్న రైతులు దేశం మొత్తానికి స్ఫూర్తినిస్తూ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నాకు ఒక రెండు వాక్యాలు గుర్తొస్తున్నాయి. అది ఒక పాటలాగా చెబుతాను. మహారాష్ట్రలో మా మిత్రులు సమతా కళామంచ్‌, శీతల్‌ సాఠీ మరియు సచిన్‌ మాయి వాళ్ళు వ్రాసారు ఈ పాట. వాళ్ళు భగత్‌ సింగ్‌ను గుర్తుకు తెచ్చుకుంటూ వ్రాసిన పాట ఇది. అందులో ఇంక్విలాబ్‌ స్ఫూర్తి ఉంది. వాళ్ళు చేసిన ఉద్యమంలోనే ప్రతిరోజూ, మనం చేసే ప్రతి పనిలోనూ ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అనేది ఉంది.
పాట : హే భగత్‌సింగ్‌ తూ జిందా హై…
హే భగత్‌సింగ్‌ తూ జిందా హై… హర్‌ ఏక్‌ లఘువోంకీ నజర్‌ మే
హర్‌ ఏక్‌ లఘువోంకీ నజర్‌ మే… ఇంక్విలాబ్‌ కీ లానే మే
హే భగత్‌సింగ్‌ తూ జిందా హై… హర్‌ ఏక్‌ లఘువోంకీ నజర్‌ మే
అంటే ఒక్కొక్క రక్తకణంలో భగత్‌సింగ్‌ స్ఫూర్తి ఇప్పటికీ ఉంది. 23 ఏళ్ళ యువ వయసున్న అతన్ని సుఖ్‌దేవ్‌, రాజ్‌గురుతో పాటు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినందుకు అప్పట్లో ఉన్న బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరితీసింది. ఆ పోరాటంలో ఆ స్ఫూర్తి ఇప్పటికీ రైతు ఉద్యమంలో కొనసాగుతోంది అన్నదానికి ఇప్పటి రైతు ఉద్యమమే నిదర్శనం. అప్పుడు బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే, ఇప్పటి కార్పొరేట్‌ శక్తులకు వ్యతిరేకంగా అదానీ, అంబానీకి వ్యతిరేకంగా, కార్పొరేట్‌ పవర్‌ కన్నా ఫార్మర్‌ పవర్‌ (రైతు శక్తి) గొప్పది, శక్తివంతమైనదని నిలబడుతూ దేశం మొత్తానికి… అంటే ఇంతకుముందు కూడా రైతు ఉద్యమాలు చాలా జరిగాయి. కానీ,”what is significant apart from the previous movements is the challenge to the Corporate Power”. అంటే నేడు దేశం ఏ దిశగా వెళ్తోందో దేశ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ ఆ దిశకి మార్చే విధంగా జరుగుతోంది రైతు ఉద్యమం. మరయితే, దేశ రాజకీయాలలో దేశ ఎన్నికలను, దేశ విధానాలను, దేశ చట్టాలను ఎవరు నిర్ణయిస్తున్నారో వాళ్ళను ప్రశ్నిస్తూ అదానీలను, అంబానీలను ప్రశ్నిస్తూ, నేరుగా వాళ్ళను నిశానా చేస్తూ ఈ ఉద్యమమన్నది జరుగుతున్నది కాబట్టే ఇది దేశం మొత్తానికి ఒక కొత్త స్ఫూర్తినిచ్చే ఉద్యమంగా కూడా మనందరం చూస్తున్నాం.
ఈ చారిత్రాత్మక నేపథ్యంలో రైతు స్వరాజ్య వేదిక లాంటి స్వతంత్ర రైతు సంఘాల పాత్రను చూస్తే కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పంజాబ్‌లో, హర్యానాలో ఎన్నో దశాబ్దాలుగా జరుగుతున్న ఈ పోరాటాలు మనకు ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తున్నాయి కానీ ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంఘాలు అక్కడి గ్రామాల్లో స్థానిక సమస్యల మీద నిరంతరం పోరాడుతూ అక్కడ సంఘటితంగా రైతులతో పాటు పనిచేస్తున్న ఒక చరిత్ర ఉంది.
అదేవిధంగా, ఇక్కడ తెలంగాణాలో కూడా చారిత్రాత్మక తెలంగాణా ఉద్యమంతో పాటు చాలా ఉద్యమాలు జరిగాయి. తెలంగాణా ఉద్యమం ఒక స్ఫూర్తిదాయకమైన ఉద్యమం. ఇప్పుడు కుల నిర్మూలనకు, కుల పోరాటాలకు సంబంధించి ఎన్నో ఉద్యమాలు ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా జరిగాయి. ఆ నేపథ్యంలో రైతు స్వరాజ్య వేదిక లాంటి స్వతంత్ర సంస్థలు ఎప్పుడైతే రైతుల మధ్య నుంచి ఒక ప్రజా సంఘం పుడుతుందో, ఖచ్చితంగా గిరిధర్‌ అన్నట్లు ఒక సంస్థను నడిపించాలంటే అది ప్రతిరోజూ ఒక ఛాలెంజే. అంటే ఆ కార్యకర్తలు ఎవరైతే ఆ సంస్థలో పనిచేస్తారో ప్రతిరోజూ దాన్ని నడిపించడం ఒక ఛాలెంజ్‌. అలాంటిది ఒక పదేళ్ళపాటు రైతు స్వరాజ్య వేదిక నడిపించటమన్నా లేదా ఇక్కడ శంకరన్న మాట్లాడుతూ చెప్పారు దళిత బహుజన్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేసి 25 ఏళ్ళవుతోందని. అంతేకాలం దాన్ని నడిపించడమన్నా, ఇంకా ఇటువంటి ప్రతి ప్రజా సంఘాన్ని నడిపించే వెనకాల ఎన్నో డైనమిక్స్‌ ఉంటాయి. దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. ఆ కృషితోపాటు ఆ constituency ని నడుపుకుంటూ పోవడమన్నది సాధారణమైన విషయం కాదు. రైతుసంఘాలు చాలా ఉన్నాయి. కానీ ఫోకస్డ్‌గా కౌలు రైతులు, ఆదివాసీ రైతులు, దళిత రైతులు, మహిళా రైతుల సమస్యలపై కూడా సానుకూలంగా స్పందించడానికి, మహిళా రైతులకు సంబంధించిన విషయాలను కూడా మెయిన్‌ స్ట్రీం చేయడానికి రైతు స్వరాజ్య లాంటి ఒక ప్రజా సంఘం ప్రయత్నం చేస్తోంది. కాబట్టి మన రెండు రాష్ట్రాల వేదిక మిత్రులందర్నీ ఇక్కడ చూస్తే ఇది రైతు స్వరాజ్య వేదిక సాధించిన ఒక సానుకూల దృక్పథంగా అనుకోవచ్చు. మనం ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా గుర్తించి ఆ అజెండాని, ఇతర అసంపూర్తి అజెండాలను ముఖ్య స్రవంతిలో ఇంకా ఎలా తీసుకెళ్ళాలన్నది మనందరి బాధ్యత. ఎందుకంటే ఇందాక మిత్రులన్నట్లు, ఒక రైతు ఉద్యమం అన్నది రైతులకు సంబంధించినది మాత్రమే కాదు. మనందరం భోజనం తింటున్నాం. చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాలు ఈ రైతులకు సంబంధించినవే కాదు, దేశంలోని మొత్తం ప్రజానీకానికి సంబంధించినవి. అదేవిధంగా రైతు సంఘాలు నిలబడాలంటే దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మనం రైతులమా కాదా అని కాకుండా, సమాజంలో పౌరులుగా అంతే బాధ్యతగా ఈ సంఘాలకు మద్దతునివ్వడం, ఈ సంఘాలతో పాటు నిలబడడం, వాళ్ళు లేవనెత్తే అంశాలకు సంఫీుభావం తెలపడం అంతే ముఖ్యమన్నది మనకి పదే పదే తెలుస్తోంది. కానీ ఆ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితోపాటు క్రమశిక్షణతో పాటించాలని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవడం కూడా చాలా అవసరం.
2014 నుండి మనం చూసుకుంటే ఈ మూడు రైతు చట్టాలే కాకుండా కార్మిక చట్టాలు.. అంటే దేశంలోనే 93 శాతం కూలీలు, అసంఘటిత కార్మికుల జీవితాలను ధ్వంసం చేసే చట్టాలు వంటివి అనేకం వచ్చాయి. అటువంటి చట్టాలను పాస్‌ చేయడం, మొత్తం పర్యావరణాన్ని నష్టం చేసే పర్యావరణ నోటిఫికేషన్లను పాస్‌ చేయడం, విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరణ చేసే నూతన విద్యా విధానం… ఇలా ఎన్నో ఉన్నాయి. ఇటీవల గత నాలుగు రోజులుగా అందరూ చూసే ఉంటారు. ఇప్పుడు బ్యాంకులు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సంబంధించి నోటిఫికేషన్‌ ఇచ్చేశారు. గత నెల 15, 16 తేదీలలో రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా లక్షలాది మంది బ్యాంకు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు అక్కడ పనిచేసే ఉద్యోగులకు మాత్రమే సంబంధించినది కాదు. పబ్లిక్‌ సెక్టార్‌లో బ్యాంకుల్లో లేదా ఇన్సూరెన్స్‌ కంపెనీల్లో క్లయింట్లుగా ఉండేది ఎవరు?
సన్న, చిన్నకారు రైతులు, మహిళలు, వృద్ధులు దాచుకుని కట్టే చందా నుంచే బ్యాంకులు నడుస్తాయి. కానీ మనం ఈరోజు ఏం చూస్తున్నామంటే పెద్ద పెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులన్నీ మూసివేసే విధానంలో ప్రభుత్వం సాగుతోంది. బ్యాంకు లోన్స్‌ విషయానికి వస్తే, చాలా పెద్ద స్థాయిలోని ప్రైవేట్‌ కంపెనీలు, కోట్లాది రూపాయల బకాయిలు ఇంకా చెల్లించలేదు. అలాంటి బకాయిలను వాళ్ళు వసూలు చేయడం లేదు. ఇక్కడ మనకు మినిమం డిపాజిట్‌ లేకపోతే బ్యాంక్‌ అకౌంటు మూసివేస్తామని, అసలు బ్యాంకులే మూసివేస్తామన్న దిశలో ఈ విధానం జరుగుతోంది. వీటన్నింటి గురించి మనం ప్రశ్నించాలి. ఎందుకంటే మనం రైతాంగ పోరాటంలో ఉన్నాం. రైతు ఉద్యమంలో భాగంగా ఉన్నాం. దేశంలో ఉన్న ప్రతి విధానం, ప్రతి రంగంలో మార్పు అన్నది జరుగుతోంది కాబట్టి ఆ రంగంలో ఎవరు పోరాడుతున్నారో ఆ పోరాటాల మన పోరాటాల మధ్యలో చాలా సంఫీుభావం ఉండవచ్చు. ఎందుకంటే, మనల్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్‌ ప్రభుత్వం, స్వాతంత్య్రం తర్వాత మన ఫాసిస్టు ప్రభుత్వాలు ప్రజలను వేధిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వమే ఈ common threats ఏంటో గుర్తించి ఐక్య పోరాటాల నిర్మాణంలో ఇంకా లోతుగా దిగడం అనేది చాలా అవసరం.
కానీ ఎవరైతే సంఫీుభావంతో… అంటే వేరే కార్యకర్తలు ఇప్పుడు రైతులతో నిలబడినా లేకపోతే ప్రజాసంఘాలు వేరేవాళ్ళతో నిలబడినా కూడా మనం దాన్ని సంఫీుభావం అంటున్నాము, ప్రభుత్వం దాన్ని కుట్ర అంటోంది. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం, ఎంతోమంది కార్యకర్తల మీద వీళ్ళు కుట్ర చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. అంటూ వాళ్ళమీద కేసులు బనాయించడం లాంటి కేసులు… అంటే 20`22 ఏళ్ళ అమ్మాయికి ఎదురైన విషాదం, ఆ కేసులో ఆ అమ్మాయితో… కాగితాల మీద మీరు కూడా సపోర్టు చేయవచ్చు అని చెప్పడంతో… ఆ కార్యకర్తల మీద కూడా కేసులు బనాయిస్తున్నారు.
శివకుమార్‌ లాంటి వాళ్ళని రైతు ఉద్యమానికి సంఫీుభావం చూపిస్తున్నారు, కార్మిక ఉద్యమంలో ఉన్నారని చాలా ఘోరంగా చిత్రహింసలు పెట్టారు. ఇలా చూసుకుంటూ పోతే తెలంగాణ, ఆంధ్రలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి.
ప్రభుత్వ నిర్బంధంలో అయితే, కేంద్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కువ తేడా లేదు. ప్రభుత్వాలు ఎక్కడ అధికారంలో ఉన్నా వాళ్ళకి కావలసింది ఏమిటంటే ‘‘ప్రజలు వారిని ప్రశ్నించకూడదు, ప్రజలు అసలేమీ అడగకూడదు’’. అసలు మేము ఎంత చెప్తే అంతే, అదే లైన్‌లో వెళ్ళాలి అన్న ప్రభుత్వ వైఖరిని మనం ప్రశ్నించినప్పుడు ప్రభుత్వం ఎప్పుడూ తప్పుడు కేసులు బనాయించడం, జైల్లో వేయడం వంటివి నిరంతరం చేస్తూనే ఉంటారు. కానీ, దీన్ని మనం ఎదిరించాలంటే నిర్బంధమన్నది ఉంది. రాబోయే కాలంలో ఈ నిర్బంధం ఇంకా పెరుగుతూనే ఉంటుంది.
మనం ఒక పది సంవత్సరాలు ఈ ఉద్యమాన్ని వేదికగా చేసుకున్నాం. కానీ మాస్‌ మూవ్‌మెంట్‌ అంటారు. దేనికి సంబంధించి ఇంకా సుదీర్ఘంగా మాట్లాడాలి. ఒక జిల్లానో, రెండు జిల్లాలనో తీసుకుని మొదలుపెట్టవచ్చునేమో. ఆ దిశగా ఆలోచించాలి. మనకు సంఖ్యాబలం ఉన్నప్పుడే ఎవరైనా కొంతన్నా తగ్గుతారు. పంజాబ్‌, హర్యానాల్లో కనీసం 10, 15 సంఘాలున్నాయి. అక్కడ సంఖ్యాబలం ఉందన్నది మనం ఖచ్చితంగా ఒప్పుకోవలసిందే. మనం ఆ సంఖ్యా బలాన్ని ఏ విధంగా బలోపేతం చేసుకుంటామన్న అంశాన్నే ఒక వేదికలో మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ప్రతి వేదిక, సంఘం కొన్ని అంశాల మీద priortize చేసి పనిచేస్తుంది. రైతు స్వరాజ్య వేదికలో రైతు హక్కుల మీద పనిచేస్తాం. కానీ, మనం చేయడం ఒకటైతే, ఒక రాజకీయ దృక్పథం అన్నది ఎంత విశాలంగా ఉంటే అది మన రాజకీయ పనిలో అంతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం రైతు హక్కుల మీద పనిచేస్తున్నా, కార్మిక హక్కుల మీద కావచ్చు, మైనారిటీల మీద జరిగే దాడులు ఏవైనా కావచ్చు. వాటిమీద అవగాహన కలిగించుకోవడం…., రైతు స్వరాజ్య వేదిక పనిచేస్తున్న ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించడం అవసరం. లేకపోతే వీళ్ళు ఈ పని చేస్తున్నారు అని విడదీయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటుంది.
కానీ మనం ఉమ్మడి ప్రయత్నం చేయాలంటే అవగాహన అన్నది చాలా చాలా ముఖ్యం. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ విలువల్ని కేంద్రంగా చేసుకొని ప్రతి కార్యకర్త అవగాహన పెంచుకోవడం, prioritized హక్కుల గురించి మాట్లాడడం, రాజ్యాంగ హక్కులను ఇంకా లోతుగా అర్థం చేసుకొని ఏ విధంగా ప్రభుత్వ విధానాలు రైతులకు అందుతాయనేది మాట్లాడాలి. అది ప్రతి దినం పనిలో కూడా ప్రతిబింబించాలి. చివరగా ఒక్కటి… మనం ఒక్కొక్కరం వేర్వేరుగా ఎన్నో పనులు చేస్తుంటాం. కానీ, మనందరినీ కలిపేది ఒక్కటే. ‘రాజకీయ చైతన్యం’. ఏ విషయంలో పనిచేస్తామో, అందులో రాజకీయ చైతన్యం ఉండడం సహజం. రెండవది సామాజిక న్యాయం. ఇప్పుడు దళితులు, ఆదివాసీలు, బడుగు, బలహీన వర్గాలు 90% పైన (రైతులే కావచ్చు, కూలీలు కావచ్చు). ఈ వర్గాలకు చెందిన వారే కాబట్టి ఈ వర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫోకస్‌తో పాటు పనిచేసే ఒక దృక్పథం ‘సామాజిక న్యాయం’. మూడవది ఆర్థిక సమానత. ఈ కోణం నుంచి కూడా పని చేయడం చాలా ముఖ్యం.
కావున మనం ఈ కోణాలన్నింటి నుంచి పనిచేస్తే ఈ వేదికని రాబోయే కాలంలో ఒక ఖచ్చితంగా అందరూ కలిసి బలమైన ప్రజా ఉద్యమంగా దీన్ని రూపొందించుకోవచ్చు. అందరూ సంఘాల్లో పనిచేస్తున్నాం. ప్రతి సంఘంలోనూ కొన్ని పరిమితులు/హద్దులు
ఉంటాయి. బలాలు ఉంటాయి. బలహీనతలు ఉంటాయి. కాబట్టి ఒకరి నుండి ఒకరం పరస్పరం చూసి నేర్చుకోవడం అవసరం. ఇది మనం పనిచేసే క్రమంలో కూడా చాలా ముఖ్యం.
చివరగా, కుల నిర్మూలన, పితృస్వామ్య నిర్మూలన… ఈ రెండు అంశాలు కూడా మన పనిలో భాగంగా ఖచ్చితంగా ఉండాలి. అది మన ప్రతి స్థాయిలో కనిపించాలి. కుల నిర్మూలన అన్నది దళిత సంఘాలు చేసే పని కాదు. ఇది ప్రతి సంఘం బాధ్యత. పితృస్వామ్యాన్ని ఎదిరించడం ప్రతి సంఘం బాధ్యత. ఈ విలువల్ని మనం మన సంఘాల్లో, సామాజిక సంఘాల్లో, మన పనిలో మనం ఆచరించి, గంభీరంగా ముందుకు తీసుకొస్తే అంతే బలమైన రాజకీయ అవగాహన అవుతుంది. అప్పుడే మనం ఇంకా బలంగా తయారవుతాం.
రైతు స్వరాజ్య వేదిక దశాబ్ద కాలంగా విస్తరించడం జరుగుతోందని చెప్పవచ్చు. ఆర్‌ఎస్‌వికి ప్రతి రైతుతో, ప్రతి రైతు కూలీతో సంబంధం ఉంది. అందుకే రాజకీయ దృక్పథం అనేది చాలా స్పష్టంగా ఉండాలి. ఉద్యమం మొదట్లో ఏ స్ఫూర్తితో మొదలైందో, ఆ స్ఫూర్తి విస్తరించాలి. అది ప్రతి రైతు నినాదం కావాలి. మనకు మరొక ఛాయిస్‌ లేదు.
మనం గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుండి ఇలాంటి అవగాహనతో పాటు పని చేయాలని నా మనవి. ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ ధన్యవాదాలు.

Share
This entry was posted in ఉపన్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.