ఏంటి ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకుంటూ లోపలికి అడుగు పెట్టిన భావనకి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని సీరియస్‌గా పనిచేసుకుంటున్న స్టాఫ్‌ని చూసేసరికి మళ్ళీ ఏదో పెద్ద చర్చే జరిగుంటుం దని అనుకుంటూ ‘హాయ్’ అని పలకరించింది. రెస్పాన్స్ కోసం ఒక్క క్షణం అలాగే నిలబడిరది. పలకరింపుగా కొందరు చెయ్యూపితే, కొందరు హాయ్ అన్నారు. హారిక మాత్రం పెదాలు సాగదీసి నవ్వినట్లుగా చూసి తిరిగి తన పనిలో పడిరది. ఎప్పుడూ చలాకీగా ఉండే హారిక అలా
ఉండేసరికి చర్చ ఘాటుగానే అయ్యుంటుందని ఊహించింది భావన. ‘ఏం జరిగింది హరీ’ అంటూ నాలుగడుగులు వేసింది. ‘మీరు రిఫ్రెష్ అవ్వండి మాట్లాడుకుందాం’ అన్న హారిక మాటలకి తన రూంలోకి వెళ్ళింది భావన.
అదో ఎన్జీఓ ఆఫీస్. మహిళా హక్కుల మీద పనిచేస్తారు. సామాజికంగా నిర్లక్ష్యానికి గురవుతున్న సమూహాలతో కూడా పనిచేయడం మొదలెట్టారు. ఆ సందర్బంగా స్టాఫ్ అందరికీ అవగాహన కోసం ‘జెండర్`లైంగికత’ అన్న అంశంమీద ఈ మధ్యనే ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. ఆ వర్క్‌షాప్ జరిగిన నాల్రోజులు అనేక కొత్త విషయాలు చర్చకొచ్చాయి. మరీ ముఖ్యంగా ూGదీు అంశాలమీద, ట్రాన్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిన రిసోర్స్ పర్సన్లు రెండు రోజులు వారితోనే ఉండడం వల్ల చాలా విషయాలను లోతుగా చర్చించుకోవడానికి, అర్థం చేసుకోడానికి వీలైంది. ఆ సమయంలోనే లెస్బియన్లు, గేలు, బైసెక్స్యువల్ వ్యక్తులపై కొంత చర్చ వచ్చినా ఫోకస్ ట్రాన్స్ వ్యక్తుల అంశాలపైనే కేంద్రీకరించడంతో ఆ చర్చలు కొనసాగలేదు. అయితే ఆ తర్వాత కూడా స్టాఫ్ మధ్య చాలాసార్లే ఆ అంశాలపై చర్చ వచ్చేది. వ్యక్తిగత అనుభవాలను, స్నేహితుల విషయాలను, క్షేత్రస్థాయినుంచీ వచ్చే కేస్ స్టడీలను ఆధారం చేసుకుని జెండర్ లైంగికత కోణాల నుంచి విశ్లేషిస్తూ సిద్ధాంతపరమైన చర్చలు జరిగేవి.
సంస్థలో చేరి ఏడాది కూడా అవ్వని హారికకి ఈ చర్చలన్నీ చాలా అసక్తిగా ఉండేవి. కొన్ని సార్లు తన గురించే మాట్లాడు తున్నట్లుండేది. అంతలోనే ‘ఛ… ఛ… నేనలా కాదు’ అని సర్దిచెప్పుకునేది. కానీ ఆ మాటలన్నీ మైండ్‌లో తిరుగుతూ ఒక్కోరోజు నిద్రకూడా పట్టేది కాదు. మర్నాడు ఆఫీస్‌కి వచ్చాక భావన ఏర్పాటు చేసిన క్వశ్చన్ కాలమ్‌లో ఒక స్లిప్ పెట్టేది. స్టాఫ్‌లో ఎవరైనా సరే తాము తెలుసుకోవాలనుకుంటున్న విషయాల గురించి, చర్చించాలనుకుంటున్న అంశాల గురించి అక్కడ స్లిప్ పెట్టొచ్చు. రెండు మూడు రోజులకొకసారి ఆ స్లిప్పులను తీసి వాటిమీద మాట్లాడుకుంటారు. ప్రతి ప్రశ్నని మూలాని కంటూ విశ్లేషిస్తూ ఎవరి ప్రశ్నకి వారే సమాధానం వెతికి పట్టుకునేలా, లోతుగా చర్చలు జరుగుతాయి. ఈ మొత్తంలో ఎవరూ ఎవర్నీ వ్యక్తిగతంగా కామెంట్ చేయడం కానీ, ఎత్తిచూపడం కానీ జరగదు. అందుకే తనలో జరుగుతున్న ఘర్షణని అర్థం చేసుకోడానికి, తన ప్రశ్నలకి సమాధానం దొరకడానికి ఇదే సరైన అవకాశం అనుకుంది హారిక.
ఎప్పుడూ ప్యాంట్లు, లూజ్ షర్ట్‌లు వేసుకునే హారికకి తనని అందరూ హరీ అని పిలవడమే ఇష్టం. ఎప్పుడూ సైకిలేసుకుని తిరగడం, లేదా బస్కీలు తీయడం, కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ప్రయోగాలు చేయడం, వంట చేయడం, ఇల్లు సర్దడం, కాలనీ చివర్లో ఉన్న బ్రిడ్జ్ రైలింగ్ మీద కూర్చుని ఫ్రెండ్స్‌తో పిచ్చాపాటీ కబుర్లేసుకోడం హరికి ఎంతో ఇష్టమైన పనులు. ఈ ఫ్రెండ్స్ అంతా అబ్బాయిలే. అమ్మాయిలతో మాట్లాడ్డం అలా ఉంచి వాళ్ళతో కళ్ళు కలిపి చూడాలంటేనే ఏదో బెరుకు. కానీ సారిక వచ్చి తనతో చనువుగా చెయ్యి పట్టుకునో, భుజం మీద చెయ్యేసో మాట్లాడుతుంటే ఏదో ఫీలింగ్ అనిపిస్తుంది. ఆడవాళ్ళ మధ్యలో కూర్చునుంటే ఏదో సిగ్గుగా ఉంటుంది. అసహనంగానూ ఉంటుంది ఒక్కో సారి. అదే అబ్బాయిలతో చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. వాళ్ళూ, తనూ ఒకటే అనిపిస్తుంది. ఎందుకిలా ఉంటుందో తనకి అర్థం కావట్లేదు. వీటివల్ల ఇటు అబ్బాయిల నుంచి, అటు అమ్మాయిల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. అవమానాలూ ఎదుర్కొంది.
మిగతా రోజులు ఎలా ఉన్నా నెలకి వారం రోజుల పాటు జీవితం తనది కాదనిపి స్తుంది. ఎవరి శరీరంలోనో తనని ఇరికించినట్లు అనిపిస్తుంది. పీరియడ్స్ వచ్చేముందు శరీరంలో జరిగే మార్పులతో పొత్తికడుపు దగ్గరంతా అనీజీగా ఉండటం, బ్రెస్ట్ పెయిన్, నడుం నొప్పి… చాలా అసహనంగా, కోపంగా తనమీద తనకే చిరాగ్గా ఉంటుంది. బయట కెక్కడికీ వెళ్ళకుండా ఆఫీస్‌కి, ఇంటికి పరిమిత మవుతుంది. కానీ పీరియడ్స్ టైంలో మాత్రం స్త్రీత్వమే తన అస్తిత్వం అనిపిస్తుంది. పీరియడ్స్ తర్వాత హాయిగా తలస్నానం చేసి ఎప్పుడూ నిర్లక్ష్యంగా వదిలేసే భుజాలవరకు ఉన్న జుట్టుని క్లిప్పుతో అలంకరించాల నిపిస్తుంది. బాడీ హగ్గింగ్ లాంగ్ ఫ్రాక్ కానీ, చుడిదార్ కానీ వేసుకోవాలనిపిస్తుంది. క్లోజ్ ఫ్రెండ్ నానీతో ఫ్లర్ట్ చేయాలనిపిస్తుంది. ఆఫీసులో అమ్మాయిల్తో ఫ్రీగా జోకులేసుకుంటూ సంతోషంగా ఉంటుంది. ఇదంతా అయోమ యంగా అనిపిస్తోంది. తనకి అబ్బాయిలిష్టమా, అమ్మాయిలిష్టమా! అసలు తన లైంగికత ఏంటి? అర్థంకాక, జవాబులు దొరక్క గింజుకుంటోంది. ఇది గమనించిన భావన తనని తను తేల్చుకోడ ంలో హారికకి ఎంతో తోడుగా ఉంటోంది.
ఈ సందిగ్ధంలో ఉండగానే ఆ రోజు సారిక, నానీ… హారిక కోసం ఆఫీసుకి వచ్చారు. ఉన్న ట్లుండి విజిటర్స్ రూంలో నుండి అరుపులు వినిపిస్తుంటే కొలీగ్స్ అంతా వచ్చేశారు. ‘హరికి నేనంటే ఇష్టం మధ్యలో నువ్వు అడ్డురాకు’ అని సారిక అనేసరికి ‘హారికకి నేనంటే ప్రాణం. ఆడపిల్లవి నిన్నిష్టపడడమేంటి? ఇదేమన్నా ఫైర్ సినిమానా? అనవసరంగా మా జీవితాల్తో ఆడుకోకు. వెళ్ళి మంచి సైకాలజిస్ట్‌ని కలువు. నీ బుర్ర దారిలో పెడ్తారు’ అని నానీ గట్టిగా అరిచాడు. ఒక్కుదుటున సారిక లేచేసరికి హారిక గట్టిగా పట్టుకుంది. సారిక కూడా హారికను గట్టిగా హత్తుకుంటూ ‘చూశావా’ అంటుండగానే ఆమెని నానీ ‘పిచ్చివేషాలేయకు’ అని పక్కకి నెట్టేశాడు. ఇంతలో అక్కడికొచ్చిన కొలీగ్స్ స్ట్రాంగ్‌గా చెప్పి వాళ్ళిద్దరినీ పంపేసి హారికని లోపలికి తీసుకొచ్చారు.
హరి అలియాస్ హారికకి మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఒకే ఒక్క ఆలోచన తిరుగు తోంది ` నెక్ట్స్ వాట్… భావనతో మాట్లాడాలి. సారిక, నానీ ఇద్దరూ కావా లనిపిస్తోంది. ఇద్దరితోనూ జీవితంలో చాలా దగ్గరగా, అతి సన్నిహితంగా ఉండాలని పిస్తోంది. ఇదేమన్నా మానసిక రోగమా? ఇది లైంగికతకు సంబంధిం చినదా? అసలిది సాధ్యమా? సమాజం ఎలా స్పందిస్తుంది? నన్నెలా ఆదరిస్తుంది? ఆదరించ కపోతే…. నెక్ట్స్ వాట్!!