దళిత స్త్రీ సమస్యను జాతీయస్థాయిలో ఒక ముఖ్యమైన ఎజెండాని చేసి విస్తృతస్థాయిలో పనిచేసి కుల, మత దురహంకారాలకు, పితృస్వామిక అణచివేత దారులకు వెన్నులో చలి పుట్టించిన సాహసి రజనీ తిలక్. ఆమె నిరుపేద దళిత జాతవ కులంలో పుట్టింది. వీరిది ఉత్తరప్రదేశ్
అయినప్పటికీ పేదరికం కారణంగా ఆమె తల్లిదండ్రులు జీవనోపాధిని వెతుక్కుంటూ ఢల్లీి వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. పాత ఢల్లీిలో చేపలు పట్టుకుని జీవించేవారు. వారు నివసించే బస్తీలో 1958 మే 27న జన్మించిన రజనీ తిలక్ తమ తల్లిదండ్రుల ఏడుగురి సంతానంలో ఆరవ బిడ్డ. పేదరికంతో వచ్చే పౌష్టికాహార లోపంతో తన ముగ్గురు తోబుట్టువులు బాల్యంలోనే మృత్యువాత పడ్డారు. వారిది కుల, మత ఛాందస వాదం నుంచి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న కుటుంబం. రజనీ తండ్రి బట్టలు కుట్టే దర్జీ. ఆమె చిన్నప్పుడు ఒక నర్స్ కావాలని అనుకున్నా, డబ్బు లేక చదువు కొన సాగలేదు. తర్వాత ఆమె ప్రభుత్వ ఐఐటిలో చేరి బట్టలు కుట్టడం నేర్చుకుంది. తన తోబుట్టువుల పెంపకం బాధ్యత రజనీ మీద పడడంతో ఆమె పనిచేస్తూ చదువు కొనసాగించి ఒక గుమస్తా ఉద్యోగం సంపాదించు కుంది. 1980లో అంగన్వాడీ సెంటర్లో మొదట పనిచేసిన రజని నెల జీతం కేవలం 150 రూపా యలు మాత్రమే. అయినా ఆమె నిరుత్సాహపడలేదు. అంగన్వాడీ సెంటర్లలో జరిగే మోసాలను అర్థం చేసుకోవడంతో పాటు ఆ క్రమంలో తనకు భావసారూప్యం గల స్నేహితులను పొందింది రజని. ఆ తర్వాత ఆమె క్షేత్రస్థాయిలో ఎన్నో పోరాటాలను స్వయంగా నిర్మించి దళిత సమస్య మీద విస్తృతంగా పనిచేసింది. అంగన్వాడీ కేంద్రాలకు నిధులు సరిగ్గా లేకపోవడం, బాలికలకు కనీసం టాయిలెట్ సౌకర్యం లేకపోవడంపై ఆమె ఆందోళన ప్రారంభించింది. సుమారు నాలుగు వేల మంది కార్యకర్తలను సమీకరించి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది.
రజని అణగారిన కులాల సమస్యల మీద ఎప్పుడూ క్షేత్రస్థాయిలో పనిచేయడమే కాకుండా ఢల్లీి జంతర్ మంతర్ ఆందోళనలలో ఎప్పుడూ ముందుండేది. ఆమె మహారాష్ట్ర దళిత పాంథర్స్ ఉద్యమంతో మమేకమై దాన్ని జాతీయ స్థాయి
ఉద్యమంగా మలచింది. దళిత ఉద్యమపరంగా మహారాష్ట్రకీ, ఢల్లీికి రజని తిలక్ ఒక వారధిగా, అనుసంధానకర్తగా వ్యవహరించింది. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు మరుగుదొడ్ల కోసం, శ్రామిక స్త్రీల హక్కుల కోసం నిరంతరం శ్రమించింది. బ్రాహ్మణీయ వ్యవస్థపై పోరాడడానికి ఆమె జాతీయ స్థాయిలో అనేక ఉద్యమ సంస్థలను ఏర్పాటు చేసి వాటిని సమర్ధవంతంగా నిర్వహిం చింది. వాటిల్లో ‘ప్రత్యామ్నాయ దళిత మీడియా సెంటర్’, అన్ని దళిత సంఘాలను జాతీయ స్థాయి లో ఐక్య సంఘటనగా ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ దళిత్ ఆర్గనైజేషన్స్’, ‘నేషనల్ ఫెడరేషన్ ఫర్ దళిత్ ఉమెన్’, ‘దళిత్ లేఖక్ సంఫ్‌ు’ ముఖ్యమైనవి. దళిత స్త్రీ సమస్యను జాతీయ స్థాయిలో చర్చకు పెట్టిన వారిలో రజని మొదటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఆమె ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమంతో, ‘ఆహావన్’ అనే దళిత రంగస్థల ఉద్యమంతో, ‘అంగన్వాడి’, ‘సహేరి’ అనే స్త్రీల సంఘాలతోనూ మమేకమై అట్టడుగు స్త్రీల సమస్యల మీద పనిచేసింది. సావిత్రీబాయి ఫూలే వర్ధంతిని ‘ఇండియన్ ఉమెన్స్ డే’ గానూ, ఆమె జయంతిని ‘ఎడ్యుకేషన్ డే’గానూ జరపాలనే డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చి దానికోసం ఆమె ఎంతో శ్రమించింది. ఆమె సావిత్రీ బాయి ఫూలే సాహిత్యాన్ని అనువదించడంలో కృషి చేసి, జాతీయ స్థాయిలో దళిత స్త్రీల సాహి త్యాన్ని ఒక సంకలనంగా తీసుకురావడానికి పని చేస్తూ 2018 మార్చి నెలాఖరున గుండెపోటుతో మృతి చెందారు. రజనీ తిలక్‌కు ఒక కుమార్తె ఉంది.
రజనీ ఒక విశాల ప్రాతిపదికన దళిత
ఉద్యమం నడవాలని, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా కలసి వచ్చే మతతత్వ వాదులతో తప్ప అన్ని ప్రజా ఉద్యమ సంస్థలతో మమేకమవుతూ దళిత ఎజెండాని ముందుకు తీసుకువెళ్ళాలని భావించింది. ఢల్లీిలో నిర్భయ సంఘటన జరిగి
నప్పుడు ఆమె దళిత యువతి అయితే అంత పెద్ద ఎత్తున స్పందన వచ్చేదా? అని కొందరు దళితవా దులు భావించినప్పటికీ రజని ఆ ఉద్యమంలో బేషరతుగా పాల్గొని సాటి స్త్రీ పట్ల తన సంఫీుభా వాన్ని ప్రకటించింది. దళిత ఉద్యమంలో ఎన్జీఓల జోక్యాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించడం రజని ఆలోచనా విధానంలో ఒక ముఖ్యమైన అంశం. స్వచ్ఛంద సంస్థలతో జత కడితే దళిత ఉద్యమం తన సొంత వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే కాక ప్రభుత్వాలతో పోరాడలేదని ఆమె అభిప్రాయం.
రజని స్త్రీ వాదులతో కొన్ని విషయాలలో నిర్మొహమాటంగా విభేదించేది. స్త్రీలు తమ ఇష్టానుసారం తమ తమ శరీరాలను ఉపయోగించ వచ్చని వాదించే వారితో రజని విభేదించి సెక్స్ వర్కర్లుగా వ్యభిచార కూపంలో మగ్గుతున్న వారంతా వారి ఇష్టానుసారం జీవిస్తున్నట్టు కాదని, వారిలో అత్యధికులు అణగారిన కులాల స్త్రీలేనని, తమ పేదరికం వలన, కుల వ్యవస్థ తమ జీవితాలపై చేసిన పితృస్వామిక దాష్టీకం వలన దళిత, ఆదివాసీ స్త్రీలు లైంగిక దోపిడీకి గురవుతున్నారని, అందులో వారి వ్యక్తిగత స్వేచ్ఛ అనేదానికి చోటు లేదని రజని వాదిస్తుంది. అదే విధంగా దళిత పురుషులలో
ఉండే మగ అహంకారాన్ని కూడా ఎండగట్టింది. ఒక చిన్న సారా గ్లాసు దళిత పురుషుడిని జంతువు గా మారుస్తుందని, కూలీ డబ్బు కుటుంబాలకు అందకుండా దిగమింగే తాగు బోతు పురుషుల ఆగడాలను చెండాడిరది రజనీ గొంతు.
రజనీ మొదట కాన్షీరాం స్థాపించిన బామ్సెఫ్లో మాయావతితో కలిసి పనిచేయడమే కాక మహారాష్ట్ర కేంద్రంగా జాతీయ స్థాయిలో ముఖ్యనాయకులైన రామదాస్ అతవలే వంటి వారితో, దళిత రచయి తలు, మేధావులైన కుముద్ పవాడే, విమలా తోరాట్, ఊర్మిళా పవార్ వంటి వారితో కూడా మమేకమై సావిత్రీ బాయి సమగ్ర సాహిత్యాన్ని మరాఠీ భాష నుంచి హిందీలోకి తర్జుమా చేసే పనిని పూర్తి చేసింది. ఆమె కవిత్వంతో పాటు దళితవాదం పైన సిద్ధాంత గ్రంధాలను కూడా సుమారు పధ్నాలుగు దాకా ప్రచురించింది. ఆమె ఆత్మకథ ‘అప్నీ జమీన్ అప్నా ఆస్మా’ ఎంతో ప్రసిద్ధి గాంచింది.
రజనీ తిలక్ అంబేడ్కరిజాన్ని ఉదారవాదంతో కాక రాడికల్‌గా ఆచరించింది. తన సాటి సహచ రులే ఆమెను కించపరిచినా తానూ ఎంచుకున్న మార్గం నుంచి వెనక్కి రాకుండా గొప్ప ఆత్మవిశ్వా సంతో చివరివరకూ తన ఆశయ సాధనలోనే బతకడం రజనీకే సాధ్యపడిరది. ఎక్కడ దళితుల ఊచకోత, వెలి, పరువు హత్యలు, దళిత స్త్రీలపై అత్యాచారాలు జరిగినా రజనీ తిలక్ వారి పక్షాన జాతీయ స్థాయిలో ప్రభుత్వాలతో, మనువాద అధికార పీఠాలతో తలపడిరది. ప్రధాన మంత్రు లను స్వయంగా కలిసి దళిత స్త్రీల దుస్థితిని వివరించి వారి కోసం తన గొంతునిచ్చింది. ఢల్లీి కేంద్రంగా పనిచేసే రజనీని కొందరు ‘చమర్’ అనుకుంటే మరికొందరు ‘జాతవ’ అనుకున్నారు. ఆమె దృష్టిలో ఆ కులాలన్నీ ఒక్కటే. తనలాంటి సాటి పీడితులలో కలదిరగడం ఆమె ఎంచుకున్న మార్గం. ఎప్పుడూ ఉద్యమకారులతో నిత్యం చైతన్యాన్ని ధ్వనిస్తూ ఉండే రజనీ ఇల్లు నిర్భాగ్యులకు కూడా నీడనిచ్చే చలివేంద్రం. ఇటీవలే పూనేలో ‘ణaశ్రీఱ్ ఔశీఎవఅ ూజూవaసశీబ్’ పేరున జరిగిన దళిత స్త్రీల జాతీయ సదస్సులో రజనీ తిలక్ క్రియాశీలక పాత్ర పోషించడమే కాక ఆమె దళిత స్త్రీల సమస్యలపై చేసిన కృషిని గుర్తిస్తూ నిర్వాహకులు ఆమెని ‘లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు’తో సత్కరిం చారు. రజనీ ద్వారా దళిత స్త్రీ సమస్య ఇప్పుడిప్పుడే జాతీయ స్థాయిలో చర్చకు వస్తున్న సందర్భలో దళిత యువతులకు అండదండలుగా ఉండాల్సిన రజనీ అర్థాంతరంగా వెళ్ళిపోవడం దళిత మహిళా
ఉద్యమానికి తీరని నష్టం జరిగిందనుకోవచ్చు. పేదరికంతో, వెనుకబాటు తనంతో, పీడనతో కమురుకుపోయిన ఢల్లీి మురికివాడల్లో మిలమిల మెరిసే ఓ నల్లటి నక్షత్రం రజనీ తిలక్.