… నేనే తరగతి?! – పి. ప్రశాంతి

కారు శబ్దాన్ని ఎక్కడ్నుంచి పసిగట్టారో కాని కారు బడి దగ్గరికి చేరేసరికి పరిగెత్తుకొచ్చేశారు పిల్లలు. ఆ చిన్ని ఆదివాసీ గూడెంలో ఎటుచూసినా పది హేనేళ్ళలోపు పిల్లలు ఆడుతూనో, గెంతు తూనో కనిపిస్తారు. చంటి పిల్లల్ని చంక నేసుకుని ఆడేసుకుంటున్న ఏడెనిమిదేళ్ళ

పిల్లలు… జామ, మామిడి, సీతాఫలపు చెట్ల కొమ్మల్లో కోతుల్లా ఉయ్యాలలూగుతూ, ఎవరెంత ఎత్తునుండి దూకుతారో పందెం వేసుకుని అంతెత్తునుంచి దూకడం, అంత లోనే మళ్ళీ చెట్లెక్కయ్యడం… పది, పన్నెండేళ్ళ పిల్లల అల్లరే అల్లరి. ఆడా మగా తేడా లేదు… రెండు, మూడేళ్ళ వయసున్న పిల్లలు వీళ్ళ వెనక పడుతూ, లేస్తూ అటూ, ఇటూ పరుగులు పెట్టడం… ఎటు చూసినా కేరింతలు, అరుపులు, గోలతో సందడి సందడిగా ఉంటుంది. ఇప్పుడూ అంతే.
గీత, ఐశ్వర్య, చరణ్‌, రాము, భూమిక, భవాని, లక్ష్మి, సిద్ధు… అంతా పదేళ్ళలోపు పిల్లలు ఒక్కుమ్మడిగా వచ్చేసి నవ్వుతూ చూస్తూ నించున్నారు. కారాపి దిగుతూనే ‘పిల్లలూ… బాగున్నారా’ అడిగింది శాంతి. బాగున్నామని జవాబు చెప్తూనే నాతో వచ్చిం దెవరా అని ఆసక్తిగా చూస్తూ నిలబడ్డారు. వచ్చిందెవరో చెప్పేదాకా తనేమడిగినా సమాధానం పొడిగానే ఉంటుందని తెల్సు కనుక ‘నా ఫ్రెండ్‌ శ్రావ్య’ అని పరిచయం చేసింది శాంతి. పలకరింపులయ్యాక
ఉన్నట్టుండి సిద్దు ‘మేడం! ఇన్ని రోజుల య్యింది ఎక్కడికెల్లిపోయావు మేడం’ అని నిష్టూరంగా అడిగాడు. పైగుంపు నుంచి పరిగెత్తుకొస్తున్న పిల్లల్ని గమనిస్తూ ‘ఇంటికెళ్ళాను సిద్ధూ… ఆఫీసుంది కదా… ఐనా నెల కూడా కాలేదు నేనెళ్ళి…’ అంటుండగానే అప్పుడే అక్కడికి చేరుకున్న 15 ఏళ్ళ రాశి ‘మీరు ఇక్కడే ఉండాలను కుంటున్నారు మేడం పిల్లలు. మీరెల్లాక ఈ 3 వారాల్లో ఎన్నిసార్లు అడిగారో’ అని కిలకిలా నవ్వింది. ‘మీరిక్కడే ఉండొచ్చుగా’ అని అంది గీత. ‘సరే మరి, ఒకిల్లు కట్టుకుని ఇక్కడే ఉండిపోతా…’ శాంతి అంటుండగానే ‘మేం కట్టిస్తాం ఉండిపోండి మేడం’ అన్నారు వెనకనుంచి వచ్చిన యువకులు హరి, శివ, రమేష్‌. ‘బావుంది, బావుంది. మీరు ఇల్లు కట్టుకుంటుండండి, నేను ఊరు చూసొస్తా’ అని నవ్వుతున్న శ్రావ్యని చూస్తూ ‘ప్రియమైన మనుషులు శ్రావ్యా…’ అంటూనే ‘పదండి మనూరు చూపించుదాం’ ముందుకు దారితీసింది శాంతి. పొలోమని పిల్లలంతా ముందు నడిచారు.
ఊరంతా చుట్టేసొచ్చి కూర్చుంటూ శ్రావ్య అడిగింది ‘టీనేజి అమ్మాయిలెవరూ ఆటల్లో లేరే’ అని. ‘మెచ్యూర్‌ అవుతూనే ఈ అమ్మాయిలు అన్నీ మానేశారనుకుంటా. అప్పటి దాకా చెట్లెక్కి దూకేవాళ్ళు ఒక్కసారే మానేస్తారు. ఈ స్కూలు వరకే, పై చదువులకే వెళ్ళేవారు కాదు. పోయిన సంవత్సరమే మొదటిసారి ఇక్కడ్నుంచి ఐదుగురు అమ్మాయిలు హాస్టల్లో చేరారు. నెల్లాళ్ళకే కరోనాతో అదీ మూసేశారు’ అంది.
‘అయ్యో’ అంటూనే ‘మీరంతా ఏం చదువుతున్నారు’ అడిగింది శ్రావ్య. అక్కడ చేరిన ముప్ఫైమంది పిల్లలు సమాధానం చెప్పకుండా ఒకరి ముఖాలొకరు చూసు
కున్నారు. అలా ఎందుకో అర్థంకాక శ్రావ్య ‘బడికెళ్తున్నారా మీరంతా’ అని అడిగింది. ‘బడి లేదుగా’ విసురుగా చెప్పింది గీత. ‘కరోనా అని మూసేశారుగా’ అన్నాడు విజయ్‌. ‘అవును కదా! సారీ సారీ. బడి మూసేటప్పటికి నువ్వే తరగతిలో ఉన్నావ్‌’ మళ్ళీ అడిగింది గీతని. ‘రెండు’ చెప్పింది గీత. ‘మొన్న నేనదే చెప్తే తిట్టాడు. మురళి సారు’ అంది గీత క్లాస్‌మేట్‌ భవాని. ‘నేను కూడా మూడని చెప్తే తిట్టాడు రాజు సార్‌. నేనిప్పుడు ఐదోతరగతంట’ అయోమయంగా చూశాడు హరిశ్చంద్ర. పిల్లలంతా ఒకర్నొకరు నువ్వే తరగతంటే నువ్వే తరగతి అను కుంటూ, వెటకారంగా నవ్వుకుంటూ కాసేపు గోల చేశారు.
‘ఎంత ట్రాజడీ కదా? దాదాపు సంవత్స రంన్నరగా బడులు లేవు. వీళ్ళకి ఆన్‌లైన్‌ క్లాసులకు అవకాశం లేదు. పిల్లల చదువు లెలా అయిపోయాయి’ నిట్టూర్చింది శ్రావ్య. ‘అది కూడా పిల్లలందరి మీదా ఒకేలాంటి ప్రభావం లేదు. సిటీల్లో ఒకలా ఉంది. పల్లెల్లో ఒకలా ఉంటే ఈ గిరిజన గ్రామాల్లో ఒకలా ఉంది’ అంది శాంతి.
అంతలో ఐశ్యర్య లేచి ‘మేడం, ఇప్పుడు నేనే తరగతి’ అని అడిగింది. ‘కరోనా వచ్చేటప్పటికి నేను రెండోక్లాసు. మరిప్పుడు ఎంత?’ వెంటనే మళ్ళీ అడిగింది. ‘నువ్వి ప్పుడు నాలుగో తరగతికి వెళ్ళాలి. ఇంకో నెలకన్నా బడి తెరిచినప్పుడు నువ్వు నాలుగో తరగతికి వెళ్తావు’ అంది శాంతి. ‘కాదు మేడం. నాకు మూడో తరగతి పుస్తకాలు ఇవ్వలేదు. అయి చదువుకోకుండా నేను నాలుక్కెలా ఎల్తాను’ ఉక్రోషంగా అంది ఐశ్వర్య.
శాంతి, శ్రావ్య ముఖాలు చూసుకున్నారు. వాళ్ళ దగ్గరా సమాధానం లేదు. పిల్లలకి అర్థం చేయించే లెక్కా లేదు. తన ప్రశ్న వీళ్ళకి అర్థం కాలేదనుకుందో ఏమో ‘అపుడు బడున్నపుడు మా అన్న మూడో తరగతి పుస్తకం చదువు తుంటే రెండు చదవకుండానే మూడుకెల్తావా… తప్పుతావ్‌ అంది మణి టీచరు. మరిప్పుడు రెండు అయిపోలేదు. మూడు చదవలేదు. నాలుక్కెల్తే తప్పు కాదా…’ ఆందోళనగా అంది ఐశ్యర్య. ‘నువ్వేం ఏడవ కు. కరోనా వచ్చినప్పటి నుంచి రెండు ఎండా కాలాలు ఎల్లిపోయాయి. అంటే నువ్వు రెండు తరగతులు దాటేశావు. పెద్ద క్లాసుకెల్లిపోతావు, ఏడవకుండా కూర్చో’ లాజిక్కు చెప్పాడు రాము.
సిటీల్లో ప్రైవేటు స్కూళ్ళలో చదువుతూ యూనిఫాం వేసుకుని కంప్యూటర్‌ ముందో, స్మార్ట్‌ఫోన్‌ ముందో కూర్చుని క్లాసులు వింటున్న యుకెజి పిల్లలక్కూడా తెల్సు వాళ్ళే క్లాసో. పోనీ కనీసం మైదానం ప్రాంతాల గ్రామాల్లో స్మార్ట్‌ ఫోన్లోనో, టీవీ క్లాసులో వింటున్న పిల్లలకీ తెలుసు వాళ్ళే క్లాసో. మరి ఈ మారుమూల ఆదివాసీ గ్రామాల పిల్లల కి… ఇప్పుడో వారం, అప్పుడో పదిరోజులు బడి తీశామని, సేఫ్టీ రీత్యా పిల్లలు రావద్దని, టీచర్లు మాత్రం విడతల వారీగా వచ్చి పోవాలని అంటుంటే… మరి ఈ పిల్లలకెవరు చెప్తారు వాళ్ళే క్లాసో!!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.