భూమిక సంపాదకులు శ్రీమతి కె. సత్యవతి గారికి,
అమ్మా,
చాలా కాలం క్రిందట ఒక యువ సాహిత్యాభిలాషి నా ఎదుటికి వచ్చి ‘కాళీ పట్నం వారిది నిస్వార్ధ సేవ’ అన్నాడు. నేనున్నాను కదా, ‘ఆయనది అంతా స్వార్థమే’ అని. నా మీద పడి పీక పిసుకుతాడనుకొన్నాను అతని కోపం చూసి ‘‘అవును తెలుగు కథలంటే, వాటి
రచయితలు ఎవరంటే, తెలుగు సాహిత్యమంటే ఆయనకున్నది స్వార్థం కాక మరేమిటి? అన్నాను. ఒక్క క్షణమాగి కన్నీళ్ళతో నన్ను కౌగిలించుకున్నాడు. భారత భూమి స్వాతంత్య్రం గాంధీజీకి స్వార్ధం. నావంటి కాళుల అజ్ఞానం తొలగించటం మల్లాది రామకృష్ణ శాస్త్రి స్వార్ధం. ఆధ్యాత్మికతను, శృంగారాన్నీ ప్రజానికానికి వివరించడం అన్నమయ్య స్వార్ధం. ఇంతెందుకు స్త్రీ జనుల ముందుంజ కె.సత్యవతి స్వార్థం. పైవి కాదనగలిగే వారెవరు? – వి.ఎ.కె. రంగారావు, చైన్నె