కనువిప్పు కలిగించే ‘‘నేనే తరగతి’’
భూమిక ఆగస్టు సంచికలో ప్రచురితమైన ‘‘నేనే తరగతి’’ వ్యాసం అందరినీ ఆలోచింపచేసేలా ఉంది. విద్యా వ్యవస్థ తీరును, విద్యార్థుల పట్ల ప్రస్తుత సమాజ బాధ్యతను
(కరోనా ప్రభావిత పరిస్థితిలో) ఎంతో హృద్యంగా ప్రశ్నించినట్లు అనిపించింది. విద్యార్థుల మస్తిష్కంలో ఏర్పడిన అయోమయం, సందిగ్ధత, వారి భవిష్యత్తు పట్ల ఆలోచన కలిగేలా, ప్రతి ఒక్కరికీ కనువిప్పు కలిగించేలా ఉంది.
` శ్రీనివాసరావు, హైదరాబాద్