మూడు సంస్థలు ఒక్కటిగా కలిసి అందరం ఒక కుటుంబంలో ఉన్నట్లుగా కలిసి మెలిసి పనిచేయడం, మూడు సంస్థల్లో చేస్తున్న పనిని తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐక్యతారాగం ఇంకా కొనసాగాలి. తద్వారా మేము ఇంకా అనేక విషయాలను, కొత్త కొత్త
సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి.
నేను నేర్చుకుంటున్న విషయాలను అందరికీ చెబుతున్నాను. ట్రాన్స్ జెండర్స్ గురించి అర్థం చేసుకోవాలని, వాళ్ళని ఎగతాళి చేయవద్దని మా కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు, అలాగే గ్రామాల్లో కూడా అర్థం చేయిస్తున్నాను. మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపులను నిరోధించడానికి అందరం ఒక్కటై ప్రయత్నం చేయాలని, అందుకోసం అందరూ ముందుకు రావాలని చెబుతున్నాను. జెండర్ సమానత్వంపై ముందుగా కుటుంబంలో మార్పు రావాలి. చదువులో, ఆరోగ్యంలో, పనుల్లో ఆడపిల్లలను, మగపిల్లలను సమానంగా చూడాలి.
ఐక్యతారాగంలో నేర్చుకున్న విషయాలు నాకు, నా కుటుంబంలోను, అలాగే నా బంధువులలో ఎంతో
ఉపయోగపడుతున్నాయి. అలాగే నేను చేస్తున్న పనిలో కూడా ఉపయోగపడుతున్నాయి.